30-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
30.11.2004
‘‘ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖము ద్వారా బ్రహ్మాబాబా
సమానమైన అవ్యక్త రూపాన్ని చూపించండి, సాక్షాత్కార మూర్తులుగా
అవ్వండి’’
ఈ రోజు భాగ్యవిధాత అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ
భాగ్యవంతులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. మొత్తము కల్పములో
ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మరెవ్వరికీ ఉండదు. కల్ప-కల్పము యొక్క
పిల్లలైన మీరే ఈ భాగ్యము యొక్క అధికారాన్ని ప్రాప్తి
చేసుకుంటారు. మీ కల్ప-కల్పపు అధికారము యొక్క భాగ్యము గుర్తుందా?
ఈ భాగ్యము ఎందుకు సర్వ శ్రేష్ఠ భాగ్యము? ఎందుకంటే స్వయం
భాగ్యవిధాత అయిన తండ్రియే ఈ శ్రేష్ఠ భాగ్యముతో కూడిన దివ్య
జన్మను పిల్లలైన మీకు ఇచ్చారు. ఎవరికైతే జన్మయే భాగ్యవిధాత
ద్వారా జరుగుతుందో, దాని కంటే శ్రేష్ఠమైన భాగ్యము మరేదీ ఉండనే
ఉండదు. మీ భాగ్యము యొక్క నషా స్మృతిలో ఉంటుందా? మీ భాగ్యము
యొక్క లిస్టు తీసినట్లయితే ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది?
బ్రాహ్మణులైన మీ యొక్క భాగ్యశాలీ జీవితములో అప్రాప్తి అనే
వస్తువేదీ లేదు. అందరి మనసులలో మీ భాగ్యము యొక్క లిస్టు
స్మృతిలోకి వచ్చిందా! స్మృతిలోకి తీసుకురండి, వచ్చిందా
స్మృతిలోకి? హృదయము ఏ పాట పాడుతుంది? వాహ్ భాగ్య విధాత! మరియు
వాహ్ నా భాగ్యము! ఈ శ్రేష్ఠ భాగ్యము యొక్క విశేషత ఏమిటంటే -
ఒక్క భగవంతుని ద్వారా మూడు సంబంధాల ప్రాప్తి ఉంది. ఒక్కరి
ద్వారా ఒక్కరిలో మూడు సంబంధాలు, అవి జీవితములో విశేష సంబంధాలుగా
గాయనము చేయబడ్డాయి - తండ్రి, శిక్షకుడు, సద్గురువు, ఎవరికీ కూడా
ఒక్కరి ద్వారా మూడు విశేష సంబంధాలు మరియు ప్రాప్తులు ఉండవు.
మీరు నషాతో అంటారు - వారు మా తండ్రి కూడా, శిక్షకుడు కూడా,
సద్గురువు కూడా అని. బాబా ద్వారా సర్వ ఖజానాల గని
ప్రాప్తించింది. ఖజానాల లిస్టు కూడా స్మృతిలోకి వచ్చింది! ఏయే
ఖజానాలు బాబా ద్వారా లభించాయి అన్నది స్మృతిలోకి తీసుకురండి!
లభించాయా లేక లభించాలా? ఏమంటారు? బాలకులు కాబట్టి ఎలాగూ
యజమానులుగా ఉండనే ఉన్నారు. శిక్షకుని ద్వారా శిక్షణతో శ్రేష్ఠ
పదవి యొక్క ప్రాప్తి కలిగింది. మామూలుగా చూసినా సరే, ప్రపంచములో
కూడా అన్నింటికంటే శ్రేష్ఠమైన పదవి రాజ్య పదవి అని అంటూ ఉంటారు,
మరి మీరైతే డబుల్ రాజులుగా అయ్యారు. వర్తమానములో స్వరాజ్య
అధికారులు మరియు భవిష్యత్తులో అనేక జన్మలు రాజ్య పదవికి
అధికారులు. చదువు ఒక్క జన్మది, అది కూడా చిన్నపాటి జన్మది కానీ
పదవి యొక్క ప్రాప్తి అనేక జన్మలకు లభిస్తుంది, అంతేకాక రాజ్యము
కూడా అఖండమైన, స్థిరమైన, నిర్విఘ్న రాజ్యము. ఇప్పుడు కూడా
స్వరాజ్య అధికారీ నిశ్చింత చక్రవర్తులు, అంతేనా? నిశ్చింత
చక్రవర్తులుగా అయ్యారా? ఎవరైతే నిశ్చింతగా ఉన్నారో వారు
చేతులెత్తండి. నిశ్చింతగా ఉన్నారా, కొంచెము కూడా చింత లేదా?
చూడండి, ఎప్పుడైనా ఏదైనా పపెట్ షో (తోలుబొమ్మలాట) ఎదురుగా
వచ్చిందంటే, ఆ సమయములో చింత కలుగుతుందా? మాయ యొక్క పపెట్ షో (తోలుబొమ్మలాట)
ఎదురుగా వస్తుందా, రాదా? అప్పుడు కొంచెం-కొంచెం చింత కలుగుతుందా?
కలగదా? కొంచెం చింత, చింతన నడుస్తుందా లేక నడవదా? అలాగే
శ్రేష్ఠ భాగ్యము ఇప్పటి నుండే నిశ్చింత చక్రవర్తులుగా
తయారుచేస్తుంది. ప్రస్తుతము కొద్దో-గొప్పో ఏవైతే విషయాలు
వస్తాయో, అవి భవిష్యత్తులో ఇంకా అనుభవజ్ఞులుగా, పరిపక్వముగా
తయారుచేసేటటువంటివి.
ఇప్పుడైతే అందరూ ఈ రకరకాల విషయాల యొక్క అనుభవజ్ఞులుగా
అయిపోయారు కదా! గాభరా అయితే పడరు కదా? ప్రశాంతముగా సాక్షీ
స్థితి అనే సీట్ పై కూర్చుని ఈ తోలుబొమ్మలాటను చూడండి, కార్టూన్
షోను చూడండి. అసలు అది ఏమీ కాదు, అది కార్టూన్ మాత్రమే.
ఇప్పుడైతే దృఢముగా అయిపోయారు కదా! ఇప్పుడు దృఢముగా ఉన్నారా?
లేక అప్పుడప్పుడు గాభరా పడతారా? అది కాగితపు పులిలా వస్తుంది.
కాగితముతో తయారైనదే కానీ పులి రూపములో వస్తుంది. ఇప్పుడు
సమయమనుసారముగా అనుభవీ మూర్తులుగా అయ్యి సమయానికి, ప్రకృతికి,
మాయకు ఛాలెంజ్ చెయ్యండి - రండి, మేము విజయులము. విజయము యొక్క
ఛాలెంజ్ చెయ్యండి. (మధ్య మధ్యలో దగ్గు వస్తూ ఉంది). ఈ రోజు
వాయిద్యము కాస్త బాగోలేదు, అయినా కానీ కలిసేది ఉంది కదా!
బాప్ దాదా వద్దకు రెండు గ్రూపులు పదే-పదే వస్తుంటాయి, ఎందుకు
వస్తాయి? రెండు గ్రూపులూ బాప్ దాదాతో - మేము సిద్ధముగా ఉన్నాము
అని అంటున్నాయి. ఒకటేమో ఈ సమయము, ప్రకృతి మరియు మాయ. ఇప్పుడు
నా రాజ్యము పోనున్నది అని మాయ అర్థం చేసుకుంది. మరియు రెండవ
గ్రూపు - అడ్వాన్స్ పార్టీ వారు. రెండు గ్రూపులూ డేట్ ను
అడుగుతున్నాయి. విదేశాలలోనైతే ఒక సంవత్సరము ముందే డేట్ ఫిక్స్
చేస్తారు కదా? మరియు ఇక్కడ 6 నెలలు ముందు చేస్తారా? భారత్ లో
వేగముగా వెళ్తారు, 15 రోజులలో కూడా ఏదైనా ప్రోగ్రాము డేట్
ఫిక్స్ అయిపోతుంది. మరి సమాప్తి, సంపన్నత, బాబా సమానముగా
తయారయ్యే డేట్ ఏమిటి? వారు బాప్ దాదాను అడుగుతారు. ఈ డేట్ ను
ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఫిక్స్ చెయ్యాలి. వీలవుతుందా? డేట్
ఫిక్స్ అవ్వగలదా? పాండవులు చెప్పండి, ముగ్గురూ చెప్పండి (బాప్
దాదా నిర్వైర్ భాయిజీ, రమేష్ భాయిజీ, బ్రిజ్ మోహన్ భాయిజీని
అడుగుతున్నారు). డేట్ ఫిక్స్ అవ్వగలదా? చెప్పండి - అవ్వగలదా?
లేక అకస్మాత్తుగా జరగనున్నదా? డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది కానీ
దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలా లేక వద్దా? మరి అది
ఎప్పుడు? చెప్పండి. అవుతుందా? అకస్మాత్తుగా అవుతుందా? డేట్
ఫిక్స్ అవ్వదా? అవుతుందా? ముందు లైన్ వారు చెప్పండి, అవుతుందా?
డ్రామాను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు మనసులో డేట్ యొక్క
సంకల్పము చెయ్యవలసి ఉంటుంది అని ఎవరైతే అంటారో, వారు
చేతులెత్తండి. చెయ్యాల్సి ఉంటుందా? వీరు చేతులెత్తటం లేదు?
అకస్మాత్తుగా అవుతుందా? డేట్ ను ఫిక్స్ చెయ్యగలరా? వెనుక
ఉన్నవారికి అర్థమయ్యిందా? అకస్మాత్తుగా జరగనున్నది అన్నది నిజమే
కానీ స్వయాన్ని తయారుచేసుకునేందుకు లక్ష్యమునైతే తప్పకుండా
పెట్టుకోవాల్సి ఉంటుంది. లక్ష్యము లేకపోతే సంపన్నముగా అవ్వటములో
నిర్లక్ష్యము వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైతే డేట్ ఫిక్స్
చేస్తారో అప్పుడే సఫలత లభిస్తుంది. ఏదైనా ప్రోగ్రామ్ కు డేట్
ఫిక్స్ చేస్తారు కదా? తయారవ్వాల్సిందే, ఈ సంకల్పమైతే చేయాల్సి
ఉంటుంది కదా! లేక అవసరము లేదా, డ్రామాలో దానంతట అదే
జరిగిపోతుందా? ఏమనుకుంటున్నారు? మొదటి లైన్ వారు చెప్పండి.
ప్రేమ్ (డెహరాడూన్ దీదీ), మీరు చెప్పండి. చేయాల్సి ఉంటుందా,
చేయాల్సి ఉంటుందా? జయంతి చెప్పండి, చేయాల్సి ఉంటుందా? అది
ఎప్పుడు అవుతుంది? సమయము వచ్చినప్పుడు అంతిమములో అవుతుందా!
సమయము సంపన్నముగా తయారుచేస్తుందా లేక మీరు సమయాన్ని సమీపముగా
తీసుకువస్తారా?
బాప్ దాదా చూసారు - స్మృతిలో జ్ఞానము కూడా ఉంటుంది, నషా కూడా
ఉంటుంది, నిశ్చయము కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు దానికి అదనముగా
ఇంకొకటి జరగాలి - అదేమిటంటే నడవడిక మరియు ముఖము ద్వారా
కనిపించాలి. బుద్ధిలో అన్నీ గుర్తుంటాయి, స్మృతిలోకి కూడా
వస్తాయి కానీ ఇప్పుడు స్వరూపములోకి రావాలి. సాధారణ రూపములో
ఉన్నా కానీ ఒకవేళ ఎవరైనా పెద్ది వృత్తిలో ఉన్నవారైతే లేక
ధనవంతుల పిల్లల్లో చదువుకున్నవారైతే, వీరు ఎవరో ప్రత్యేకమైనవారు
అన్నది వారి నడవడిక ద్వారా కనిపిస్తుంది, వారిలో ఏదో ప్రత్యేకత
కనిపిస్తుంది. మరి ఇంత గొప్ప భాగ్యము ఉంది, వారసత్వము కూడా ఉంది,
చదువు మరియు పదవి కూడా ఉన్నాయి. స్వరాజ్యమైతే ఇప్పుడు కూడా ఉంది
కదా! ప్రాప్తులు కూడా అన్నీ ఉన్నాయి, కానీ నడవడిక మరియు ముఖము
ద్వారా భాగ్య సితార మస్తకములో మెరుస్తూ కనిపించాలి, ఇప్పుడు ఇది
అదనముగా జరగాలి. ఇప్పుడు ప్రపంచములోనివారికి శ్రేష్ఠ భాగ్యవాన్
ఆత్మలైన మీ ద్వారా ఈ అనుభవము జరగబోతుంది, జరగాలి కాదు,
జరగబోతుంది, అదేమిటంటే - వీరు మా ఇష్ట దేవతలు, ఇష్ట దేవీలు,
వీరు మా వారు. ఏ విధంగానైతే బ్రహ్మాబాబాలో చూసారు కదా - సాధారణ
తనువులో ఉంటూ కూడా, ఆది సమయములో కూడా బ్రహ్మాబాబాలో ఏం
కనిపించేది, కృష్ణుడు కనిపించేవారు కదా! ఆదిలోని వారికి అనుభవము
ఉంది కదా! ఏ విధంగా ఆదిలో బ్రహ్మాబాబా ద్వారా కృష్ణుడు
కనిపించేవారో, అలా చివరిలో ఏ రూపము కనిపించేది? అవ్యక్త రూపము
కనిపించేది కదా! నడవడికలో, ముఖములో కనిపించింది కదా! ఇప్పుడు
బాప్ దాదా విశేషముగా నిమిత్తమైన పిల్లలకు ఈ హోమ్ వర్కును
ఇస్తున్నారు - ఇప్పుడు బ్రహ్మాబాబా సమానముగా అవ్యక్త రూపము
కనిపించాలి. కనీసము 108 మాలలోని మణులలోనైనా ముఖము మరియు నడవడిక
ద్వారా కనిపించాలి. 108 మాలలోని మణులు ఎవరు అని బాప్ దాదా
పేర్లు అయితే కోరుకోవటం లేదు, పేర్లు చెప్పటం లేదు, కానీ వారి
నడవడిక మరియు ముఖము ద్వారా స్వతహాగానే ప్రత్యక్షమవ్వాలి. ఈ హోమ్
వర్కును బాప్ దాదా నిమిత్తులైన పిల్లలకు విశేషముగా ఇస్తున్నారు.
వీలవుతుందా? అచ్ఛా, ఎంత సమయము కావాలి? మేము ఆలస్యముగా వచ్చాము
కదా అని భావించకండి, ఇది సమయము యొక్క విషయము కాదు, మేము వచ్చి
కొన్ని సంవత్సరాలే అయ్యింది కదా అని ఎవరైనా అనుకుంటున్నారా.
ఎవరైనా ఆలస్యముగా వచ్చినా వేగముగా వెళ్ళవచ్చు మరియు వేగముగా
వెళ్ళి మొదటి నంబరులోకి రావచ్చు, ఇది కూడా బాప్ దాదా యొక్క
ఛాలెంజ్, మీరు చెయ్యగలరు. ఎవరైనా చెయ్యగలరు. చివరిలోనివారు కూడా
చెయ్యగలరు. కేవలం లక్ష్యము పక్కాగా పెట్టుకోండి - చెయ్యాల్సిందే,
జరగాల్సిందే.
డబుల్ విదేశీయులు చేతులెత్తండి. మరి డబుల్ విదేశీయులు ఏం
చేస్తారు? డబుల్ ఛాన్స్ తీసుకుంటారు కదా. బాప్ దాదా పేరు
అనౌన్స్ చెయ్యరు, కానీ వారు వీరు అని వారి ముఖమే చెప్తుంది.
ధైర్యము ఉందా? మొదటి లైన్ వారిని బాప్ దాదా చూస్తున్నారు. ఉందా,
ధైర్యము ఉందా? ఒకవేళ ధైర్యము ఉన్నట్లయితే చేతులెత్తండి. ధైర్యము
ఉంటే? వెనక వారు కూడా చేతులెత్తవచ్చు. ఎవరైతే తమకు తాముగా
ముందుకు వచ్చి బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. అచ్ఛా -
బాప్ దాదా రిజల్ట్ చూసేందుకు, ఏమేమి పురుషార్థము చేస్తున్నారు,
ఎవరెవరు చేస్తున్నారు అన్న ఈ రిజల్టు చూసేందుకు 6 నెలలు
ఇస్తున్నారు. 6 నెలలు రిజల్టు చూస్తారు, ఆ తర్వాత ఫైనల్
చేస్తారు. సరేనా? ఎందుకంటే ఇప్పుడు సమయము యొక్క వేగము తీవ్రముగా
ముందుకు వెళ్తుంది అన్నది కనిపిస్తుంది. రచన వేగముగా వెళ్ళకూడదు,
రచయిత వేగముగా ఉండాలి. ఇప్పుడు కొంచెము వేగము పెంచండి,
ఇప్పుడిక ఎగరండి. నడుస్తున్నాము అని కాదు, ఎగురుతున్నాము
అన్నట్లు ఉండాలి. జవాబు ఇచ్చేటప్పుడు చాలా మంచి జవాబు ఇస్తారు
- మేమే కదా తయారయ్యేది! ఇంకెవరు అవుతారు! బాప్ దాదా
సంతోషిస్తారు. కానీ ఇప్పుడు మనుష్యులు ఉన్నారు కదా, వారు ఏదైనా
చూడాలనుకుంటున్నారు. బాప్ దాదాకు గుర్తుంది - ఆదిలో పిల్లలైన
మీరు సేవకు వెళ్ళినప్పుడు పిల్లల ద్వారా కూడా సాక్షాత్కారాలు
జరిగేవి. ఇప్పుడు సేవ మరియు స్వరూపము రెండింటి వైపు అటెన్షన్
ఉండాలి. మరి ఏం విన్నారు! ఇప్పుడు సాక్షాత్కార మూర్తులుగా
అవ్వండి. సాక్షాత్తు బ్రహ్మాబాబాగా అవ్వండి. అచ్ఛా.
ఈ రోజు కొత్త-కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు. మీ
స్నేహ శక్తితో అందరూ చేరుకున్నారు, అందుకే బాప్ దాదా విశేషముగా
కొత్త-కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో, వారిలోని ప్రతి ఒక్కరికీ
పేరు సహితముగా పదమాల రెట్లుగా అభినందనలను ఇస్తున్నారు, దానితో
పాటుగా వరదాత వరదానము ఇస్తున్నారు - సదా బ్రాహ్మణ జీవితములో
జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. అచ్ఛా!
సేవా టర్న్ పంజాబు వారిది:-
పంజాబువారు లేవండి. చాలా మంచిది. ఈ విధిని కూడా బాగా
తయారుచేసారు, ప్రతి జోన్ కు అవకాశము లభిస్తుంది. ఒకటేమో యజ్ఞ
సేవ ద్వారా ఒక్కొక్క అడుగులో పదమాల సంపాదన జమ అవుతుంది ఎందుకంటే
చాలావరకు ఏ కర్మ చేస్తున్నా సరే యజ్ఞ సేవ గుర్తుంటుంది మరియు
యజ్ఞ సేవ గుర్తు రావడముతో యజ్ఞ రచయిత అయిన బాబా తప్పకుండా
గుర్తుకు వస్తారు. కనుక సేవలో కూడా ఎక్కువలో ఎక్కువగా పుణ్య
ఖాతాను జమ చేసుకుంటారు మరియు ఎవరైతే సత్యమైన పురుషార్థీ పిల్లలు
ఉంటారో, వారు తమ స్మృతి చార్టును సహజముగా మరియు నిరంతరమైనదిగా
తయారుచేసుకోగలరు ఎందుకంటే ఇక్కడ ఒకటేమో మహారథుల సాంగత్యము ఉంది,
సాంగత్యము యొక్క రంగు సహజముగా అంటుకుంటుంది. అటెన్షన్
పెట్టినట్లయితే ఈ 8-10 రోజులు ఏవైతే లభిస్తాయో, వీటిలో చాలా
మంచి ఉన్నతి చేసుకోగలరు. సాధారణ రీతిలో సేవ చేస్తే అంత లాభము
ఉండదు, కానీ అవకాశము ఉంది - ఒకటేమో, సహజ నిరంతర యోగిగా
అయ్యేందుకు, పుణ్య ఖాతాను జమ చేసుకునేందుకు మరియు అతి పెద్ద
పరివారము యొక్క నషాలో, సంతోషములో ఉండేందుకు అవకాశము ఉంది.
కావున పంజాబువారికి అవకాశము లభించింది, ప్రతి జోన్ వారికి
లభిస్తుంది కానీ లక్ష్యము పెట్టుకోండి, ఈ మూడు లాభాలు పొందాలి
- ఎంత పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు? సహజ స్మృతి యొక్క ఉన్నతి
ఎంత చేసుకున్నారు? మరియు సంగఠన లేక పరివారము యొక్క స్నేహాన్ని,
సమీపతను ఎంత అనుభవము చేసుకున్నారు? ఈ మూడు విషయాలలో రిజల్టును
ప్రతి ఒక్కరూ తమది తాము చూసుకోవాలి. డ్రామాలో అవకాశము అయితే
లభిస్తుంది కానీ ఆ ఛాన్స్ ను తీసుకునే ఛాన్సలరుగా అవ్వండి. మరి
పంజాబు వారైతే తెలివైనవారు కదా! మంచిది. పెద్ద సంఖ్యలో కూడా
వచ్చారు మరియు సేవ కూడా పెద్ద మనసుతో లభించింది. వచ్చిన సంఖ్య
కూడా బాగా వచ్చింది. బాగుంది. సంగఠన బాగుంది.
(ఈ రోజు రెండు వర్గాల వారు వచ్చారు - గ్రామ వికాస వర్గము వారు
మరియు మహిళా వర్గము వారు మీటింగు కోసము వచ్చారు)
మహిళా వర్గము వారు లేచి నిలబడండి:-
ఇందులో మెజారిటీ టీచర్లు ఉన్నారా?
టీచర్లు చేతులెత్తండి. మంచి అవకాశము. సేవకు సేవ మరియు సేవతోపాటు
మేవా (ఫలము). సంగఠన యొక్క మరియు బాబా మిలనము యొక్క ఆనందాన్ని
పొందండి. కావున సేవ మరియు మేవా (ఫలము), రెండూ లభించాయి. మంచిది.
ఇప్పుడు ఏదైనా కొత్త ప్లాన్ ను తయారుచేసారా? ఎవరైనా సరే, మహిళా
వర్గము వారైనా లేక వేరే వర్గానికి చెందినవారైనా, గ్రూప్స్
తయారయ్యాయి. కావున ప్రతి గ్రూపు విశేషముగా ప్రాక్టికల్ గా
నడవడిక మరియు ముఖము ద్వారా ఏదో ఒక గుణము లేక శక్తి కనిపించే
విధముగా బాధ్యతను తీసుకోవాలి. ఉదాహరణకు, ఈ గ్రూపు వారము అనగా
మహిళా గ్రూపు వారము ఈ గుణాన్ని లేక శక్తిని ప్రాక్టికల్ గా
ప్రత్యక్షరూపములోకి తీసుకువస్తాము. ఇలా ప్రతి వర్గము వారు
విశేషముగా ఏదో ఒకదానిని ఫిక్స్ చేసుకోవాలి మరియు ఎలాగైతే
పరస్పరము సర్వీస్ రిజల్టును నోట్ చేసుకుంటారో, అలా పరస్పరము
ఉత్తర-ప్రత్యుత్తరాల ద్వారానైనా లేక సంగఠనలోనైనా ఇది కూడా చెక్
చేసుకుంటూ ఉండండి. కావున ముందుగా మీరు చేసి చూపించండి. మహిళా
వర్గము వారు చేసి చూపించండి. సరేనా. ప్రతి వర్గము వారు ఏదో ఒక
ప్లాన్ ను తయారుచెయ్యాలి మరియు సమయము ఫిక్స్ చేసుకోండి - ఇంత
సమయములో ఇంత శాతము ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి అని. ఇక
అప్పుడు బాప్ దాదా ఏదైతే కోరుకుంటున్నారో, నడవడిక మరియు ముఖముపై
రావాలి అని, అది వచ్చేస్తుంది. కావున ఈ ప్లాన్ ను తయారుచేసి
బాప్ దాదాకు ఇవ్వండి. ప్రతి వర్గము వారు ఏం చేస్తారు? ఏ విధంగా
సేవ ప్లాన్ ను నోట్ చేస్తారు కదా, అలా ఇది చేసి ఇవ్వండి. సరే
కదా! చేసి ఇవ్వండి. మంచిది, చిన్న-చిన్న సంగఠనలు అద్భుతము
చెయ్యగలవు. సరే. టీచర్లు ఏమనుకుంటున్నారు? చెయ్యగలరా? చెయ్యగలరా?
అయితే ప్లాన్ తయారుచెయ్యండి. అచ్ఛా. సేవకు అభినందనలు.
గ్రామ వికాస వర్గము వారు లేచి నిలబడండి:-
ఇప్పటివరకు గ్రామ వికాస వర్గము వారు ఎన్ని గ్రామాలను పరివర్తన
చేసారు? ఎన్ని గ్రామాలలో చేసారు? (7 గ్రామాలలో చేసాము, ఒక
గ్రామములో 75 శాతము వరకు పని జరిగింది. ఈ మీటింగులో ప్రోగ్రామ్
తయారుచేసాము - ‘‘సమయము యొక్క పిలుపు - స్వచ్ఛ స్వర్ణిమ గ్రామ్య
భారత్’’. ఈ ప్రాజెక్ట్ లో భాగముగా ప్రతి గ్రామాన్ని
వ్యసనముక్తముగా మరియు స్వచ్ఛముగా తయారుచేసే సేవ చేస్తాము).
మంచిది - ప్రాక్టికల్ గా ఉంది కదా. దీని మొత్తము రిజల్టు ఏదైతే
ఉంటుందో, అది ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ వద్దకు వెళ్తుందా?
(ఇప్పుడు ఇంకా పంపించలేదు) పంపించాలి, ఎందుకంటే పల్లె-పల్లెలో
ప్రాక్టికల్ గా ఏదైతే చేస్తున్నారో, అది వాస్తవానికి
ప్రభుత్వమువారి పని, కానీ మీరు సహయోగులుగా అవుతున్నారు కావున
రిజల్టును చూసి వారు మంచి పని చేస్తున్నారని భావిస్తారు. ఎలాంటి
బులెటిన్ ను తయారుచెయ్యండి అంటే గవర్నమెంటులోని ప్రముఖ
వ్యక్తులందరి వద్దకు ఆ బులెటిన్ చేరుకోవాలి, పుస్తకము వద్దు,
మ్యాగజీన్ వద్దు, అన్ని వైపుల జరిగిన సేవ యొక్క మొత్తము
రిజల్టును క్లుప్తముగా పంపించాలి. మంచిది - అభినందనలు. అచ్ఛా -
(మధ్య-మధ్యలో దగ్గు వస్తూ ఉంది) ఈ రోజు వాయిద్యము శాంతిని
కోరుకుంటుంది. అచ్ఛా.
బాప్ దాదా వద్దకు నలువైపుల నుండి సేవా రిజల్టు కూడా వస్తూ
ఉంటుంది మరియు విశేషముగా ఈ రోజుల్లో ఏ మూల కూడా మిగిలిపోకూడదు
- అందరికీ సందేశము లభించాలి, ఈ ప్లాన్ ను ఏదైతే ప్రాక్టికల్ గా
చేస్తున్నారో, దాని రిజల్టు కూడా బాగుంది. బాప్ దాదా వద్దకు
డబుల్ విదేశీ పిల్లల యొక్క సమాచారము వచ్చింది మరియు ఎవరెవరైతే
మెగా ప్రోగ్రాములు (భారత్ లో) చేసారో, వారి సమాచారము కూడా
మొత్తము లభించింది. నలువైపులా సేవ యొక్క రిజల్టు సఫలతా
పూర్వకముగా ఉంది. కనుక పిల్లలు ఏ విధంగా సేవలో సందేశాన్ని ఇచ్చే
రిజల్టులో సఫలతను ప్రాప్తి చేసుకున్నారో, అలాగే వాణి ద్వారా,
సంపర్కము ద్వారా, అలాగే తమ ముఖము ద్వారా ఫరిశ్తా రూపము యొక్క
సాక్షాత్కారాన్ని చేయిస్తూ వెళ్ళండి.
అచ్ఛా - మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు.
మంచిది, టూ లేట్ (చాలా ఆలస్యము) అన్న బోర్డు పెట్టకముందే
వచ్చేసారు, మంచిది, అవకాశము తీసుకోండి. అద్భుతము చేసి చూపించండి.
ధైర్యము ఉంచండి, బాప్ దాదా సహాయము పిల్లలు ప్రతి ఒక్కరికీ
ఉంటుంది. అచ్ఛా!
బాప్ దాదా నలువైపులా సాకారములో, సమ్ముఖముగా కూర్చుని ఉన్న
పిల్లలకు మరియు తమ-తమ స్థానాలలో, దేశాలలో బాబాతో మిలనము
జరుపుకునే నలువైపులా ఉన్న పిల్లలకు సేవ కొరకు, స్నేహము కొరకు
మరియు పురుషార్థము కొరకు చాలా-చాలా అభినందనలనైతే ఇస్తున్నారు,
కానీ పురుషార్థములో తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు ఆత్మలను
దుఃఖము, అశాంతుల నుండి విడిపించేందుకు మరింత తీవ్ర పురుషార్థము
చెయ్యండి. దుఃఖము, అశాంతి, భ్రష్టాచారము అతిలోకి వెళ్తున్నాయి,
ఇప్పుడు అతిని అంతము చేసి అందరికీ ముక్తిధామము యొక్క
వారసత్వాన్ని బాబా నుండి ఇప్పించండి. సదా ఇటువంటి దృఢ సంకల్పము
కల పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.
వరదానము:-
నమ్రత మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్
ద్వారా తండ్రిని ప్రత్యక్షము చేసే విశేష సేవాధారీ భవ
ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో, అక్కడ
అద్భుతము కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు నమ్రత మరియు సత్యత
యొక్క అథారిటీల బ్యాలెన్సుతో ఎవరికైనా తండ్రి పరిచయాన్ని
ఇస్తారో, అప్పుడు అద్భుతము కనిపిస్తుంది. ఈ రూపము ద్వారానే
తండ్రిని ప్రత్యక్షము చేయాలి. మీ మాటలు స్పష్టముగా ఉండాలి,
అందులో స్నేహము కూడా ఉండాలి, నమ్రత మరియు మధురత కూడా ఉండాలి,
అలాగే మహానత మరియు సత్యత కూడా ఉండాలి, అప్పుడు ప్రత్యక్షత
జరుగుతుంది. మాట్లాడుతూ ఉండగా మధ్య-మధ్యలో అనుభవము చేయిస్తూ
ఉండండి, తద్వారా తపనలో నిమగ్నమైన మూర్తులుగా అనుభవమవుతారు.
ఇటువంటి స్వరూపముతో సేవ చేసేవారే విశేషమైన సేవాధారులు.
స్లోగన్:-
అవసరమైన సమయానికి ఏ సాధనాలు లేకపోయినా కానీ సాధనలో విఘ్నము
కలగకూడదు.
అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని)
అలవరచుకోండి
కొందరు - కోపము వికారము కాదు, అది అస్త్రము వంటిది అని
భావిస్తారు. కానీ క్రోధము జ్ఞాన స్వరూప ఆత్మలకు మహాశత్రువు
ఎందుకంటే అనేక ఆత్మల సంబంధ-సంపర్కములోకి వచ్చినప్పుడు క్రోధము
ప్రసిద్ధమవుతుంది మరియు క్రోధాన్ని చూసి బాబా పేరుకు చాలా నింద
వస్తుంది. అప్పుడు అనేవారు ఏమంటారంటే - చూసాములే జ్ఞాన స్వరూప
ఆత్మలైన పిల్లలను! అందుకే, దీని అంశమాత్రాన్ని కూడా సమాప్తము
చేసి సభ్యతాపూర్వకమైన వ్యవహారము చెయ్యండి.
|
|
|