29-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబా మీకు జ్ఞాన రత్నాలను ఇవ్వడానికి, మురళిని వినిపించడానికి వచ్చారు, అందుకే మీరు ఎప్పుడూ మురళిని మిస్ చేయకూడదు, మురళిపై ప్రేమ లేదంటే తండ్రిపై ప్రేమ లేనట్లే’’

ప్రశ్న:-
మీరు ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నింటికన్నా మంచి క్యారెక్టర్ ఏది?

జవాబు:-
నిర్వికారులుగా అవ్వడము అన్నింటికన్నా మంచి క్యారెక్టర్. ఈ ప్రపంచమంతా వికారీమయమైనదని మీకు జ్ఞానము లభిస్తుంది, వికారీమయము అనగా క్యారెక్టర్ లేకపోవడము. తండ్రి నిర్వికారీ ప్రపంచాన్ని స్థాపించడానికి వచ్చారు. నిర్వికారీ దేవతలు క్యారెక్టర్ కలవారు. తండ్రి స్మృతి ద్వారానే క్యారెక్టర్ బాగవుతుంది.

ఓంశాంతి
పిల్లలూ, మీరు చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఒకవేళ చదువును మిస్ చేసినట్లయితే పదవి నుండి కూడా మిస్ అయిపోతారు. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? గాడ్లీ స్పిరిచ్యుల్ యూనివర్శిటీలో (ఈశ్వరీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయములో). ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మేము ఈ విశ్వవిద్యాలయములో చేరుతాము అని కూడా పిల్లలకు తెలుసు. తండ్రి మనకు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా అని కూడా పిల్లలైన మీకు తెలుసు. మామూలుగానైతే మూర్తి గురువుది వేరుగా, తండ్రిది వేరుగా, టీచరుది వేరుగా ఉంటుంది. కానీ ఈ మూర్తి అయితే ఒక్కరే. కానీ వీరిలో ముగ్గురూ ఉన్నారు అనగా వీరు తండ్రి కూడా అవుతారు, టీచరు కూడా అవుతారు, గురువు కూడా అవుతారు. మనుష్యుల జీవితములో ఈ ముగ్గురూ ముఖ్యమైనవారు. తండ్రి, టీచర్, గురువు వారే. మూడు పాత్రలనూ వారు స్వయమే అభినయిస్తారు. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి మరియు ఇటువంటి త్రిమూర్తి యూనివర్శిటీలోకి అనేకులను తీసుకువచ్చి చేర్చాలి. ఏయే యూనివర్శిటీలోనైతే చదువు బాగుంటుందో, అక్కడ చదివేవారు ఇతరులకు చెప్తారు - ఈ యూనివర్శిటీలో చదవండి, ఇక్కడ జ్ఞానము మంచిగా లభిస్తుంది మరియు క్యారెక్టర్స్ కూడా బాగుపడతాయి అని. అలాగే పిల్లలైన మీరు కూడా ఇతరులను తీసుకురావాలి. మాతలు మాతలకు, పురుషులు పురుషులకు అర్థం చేయించాలి. చూడండి, వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా. ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా లేదా? అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. తమ మిత్ర సంబంధీకులకు, సఖులకు - వీరు సుప్రీమ్ తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా మరియు సుప్రీమ్ గురువు కూడా అని ఎప్పుడైనా అర్థం చేయిస్తున్నారా? తండ్రి సుప్రీమ్ దేవీ-దేవతలుగా తయారుచేస్తారు, తండ్రి తన సమానముగా తండ్రిగా తయారుచేయరు. ఇకపోతే వారు తమ మహిమ ఏదైతే ఉందో అందులో తమ సమానముగా తయారుచేస్తారు. తండ్రి పని పాలన చేయడము మరియు ప్రేమించడము. ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. వారిని ఇంకెవ్వరితోనూ పోల్చలేము. గురువు ద్వారా శాంతి లభిస్తుంది అని అంటారు కానీ వీరైతే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. నేను సర్వాత్మలకూ తండ్రిని అని కూడా ఎవ్వరూ అనరు. సర్వాత్మలకు తండ్రిగా ఎవరు అవ్వగలరు అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఒక్క అనంతమైన తండ్రినే హిందువులు, ముసల్మానులు మొదలైనవారందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు. బుద్ధి తప్పకుండా నిరాకారుని వైపుకు వెళ్తుంది. ఇలా ఎవరు అన్నారు? ఆత్మయే గాడ్ ఫాదర్ అని అంటుంది. కావున తప్పకుండా వారిని కలుసుకోవాలి కదా. కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడూ కలుసుకోకపోతే వారు తండ్రి ఎలా అవ్వగలరు? మొత్తం ప్రపంచంలోని పిల్లల ఆశ ఏదైతే ఉందో దానిని వారు పూర్తి చేస్తారు. మేము శాంతిధామానికి వెళ్ళాలి అన్న కోరిక అందరికీ ఉంటుంది. ఆత్మకు ఇల్లు గుర్తుకు వస్తుంది. ఆత్మ రావణ రాజ్యములో అలసిపోయింది. ఇంగ్లీష్ లో కూడా ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని లిబరేట్ (విముక్తులను) చేయండి అని అంటారు. తమోప్రధానముగా అవుతూ, అవుతూ పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మొదట సుఖధామములోకి వస్తారు. అంతేకానీ మొట్టమొదటే వచ్చి వికారులుగా అవుతారని కాదు. ఇది వేశ్యాలయము, రావణ రాజ్యము, దీనిని రౌరవ నరకము అని అంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు.

భారత్ లో లేక ఈ ప్రపంచములో ఎన్ని శాస్త్రాలు, ఎన్ని చదువుకునే పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ అంతమైపోతాయి. తండ్రి మీకు ఈ కానుకనేదైతే ఇస్తారో ఇది ఎప్పటికీ తగలబడదు. ఇది ధారణ చేయవలసినది. పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో దానిని తగలబెట్టడం జరుగుతుంది. తగలబెట్టేందుకు జ్ఞానము శాస్త్రమేమీ కాదు. మీకు జ్ఞానము లభిస్తుంది, దాని ద్వారా మీరు 21 జన్మలు పదవిని పొందుతారు. దీనికి సంబంధించిన శాస్త్రాలను తగలబెడతారని కాదు, అలా కాదు. ఈ జ్ఞానము దానంతట అదే కనుమరుగైపోతుంది. ఇక్కడ ఇది చదువుకునే పుస్తకమేమీ కాదు. జ్ఞాన-విజ్ఞాన భవనము అన్న పేరు కూడా ఉంది. కానీ దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, దాని అర్థమేమిటి? అన్నది వారికి తెలియదు. జ్ఞాన-విజ్ఞానముల మహిమ ఎంత భారీ అయినది! జ్ఞానము అనగా సృష్టి చక్రము యొక్క జ్ఞానము, దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. విజ్ఞానము అనగా శాంతిధామము. మీరు జ్ఞానము కన్నా కూడా అతీతముగా వెళ్తారు. జ్ఞానములో చదువు ఆధారముపై మీరు మళ్ళీ రాజ్యము చేస్తారు. ఆత్మలైన మమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తారు అని మీరు భావిస్తారు. లేకపోతే భగవానువాచ అన్నది మాయమైపోతుంది. భగవంతుడేమైనా శాస్త్రాలను చదివి వస్తారా. భగవంతునిలోనైతే జ్ఞానము-విజ్ఞానము రెండూ ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటారో వారు అలా తయారుచేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. జ్ఞానము కంటే విజ్ఞానము చాలా సూక్ష్మమైనది. జ్ఞానము కంటే కూడా అతీతముగా వెళ్ళాలి. జ్ఞానము స్థూలమైనది, నేను చదివిస్తాను, అప్పుడు శబ్దం వస్తుంది కదా. విజ్ఞానము సూక్ష్మమైనది, ఇందులో శబ్దం నుండి అతీతముగా శాంతిలోకి వెళ్ళవలసి ఉంటుంది, ఆ శాంతి కోసమే భ్రమిస్తూ ఉంటారు. సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ ఏ వస్తువైతే తండ్రి వద్ద ఉందో, అది ఇంకెవ్వరి నుండీ లభించదు. హఠయోగాలు చేస్తారు, గోతులలో కూర్చొంటారు, కానీ దాని ద్వారా శాంతి ఏమీ లభించదు, ఇక్కడైతే శ్రమ యొక్క విషయమేదీ లేదు. చదువు కూడా చాలా సహజమైనది. 7 రోజుల కోర్సు తీసుకోవటం జరుగుతుంది. 7 రోజుల కోర్సు తీసుకుని, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి, ఈ విధంగా ఇంకే దైహికమైన కాలేజీలోనూ చేయలేరు. మీ కొరకు ఉన్న ఈ కోర్సు 7 రోజులదే. ఇందులో అన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. కానీ పూర్తిగా 7 రోజులు ఎవ్వరూ ఇవ్వలేరు. బుద్ధియోగము ఎటో అటు వెళ్ళిపోతుంది. మీరు భట్టీలో కూర్చున్నారు, అప్పుడు ఎవరి ముఖాన్నీ చూసేవారు కాదు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. బయటకు కూడా వెళ్ళేవారు కాదు. తపస్య కొరకు సాగర తీరానికి వెళ్ళి స్మృతిలో కూర్చొనేవారు. ఆ సమయములో ఈ చక్రాన్ని అర్థం చేసుకోలేదు. ఈ చదువును కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. మొట్టమొదటైతే బాబాతో యోగము కావాలి. తండ్రి పరిచయము కావాలి. ఆ తర్వాత టీచర్ కావాలి. మొదటైతే తండ్రితో యోగాన్ని ఎలా జోడించాలి అనేది కూడా నేర్చుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఈ తండ్రి అశరీరి, ఇంకెవ్వరూ దీనిని అంగీకరించరు. గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అని అనేస్తారు. కేవలం ఆ సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయము లేదు. మీరు విద్యార్థులు. తండ్రి అంటారు, మీ వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోండి కానీ క్లాస్ లో తప్పకుండా చదవండి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. ఒకవేళ స్కూలుకు వెళ్ళము అని అంటే, మరి తండ్రి కూడా ఏమి చేయగలరు. అరే, భగవతి-భగవానులుగా తయారుచేయడానికి స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు! భగవానువాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. మరి భగవంతుడి నుండి రాజయోగాన్ని నేర్చుకోరా. నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు! కావుననే మీరు పరుగెత్తుకుని రావడం జరిగింది. విషము నుండి రక్షించుకునేందుకు పరుగెత్తారు. మీరు వచ్చి భట్టీలో కూర్చున్నారు, అప్పుడు ఎవ్వరినీ చూడలేరు, కలుసుకోలేరు. ఎవ్వరినీ చూసేవారే కాదు అన్నప్పుడు ఇక ఎవరితో మనస్సు పెట్టుకుంటారు. భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలకు నిశ్చయం కూడా ఉంది, అయినా కానీ అనారోగ్యం ఉంది, ఈ పని ఉంది అని సాకులు చెప్తారు. తండ్రి అయితే ఎన్నో షిఫ్టులలో చెప్పగలరు. ఈ రోజుల్లో స్కూళ్ళలో ఎన్నో షిఫ్టులు పెడతారు. ఇక్కడ ఏమంత ఎక్కువ చదువైతే లేదు. కేవలం అల్ఫ్ ను మరియు బే ను (భగవంతుడిని మరియు రాజ్యాధికారాన్ని) అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. అల్ఫ్ ను మరియు బే ను - వీటిని స్మృతి చేయండి, అందరికీ తెలియజేయండి. త్రిమూర్తినైతే ఎందరో తయారుచేస్తారు కానీ పైన శివబాబాను చూపించరు. గీతా భగవంతుడు శివుడు అని, వారి ద్వారానే ఈ జ్ఞానాన్ని తీసుకొని విష్ణువుగా అవుతారని అర్థం చేసుకోరు. ఇది రాజయోగము కదా. ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ, ఇది ఎంత సహజమైన వివరణ. పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో లేవు. కేవలం ఒక్క బ్యాడ్జి ఉండాలి, అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రము ఉండాలి. దానితో తండ్రి ఏ విధంగా బ్రహ్మా ద్వారా చదువును చదివించి విష్ణు సమానముగా తయారుచేస్తారో అర్థం చేయించాలి.

మేము రాధగా అవ్వాలి అని కొందరు భావిస్తారు. కలశమైతే మాతలకు లభిస్తుంది. అనగా రాధ యొక్క అనేక జన్మల అంతిమములో ఆమెకు కలశం లభిస్తుంది. ఈ రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయించగలరు, ఇది ఇంకే మనుష్యమాత్రులకూ తెలియదు. మీ వద్దకు సెంటరుకు ఎంతమంది వస్తారు. కొందరైతే ఒక రోజు వస్తారు, మళ్ళీ నాలుగు రోజులు రారు. అప్పుడు వారిని అడగాలి - ఇన్ని రోజులూ మీరేమి చేసేవారు? తండ్రిని స్మృతి చేసేవారా? స్వదర్శన చక్రాన్ని తిప్పేవారా? ఎవరైతే చాలా ఆలస్యంగా వస్తారో వారికి వ్రాసి మరీ అడగాలి. కొంతమంది ట్రాన్స్ఫర్ అయి వెళ్తారు, అయినా కానీ ఏదో ఒక సెంటరుకు చెందినవారిగా తప్పకుండా ఉంటారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తిప్పాలి అని వారికి మంత్రము లభించింది. తండ్రి అయితే చాలా సహజమైన విషయాన్ని తెలియజేశారు. ఉన్నవే రెండు పదాలు - మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులో మొత్తం చక్రమంతా వచ్చేస్తుంది. ఎవరైనా శరీరము వదిలితే అప్పుడు ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ స్వర్గము అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అక్కడ రాజ్యము ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పైన ఉన్నవారి నుండి కింద ఉన్నవారి వరకు, షావుకారుల నుండి పేదల వరకూ అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడైతే ఇది దుఃఖపు ప్రపంచము, అది సుఖమయమైన ప్రపంచము. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరైనా దుకాణదారులైనా లేక ఇంకేమైనా కానీ చదువు విషయములో సాకులు చెప్పడం బాగా అనిపించదు. వారు రాకపోతే వారిని అడగాలి - మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారు? స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా? తినండి, తాగండి, తిరగండి, దానికి వద్దనేమీ అనటం లేదు. అలాగే దీని కొరకు కూడా సమయాన్ని కేటాయించండి. ఇతరుల కళ్యాణమును కూడా చేయాలి. ఎవరికైనా బట్టలు ఉతికే పని ఉన్నట్లయితే వారి వద్దకు ఎంతోమంది వస్తారు. ఆ వచ్చిన వారు ముసల్మానులైనా, పారసీయులైనా, హిందువులైనా, వారికి ఇలా చెప్పండి - మీరు స్థూల వస్త్రాలను ఉతికించుకుంటారు కానీ మీ ఈ శరీరమేదైతే ఉందో అది పాత మురికి పట్టిన వస్త్రము వంటిది, ఆత్మ కూడా తమోప్రధానముగా ఉంది, దానిని సతోప్రధానముగా, స్వచ్ఛముగా తయారుచేయాలి. ఈ ప్రపంచమంతా తమోప్రధానముగా, పతితముగా, కలియుగముగా, పాతగా ఉంది. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి అన్న లక్ష్యము ఉంది కదా. ఇప్పుడిక చేయండి, చేయకపోండి, అర్థం చేసుకోండి లేక చేసుకోకపోండి, ఇక మీ ఇష్టము. మీరు ఆత్మ కదా. ఆత్మ తప్పకుండా పవిత్రముగా ఉండాలి. ఇప్పుడైతే మీ ఆత్మ అపవిత్రముగా అయ్యింది. ఆత్మ మరియు శరీరము, రెండూ మురికి పట్టి ఉన్నాయి, వీటిని శుభ్రం చేయడానికి మీరు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీ ఆత్మ పూర్తిగా 100 శాతము పవిత్ర బంగారముగా అయిపోతుంది అన్న గ్యారంటీ ఉంది, అప్పుడిక నగ కూడా మంచిగా తయారవుతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టము అని చెప్పాలి. ఇది కూడా ఎంత పెద్ద సేవ. డాక్టర్ల వద్దకు వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, గొప్ప-గొప్ప వారి వద్దకు వెళ్ళి - క్యారెక్టర్ చాలా బాగుండాలి, ఇక్కడైతే అందరూ కారెక్టర్ లేనివారిగా ఉన్నారు అని అర్థం చేయించండి. తండ్రి అంటారు, నిర్వికారులుగా అవ్వండి. నిర్వికారీ ప్రపంచము ఉండేది కదా. ఇప్పుడు ఇది వికారీగా ఉంది అనగా క్యారెక్టర్ లేకుండా ఉన్నారు. క్యారెక్టర్లు చాలా పాడైపోయాయి. నిర్వికారులుగా అవ్వకుండా బాగుపడరు. ఇక్కడ మనుష్యులు కామ వికారులుగా ఉన్నారు. ఇప్పుడు వికారీ ప్రపంచము నుండి నిర్వికారీ ప్రపంచమును ఒక్క తండ్రే స్థాపన చేస్తారు. మిగిలిన పాత ప్రపంచమంతా వినాశనమైపోతుంది. ఇది చక్రము కదా. ఈ చక్రములో వివరణ చాలా బాగుంది. ఇది నిర్వికారీ ప్రపంచముగా ఉండేది, అక్కడ దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు వారేమయ్యారు? ఆత్మ అయితే వినాశనమవ్వదు, ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. దేవీ-దేవతలు కూడా 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము ఎంత అశుద్ధముగా ఉంది. తండ్రి ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితముగా యథార్థమేనని మీకు అనిపిస్తుంది. అక్కడ తప్పకుండా పవిత్ర ప్రపంచమే ఉంటుంది. ఇది పవిత్ర ప్రపంచముగా లేని కారణముగా తమపై దేవత అన్న పేరుకు బదులుగా హిందువు అన్న పేరును పెట్టుకున్నారు. హిందుస్థాన్ లో ఉండేవారిని హిందువులు అని అనేస్తారు, దేవతలు స్వర్గములో ఉంటారు. ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు, కావున ఏ విధంగా తండ్రి అర్థం చేయిస్తారో అలా మళ్ళీ కూర్చొని రిపీట్ చేయాలి. ముఖ్యమైన పదాలను నోట్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత తండ్రి ఈ-ఈ పాయింట్లను వినిపించారు అని వినిపించండి. నేను గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అని చెప్పండి. ఇది గీతా యుగము. నాలుగు యుగాలు ఉన్నాయి, ఇదైతే అందరికీ తెలుసు. ఇది లీప్ యుగము. ఈ సంగమయుగము గురించి ఎవరికీ తెలియదు, ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. మనుష్యులు శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఏమి చేసారు? అన్నది వారికి తెలియదు. శివజయంతి తర్వాత కృష్ణజయంతి వస్తుంది, ఆ తర్వాత రామజయంతి. జగదాంబ, జగత్పితల జయంతినైతే ఎవ్వరూ జరుపుకోరు. అందరూ నంబరువారుగా వస్తారు కదా. ఇప్పుడు మీకు ఈ జ్ఞానమంతా లభిస్తుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మన తండ్రి, సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచర్, సుప్రీమ్ సద్గురువు - ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి. అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు రాజ్యాధికారము) యొక్క చదువును చదివించాలి.

2. జ్ఞానము అనగా సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి మరియు విజ్ఞానము అనగా శబ్దము నుండి అతీతముగా శాంతిలోకి వెళ్ళాలి. 7 రోజుల కోర్సును తీసుకుని ఆ తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదవాలి.

వరదానము:-

సేవలో గౌరవము మరియు ప్రతిష్ట అనే అపరిపక్వ ఫలాన్ని త్యాగము చేసి సదా ప్రసన్నచిత్తులుగా ఉండే అభిమాన ముక్త భవ

రాయల్ రూపములోని కోరిక యొక్క స్వరూపము పేరు, గౌరవము మరియు ప్రతిష్ట. ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారికి అల్పకాలికముగా పేరు లభిస్తుంది కానీ ఉన్నత పదవిలో పేరు వెనుకబడిపోతుంది ఎందుకంటే అపరిపక్వముగానే తినేశారు. సేవకు ప్రతిఫలముగా నాకు గౌరవము లభించాలి అని కొంతమంది పిల్లలు ఆలోచిస్తుంటారు కానీ ఇది గౌరవము కాదు, అభిమానము. ఎక్కడైతే అభిమానము ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు, అందుకే అభిమానముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవము చెయ్యండి.

స్లోగన్:-

పరమాత్మ ప్రేమ యొక్క సుఖాన్ని ఇచ్చే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖపు అల రాలేదు.