29-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శరీర సహితముగా ఏవేవైతే కనిపిస్తాయో, అవన్నీ వినాశనం అవ్వనున్నాయి, ఆత్మలైన మీరు ఇప్పుడిక ఇంటికి తిరిగి వెళ్ళాలి, అందుకే పాత ప్రపంచాన్ని మర్చిపోండి’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ పదాలతో అందరికీ తండ్రి సందేశాన్ని వినిపించవచ్చు?

జవాబు:-
అందరికీ ఇలా వినిపించండి - అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు, ఇప్పుడిక హద్దు వారసత్వము యొక్క సమయం పూర్తయ్యింది అనగా భక్తి పూర్తయ్యింది, ఇప్పుడిక రావణ రాజ్యం సమాప్తమవుతుంది, తండ్రి మిమ్మల్ని పంచ వికారాల రూపీ రావణుడి జైలు నుండి విడిపించడానికి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇందులో మీరు పురుషార్థము చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. కేవలం ఇది పురుషోత్తమ సంగమయుగము అని అర్థం చేసుకున్నా కూడా స్థితి శ్రేష్ఠముగా అవ్వగలదు.

ఓంశాంతి
ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? అవ్యభిచారీ స్మృతిలో కూర్చున్నారు. ఒకటేమో అవ్యభిచారీ స్మృతి, ఇంకొకటి వ్యభిచారీ స్మృతి. అవ్యభిచారీ స్మృతి లేక అవ్యభిచారి భక్తి ఎప్పుడైతే మొదట ప్రారంభమవుతుందో అప్పుడు అందరూ శివుని పూజనే చేస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు వారే, వారు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా. వారు చదివిస్తారు. ఏం చదివిస్తారు? మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. దేవతల నుండి మనుష్యులుగా అవ్వడానికి పిల్లలైన మీకు 84 జన్మలు పట్టింది, మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడానికి ఒక్క క్షణం పడుతుంది. తాము తండ్రి స్మృతిలో కూర్చున్నారని పిల్లలకు తెలుసు. వారు మన టీచర్ కూడా, సద్గురువు కూడా. ఒక్కరి స్మృతిలో ఉండమని వారు యోగాన్ని నేర్పిస్తారు. వారు స్వయం అంటారు - ఓ ఆత్మల్లారా, ఓ పిల్లలూ, దేహపు సర్వ సంబంధాలనూ వదలండి, ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచము మారుతోంది. ఇప్పుడు ఇక ఉండేది లేదు. పాత ప్రపంచపు వినాశనం కొరకే ఈ మందుగుండు సామాగ్రి మొదలైనవన్నీ తయారుచేయబడి ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. వినాశనమైతే తప్పకుండా జరగనున్నది. మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఇది ఆత్మకు తెలుసు. మనం ఇప్పుడు తిరిగి వెళ్తున్నాము, అందుకే తండ్రి చెప్తున్నారు - ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహాన్ని కూడా వదిలివేయాలి. దేహ సహితముగా ఈ ప్రపంచంలో ఏవేవైతే కనిపిస్తున్నాయో, అవన్నీ వినాశనమవ్వనున్నాయి, శరీరము కూడా అంతమవ్వనున్నది. ఇప్పుడు ఆత్మలమైన మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి. అలా తిరిగి వెళ్ళకుండా కొత్త ప్రపంచములోకి రాలేము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. పురుషోత్తములు ఈ దేవతలు. అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు నిరాకారుడైన తండ్రి. ఆ తర్వాత మనుష్య సృష్టిలో చూస్తే ఇందులో ఉన్నతమైనవారు దేవతలు. వారు కూడా మనుష్యులే, కానీ వారు దైవీ గుణాలు కలవారు. వారే మళ్ళీ అసురీ గుణాలు కలవారిగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ అసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్ళవలసి ఉంటుంది, సత్యయుగములోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరు? పిల్లలైన మీరు. పిల్లలైన మీరు చదువుతున్నారు, ఇతరులను కూడా చదివిస్తారు. కేవలం తండ్రి సందేశాన్నే ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు హద్దులోని వారసత్వము పూర్తవుతుంది.

పంచ వికారాల రూపీ రావణుడి జైలులో మనుష్యులందరూ ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. అందరూ దుఃఖమునే తీసుకుంటూ ఉంటారు. ఎండిన రొట్టే లభిస్తుంది. తండ్రి వచ్చి అందరినీ రావణుడి జైలు నుండి విడిపించి సదా సుఖవంతులుగా తయారుచేస్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ మనుష్యులను దేవతలుగా తయారుచేయలేరు. మీరు ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకని కూర్చున్నారు. ఇప్పుడు ఇది కలియుగము. ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారయ్యాయి. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల పరిచయాన్ని స్వయంగా తండ్రే కూర్చొని ఇస్తారు. మీరు కేవలం ఈశ్వరుడు, పరమాత్మ అని అనేవారు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా అని మీకు ఇంతకుముందు తెలియదు. వారిని సద్గురువు అని అంటారు. అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్మల్ని ఆత్మ మరియు జీవము అని అంటారు. ఆ అకాలమూర్తి ఈ శరీరము రూపీ సింహాసనముపై కూర్చున్నారు. వారు జన్మ తీసుకోరు. కావున ఆ అకాలమూర్తి అయిన తండ్రి పిల్లలకు ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు - నాకు నాదంటూ రథము లేదు, మరి నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా ఎలా తయారుచేయాలి? నాకు రథము కావాలి కదా. అకాలమూర్తికి కూడా సింహాసనమైతే కావాలి! అకాల సింహాసనము మానవునిదే ఉంటుంది. అంతేకానీ ఇంకెవ్వరిదీ కాదు. మీలోని ప్రతి ఒక్కరికీ సింహాసనము కావాలి. అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది. వారు అందరికీ తండ్రి, వారిని మహాకాలుడు అని అంటారు. వారు పునర్జన్మలలోకి రారు. ఆత్మలైన మీరు పునర్జన్మలలోకి వస్తారు. నేను కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాలు రెండే - అల్ఫ్ మరియు బే అనగా తండ్రి మరియు రాజ్యాధికారము. తండ్రి వచ్చి రాజ్యాధికారాన్ని ఇస్తారు మరియు రాజ్యాధికారము కోసం చదివిస్తారు, అందుకే దీనిని పాఠశాల అని కూడా అంటారు. భగవానువాచ - భగవంతుడు నిరాకారుడు. వారికి కూడా పాత్ర ఉండాలి. వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు, వారిని అందరూ స్మృతి చేస్తారు. భక్తి మార్గములో స్మృతి చేయని మనుష్యులంటూ ఎవ్వరూ ఉండరు. అందరూ హృదయపూర్వకంగా - ఓ భగవంతుడా, ఓ ముక్తిప్రదాత, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే వారు సర్వాత్మలకూ తండ్రి. వారు తప్పకుండా అనంతమైన సుఖమునే ఇస్తారు. హద్దులోని తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చారు, వారు ఏం చెప్తున్నారంటే - పిల్లలూ, ఇతర సాంగత్యాలను తెంచి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. దేవీ, దేవతలైన మీరు కొత్త ప్రపంచములో ఉంటారని కూడా తండ్రే తెలియజేశారు. అక్కడైతే అపారమైన సుఖము ఉంటుంది. ఆ సుఖాల అంతాన్ని ఎవ్వరూ పొందలేరు. కొత్త ఇంటిలో ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది, పాత ఇంటిలో దుఃఖము ఉంటుంది. అందుకే తండ్రి పిల్లల కొరకు కొత్త ఇంటిని నిర్మిస్తారు. పిల్లల బుద్ధియోగము కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది. ఇది హద్దులోని విషయము. ఇప్పుడైతే అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు. పాత ప్రపంచములో ఏదైతే చూస్తున్నారో అదంతా స్మశానయోగ్యముగా అవ్వనున్నది. ఇప్పుడిక స్వర్గ స్థాపన జరుగుతోంది. మీరు సంగమయుగములో ఉన్నారు. మీరు కలియుగము వైపూ చూడగలరు, అలాగే సత్యయుగము వైపుకు కూడా చూడగలరు. మీరు సంగమయుగములో సాక్షీగా అయి చూస్తారు. ప్రదర్శనీలోకి లేక మ్యూజియంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు వచ్చినవారిని సంగమయుగ చిత్రము ముందు నిల్చోబెట్టండి. ఇటువైపు కలియుగము, అటువైపు సత్యయుగము, మనం మధ్యలో ఉన్నాము. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. అక్కడ చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఇంకే ధర్మంవారూ అక్కడకు రారు. కేవలం మీరే మొట్టమొదట వస్తారు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. పావనంగా అయ్యేందుకే నన్ను - ఓ బాబా, మమ్మల్ని పావనంగా తయారుచేసి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని పిలిచారు. శాంతిధామములోకి తీసుకువెళ్ళండి అని పిలవరు. పరంధామమును స్వీట్ హోం అని అంటారు. ఇప్పుడు ఇక మనం ఇంటికి వెళ్ళాలి, దానిని ముక్తిధామము అని అంటారు. దాని కోసమే సన్యాసులు మొదలైనవారు శిక్షణను ఇస్తారు. వారు సుఖధామము యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. ఏయే ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయనేది పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. మనుష్య సృష్టి రూపీ వృక్షములో మొట్టమొదటి పునాది మీదే. బీజమును వృక్షపతి అని అంటారు. తండ్రి అంటారు, వృక్షపతినైన నేను పైన నివాసిస్తాను, ఎప్పుడైతే వృక్షము పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుందో, అప్పుడు నేను దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తాను. మర్రి వృక్షము చాలా అద్భుతమైన వృక్షము. కాండము లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఈ అనంతమైన వృక్షములో కూడా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు, మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి.

మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు. పాత్రను అభినయించడానికి ఇక్కడకు వచ్చారు. పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు, అందుకే ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ తక్కువలో తక్కువ ఒక్క జన్మ ఉంటుంది. కానీ మనుష్యులేమో 84 లక్షల జన్మలు అని అనేస్తారు. అవి కూడా ఎవరికి ఉంటాయి అన్నది అర్థం చేసుకోలేకపోతారు. తండ్రి వచ్చి - మీరు 84 జన్మలు తీసుకుంటారు అని మీకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరు నా నుండి విడిపోతారు. సత్యయుగీ దేవతలే మొదట ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆత్మలు ఇక్కడ పాత్రను అభినయిస్తారో, అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇది కూడా మీకు తెలుసు - మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామములో ఉంటాయి. కావున శాంతిధామము వేరైనట్లు కదా, ఇకపోతే ప్రపంచమైతే ఇదే. పాత్రను ఇక్కడ అభినయిస్తారు. కొత్త ప్రపంచములో సుఖము యొక్క పాత్రను, పాత ప్రపంచములో దుఃఖము యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇది సుఖ-దుఃఖాల ఆట. అది రామరాజ్యము. ప్రపంచములోని మనుష్యులెవ్వరికీ ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్నది తెలియదు. వారికి రచయితను గురించి కానీ లేక రచన యొక్క ఆదిమధ్యాంతాలను గురించి కానీ తెలియదు. జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇంకే శాస్త్రములోనూ లేదు. నేను మీకు అది వినిపిస్తాను, తర్వాత అది కనుమరుగైపోతుంది. సత్యయుగములో ఇది ఉండదు. భారత్ యొక్క ప్రాచీనమైన సహజ రాజయోగమే మహిమ చేయబడింది. గీతలో కూడా రాజయోగము అన్న మాట వస్తుంది. తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్య వారసత్వాన్ని ఇస్తారు. ఇకపోతే రచన నుండైతే వారసత్వము లభించదు. రచయిత అయిన తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. మనుష్యులు ప్రతి ఒక్కరూ రచయితే, వారు పిల్లలను రచిస్తారు. వారు హద్దులోని బ్రహ్మా, వీరు అనంతమైన బ్రహ్మా. వీరు నిరాకార ఆత్మలకు తండ్రి, వారు లౌకిక తండ్రి, అలాగే వీరు ప్రజాపిత. ప్రజాపిత ఎప్పుడు ఉండాలి? సత్యయుగములోనా? కాదు, పురుషోత్తమ సంగమయుగములో ఉండాలి. సత్యయుగము ఎప్పుడు ఉంటుందో కూడా మనుష్యులకు తెలియదు. వారైతే సత్యయుగము, కలియుగము మొదలైనవాటికి లక్షల సంవత్సరాలు చూపించారు. ఒక్కొక్క యుగము 1,250 సంవత్సరాలు ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. 84 జన్మల లెక్క కూడా ఉండాలి కదా. అలాగే మనం ఎలా దిగుతామో మెట్ల లెక్క కూడా ఉండాలి కదా. మొట్టమొదట కాండములో దేవీ-దేవతలు ఉన్నారు, వారి తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. తండ్రి వృక్షము యొక్క రహస్యాన్ని కూడా తెలియజేశారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇది నేర్పించలేరు. ఈ చిత్రాలు మొదలైనవాటిని ఎలా తయారుచేసారు? ఎవరు నేర్పించారు? అని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు - బాబా మాకు వాటిని ధ్యానములో చూపించారు, అప్పుడు వాటిని మేము ఇక్కడ తయారుచేస్తాము, మళ్ళీ వాటిని తండ్రే ఈ రథములోకి వచ్చి ఇలా, ఇలా చేయండి అని కరెక్ట్ చేస్తారు. స్వయంగా వారే సరిదిద్దుతారు.

శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు, కానీ అతడిని ఆ విధంగా ఎందుకు అంటారు అన్నది మనుష్యులు అర్థం చేసుకోలేరు. అతను వైకుంఠానికి అధిపతిగా ఉండేవారు, అప్పుడు తెల్లగా ఉండేవారు, ఆ తర్వాత పల్లెటూరి బాలుడిలా నల్లగా అయ్యారు, అందుకే అతడినే శ్యామసుందరుడు అని అంటారు. అతనే మొదట వస్తారు. తతత్వం. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపిస్తారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. భారత్ ను కూడా మర్చిపోయి హిందుస్థాన్ నివాసులము, హిందువులము అని అనేస్తారు. నేను భారత్ లోకే వస్తాను. భారత్ లో దేవతల రాజ్యము ఉండేది, అది ఇప్పుడు కనుమరుగైపోయింది. దానిని మళ్ళీ పునఃస్థాపన చేయడానికి నేను వస్తాను. మొట్టమొదట ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది. ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త-కొత్త ఆకులు, మఠాలు, మార్గాలు చివరిలో వస్తాయి. కావున వాటి శోభ ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ చివరిలో ఎప్పుడైతే వృక్షమంతా శిథిలావస్థను చేరుకుంటుందో, అప్పుడు మళ్ళీ నేను వస్తాను. యదా యదా హి... ఆత్మకు తన గురించి కూడా తెలియదు, అలాగే తండ్రి గురించి కూడా తెలియదు. తమను తాము కూడా నిందించుకుంటారు, అలాగే తండ్రిని మరియు దేవతలను కూడా నిందిస్తూ ఉంటారు. తమోప్రధానులుగా, బుద్ధిహీనులుగా అయిపోతారు. అప్పుడు నేను వస్తాను. పతిత ప్రపంచములోకే రావలసి ఉంటుంది. మీరు మనుష్యులకు ప్రాణదానాన్ని ఇస్తారు అనగా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మీరు అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తారు, అది కూడా అర్ధకల్పం కొరకు చేస్తారు. వందేమాతరం అన్న గాయనము కూడా ఉంది కదా. ఏ మాతలకు వందనము చేస్తారు? మీరే ఆ మాతలు, మీరు సృష్టినంతటినీ స్వర్గముగా తయారుచేస్తారు. పురుషులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాతలదే, అందుకే తండ్రి మాతల మహిమను చేస్తారు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఇంతటి మహిమాయోగ్యులుగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అపారమైన సుఖాల ప్రపంచములోకి వెళ్ళేందుకు సంగమములో నిలబడాలి. సాక్షీగా అయి అన్నింటినీ చూస్తూ కూడా బుద్ధియోగాన్ని కొత్త ప్రపంచముతో జోడించాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్తున్నాము అన్నది బుద్ధిలో ఉండాలి.

2. అందరికీ ప్రాణదానాన్ని ఇవ్వాలి, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే సేవను చేయాలి. అనంతమైన తండ్రి నుండి చదువుకుని ఇతరులను చదివించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి.

వరదానము:-

సదా శ్రేష్ఠ సమయమనుసారముగా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ్-వాహ్ అనే పాటలను పాడే భాగ్యవాన్ ఆత్మా భవ

ఈ శ్రేష్ఠ సమయములో సదా శ్రేష్ఠ కర్మలను చేస్తూ ‘‘వాహ్-వాహ్’’ అన్న పాటలను మనసుతో పాడుతూ ఉండండి. ‘‘వాహ్ నా శ్రేష్ఠ కర్మలు లేక వాహ్ శ్రేష్ఠ కర్మలను నేర్పించే బాబా’’. కావున సదా వాహ్-వాహ్ అన్న పాటలను పాడండి. ఎప్పుడూ పొరపాటున కూడా దుఃఖము యొక్క దృశ్యాన్ని చూస్తున్నా కానీ అయ్యో అన్న మాట వెలువడకూడదు. వాహ్ డ్రామా వాహ్! మరియు వాహ్ బాబా వాహ్! స్వప్నములో కూడా ఊహించని భాగ్యము ఇంట్లో కూర్చొని ఉంటూండగానే లభించింది. ఈ భాగ్యము యొక్క నషాలోనే ఉండండి.

స్లోగన్:-

మనసు-బుద్ధిని శక్తిశాలిగా చేసుకున్నట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా, దృఢంగా ఉంటారు.