‘‘కారణము అనే పదాన్ని నివారణలోకి పరివర్తన చేసి
మాస్టర్ ముక్తిదాతలుగా కండి, అందరికీ తండ్రి సాంగత్యము అనే
రంగును వేసి సమానముగా అయ్యే హోలీని జరుపుకోండి’’
ఈ రోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న
ఖజానాలతో సంపన్నమైన తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి
ఒక్కరి ఖజానాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి అన్నది చూసి
హర్షిస్తున్నారు. ఖజానాలైతే అందరికీ ఒకే సమయములో ఒకే విధముగానే
లభించాయి, అయినప్పటికీ జమ ఖాతా పిల్లలందరిది వేర్వేరుగా ఉంది
కానీ సమయమనుసారముగా ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరినీ సర్వ
ఖజానాలతో సంపన్నముగా చూడాలనుకుంటున్నారు, ఎందుకంటే ఈ ఖజానాలు
కేవలం ఇప్పుడు ఈ ఒక్క జన్మ కోసమే కాదు, ఈ అవినాశీ ఖజానాలు అనేక
జన్మలు తోడుగా రానున్నాయి. ఈ సమయములోని ఖజానాల గురించైతే
పిల్లలైన మీ అందరికీ తెలుసు. బాప్ దాదా ఏయే ఖజానాలను ఇచ్చారో
వాటి గురించి చెప్పగానే అవి అందరి ఎదురుగా వచ్చేసాయి. అందరి
ఎదురుగా ఖజానాల లిస్ట్ ఇమర్జ్ అయ్యింది కదా! ఎందుకంటే బాప్ దాదా
ఇంతకుముందు కూడా చెప్పారు, ఖజానాలైతే లభించాయి కానీ వాటిని జమ
చేసుకునేందుకు విధి ఏమిటి? ఎవరు ఎంతగా నిమిత్తముగా మరియు
నిర్మానచిత్తముగా అవుతారో అంతగానే ఖజానాలు జమ అవుతాయి. కావున
చెక్ చేసుకోండి - నిమిత్తముగా మరియు నిర్మానముగా అయ్యే విధితో
మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి. ఎంతగా ఖజానాలు జమ అవుతాయో,
అంతగా వారు నిండుగా ఉంటారు. వారి నడవడిక మరియు ముఖము ద్వారా
నిండుగా ఉన్న ఆత్మను అనే ఆత్మిక నషా స్వతహాగానే కనిపిస్తుంది.
వారి ముఖముపై సదా ఆత్మిక నషా మరియు శుద్ధ గర్వము మెరుస్తూ
ఉంటుంది మరియు ఎంతగా ఆత్మిక నషా ఉంటుందో అంతగానే నిశ్చింతా
చక్రవర్తులుగా ఉంటారు. ఆత్మిక శుద్ధ గర్వము అనగా ఆత్మిక నషా
నిశ్చింత చక్రవర్తికి గుర్తు. కావున స్వయాన్ని చెక్ చేసుకోండి,
నా నడవడిక మరియు ముఖములో నిశ్చింత చక్రవర్తి యొక్క నిశ్చయము
మరియు నషా ఉందా? దర్పణమైతే అందరికీ లభించి ఉంది కదా! కావున మనసు
అనే దర్పణములో మీ ముఖాన్ని చెక్ చేసుకోండి. ఏ విధమైన చింత అయితే
లేదు కదా? ఏమవుతుంది! ఎలా అవుతుంది! ఇలా అయితే అవ్వదు కదా! ఏ
సంకల్పమూ ఉండిపోలేదు కదా? నిశ్చింత చక్రవర్తులకు ఇదే సంకల్పము
ఉంటుంది - ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా మంచిది మరియు ఏదైతే
జరగనున్నదో అది ఇంకా చాలా-చాలా మంచిగా జరుగుతుంది. దీనినే నషా
అని అంటారు, ఆత్మిక నషా అనగా స్వమానధారీ ఆత్మ. వినాశీ ధనము
కలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగా వారు సమయమనుసారముగా చింతలో
ఉంటారు. మీకు మీ ఈశ్వరీయ ఖజానాల కోసం చింత ఉందా? నిశ్చింతగా
ఉన్నారు కదా! ఎందుకంటే ఎవరైతే ఖజానాలకు యజమానులుగా మరియు
పరమాత్మకు బాలకులుగా ఉన్నారో, వారు సదా స్వప్నములో కూడా
నిశ్చింత చక్రవర్తులుగానే ఉంటారు, ఎందుకంటే వారికి నిశ్చయము
ఉంటుంది - ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలు
తోడుగా ఉన్నాయి, తోడుగా ఉంటాయి అని, అందుకే వారు నిశ్చయబుద్ధి
కలవారిగా, నిశ్చింతగా ఉంటారు.
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క జమ ఖాతాను
చూస్తున్నారు. ఇంతకుముందు కూడా వినిపించారు - విశేషముగా మూడు
రకాల ఖాతాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరు. ఒకటి - తమ
పురుషార్థము అనుసారముగా ఖజానాలను జమ చేసుకోవడము, ఇది ఒక ఖాతా.
రెండవ ఖాతా, ఆశీర్వాదాల ఖాతా. ఆశీర్వాదాల ఖాతా జమ అయ్యేందుకు
సాధనము ఏమిటంటే, సదా సంబంధ-సంపర్కములో మరియు సేవలో ఉంటూ
సంకల్పాలు, మాటలు మరియు కర్మలు, మూడింటిలోనూ స్వయము కూడా
స్వయముతో సంతుష్టము మరియు ఇతరులు కూడా అన్నింటిలోనూ మరియు సదా
సంతుష్టముగా ఉండాలి. సంతుష్టత ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది.
మరియు మూడవ ఖాతా - పుణ్య ఖాతా. పుణ్య ఖాతాకు సాధనము ఏమిటంటే -
ఏ సేవను చేసినా, మనసు ద్వారా కావచ్చు, వాణి ద్వారా కావచ్చు,
కర్మ ద్వారా కావచ్చు, సంబంధ-సంపర్కములోకి వస్తూ కావచ్చు, సదా
నిస్వార్థమైన మరియు అనంతమైన వృత్తి, స్వభావము, భావము మరియు
భావనతో సేవ చేయండి, దీనితో పుణ్య ఖాతా స్వతహాగానే జమ అవుతుంది.
కావున చెక్ చేసుకోండి - చెక్ చేసుకోవడము వస్తుంది కదా! వస్తుందా?
ఎవరికైతే రాదో వారు చేతులెత్తండి. ఎవరికైతే రాదో వారు. ఎవ్వరూ
లేరు అంటే అందరికీ వచ్చు అన్నమాట. మరి చెక్ చేసుకున్నారా? స్వ
పురుషార్థము యొక్క ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా,
మూడింటిలోనూ ఎంత శాతములో జమ అయ్యింది? చెక్ చేసుకున్నారా?
ఎవరైతే చెక్ చేసుకుంటూ ఉంటారో వారు చేతులెత్తండి. చెక్
చేసుకుంటారా? మొదటి లైన్ వారు చెక్ చేసుకోరా? చెక్ చేసుకోరా?
ఏమంటారు? చెక్ చేసుకుంటారు కదా! ఎందుకంటే బాప్ దాదా వినిపించారు,
సూచనను ఇచ్చారు, ఇప్పుడు సమయము యొక్క సమీపత తీవ్రగతితో ముందుకు
సాగుతుంది, అందుకే తమ చెకింగ్ ను పదే-పదే చేసుకోవాలి ఎందుకంటే
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ రాజయోగుల నుండి రాజా
పిల్లలుగా చూడాలనుకుంటున్నారు. పరమాత్మ తండ్రికి ఇదే ఆత్మిక నషా
ఉంది - నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ. పరమాత్ముని సంతానము
స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా అవుతారు.
ఖజానాలైతే బాప్ దాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి. ఈ ఖజానాలను
జమ చేసుకునేందుకు చాలా సహజమైన విధి ఏమిటంటే - విధి అనండి లేక
తాళంచెవి అనండి, అదేమిటో తెలుసు కదా! జమ చేసుకునేందుకు తాళంచెవి
ఏమిటి? తెలుసా? మూడు బిందువులు. తాళంచెవి అందరి వద్ద ఉంది కదా?
మూడు బిందువులను పెట్టండి మరియు ఖజానాలు జమ అవుతూ ఉంటాయి.
మాతలకు తాళం వేయడము వస్తుంది కదా, మాతలు తాళంచెవులను
సంభాళించడములో తెలివైనవారిగా ఉంటారు కదా! మరి మాతలందరూ ఈ మూడు
బిందువులు అనే తాళంచెవిని సంభాళించుకుని పెట్టుకున్నారా? తాళం
వేసారా? చెప్పండి, మాతలు తాళంచెవి ఉందా? ఎవరి వద్దనైతే ఉందో
వారు చేతులెత్తండి. తాళంచెవి అయితే దొంగలించబడడం లేదు కదా?
మామూలుగా ఇంటిలోని ప్రతి వస్తువు యొక్క తాళంచెవిని సంభాళించడం
మాతలకు చాలా బాగా వస్తుంది. మరి ఈ తాళంచెవి కూడా సదా తోడుగా
ఉంటుంది కదా!
వర్తమాన సమయములో బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఇప్పుడు
సమయము సమీపిస్తున్న కారణముగా బాప్ దాదా ఒక్క పదాన్ని పిల్లలందరి
నుండి, సంకల్పాలలో, మాటలలో మరియు ప్రాక్టికల్ కర్మలలో మార్పును
తీసుకురావడం చూడాలని కోరుకుంటున్నారు. ధైర్యముందా? ఒక్క పదము,
దానినే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి చేత పరివర్తన
చేయించాలనుకుంటున్నారు, ఒకే ఒక్క పదము పదే-పదే తీవ్ర
పురుషార్థుల నుండి నిర్లక్ష్యపు పురుషార్థులుగా చేసేస్తుంది
కానీ ఇప్పుడు సమయమనుసారముగా ఏ పురుషార్థము కావాలి? తీవ్ర
పురుషార్థము. అంతేకాక అందరూ కూడా తీవ్ర పురుషార్థుల లైన్ లోకి
రావాలని కోరుకుంటారు కూడా, కానీ ఒక్క పదము నిర్లక్ష్యులుగా
చేసేస్తుంది. ఆ పదము ఏమిటో తెలుసా? పరివర్తన చేసుకోవడానికి
సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారా? చేతులెత్తండి, సిద్ధముగా
ఉన్నారా? చూడండి, మీ ఫోటో టి.వి.లో వస్తుంది. సిద్ధముగా ఉన్నారా,
అచ్ఛా, అభినందనలు. అచ్ఛా - తీవ్ర పురుషార్థముతో పరివర్తన చేయాలా
లేక చేస్తాములే, చూస్తాములే... ఇలా అయితే కాదు కదా? ఆ ఒక్క పదము
ఏమిటి అనేది తెలుసుకునే ఉంటారు, ఎందుకంటే అందరూ తెలివైనవారే. ఆ
ఒక్క పదము ఏమిటంటే - ‘కారణము’, ఈ పదాన్ని పరివర్తన చేసి
‘నివారణ’ అన్న పదాన్ని ఎదురుగా తీసుకురండి. కారణము ఎదురుగా
రావడము వలన లేక కారణము గురించి ఆలోచించడము వలన నివారణ జరుగదు.
అందుకే బాప్ దాదా కేవలం మాటల వరకే కాదు, కానీ సంకల్పాలలో కూడా
ఈ ‘‘కారణము’’ అనే పదాన్ని ‘‘నివారణ’’లోకి పరివర్తన చెయ్యాలని
కోరుకుంటున్నారు ఎందుకంటే కారణాలు భిన్న-భిన్న రకాలుగా ఉంటాయి
మరియు ఆ కారణము అన్న పదము ఆలోచనల్లోకి, మాటల్లోకి, కర్మల్లోకి
రావడముతో తీవ్ర పురుషార్థానికి ఎదురుగా బంధనముగా అయిపోతుంది
ఎందుకంటే మీ అందరిదీ బాప్ దాదాతో ప్రతిజ్ఞ ఉంది, స్నేహముతో
కూడిన ప్రతిజ్ఞ ఉంది, అదేమిటంటే - మేమందరము కూడా బాబాకు విశ్వ
పరివర్తనా కార్యములో సహచరులము. మేము బాబాకు సహచరులము, బాబా
ఒంటరిగా చేయరు, పిల్లలను తమతోపాటు తీసుకువస్తారు. కావున విశ్వ
పరివర్తన కార్యములో మీ కార్యము ఏమిటి? సర్వాత్మల కారణాలను కూడా
నివారణ చెయ్యడము ఎందుకంటే ఈ రోజుల్లో మెజారిటీ దుఃఖితులుగా
మరియు అశాంతిగా ఉన్న కారణముగా ఇప్పుడు ముక్తిని కోరుకుంటున్నారు.
దుఃఖము, అశాంతి నుండి, సర్వ బంధనాల నుండి ముక్తిని
కోరుకుంటున్నారు మరియు ముక్తిదాత ఎవరు? బాబాతో పాటు పిల్లలైన
మీరు కూడా ముక్తిదాతలు. మీ జడ చిత్రాల నుండి ఈ రోజు వరకు ఏమి
కోరుకుంటూ ఉంటారు? ఇప్పుడు దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండటాన్ని
చూసి మెజారిటీ ఆత్మలందరూ ముక్తిదాత ఆత్మలైన మిమ్మల్ని గుర్తు
చేస్తున్నారు. ఓ ముక్తిదాత, ముక్తిని ఇవ్వండి అని మనసులో
దుఃఖితులై మొరపెట్టుకుంటున్నారు. మీకు ఆత్మల యొక్క దుఃఖము,
అశాంతితో కూడిన పిలుపులు వినిపించడము లేదా? కానీ ముక్తిదాతగా
అయి ముందుగా ఈ ‘కారణము’ అనే పదాన్ని ముక్తి చెయ్యండి. అప్పుడు
స్వతహాగానే ముక్తి యొక్క ధ్వని మీ చెవులలో మ్రోగుతుంది. ముందుగా
మీ లోపల ఈ పదము నుండి ముక్తులైతే ఇతరులను కూడా విముక్తులుగా
చెయ్యగలరు. ఇప్పుడైతే రోజురోజుకు మీ ఎదురుగా - ఓ ముక్తిదాతా,
ముక్తిని ఇవ్వండి అనేవారి క్యూ ఏర్పడనున్నది. కానీ ఇప్పటివరకు
తమ పురుషార్థములో భిన్న-భిన్న కారణాలు అనే పదము కారణముగా ముక్తి
ద్వారము మూసుకుని ఉంది, అందుకే ఈ రోజు బాప్ దాదా ఈ పదమే కాదు,
దీనితోపాటు ఇంకా మరిన్ని బలహీన పదాలు వస్తాయి, వాటిలో
విశేషమైనది - కారణము, ఆ తర్వాత అందులో ఇంకా కూడా బలహీనతలు
ఉంటాయి, ఇలా, అలా, ఎలా, ఇవి కూడా దీని సహచరులైన పదాలు, ఇవి
ద్వారాలు మూసి వేయడానికి కారణాలు.
ఈ రోజు అందరూ హోలీని జరుపుకోవడానికి వచ్చారు కదా. అందరూ
పరుగుపరుగున వచ్చారు. స్నేహమనే విమానము ఎక్కి వచ్చారు. తండ్రిపై
స్నేహము ఉంది, కావున తండ్రితోపాటు హోలీని జరుపుకోవడానికి
చేరుకున్నారు. అభినందనలు, వచ్చారు, సంతోషము. బాప్ దాదా
అభినందనలను తెలియజేస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, కుర్చీ
సహాయముతో తిరిగేవారు కూడా, ఆరోగ్యము కొంచెం కింద-మీద అవుతున్నా
కూడా ధైర్యముతో చేరుకున్నారు. బాప్ దాదా ఈ దృశ్యాన్ని
చూస్తుంటారు, ఇక్కడ క్లాస్ కు వస్తారు కదా, ప్రోగ్రామ్ కు
వస్తారు కదా, అప్పుడు కుర్చీ సహాయముతోనైనా సహచరుడిని పట్టుకుని
వచ్చేస్తారు. మరి దీనిని ఏమని అంటారు? పరమాత్ముని ప్రేమ. బాప్
దాదా కూడా ఇటువంటి ధైర్యశాలీ, హృదయపూర్వకమైన స్నేహీ పిల్లలకు
చాలా-చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను, హృదయపూర్వకమైన ప్రేమను
విశేషముగా ఇస్తున్నారు. ధైర్యమును ఉంచి వచ్చారు, తండ్రి మరియు
పరివారము యొక్క సహాయము ఉండనే ఉంది. అందరికీ స్థానము మంచిగా
లభించిందా? లభించిందా? ఎవరికైతే స్థానము మంచిగా లభించిందో వారు
చేతులెత్తండి. విదేశీయులకు మంచిగా లభించిందా? మేళా కదా, ఇది
మేళా. అక్కడ మేళాలలోనైతే ఇసుక కూడా ఎగురుతూ ఉంటుంది, భోజనము
కూడా జరుగుతూ ఉంటుంది. మీకు బ్రహ్మాభోజనము మంచిగా లభించిందా,
లభిస్తుందా? అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. నిదురించడానికి మూడు
అడుగుల నేల లభించిందా? ఇటువంటి మిలనము మళ్ళీ 5 వేల సంవత్సరాల
తర్వాత సంగమములోనే జరుగుతుంది, మరెప్పుడూ జరగదు.
ఈ రోజు, పిల్లలందరి జమ ఖాతాలను చూడాలి అని బాప్ దాదాకు
సంకల్పము ఉంది. చూసారు కూడా, ఇక ముందు కూడా చూస్తారు ఎందుకంటే
బాప్ దాదా ముందుగానే పిల్లలకు సూచనను ఇచ్చేసారు, జమ ఖాతాను జమ
చేసుకునేందుకు సమయము ఇప్పుడు ఈ సంగమయుగమే. ఈ సంగమయుగములో
ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత, మొత్తం కల్పము యొక్క
ఖాతాను ఇప్పుడు జమ చేసుకోవచ్చు. ఇక తర్వాత జమ ఖాతా యొక్క
బ్యాంకే మూసుకుపోతుంది. అప్పుడు ఏమి చేస్తారు? బాప్ దాదాకు
పిల్లలపై ప్రేమ ఉంది కదా. బాప్ దాదాకు తెలుసు, పిల్లలు
నిర్లక్ష్యములో ఒక్కోసారి మర్చిపోతారు, అయిపోతుందిలే,
చూస్తాములే, చేయడమైతే చేస్తున్నాములే, నడవడమైతే నడుస్తున్నాములే
కదా అనుకుంటారు. ఎంతో మజాతో అంటారు, మీరు చూడటము లేదా, మేము
చేస్తున్నాము, అవును నడవడమైతే నడుస్తున్నాము, ఇంకేమి చెయ్యాలి?
కానీ నడవడానికి మరియు ఎగరడానికి ఎంత తేడా ఉంది? నడుస్తున్నారు,
దానికి అభినందనలు. కానీ ఇప్పుడు నడిచే సమయము సమాప్తము
అయిపోతుంది. ఇప్పుడు ఎగిరే సమయము, అప్పుడే గమ్యానికి చేరుకోగలరు.
సాధారణ ప్రజలలోకి రావడమంటే, భగవంతునికి పిల్లలు కానీ సాధారణ
ప్రజలలోకి రావడమా! ఇది శోభిస్తుందా?
ఈ రోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా, హోలీ అంటే అర్థము
- గతించినదేదో గతించిపోయింది, మరి ఈ రోజు నుండి బాప్ దాదా ఇదే
కోరుకుంటున్నారు, గతించినదేదో గతించిపోయింది, ఏ కారణము చేతనైనా
ఒకవేళ ఏదైనా బలహీనత మిగిలి ఉండిపోయినట్లయితే, ఇప్పుడు ఆ ఘడియను
గతించినదేదో గతించిపోయింది అంటూ మీ చిత్రాన్ని స్మృతిలోకి
తీసుకురండి, స్వయమే చిత్రకారునిగా అయి మీ చిత్రాన్ని గీయండి.
బాప్ దాదా ఇప్పుడు కూడా ప్రతి బిడ్డది ఎటువంటి చిత్రాన్ని
ఎదురుగా చూస్తున్నారో తెలుసా? ఏ చిత్రాన్ని చూస్తున్నారో తెలుసా?
ఇప్పుడు మీరందరూ కూడా మీ చిత్రాన్ని గీయండి. చిత్రాన్ని గీయడము
వస్తుందా, వస్తుంది కదా! శ్రేష్ఠ సంకల్పము అనే కలముతో మీ
చిత్రాన్ని ఇప్పుడిప్పుడే ఎదురుగా తీసుకురండి. ముందు అందరూ
డ్రిల్ చేయండి, మైండ్ డ్రిల్. కర్మేంద్రియాల డ్రిల్ కాదు, మనసు
యొక్క డ్రిల్ చేయండి. రెడీ. డ్రిల్ చెయ్యడానికి రెడీగా ఉన్నారా!
తల ఊపండి. చూడండి, అన్నింటికన్నా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన చిత్రము
- కిరీటము, సింహాసనము, తిలకధారి యొక్క చిత్రము. మరి మీ
చిత్రాన్ని ఎదురుగా తీసుకురండి, మిగిలిన అన్ని సంకల్పాలను
పక్కన పెట్టి చూడండి, మీరందరూ బాప్ దాదా యొక్క హృదయ
సింహాసనాధికారులు. సింహాసనము ఉంది కదా! ఇటువంటి సింహాసనమైతే
ఎక్కడా లభించదు. ముందుగా ఈ చిత్రాన్ని గీయండి - నేను విశేష
ఆత్మను, స్వమానధారి ఆత్మను, బాప్ దాదా యొక్క మొదటి రచన అయిన
శ్రేష్ఠ ఆత్మను, బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని.
సింహాసనాధికారిగా అయిపోయారు! దానితో పాటు - నేను పరమాత్ముని
రచనను, ఈ వృక్షము యొక్క వేర్లలో కూర్చుని ఉన్న పూర్వజ మరియు
పూజ్య ఆత్మను, ఈ స్మృతి కలిగి ఉన్న తిలకధారిని. స్మృతి అనే
తిలకము పెట్టుకున్నారా! దానితో పాటు నిశ్చింత చక్రవర్తులు,
చింతలన్నింటి యొక్క భారాన్ని బాప్ దాదాకు అర్పణ చేసిన డబుల్
లైట్ కిరీటధారిని. మరి కిరీటధారి, తిలకధారి మరియు
సింహాసనాధికారి, ఇటువంటి తండ్రికి అనగా పరమాత్మకు ప్రియమైన
ఆత్మను.
మరి మీ ఈ చిత్రాన్ని గీసారు కదా. సదా ఈ డబుల్ లైట్ యొక్క
కిరీటాన్ని నడుస్తూ-తిరుగుతూ ధారణ చెయ్యవచ్చు. ఎప్పుడైనా మీ
స్వమానాన్ని స్మృతి చేసుకున్నట్లయితే ఈ కిరీటధారి, తిలకధారి
మరియు సింహాసనాధికారి ఆత్మను... మీ ఈ చిత్రాన్ని దృఢ సంకల్పము
ద్వారా ఎదురుగా తెచ్చుకోండి. గుర్తుందా - ప్రారంభములో మీ
అభ్యాసము పదే-పదే ఒక్క మాటను గుర్తు తెచ్చుకోవడములో ఉండేది, ఆ
ఒక్క మాట ఏమిటంటే - నేను ఎవరు? ఈ నేను అనేది ఎవరు? ఈ మాటను
పదే-పదే స్మృతిలోకి తెచ్చుకోండి మరియు మీకు ఉన్న భిన్న-భిన్న
స్వమానాలను, టైటిల్స్ ను, భగవంతుడి ద్వారా లభించిన టైటిల్స్ ను
గుర్తు చేసుకోండి. ఈ రోజుల్లో మనుష్యులకు మనుష్యుల నుండి
టైటిల్స్ లభించినా కూడా ఎంత గొప్పగా భావిస్తారు. మరి పిల్లలైన
మీకు తండ్రి ద్వారా ఎన్ని టైటిల్స్ మరియు స్వమానాలు లభించాయి?
సదా స్వమానాల లిస్టును మీ బుద్ధిలో మననము చేస్తూ ఉండండి. నేను
ఎవరిని? ఈ లిస్టును తీసుకురండి. ఇదే నషాలో ఉన్నట్లయితే
‘కారణము’ అనేదేదైతే ఉందో ఆ మాట మర్జ్ అయిపోతుంది మరియు నివారణ
ప్రతి కర్మలోనూ కనిపిస్తుంది. ఎప్పుడైతే నివారణ స్వరూపులుగా
అవుతారో అప్పుడు సర్వాత్మలకు నిర్వాణధామానికి, ముక్తిధామానికి
వెళ్ళే సహజ మార్గాన్ని చెప్పి విముక్తులుగా చేస్తారు.
దృఢ సంకల్పము చేయండి - దృఢ సంకల్పము చేయడము వచ్చా? దృఢత
ఉన్నప్పుడు ఆ దృఢత సఫలతకు తాళంచెవి వంటిది. కొద్దిగా కూడా దృఢ
సంకల్పములో లోటును తీసుకురాకండి, ఎందుకంటే మాయ పని ఓటమిపాలు
చెయ్యడము, మీ పని ఏమిటి? మీ పని బాబా మెడలో హారముగా అవ్వడము,
మాయతో ఓడిపోవడము కాదు. అందరూ ఈ సంకల్పాన్ని చెయ్యండి - నేను సదా
బాబా మెడలోని విజయమాలను, మెడలోని హారమును. మెడలోని హారము విజయీ
హారము.
మీరు ఏమవుతారు అని బాప్ దాదా చేతులెత్తిస్తే మీరు ఏమని జవాబు
ఇస్తారు? ఒకే జవాబు చెప్తారు - మేము లక్ష్మీ-నారాయణులుగా
అవుతాము అని. సీతా-రాములు అని అనరు. మరి లక్ష్మీ-నారాయణులుగా
అయ్యేవారు - మేము బాప్ దాదా యొక్క విజయమాలలోని మణిపూసలము,
పూజ్య ఆత్మలము అని అనుకుంటారు. భక్తులు మీ మాలలోని మణిపూసలను
జపిస్తూ-జపిస్తూ తమ సమస్యలను సమాప్తము చేస్తారు. ఇంతటి
శ్రేష్టమైన మణులు మీరు. మరి ఈ రోజు బాప్ దాదాకు ఏమి ఇస్తారు?
హోలీకి ఏదో ఒక కానుకను ఇస్తారు కదా! ఈ ‘కారణము’ అనే మాటను,
అయితే, అయితే అనే మాటను, అయితే, అయితే అని అంటూ ఉంటే చిలుకలా
అయిపోతారు కదా. అయితే, అయితే అని కూడా వద్దు, ఇలా, అలా అని కూడా
వద్దు. ఎటువంటి కారణము వద్దు, నివారణ. అచ్ఛా!
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ సమానముగా అయ్యేందుకని,
శ్రేష్ఠ సంకల్పము చేసేందుకని పదమాల, పదమాల రెట్లు అభినందనలను
ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. మా అంతటి పదమాల,
పదమాల భాగ్యశాలులు ఎవరు అన్న నషా ఉంది కదా. ఈ నషాలోనే ఉండండి.
అచ్ఛా!
ఇప్పుడు ఒక్క సెకండులో బ్రాహ్మణులందరూ తమ రాజయోగాన్ని
అభ్యసిస్తూ మనసును ఏకాగ్రము చేసే యజమానులుగా అయి మనసును ఎక్కడ
కావాలంటే అక్కడ, ఎంత సమయము కావాలంటే అంత సమయము, ఎలా కావాలంటే
అలా, ఇప్పడిప్పుడే మనసును ఏకాగ్రము చెయ్యండి. మనసు ఎక్కడ కూడా
అక్కడక్కడ చంచలమవ్వకూడదు. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా...
ఈ స్నేహము యొక్క సాంగత్యపు రంగుతో ఆధ్యాత్మిక హోలీను జరుపుకోండి.
(డ్రిల్). అచ్ఛా!
నలువైపులా ఉన్న శ్రేష్ఠమైన, విశేషమైన హోలీ మరియు హైయ్యెస్ట్
పిల్లలకు, సదా స్వయాన్ని బాబా సమానముగా సర్వ శక్తులతో
సంపన్నముగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసేవారికి, సదా
ప్రతి బలహీనత నుండి ముక్తులై ఇతర ఆత్మలకు కూడా ముక్తిని
ఇప్పించ్చే ముక్తిదాత పిల్లలకు, సదా స్వమానము అనే సీట్ పై సెట్
అయ్యేవారికి, సదా అమరభవ అనే వరదానాన్ని అనుభవ స్వరూపములోకి
తీసుకువచ్చేవారికి, నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు, ఎదురుగా
కూర్చుని ఉన్నవారికి, దూరంగా కూర్చుని స్నేహములో ఇమిడిపోయిన
పిల్లలకు ప్రియస్మృతులు మరియు తమ ఉల్లాస-ఉత్సాహాలు మరియు
పురుషార్థము యొక్క సమాచారాన్ని ఇచ్చేవారికి బాప్ దాదా నుండి
చాలా-చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన
పదమాల, పదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి మరియు రాజయోగీ
సో రాజ్య అధికారి పిల్లలందరికీ నమస్తే.