29-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ స్వధర్మములో స్థితులై పరస్పరములో
ప్రేమగా ఒకరికొకరు ఓం శాంతి చెప్పుకోండి - ఇది కూడా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవడము
వంటిది’’
ప్రశ్న:-
భక్తిలో కూడా
భగవంతునికి భోగ్ సమర్పిస్తారు, ఇక్కడ పిల్లలైన మీరు కూడా భోగ్ పెడతారు - ఈ ఆచారము
ఎందుకు ఉంది?
జవాబు:-
ఎందుకంటే భోగ్
సమర్పించడము కూడా వారి పట్ల గౌరవాన్ని ఉంచడము వంటిదే. శివబాబా నిరాకారుడని, అభోక్త
అని మీకు తెలుసు. వారు తినరు కానీ భావన అయితే వారికి చేరుతుంది. వారు సర్వుల
సద్గతిదాత, పతిత-పావనుడైన తండ్రి. కావున తప్పకుండా వారికి భోగ్ ను కూడా సమర్పించాలి.
పాట:-
మా తీర్థము
అతీతమైనది...
ఓంశాంతి
పిల్లల మనసులో
కూడా ఓం శాంతి అన్న మాట వచ్చింది. ఎలాగైతే ఎవరికైనా నమస్తే చెప్పినప్పుడు, వారు కూడా
రిటర్న్ లో నమస్తే చెప్తారు. ఇక్కడ తండ్రి ఓం శాంతి అని అన్నారు కనుక వీరి (బ్రహ్మా)
ఆత్మ సహితముగా పిల్లలందరి మనసు నుండి ఓం శాంతి అని వస్తుంది, అనగా నేను ఆత్మను,
శాంతి స్వరూపాన్ని. రెస్పాన్స్ (బదులు) ఇవ్వాలి కదా. ఇది రెస్పాన్స్ కదా.
ఇతరులెవ్వరూ ఇలా అర్థ సహితముగా చెప్పలేరు. జ్ఞాన సూర్యుడైన తండ్రి కూడా ఓం శాంతి అని
చెప్తారు. జ్ఞాన చంద్రుడు కూడా ఓం శాంతి అని చెప్తారు. జ్ఞాన సితారలు కూడా ఓం శాంతి
అని చెప్తారు. సితారలు అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేస్తారు. మేము శాంతి
స్వరూపులము మరియు శాంతిధామ నివాసులము - అని ఇప్పుడు పిల్లలైన మీకు మీ స్వధర్మము
గురించి తెలిసింది. ఈ విషయములో మీకు నిశ్చయము ఏర్పడింది. ఆత్మ గురించి మీకు మంచి
రీతిలో తెలుసు. తప్పకుండా మహానాత్మ, పాపాత్మ అని అంటూ ఉంటారు కూడా. ఆత్మయే ఒక
శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. కానీ ఆత్మ యొక్క యథార్థ పరిచయము ఎవరికీ
తెలియదు. ఆత్మ అయిన మనము చాలా చిన్నగా ఉంటాము, 84 జన్మల పాత్రను అభినయిస్తాము.
ఇంతకుముందు ఈ విషయాలు మీకూ తెలియవు, ఇతరులకు కూడా తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు
సమ్ముఖముగా కూర్చున్నారు. తండ్రిని మీ వారిగా చేసుకుంటారు. పిల్లలు వారసత్వాన్ని
తీసుకునేందుకు తండ్రిని తమవారిగా చేసుకుంటారు.
ఆత్మలైన మన అనంతమైన
తండ్రి ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారని, బ్రహ్మా తనువులోకి వచ్చి ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితం కూడా ఆది
సనాతన దేవీ-దేవతా ధర్మము అనగా సూర్యవంశీ రాజధాని స్థాపన అయ్యింది. ఈ స్థాపనా
కార్యాన్ని కల్ప-కల్పము తండ్రియే చేస్తారు, వారిని భగవంతుడు అని అంటారు. దుఃఖము
హరించండి, సుఖము ఇవ్వండి అని తండ్రి అయిన భగవంతుడిని అందరూ అడుగుతారు. సుఖము
లభించినప్పుడు ఇక అడగాల్సిన అవసరముండదు. ఇక్కడ అడుగుతారు, ఎందుకంటే దుఃఖముంది.
అక్కడ ఏమీ అడగాల్సిన అవసరము ఉండదు ఎందుకంటే తండ్రి తమదంతా ఇచ్చి వెళ్తారు, అందుకే
సత్యయుగములో ఎవరూ కూడా తండ్రిని స్మృతి చేయరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
పిల్లలను నేను సుఖధామానికి యజమానులుగా చేస్తాను. ఈ బాబా నుండి మనము మళ్ళీ సుఖధామము
యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి నుండి
అనంతమైన సుఖము తీసుకుంటారు. భక్తి మార్గము ఎలా నడుస్తుంది, మనుష్య సృష్టి రూపీ
వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనము ఎలా జరుగుతాయి, డ్రామా ఆదిమధ్యాంతాలు
ఏమిటి అనేవి మీకు అర్థం చేయించడము జరుగుతుంది. ఇది సాకారీ ప్రపంచము, అది నిరాకారీ
ప్రపంచము. మనము పూర్తి అర్ధకల్పమంతా భక్తి చేసామని పిల్లలు అర్థం చేసుకున్నారు.
ఇప్పుడిది కలియుగాంతము. వారసత్వము సంగమములోనే లభిస్తుంది. ఈ విషయాలను పిల్లలు మంచి
రీతిలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము సంగమములో ఉన్నాము, ఇది పిల్లలైన మీరు మాత్రమే
అర్థం చేసుకుంటారు. ఎప్పటివరకైతే పరిచయము ఇవ్వరో, అప్పటివరకు ఇతరులెవ్వరూ అర్థం
చేసుకోలేరు. పాత ప్రపంచము మారి కొత్తదిగా అయినప్పుడు, సంగమయుగము తప్పకుండా వస్తుంది.
ఇదంతా పాత ప్రపంచము, దీనిని ఇనుప యుగమని అంటారు. మొట్టమొదట ప్రపంచమంతటా ఒకే
ధర్మముంటుందని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచములో కేవలం భారత ఖండము మాత్రమే ఉంటుంది,
కొద్దిమంది మనుష్యులే ఉంటారు. కొత్త ప్రపంచాన్నే స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచములో
కొత్త భారత్ ఉండేదని దీని ద్వారా ఋజువవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచములో పాత భారత్
ఉంది. కొత్త ప్రపంచము, కొత్త భారత్ ఉండాలని, కొత్త ఢిల్లీ ఉండాలని గాంధీ కూడా
అనేవారు. ఇప్పుడు కొత్త భారత్ లేక కొత్త ఢిల్లీ లేవు. కొత్త భారత్ లోనైతే ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. ఇప్పుడు అదే భారత్ లో రావణ రాజ్యము ఉంది. కొత్త
ప్రపంచము, కొత్త ఢిల్లీ ఉండేవని, ఫలానా సమయము నుండి ఫలానా సమయము వరకు ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని కూడా వ్రాయాలి. కొత్త ప్రపంచాన్ని తయారుచేసేవారే ఈ
విషయాలను అర్థం చేయించగలరు. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన
చేస్తారు, ఆ స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వస్తారు. తండ్రి మీకు యుక్తులను
తెలియజేస్తారు మరియు పురుషార్థము చేయిస్తారు. సమ్ముఖముగా కలుసుకునేందుకు కూడా
వస్తారు మరియు అక్కడ కూర్చుని కూడా చదువుకుంటారు. సమ్ముఖముగా కలవాలని మనసు
కలుగుతుంది. అక్కడ మనుష్యులు, మనుష్యులను సమ్ముఖముగా కలుస్తారు. ఇక్కడ మీరు - మేము
శివబాబాను కలుసుకునేందుకు వెళ్తున్నామని అంటారు. వారు నిరాకారుడు కదా అని అంటారు.
మరి ఆత్మలైన మనము కూడా నిరాకారియే. మనము కూడా ఇక్కడకు పాత్రను అభినయించేందుకు
వస్తాము కదా. ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో, వారు తప్పకుండా పాత్రధారులు కూడా.
భగవంతుడి పేరు కూడా ఉంది కదా. నిరాకార శివుడినే భగవంతుడని అంటారు, వేరెవ్వరినీ
భగవంతుడని అనరు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. వారికి పూజ జరుగుతుంది, ఆత్మలకు
కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కదా. వారు మట్టితో సాలిగ్రామాలను
తయారుచేస్తారు. రాతితోనైనా లేక మట్టితోనైనా తయారుచేయవచ్చు. మట్టితో చేసినవాటిని
పగలగొట్టడము మరియు మళ్ళీ తయారుచేయడము సులువుగా ఉంటుంది. ప్రపంచములోని వారికి ఈ
విషయాల గురించి తెలియదు. రుద్ర యజ్ఞములో ఎంతమంది ఆత్మలకు పూజ చేయవచ్చు. పిల్లలైతే
అనేకమంది ఉన్నారు. భక్తులందరూ భగవంతుని పిల్లలు, తండ్రిని స్మృతి చేస్తారు. శివబాబా
భారత్ లోనే వస్తారని బాబా అర్థం చేయించారు. కొద్దిమంది పిల్లలైన మీరు మాత్రమే
భగవంతునికి సహాయకులుగా, ఈశ్వరీయ సేవాధారులుగా అవుతారు, భక్తులు వారికి మాత్రమే
సాలిగ్రామాలను తయారుచేసి పూజిస్తారు. ఏ యజ్ఞాలనైతే రచిస్తారో, వాటిలో చిన్న యజ్ఞాలు
కూడా ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. పెద్ద షావుకారులు పెద్ద యజ్ఞాలను రచిస్తారు.
లక్షలాది సాలిగ్రామాలను తయారుచేస్తారు. చిన్న యజ్ఞమైతే 5-10 వేలు సాలిగ్రామాలను
తయారుచేస్తారు. సేఠ్ ను బట్టి యజ్ఞముంటుంది మరియు దాని బట్టి సాలిగ్రామాలను
తయారుచేస్తారు. ఒక్క శివలింగాన్ని తయారుచేస్తారు మరియు మిగిలినవి సాలిగ్రామాలుగా
తయారుచేస్తారు, మరి అంతమంది బ్రాహ్మణులు కూడా ఉండాలి. చాలామంది యజ్ఞాలను చూసి ఉంటారు.
బాబా పిల్లలైన మనకు సేవ చేస్తున్నారని, మనము మళ్ళీ ఇతరుల సేవ చేస్తామని, అందుకే పూజ
జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతారు. బాబా, మీరైతే సదా
పూజ్యులు, మమ్మల్ని కూడా పూజ్యులుగా చేస్తున్నారు అని ఆత్మ అంటుంది. పూజ్యాత్మలైన
మీరు శరీరాలను తీసుకున్నప్పుడు పూజ్య దేవీ-దేవతలని అంటారు. ఆత్మయే పూజ్యముగా మరియు
పూజారిగా అవుతుంది. తండ్రి రావడము కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇక తండ్రి తర్వాత
మళ్ళీ ఎప్పుడైనా ఆత్మలను చదివించడమనేది జరగనే జరగదు. ఆత్మయే వింటుంది. ఎలాగైతే ఆత్మ
శరీరము ద్వారా వింటుందో, అలా పరమపిత పరమాత్మ, సుప్రీమ్ ఆత్మ కూడా శరీరాన్ని ఆధారముగా
తీసుకుని వీరి (బ్రహ్మా) ద్వారా వింటారు. వీరి ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు.
వారికి తమ శరీరమంటూ లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా తమ-తమ సూక్ష్మ శరీరాలు
ఉన్నాయి. ఇక్కడైతే అందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి. ఇది ఉన్నదే సాకారీ ప్రపంచము.
శివబాబా నిరాకారుడు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు కూడా. వారు
వచ్చి అందరినీ పతితము నుండి పావనముగా తయారుచేస్తారు. ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ
లేదు. నేను ఒకవేళ ప్రేరణతోనే పావనముగా తయారుచేయాల్సి వస్తే, ఇక ఇక్కడకు వచ్చి
రథాన్ని తీసుకునే అవసరమేముంది? శివుని మందిరములో వారి ఎదురుగా నందిని ఉంచుతారు.
మనుష్యుల బుద్ధి పూర్తిగా రాతిబుద్ధి వలె ఉన్న కారణముగా ఏమీ అర్థం చేసుకోరు. శివుని
ఎదురుగా నందిని ఎందుకు ఉంచారు? గోశాల అనే పేరు వినేసరికి నందిని పెట్టేసారు. ఇప్పుడు
ఎద్దుపై ఎవరు స్వారీ చేసారు! శ్రీకృష్ణుని ఆత్మ అయితే సత్యయుగములో ఉంటుంది. వారికి
జంతువుపై కూర్చునే అవసరమేముంది. ఏమీ అర్థం చేసుకోరు. ద్రౌపది కూడా ఒక్కరు మాత్రమే
కాదు. ఆ తండ్రిని పిలిచేవారు ఎంతోమంది ఉన్నారు. శ్రీకృష్ణుడు చీరలు ఇస్తూ ఉన్నట్లుగా,
వారు ఒక నాటకాన్ని తయారుచేసారు, దాని అర్థమేమీ వారికి తెలియదు. మీరు 21 జన్మల వరకు
వివస్త్రగా అవ్వరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడి విషయాన్ని
ఎక్కడికి తీసుకువెళ్ళారు! భక్తి మార్గములో అనేక కథలు ఉన్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ
అనాదిగా ఉన్నాయని అంటారు. పునర్జన్మలు తీసుకుంటూ కథలు వింటూ వచ్చారు. అనాది అన్నా
కూడా, ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అనేది ఏమీ తెలియదు. రావణ రాజ్యము ఎప్పటినుండి
ప్రారంభమవుతుంది అనేది కూడా తెలియదు. దాని గురించి వర్ణన ఏమీ లేదు. మీరు ఎంత సేవ
చేస్తారు. ఆ సూర్య, చంద్ర, నక్షత్రాలు మొదలైనవి ఎలాగూ ఉన్నాయి. అవి సత్యయుగములో కూడా
ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో మార్పు-చేర్పులు ఉండవు. ఇప్పుడు మీరు భారత్
నే మళ్ళీ అంధకారము నుండి బయటకు తీసి ప్రకాశములోకి తీసుకువచ్చేందుకు నిమిత్తులయ్యారు.
భక్తి మార్గాన్ని అంధకారమని అంటారు. మీరు ధరిత్రి సితారలు అని మీకు మహిమ ఉంది.
నక్షత్రాలుంటే సూర్య-చంద్రులు కూడా ఉండాలి.
ఇది మీ ఆత్మిక తీర్థ
స్థానము. మీరు ఎటువంటి యాత్రకు వెళ్తున్నారంటే, అక్కడ నుండి మళ్ళీ ఈ మృత్యులోకములోకి
రారు. ఇప్పుడిది మృత్యులోకము, మళ్ళీ ఇక్కడే అమరలోకము ఉంటుంది. ద్వాపరము నుండి
మృత్యులోకము ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకములోకి వెళ్ళేందుకు,
సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నారు. ఆత్మలైన మన యాత్ర అతీతమైనదని మీరు అర్థం
చేసుకున్నారు. మీరు ఇక్కడ కూర్చుని, యాత్ర చేసే పురుషార్థము చేస్తారు. స్మృతితోనే
మీ వికర్మలు వినాశనమవుతాయి. వారు యాత్రలకు వెళ్తారు కానీ వికర్మలు ఎక్కడ
వినాశనమవుతాయి! మనుష్యులకు మద్యం సేవించే అలవాటు ఎంతగా ఉంటుందంటే, దానిని యాత్రలకు
వెళ్ళేటప్పుడు కూడా దాచిపెట్టి తప్పకుండా తీసుకువెళ్తారు. ఈ రోజుల్లో యాత్రలలో
చాలామంది అశుద్ధమైనవారు కూడా ఉంటారు. వాస్తవానికి అందరూ పతితులే కదా. ఎలాగైతే ఆ
పూజారీ బ్రాహ్మణులు పతితముగా ఉన్నారో, అలానే యాత్రికులు కూడా పతితముగానే ఉన్నారు. ఆ
పండాలు యాత్రలు చేయిస్తారు, కానీ పావనముగా ఉండరు కదా. మీరైతే పవిత్రముగా ఉంటారు.
సత్యమైన బ్రాహ్మణులు మీరు. మీ ఆత్మ పవిత్రముగా ఉంటుంది. స్మృతియాత్రతోనే మీరు
పవిత్రముగా అవుతారు. సతోప్రధానముగా అవ్వాలి. ‘‘మధురమైన పిల్లలూ’’, అని బాబా పదే-పదే
వ్రాస్తుంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా
అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని శివబాబా ఆత్మల కోసం వ్రాశారు.
ముఖ్యమైన డైరెక్షన్ కేవలం ఒక్కటే. ఇది ఎంత సహజమైనది. స్మృతితోనే వికర్మలు
వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు, ఇక శిక్షలు అనుభవిస్తారు.
బాబా అంటారు - మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, సంపాదన చేసుకోవచ్చు. లేవండి, కూర్చోండి,
తినండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇది మీ సంపాదన. పిల్లలకైతే ఇది ఇంకా సహజము.
ఇందులో వారికి అటెన్షన్ మొదలైనవాటి విషయమేమీ లేదు. శ్రీనాథుని మందిరములో శ్రీనాథుని
స్మృతిలో కూర్చుంటారు. భోగ్ పెడతారు. వాస్తవానికి అది రాతి మూర్తియే కదా. భోగ్ కూడా
ఎవరికి పెట్టాలి? భోగ్ కు అధికారి అయితే ఒక్క శివబాబా మాత్రమే. సర్వుల సద్గతిదాత,
పతిత-పావనుడు వారే. తండ్రి అంటారు - నేను స్వీకరించనే స్వీకరించను. మీరు నాకు
అభిషేకము కూడా నీళ్ళు కలిపిన పాలతో చేస్తారు, నాకు ఈ భోగ్ పెడతారు, ఎందుకని? నేనైతే
నిరాకారుడిని, అభోక్తను! నాకు ఏమి పూజ చేస్తారు? నా ఎదురుగా భోగ్ ను ఉంచుతారు, కానీ
భక్తులే భోగ్ పెడతారు, తర్వాత వారే పంచుకుని తింటారు. శివబాబాకైతే భోగ్ తప్పకుండా
పెట్టాలని మీకు తెలుసు. తర్వాత దానిని పంచుకుని మీరు తింటారు. ఇది వారి పట్ల
గౌరవాన్ని ఉంచడము వంటిది. మనము శివబాబాకు భోగ్ సమర్పిస్తాము. ఇది శివబాబా భండారా కదా.
ఎవరి భండారానో (వంటిల్లూ), వారికి భోగ్ తప్పకుండా పెట్టవలసి ఉంటుంది. మీరు భోగ్
పెడతారు కానీ తినేది కూడా పిల్లలైన మీరే. ఈ బ్రహ్మా తింటారు, నేను తినను. కానీ,
భావన అయితే చేరుతుంది కదా. చాలా మంచి భోగ్ తయారుచేసారు అని అనేందుకు బ్రహ్మాకు
కర్మేంద్రియాలైతే ఉన్నాయి కదా. ఈ బ్రహ్మా తినగలరు. ఈ శరీరమైతే వీరిదే కదా. నేను
కేవలం వీరిలోకి వచ్చి ప్రవేశిస్తాను. పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనముగా
చేసేందుకు, వీరి నోటిని మాత్రమే ఉపయోగిస్తాను. గోముఖము అని కూడా అంటారు కదా.
తప్పకుండా గోవు కూడా ఉంది. వీరి ద్వారానే పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటానని
మీకు తెలుసు. తల్లి-తండ్రి, రెండూ వీరే. కానీ మాతలను ఎవరు సంభాళించాలి! అందుకే
డ్రామా ప్లాన్ అనుసారముగా, సరస్వతిని నిమిత్తముగా పెట్టారు. మాతా గురువుకు మహిమ కూడా
ఉండాలి కదా. మొదటి నంబరు గురువుగా వీరు ప్రసిద్ధి చెందారు. గురు బ్రహ్మా అని అనడము
సరైనదే. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా
సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ స్వర్గము యొక్క సత్యమైన మార్గాన్ని
తెలియజేస్తారు. మన్మనాభవ, మధ్యాజీభవ అని ఆత్మయే నోటి ద్వారా మార్గాన్ని
తెలియజేస్తుంది. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ అదే మార్గాన్ని తెలియజేస్తారు. ఇక్కడ
మీరు సమ్ముఖముగా కూర్చున్నారు, స్మృతి ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే, చాలామంది
పిల్లలు మర్చిపోతారు. బాబా వద్దకు వచ్చామని ఇక్కడ ఆనందము కలుగుతుంది. బాబా అంటారు -
స్వదర్శన చక్రధారులుగా అయి, ముక్తిధామాన్ని, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి
చేయండి అనే యుక్తిని తెలియజేయండి. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పరస్పరములో ఒకరికొకరు మరియు తండ్రికి యథార్థమైన గౌరవాన్ని ఇవ్వాలి. తండ్రి
అభోక్త అయినా కానీ, ఎవరి భండారా నుండైతే పాలన జరుగుతుందో, ముందు వారికి తప్పకుండా
సమర్పించాలి.
2. పూజ్యనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. తండ్రితోపాటు సేవలో
సహాయకులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము, రెండూ పావనముగా అవుతాయో, అప్పుడు
పూజ జరుగుతుంది.
వరదానము:-
స్వయము పట్ల మరియు సర్వాత్మల పట్ల లా ఫుల్ గా అయ్యే లా
మేకర్లుగా మరియు న్యూ వరల్డ్ మేకర్లుగా కండి
ఎవరైతే స్వయము పట్ల లా ఫుల్ గా అవుతారో వారే ఇతరుల పట్ల
కూడా లా ఫుల్ గా అవ్వగలుగుతారు. ఎవరైతే స్వయము లా ను బ్రేక్ చేస్తారో, వారు ఇతరులపై
లా ను నడపలేరు. అందుకే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - ఉదయము నుండి రాత్రి వరకు
మనసా సంకల్పాలలో, వాణిలో, కర్మలలో, సంపర్కములో లేక పరస్పరము సహయోగాన్ని ఇవ్వడములో
లేక సేవలో ఎక్కడైనా సరే, లా బ్రేక్ అవ్వడము లేదు కదా! ఎవరైతే లా మేకర్లుగా ఉంటారో,
వారు లా బ్రేకర్లుగా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయములో లా మేకర్లుగా అవుతారో, వారే పీస్
మేకర్లుగా, న్యూ వరల్డ్ మేకర్లుగా అవుతారు.
స్లోగన్:-
కర్మలు చేస్తూ
కర్మల యొక్క మంచి లేక చెడు ప్రభావములోకి రాకుండా ఉండడమే కర్మాతీతముగా అవ్వడము.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
జ్వాలా స్వరూపపు
స్మృతి కొరకు మనసు మరియు బుద్ధి, ఈ రెండింటికీ ఒకటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి మరియు
మలచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి మరియు వేరే ఏ శక్తి
కూడా వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో అంతగానే పరిశీలించే శక్తి,
నిర్ణయ శక్తి పెరుగుతాయి. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని ఆపు చేస్తూ
వెళ్ళండి అనగా సర్దుబాటు శక్తిని ధారణ చేయండి.