ఓంశాంతి
భగవానువాచ. ఇప్పుడు బుద్ధిలోకి ఎవరు వచ్చారు? ఆ గీతా పాఠశాలలు మొదలైనవేవైతే ఉన్నాయో,
వారికైతే భగవానువాచ అని అన్నప్పుడు శ్రీకృష్ణుడే బుద్ధిలోకి వస్తారు. ఇక్కడ
పిల్లలైన మీకైతే ఉన్నతోన్నతమైన తండ్రి గుర్తుకొస్తారు. ఈ సమయములో ఇది సంగమయుగము, ఇది
పురుషోత్తములుగా అయ్యే యుగము. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, దేహ
సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది చాలా
ముఖ్యమైన విషయము, దీనిని సంగమయుగములో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే పతితముగా
అయ్యింది. మళ్ళీ ఆత్మయే పావనముగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. పతిత-పావనుడిని స్మృతి
చేస్తూ వచ్చారు కానీ వారి గురించి ఏమీ తెలియదు. భారతవాసులు పూర్తిగా ఘోర అంధకారములో
ఉన్నారు. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. రాత్రిలో అంధకారము, పగలులో ప్రకాశము ఉంటుంది.
సత్యయుగము పగలు, కలియుగము రాత్రి. ఇప్పుడు మీరు కలియుగములో ఉన్నారు, సత్యయుగములోకి
వెళ్ళాలి. పావన ప్రపంచములో పతితులు అనే ప్రశ్నే లేదు. పతితులుగా అయినప్పుడు పావనముగా
అయ్యే ప్రశ్న తలెత్తుతుంది. పావనముగా ఉన్నప్పుడు పతిత ప్రపంచము గుర్తు కూడా ఉండదు.
ఇప్పుడు పతిత ప్రపంచము ఉంది కావున పావన ప్రపంచము గుర్తుకొస్తూ ఉంటుంది. పతిత
ప్రపంచము చివరి భాగము, పావన ప్రపంచము మొదటి భాగము. అక్కడ పతితులెవ్వరూ ఉండజాలరు.
ఎవరైతే పావనముగా ఉండేవారో, వారే మళ్ళీ పతితముగా అయ్యారు. 84 జన్మలు కూడా వారివే
అర్థం చేయించడము జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు.
అర్ధకల్పము భక్తి చేసారు, దానిని అంత త్వరగా వదలలేరు. మనుష్యులు పూర్తిగా ఘోర
అంధకారములో ఉన్నారు, కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు, ఎవరి బుద్ధిలోనైనా కష్టము మీద
కూర్చుంటుంది. తండ్రి చెప్తున్నారు, ముఖ్యమైన విషయమేమిటంటే - దేహపు సర్వ సంబంధాలను
మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మయే పతితముగా అయ్యింది, ఆత్మయే మళ్ళీ
పవిత్రముగా అవ్వాలి. ఈ వివరణను కూడా తండ్రియే ఇస్తారు ఎందుకంటే ఈ తండ్రి ప్రిన్సిపల్,
కంసాలి, డాక్టర్, బ్యారిస్టర్, సర్వస్వమూ. ఈ పేర్లు అక్కడ ఉండవు. అక్కడ ఈ చదువు కూడా
ఉండదు. ఇక్కడ ఉద్యోగము చేయడము కోసం చదువుతారు. పూర్వము స్త్రీలు అంతగా చదువుకునేవారు
కాదు. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నారు. పతి మరణించినట్లయితే ఎవరు సంభాళిస్తారు? అందుకే
స్త్రీలు కూడా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సత్యయుగములోనైతే ఈ విధముగా చింతన చేయవలసి
వచ్చే విషయాలేవీ ఉండవు. అటువంటి సమయము కోసమనే ఇక్కడ మనుష్యులు ధనము మొదలైనవి జమ
చేసుకుంటూ ఉంటారు. అక్కడైతే ఇటువంటి చింతించవలసిన విషయాలే ఉండవు. పిల్లలైన మిమ్మల్ని
తండ్రి ఎంత ధనవంతులుగా తయారుచేస్తారు. స్వర్గములో చాలా ఖజానా ఉంటుంది.
వజ్ర-వైఢూర్యాల గనులన్నీ నిండుగా అయిపోతాయి. ఇక్కడ భూమి బంజరు భూమిగా అయిపోతుంది
కావున ఆ శక్తి ఉండదు. అక్కడి పుష్పాలకు, ఇక్కడి పుష్పాలు మొదలైనవాటికి రాత్రికి,
పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడైతే అన్ని వస్తువుల నుండి శక్తి పోయింది. అమెరికా
మొదలైన స్థానాల నుండి ఎంత మంచి విత్తనాలు తీసుకువచ్చినా కానీ శక్తి తొలగిపోతూ
ఉంటుంది. భూమియే అలా ఉంది, దాని వెనుక చాలా కష్టపడవలసి ఉంటుంది. అక్కడైతే ప్రతి
వస్తువు సతోప్రధానముగా ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానముగా ఉంటుంది, కావున
అన్నీ సతోప్రధానముగా ఉంటాయి. ఇక్కడైతే అన్ని వస్తువులు తమోప్రధానముగా ఉన్నాయి. ఏ
వస్తువులోనూ శక్తి లేదు. ఈ వ్యత్యాసాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. సతోప్రధాన
వస్తువులను చూడటమంటే ధ్యానములోనే చూస్తారు. అక్కడి పుష్పాలు మొదలైనవి ఎంత బాగుంటాయి.
అక్కడి ధాన్యము మొదలైనవి కూడా మీకు కనిపించవచ్చు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు.
అక్కడి ప్రతి వస్తువులోనూ ఎంతటి శక్తి ఉంటుంది. కొత్త ప్రపంచము ఎవరి బుద్ధిలోకీ రానే
రాదు. ఈ పాత ప్రపంచము గురించైతే ఇక అడగకండి. వ్యర్థ ప్రలాపాలు కూడా చాలా చేస్తుంటారు,
మనుష్యులు పూర్తిగా అంధకారములో నిద్రపోయారు. ఇంకా కొంత సమయము మాత్రమే మిగిలి ఉందని
మీరు చెప్తే, కొంతమంది మిమ్మల్ని హేళన కూడా చేస్తారు. ఎవరైతే స్వయాన్ని
బ్రాహ్మణులుగా భావిస్తారో, వారు రియాలిటీలో అర్థం చేసుకుంటారు. ఇది కొత్త భాష,
ఆత్మిక చదువు కదా. ఎప్పటివరకైతే ఆత్మిక తండ్రి రారో, అప్పటివరకు ఎవ్వరూ అర్థం
చేసుకోలేరు. ఆత్మిక తండ్రి గురించి పిల్లలైన మీకు తెలుసు. వాళ్ళు వెళ్ళి యోగము
మొదలైనవి నేర్పిస్తారు కానీ వారికి నేర్పించింది ఎవరు? వాళ్ళు ఆత్మిక తండ్రి
నేర్పించారు అనైతే అనరు. తండ్రి ఆత్మిక పిల్లలకు మాత్రమే నేర్పిస్తారు. సంగమయుగీ
బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులుగా అయ్యేది కూడా ఆది
సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు మాత్రమే. బ్రాహ్మణులైన మీరు ఎంత కొద్దిమంది
ఉన్నారు. ప్రపంచములో రకరకాల జాతులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచములో ఎన్ని ధర్మాలు, ఎన్ని
భాషలు ఉన్నాయి అని తెలిపే పుస్తకమొకటి తప్పకుండా ఉంటుంది. కానీ ఇవన్నీ ఇక ఉండవని
మీకు తెలుసు. సత్యయుగములోనైతే ఒకే ధర్మము, ఒకే భాష ఉండేవి. సృష్టి చక్రాన్ని మీరు
తెలుసుకున్నారు. కావున ఈ భాషలన్నీ ఉండవని కూడా మీరు తెలుసుకోగలరు. ఇంతమంది
శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ సృష్టి జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది.
మీరు మనుష్యులకు అర్థం చేయించినా కానీ వారు అర్థం చేసుకోరు. ప్రారంభోత్సవాన్ని కూడా
గొప్ప వ్యక్తులతో ఎందుకు చేయిస్తారంటే వారు పేరు-ప్రఖ్యాతులు కలవారు కాబట్టి. వాహ్!
ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ప్రారంభోత్సవము చేసారు అనే శబ్దము వ్యాపిస్తుంది. అదే
ఈ బాబా వెళ్తే, పరమపిత పరమాత్మ వచ్చి ప్రారంభోత్సవము చేసారని మనుష్యులు అర్థం
చేసుకోరు, వారు అంగీకరించరు. ఎవరైనా గొప్ప వ్యక్తి, కమీషనర్ మొదలైనవారు వస్తే, వారి
వెనుక ఇతరులు కూడా పరుగెత్తుకుని వస్తారు. వీరి వెనుక అయితే ఎవరూ పరిగెత్తరు.
ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరైతే చాలా కొద్దిమందే ఉన్నారు. ఎప్పుడైతే మీరు మెజారిటీ
అవుతారో, అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడే ఒకవేళ అర్థం చేసుకుంటే మాత్రం
తండ్రి వద్దకు పరుగెత్తుకుని వస్తారు. ఒక వ్యక్తి ఇక్కడ కుమార్తెను ఇలా అడిగారు,
మీకు ఎవరైతే ఇది నేర్పించారో, వారి వద్దకు మేము నేరుగా ఎందుకు వెళ్ళకూడదు. కానీ
సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతము పట్ల ఆకర్షణ ఎలా కలుగుతుంది? తుప్పు ఎప్పుడైతే
పూర్తిగా వదులుతుందో, అప్పుడు సూది అయస్కాంతాన్ని పట్టుకోగలదు. సూదికి ఒక మూలలో
తుప్పు పట్టి ఉన్నా కానీ అంతగా ఆకర్షించదు. మొత్తము తుప్పు అంతా వదిలిపోవాలి.
చివరిలో ఎప్పుడైతే అలా అవుతారో, అప్పుడు తండ్రితోపాటు తిరిగి వెళ్తారు. ప్రస్తుతమైతే
- మేము తమోప్రధానముగా ఉన్నాము, తుప్పు పట్టి ఉంది అనే చింత ఉంది. ఎంతగా స్మృతి
చేస్తారో, అంతగా తుప్పు తొలగిపోతూ ఉంటుంది. మెల్ల-మెల్లగా తుప్పు తొలగిపోతూ ఉంటుంది.
తుప్పు పట్టడము కూడా మెల్ల-మెల్లగా పట్టింది కదా, కావున తొలగడము కూడా అలాగే
తొలగుతుంది. తుప్పు ఏ విధముగా పట్టిందో, అదే విధముగా అది మళ్ళీ తొలగేది ఉంది, దాని
కోసం తండ్రిని స్మృతి కూడా చేయాలి. స్మృతి ద్వారా కొంతమందిది ఎక్కువ తుప్పు
తొలిగింది, కొంతమందిది తక్కువ తొలిగింది. ఎంత ఎక్కువగా తుప్పు తొలగి ఉంటే, అంతగా
వారు ఇతరులకు అర్థం చేయించేటప్పుడు ఆకర్షిస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు.
వీటిని మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. రాజ్యము స్థాపన అవుతోందని మీకు తెలుసు.
అర్థం చేయించేందుకు కూడా రోజురోజుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శనీలు,
మ్యూజియంలు మొదలైనవి తయారవుతాయని ఇంతకుముందు తెలియదు కదా. మున్ముందు ఇంకా ఇటువంటివి
వెలువడే అవకాశముంది. ఇప్పుడింకా సమయముంది, స్థాపన జరగనున్నది. హార్ట్ ఫెయిల్ కూడా
అవ్వకూడదు (నిరాశ చెందకూడదు). కర్మేంద్రియాలను వశము చేసుకోలేకపోతే కింద పడిపోతారు.
వికారాల్లోకి వెళ్తే సూదిపై చాలా తుప్పు పడుతుంది. వికారాల వలన ఎక్కువ తుప్పు పడుతూ
ఉంటుంది. సత్య, త్రేతాయుగాలలో చాలా తక్కువ తుప్పు పడుతుంది, మిగిలిన అర్ధకల్పములో
త్వరత్వరగా తుప్పు పడుతుంది, కింద పడిపోతారు. అందుకే నిర్వికారులు మరియు వికారులు
అని అంటూ ఉంటారు. నిర్వికారులైన దేవతల గుర్తులు ఉన్నాయి కదా. తండ్రి అంటారు,
దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. గుర్తులైతే ఉన్నాయి కదా. అన్నింటికంటే మంచి
గుర్తు ఈ చిత్రాలు. మీరు ఈ లక్ష్మి-నారాయణుల చిత్రాన్ని తీసుకుని పరిక్రమణ చేయవచ్చు
ఎందుకంటే మీరు ఈ విధముగా అవుతారు కదా. రావణ రాజ్యము యొక్క వినాశనము, రామ రాజ్యము
యొక్క స్థాపన జరుగుతుంది. అది రామ రాజ్యము, ఇది రావణ రాజ్యము, ఇది సంగమము. అనేకానేక
పాయింట్లు ఉన్నాయి. డాక్టర్ల బుద్ధిలో ఎన్ని మందులు గుర్తు ఉంటాయి. బ్యారిస్టర్
బుద్ధిలో కూడా అనేక రకాల పాయింట్లు ఉంటాయి. అనేక టాపిక్స్ తో మంచి పుస్తకము
తయారవ్వవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా భాషణ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ పాయింట్లను
చూసుకోండి. చురుకైన బుద్ధికలవారు వెంటనే చూసుకుంటారు. మేము ఇలా-ఇలా అర్థం
చేయిస్తామని ముందుగా వ్రాసుకోవాలి. భాషణ చేసిన తర్వాత కూడా - ఈ విధముగా అర్థం
చేయించి ఉంటే బాగుండేదని పాయింట్లు గుర్తుకువస్తాయి కదా. ఈ పాయింట్లను ఇతరులకు అర్థం
చేయిస్తే బుద్ధిలో కూర్చుంటాయి. టాపిక్స్ లిస్ట్ రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక
టాపిక్ ను తీసుకుని లోలోపల భాషణ చేయాలి లేక వ్రాయాలి. ఆ తర్వాత అన్ని పాయింట్లు
వ్రాసానా అని చూసుకోవాలి. ఎంత కష్టపడితే అంత మంచిది. వీరు మంచి సర్జన్, వీరి
బుద్ధిలో చాలా పాయింట్లు ఉన్నాయి అని తండ్రి అయితే అర్థం చేసుకుంటారు కదా. నిండుగా
అయిన తర్వాత, ఇక సేవ చేయకపోతే ఆనందమే కలగదు.
మీరు ప్రదర్శనీలు ఏర్పాటు చేసినప్పుడు, ఒక్కోచోట ఇద్దరు, నలుగురు వెలువడితే,
మరోచోట ఆరుగురు, ఎనిమిదిమంది వెలువడుతారు. కొన్నిచోట్ల అయితే ఒక్కరు కూడా వెలువడరు.
వేలాదిమంది చూస్తారు కానీ ఎంతకొద్దిమంది వెలువడుతారు, అందుకే ఇప్పుడు పెద్ద-పెద్ద
చిత్రాలను కూడా తయారుచేస్తూ ఉంటారు. మీరు చురుకైనవారిగా అవుతూ ఉంటారు. గొప్ప-గొప్ప
వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మీరు చూస్తున్నారు. బాబా అర్థం చేయించారు -
ఈ జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలి అన్నది పరిశీలించాలి. నా భక్తులుగా ఉన్నవారి నాడిని
చూడాలి. గీతను చదివేవారికి ముఖ్యముగా ఒక విషయాన్ని అర్థం చేయించండి - భగవంతుడు అని
ఉన్నతోన్నతమైనవారినే అంటారు, వారు నిరాకారుడు. దేహధారులైన మనుష్యులెవ్వరినీ
భగవంతుడని అనలేరు. పిల్లలైన మీకు ఇప్పుడు అంతా అర్థమయ్యింది. సన్యాసులు కూడా ఇంటిని
సన్యసించి పారిపోతారు. కొంతమంది బ్రహ్మచారులే వెళ్ళిపోతారు. అటువంటివారు మరుసటి
జన్మలో కూడా అలాగే అవుతారు. జన్మనైతే తప్పకుండా తల్లి గర్భము ద్వారానే తీసుకుంటారు.
ఎప్పటివరకైతే వివాహము చేసుకోరో, అప్పటివరకు బంధనముక్తులుగా ఉంటారు, అంతగా సంబంధీకులు
మొదలైనవారు ఎవరూ గుర్తుకురారు. వివాహము చేసుకున్న తర్వాత ఇక సంబంధీకులు
గుర్తుకొస్తారు. సమయము పడుతుంది, అంత త్వరగా బంధనముక్తులుగా అవ్వలేరు. తమ జీవిత కథ
గురించైతే అందరికీ తెలుస్తుంది కదా. సన్యాసులు ఏమనుకుంటారంటే - మొదట మేము
గృహస్థులుగా ఉండేవారము, ఆ తర్వాత సన్యాసము చేపట్టాము. మీది చాలా గొప్ప సన్యాసము,
అందుకే ఇందులో కష్టపడవలసి ఉంటుంది. ఆ సన్యాసులు విభూతి పూసుకుంటారు, వెంట్రుకలు
తీసేసి వేషాన్ని మార్చుకుంటారు. మీరైతే అలా చేయవలసిన అవసరము లేదు. ఇక్కడైతే
వస్త్రాలు మార్చవలసిన విషయము కూడా లేదు. మీరు తెల్ల చీరను ధరించకపోయినా పర్వాలేదు.
ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన జ్ఞానము. నేను ఆత్మను, తండ్రిని స్మృతి చేయాలి,
దీని ద్వారానే తుప్పు తొలగుతుంది మరియు నేను సతోప్రధానముగా అయిపోతాను. తిరిగి అయితే
అందరూ వెళ్ళాల్సిందే. కొందరు యోగబలముతో పావనముగా అవుతారు, కొందరు శిక్షలు అనుభవించి
వెళ్తారు. పిల్లలైన మీరు తుప్పు తొలగించుకునేందుకే కృషి చేయవలసి ఉంటుంది, అందుకే
దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ అగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి. మీరు
పవిత్రముగా అయిపోతారు. కామ చితిని కూడా అగ్ని అని అంటారు. కామాగ్నిలో కాలిపోయి
నల్లగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, తెల్లగా అవ్వండి. ఈ విషయాలు బ్రాహ్మణులైన
మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. ఈ విషయాలే అతీతమైనవి. వీరు
శాస్త్రాలను కూడా నమ్మరు, నాస్తికులుగా అయిపోయారు అని మీ గురించి అంటారు. మీరు
చెప్పండి - మేము శాస్త్రాలు చదివేవారము కానీ తర్వాత తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు.
జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. భగవానువాచ - వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదవడము
ద్వారా, దానపుణ్యాదులు చేయడము ద్వారా ఎవ్వరూ నన్ను పొందలేరు. నా ద్వారానే నన్ను
పొందగలరు. తండ్రియే వచ్చి యోగ్యులుగా తయారుచేస్తారు. ఆత్మపై తుప్పు పట్టినప్పుడు,
మీరు వచ్చి పావనముగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. తమోప్రధానముగా అయిన ఆత్మ
సతోప్రధానముగా అవ్వాలి, తమోప్రధానము నుండి తమో, రజో, సతో, మళ్ళీ సతోప్రధానముగా
అవ్వాలి. ఒకవేళ మధ్యలో ఏదైనా తేడా అయితే మళ్ళీ తుప్పు పడుతుంది.
తండ్రి మనల్ని ఇంత ఉన్నతముగా తయారుచేస్తున్నారు కావున ఆ సంతోషము ఉండాలి కదా.
విదేశాలలో చదువుకునేందుకు సంతోషముగా వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా
అవుతారు. కలియుగములో ఎంత తమోప్రధానముగా, వివేకహీనులుగా అయిపోతారు. ఎంతగా
ప్రేమిస్తారో, అంతగా ఇంకా ఎదిరిస్తూనే ఉంటారు. మన రాజధాని స్థాపనవుతోందని పిల్లలైన
మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే బాగా చదువుకుంటారో, స్మృతిలో ఉంటారో, వారు మంచి
పదవిని పొందుతారు. భారత్ నుండే అంటు కట్టబడుతుంది. రోజురోజుకూ వార్తాపత్రికలు
మొదలైనవాటి ద్వారా మీ పేరు ప్రఖ్యాతి అవుతూ ఉంటుంది. వార్తాపత్రికలైతే అన్ని వైపులకు
వెళ్తూ ఉంటాయి. ఆ వార్తాపత్రికల వారే అప్పుడప్పుడూ బాగా వ్రాస్తారు, అప్పుడప్పుడు
చెడుగా వ్రాస్తారు ఎందుకంటే వారు కూడా చెప్పుడు మాటలపైనే నడుస్తారు కదా. ఎవరు ఏది
వినిపిస్తే, అది వ్రాసేస్తారు. చెప్పుడు మాటలపై చాలామంది నడుస్తారు, దానిని పరమతమని
అంటారు. పరమతము ఆసురీ మతము. తండ్రిది శ్రీమతము. ఎవరైనా ఏవైనా తప్పుడు విషయాలు చెప్తే,
ఇక రావడమే మానేస్తారు. ఎవరైతే సేవలో ఉంటారో, వారికి అన్నీ తెలుస్తాయి. ఇక్కడ మీరు ఏ
సేవనైతే చేస్తారో, ఇది నంబరువన్ సేవ. ఇక్కడ మీరు సేవ చేస్తారు, అక్కడ మీకు ఫలము
లభిస్తుంది. ఇక్కడ తండ్రితో కలిసి కర్తవ్యము చేస్తారు కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.