30-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ సమయములో మీరు తండ్రిపై బలిహారమైనట్లయితే 21 జన్మల కొరకు మీరు సదా సుఖమయముగా అవుతారు’’

ప్రశ్న:-
జ్ఞానీ పిల్లలు తమ అవస్థను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అలవాటును పక్కా చేసుకోవాలి?

జవాబు:-
ఉదయాన్నే లేచే అలవాటును పక్కా చేసుకోవాలి. ఉదయాన్నే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి - ఇది చాలా మంచి ధారణ. ఏ పిల్లలైతే త్వరగా పడుకుంటారో మరియు త్వరగా లేస్తారో, వారి అవస్థ రోజంతా బాగుంటుంది. అజ్ఞానుల నిద్రతో పోలిస్తే జ్ఞానీ పిల్లల నిద్ర సగమే ఉండాలి. 10 గంటలకు నిద్రపోండి, 2 గంటలకు లేచి కూర్చోండి.

పాట:-
నాకు ఆధారాన్ని ఇచ్చేవారు...

ఓంశాంతి
పిల్లలందరూ సమ్ముఖముగా కూర్చుని ఉన్నారు, మేము జీవాత్మలమని పిల్లలకు తెలుసు. ఇక్కడైతే జీవాత్మలే ఉంటారు కదా. ఆత్మకు శరీరము లేనప్పుడు వివస్త్రగా ఉంటుంది, అప్పుడు ఆత్మను అశరీరి అని అంటారు. మీరైతే శరీరముతో పాటు కూర్చున్నారు. ఆత్మ మరియు పరమాత్మ ఎప్పటివరకైతే శరీరములోకి రారో, అప్పటివరకు మాట్లాడలేరు. ఇప్పుడు తండ్రి సమ్ముఖముగా కూర్చున్నామని జీవాత్మలైన మీకు తెలుసు. 5 వేల సంవత్సరాల క్రితం వలె యథావిధిగా సమ్ముఖముగా వచ్చారు. పిల్లలు తప్పకుండా తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. మేము మా అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్ముని సమ్ముఖముగా కూర్చున్నామని మీకు తెలుసు. ఎందుకు కూర్చున్నారు? తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చున్నారు. స్కూల్లో, మేము టీచర్ ద్వారా ఇంజనీరింగ్, బ్యారిస్టరీ నేర్చుకుంటున్నామని భావిస్తారు. ఈ లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. పరమపిత పరమాత్మ బ్రహ్మా తనువు ద్వారా కూర్చుని మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. భగవానువాచ - భగవంతుడు అని నిరాకారుడిని అంటారని పిల్లలకు అర్థం చేయించారు. జీవాత్మలు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. మనుష్యులు పునర్జన్మలు తీసుకుంటారా అని మీరు ఏ సన్యాసినైనా అడగండి. అప్పుడు వారు, తీసుకోరు అని చెప్పరు. లేదంటే 84 లక్షల జన్మలని ఎలా అంటారు? మీరు పునర్జన్మలను నమ్ముతారా అని అడగండి. ఇది నిశ్చితము. ఆత్మ సంస్కారాలనుసారముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. కొంతమంది మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మల మాటే లేదు. మొదటి జన్మ తప్పకుండా చాలా మంచిగా, సతోప్రధానముగా ఉంటుంది. లాస్ట్ జన్మ ఛీ-ఛీగా తమోప్రధానముగా ఉంటుంది. 16 కళల నుండి 14 కళలు, తర్వాత 12 కళలు అవుతూ ఉంటాయి, పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. అచ్ఛా, పరమపిత పరమాత్మ పునర్జన్మలు తీసుకుంటారా లేక పునర్జన్మ రహితుడా అని అడగాలి. చూడండి, ఈ పాయింటు చాలా సూక్ష్మమైనది. ఒకవేళ జనన-మరణ రహితుడు అని అంటే, ఇక శివుని జయంతి ఋజువు అవ్వదు. శివ జయంతిని జరుపుకుంటారని అంటారు. అయితే, శివ జయంతి ఉంటుంది కానీ జన్మతో పాటు మరి మరణము ఉంటుందని అంటారు కదా, అది ఉండదని అర్థం చేయించడం జరుగుతుంది. ఒకవేళ మరణించినట్లయితే, మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలి. తండ్రి ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. వారు ఈ తనువులోకి ఒక్కసారి మాత్రమే వస్తారు, అంతే, ఇక మళ్ళీ పునర్జన్మల్లోకి రారు. పరమపిత పరమాత్మ పునర్జన్మ రహితుడు. వారెప్పుడూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అవ్వరు. ఆత్మలందరూ అయితే జనన-మరణాలలోకి వస్తూ-వస్తూ పతితముగా అయిపోతారు, అప్పుడు పావనముగా చేయడానికి తండ్రి వస్తారు. ఆత్మయే పతితముగా అవుతుందని దీనితో ఋజువవుతుంది. ఆత్మ ఇంటి నుండి పావనముగా వస్తుంది, తర్వాత మాయ పతితముగా చేసేస్తుంది. తండ్రి అయితే ఎప్పుడూ పతితముగా చేయరు. తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలకు అశుద్ధమైన మతాన్ని ఇవ్వలేరు. ఈ సమయములోని మనుష్యులు పతిత మతాన్నే ఇస్తారు. ఇప్పుడు పావనుడైన తండ్రి చెప్తున్నారు, పతితముగా అవ్వకండి అనగా వికారాలలో వెళ్ళకండి. రావణుడి మతముతో దుఃఖధామముగా తయారయ్యింది. ముందు సుఖధామముగా ఉండేది. తండ్రియే సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తారని కాదు. అలా కాదు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇచ్చే మతాన్ని ఇవ్వలేరు. మాయే దుఃఖాన్ని ఇస్తుంది. ఆ మాయపై విజయాన్ని పొందడముతో మీరు జగజ్జీతులుగా అవుతారు. మనుష్యులకు మాయ అంటే అర్థం తెలియదు. వారు ధనాన్ని మాయ అని అంటారు. ఫలానావారికి మాయ నషా చాలా ఉందని అంటారు కదా. కానీ మాయ యొక్క నషా అంటూ ఉండదు. అక్కడ స్వర్గములో రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి కాల్చరు. శత్రువుల దిష్టిబొమ్మను తయారుచేయడము జరుగుతుంది. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. దేహ అహంకారము రావడముతో ఇక మిగిలిన వికారాలు వచ్చేస్తాయి. దేవతలు వామ మార్గములోకి అనగా వికారాలలోకి వెళ్తారని శాస్త్రాలలో వ్రాసి ఉంది. మాయకు వశమవ్వడముతో పరవశమైపోతారు, పరమతముపై నడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీమతముపై నడుస్తారు. పరమతము అనగా మాయ యొక్క మతము. శ్రీమతము అనగా తండ్రి యొక్క శ్రేష్ఠ మతము. ఇప్పుడున్నది రావణుడి మతము, పరమతము. అందుకే తండ్రి అన్నారు, ఆసురీ సాంప్రదాయము వారందరూ రావణుడి సంకెళ్ళలో బంధించబడి దుఃఖితులుగా ఉన్నారు.

మనుష్యులు సత్యయుగము ఆయువును లక్షల సంవత్సరాలని భావించారు. 5 వేల సంవత్సరాల ఆయువు ఎలా అనే లెక్కను మీరు తెలియజేస్తారు. క్రైస్టు వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది, బుద్ధుడు వచ్చి 2250 సంవత్సరాలు అయ్యింది, తర్వాత ఇస్లాములు వచ్చి 2500 సంవత్సరాలు అయ్యింది. అందరిదీ కలిపి అర్ధకల్పము అయ్యింది. దానికి ముందైతే దేవతల రాజ్యము ఉండేది, మరి దేవతలు వచ్చి లక్షల సంవత్సరాలు అయ్యిందని ఎలా అనగలరు. ఇంతమంది మనుష్యులు ఉన్నారు, ఒకవేళ లక్షల సంవత్సరాలైతే ఇప్పటికి చాలామంది మనుష్యులు అయిపోయేవారు. కానీ అంతమందైతే లేరు. 5 వేల సంవత్సరాలలోనే కోట్లాదిమంది మనుష్యులైపోతారు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం, భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేదని అంటారు కూడా. 5 వేల సంవత్సరాలు పూర్తి అయిపోతాయి, నాటకమనేది పూర్తి అయిపోతుంది కదా. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. నేను ఎవరిని, ఎలా ఉంటాను, ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఎవరూ తెలుసుకోలేరు. ఇది గీతా అధ్యాయమని తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. ఇది చాలా సహజమైన విషయమని బాబా వృద్ధ మాతలకు కూడా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. కొడుకు జన్మించాడంటే, వారసుడు జన్మించినట్లు. మేము బాబా వారసులమని మీరు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని బాబా అడుగుతారు. అవును బాబా, అని అంటారు. మేము 5 వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలిసామని, మీరు ఈ తనువు ద్వారా శిక్షణ ఇవ్వడానికి వచ్చారని ఆత్మ ఈ నోటి ద్వారా చెప్తుంది. ఎవరైతే పక్కా పిల్లలు ఉన్నారో, వారు - మేము బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి కూర్చున్నామని అర్థం చేసుకుంటారు. మనము బ్రహ్మా ద్వారా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము. తండ్రి అంటారు - నన్ను గుర్తించారా, నేను మీ తండ్రిని. మీరంటారు - అవును బాబా, ఆత్మలమైన మాకు మీరు తండ్రి అయిన పరమపిత పరమాత్మ. తండ్రి కూడా అంటారు - నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, వారసత్వాన్ని ఇచ్చాను, దానిని మాయ లాక్కుంది, మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను. మాయ వారసత్వాన్ని లాక్కుంటుంది, తండ్రి ఇప్పిస్తారు. ఈ ఆట అనేక సార్లు జరిగింది, జరుగుతూనే ఉంటుంది. దీనికి అంతముండదు. తండ్రికి చెందినవారిగా అవుతారు, కొంతమంది సొంత పిల్లలుగా, కొంతమంది సవతి పిల్లలుగా అవుతారు. కొందరు పక్కాగా, కొందరు కచ్చాగా ఉంటారు కదా. అప్పుడప్పుడు పక్కాగా ఉన్నవారిపై కూడా మాయ ఒక్కసారిగా గెలుస్తుంది. పిల్లలంటారు - బాబా, మేము ఎప్పటివరకైతే జీవించి ఉంటామో, అప్పటివరకు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉంటాము. వికర్మల భారము తలపై చాలా ఉంది. ఎంతగా మీరు స్మృతిలో ఉంటారో, అంతగా ఆ యోగాగ్ని ద్వారా మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతూ ఉంటారు. అగ్ని, వస్తువులను పవిత్రముగా చేస్తుంది. మీది యోగాగ్ని. ఇది అనంతమైన యజ్ఞము. అనంతమైన సేఠ్ అనంతమైన యజ్ఞాన్ని రచించారు. ఏ యజ్ఞము ఇన్ని సంవత్సరాలు నడవదు. 7-8 రోజుల కోసం లేక ఒక నెల కోసం యజ్ఞాన్ని రచిస్తారు. మీ ఈ యజ్ఞము ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది. తండ్రి అయితే వినిపిస్తూనే ఉంటారు. వారంటారు - మర్చిపోకండి, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మల వికర్మల భారము తొలగిపోతూ ఉంటుంది. భగవానువాచ - మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. వారు తప్పకుండా వచ్చి ఉన్నారు, కావుననే చెప్తారు కదా.

తండ్రి అంటారు - ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. మీ ఆత్మ ఈ సమయములో చాలా పతితముగా ఉంది. యోగముతో మనము పావనముగా అవుతూ ఉంటామని ఇప్పుడు మీకు తెలుసు. మీరు వచ్చినప్పుడు ఇతర సాంగత్యాలను తెంచి మీతో సాంగత్యాన్ని జోడిస్తామని, మీపై బలిహారమవుతామని మీరు ప్రతిజ్ఞ చేసారు. స్త్రీ పురుషునిపై మరియు పురుషుడు స్త్రీపై బలిహారమవుతారు. ఇక్కడ తండ్రిపై బలిహారమవ్వడము ఉంటుంది. వివాహములో ఒకరిపై ఒకరు బలిహారమవుతారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు మనుష్యులపై బలిహారమవ్వకూడదు. మీపై బలిహారమవుతాను అని మీరు ప్రతిజ్ఞ చేసారు. మీరు నాపై బలిహారమైనట్లయితే, 21 జన్మలు మిమ్మల్ని సదా సుఖమయముగా చేస్తాను. ఇది ఎంత గొప్ప వారసత్వము. శ్రీమతము ద్వారా మీరు శ్రేష్ఠముగా అవుతారు, ఇది మర్చిపోకండి. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని కూడా ఇంటిలో పెట్టుకోండి. మనము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి పరంధామము నుండి వచ్చి ఉన్నారు. కానీ మాయ అనే గ్రద్ద కూడా తక్కువైనదేమీ కాదు. ఇది అందరి విషయము కాదు, కానీ నంబరువారుగా ఉన్నారు. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని కొంతమంది అయితే పూర్తిగా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నషా ఎక్కుతుంది, ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే మర్చిపోతారు, మళ్ళీ ఉదయాన్నే రిఫ్రెష్ అవుతారు, తర్వాత రోజంతా మర్చిపోతారు. చూడండి, 4-5 సంవత్సరాలు ఉండి మంచి సేవ చేసినవారు కూడా ఈ రోజు లేరు. ఎక్కడో ఆజ్ఞ ఉల్లంఘన చేసారు కనుక మాయ గట్టిగా చెంపదెబ్బ వేసింది, ఇక వెళ్ళిపోయారు. బాబా అంటారు - పైకి ఎక్కితే ప్రేమ రసాన్ని అనుభవం చేస్తారు, పడిపోతే చూర్ణమైపోతారు. ఎలా చూర్ణమైపోతారు అనేది చూస్తారు. వైకుంఠములోకైతే తప్పకుండా వెళ్తారు. కానీ పదవులైతే నంబరువారుగా ఉంటాయి కదా. అక్కడ అందరూ సుఖమయముగానే ఉంటారు కానీ పదవులైతే ఉంటాయి కదా. స్కూల్ లో పదవిని పొందేందుకే పురుషార్థము చేస్తారు. ప్రజలుగా అయినా పర్వాలేదులే, భాగ్యములో ఏముంటే అదే లభిస్తుంది అని అనుకోకూడదు. దానిని తమోప్రధాన పురుషార్థమని అంటారు. ఎవరైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే ప్రతిజ్ఞ చేస్తారో, వారిది సతోప్రధాన పురుషార్థమని అని అంటారు. ఇది గుర్రపు పందెము వంటిది. అందరూ నంబరువన్ లోకైతే వెళ్ళలేరు. ఇది హ్యూమన్ (మానవ) రేస్. మేము త్వరగా శివబాబా కంఠహారములో కూర్చబడాలని మీరు కోరుకుంటారు కావున వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. అంతా స్మృతి పైనే ఆధారపడి ఉంది. మాయ ఎటువంటి విఘ్నాలను కలిగిస్తుందంటే, ఇక పూర్తిగా రేస్ నుండి తొలగించేస్తుంది. మీది హ్యూమన్ (మానవ) రేస్. ఆత్మ అంటుంది - నేను చాలా దుఃఖితముగా ఉన్నాను, శరీరాలను తీసుకుంటూ-తీసుకుంటూ చాలా విసిగిపోయాను, ఇప్పుడు ఇక బాబా వద్దకు వెళ్ళాలి అని. బాబా యుక్తులనైతే తెలియజేసారు. బాబా, నేను మీ స్మృతిలోనే ఉంటానని అంటారు. ఎంత సమయము తీయగలిగితే అంత మంచిది. గవర్నమెంట్ సేవకు కూడా 8 గంటలు ఇస్తారు, అదే విధముగా స్మృతిలో కూడా 8 గంటలైతే ఉండండి. సృష్టిని స్వర్గముగా చేయడమనేది ఎంత గొప్ప సేవ. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, అంతే. 8 గంటలు ఈ సేవను చేసినట్లయితే మీరు పూర్తి వారసత్వాన్ని పొందుతారు. ఈ విధముగా స్మృతి చేస్తూ-చేస్తూ మీ వికర్మలు వినాశనమవుతాయి. 8 గంటలు ఈ సేవకు కేటాయించండి, మిగిలిన 16 గంటలు మీరు ఫ్రీ. ఎంత వీలైతే అంత, మీరు పదే-పదే స్మృతి చేయండి. స్మృతినైతే ఎక్కడ కూర్చునైనా చేయవచ్చు. అన్నింటికన్నా మంచి సమయము మీకు ఉదయాన్నే లభిస్తుంది. సింధీలో ఒక సామెత కూడా ఉంది - త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి, అటువంటి మనుష్యులే చాలా గుణవంతులు అని. ఈ గాయనము కూడా ఇప్పటిదే. తండ్రి అంటారు - రాత్రి త్వరగా పడుకోండి, మళ్ళీ ఉదయాన్నే లేవండి. అజ్ఞానులు 8 గంటలు నిదురిస్తారు, మీ నిద్ర సగమే ఉండాలి. 4-5 గంటల నిద్ర సరిపోతుంది. మీరు కర్మయోగులు కదా. రాత్రి 10 గంటలకు పడుకోండి, 2 గంటలకు లేవండి. శివబాబాను స్మృతి చేయడము వలన మీకు చాలా సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. అచ్ఛా, 2 గంటలకు కాకపోతే 3 గంటలకు లేవండి, 4 గంటలకు లేవండి. అది ఫస్ట్ క్లాస్ సమయము. ఆ సమయములో శాంతి ఉంటుంది, అందరూ అశరీరులుగా అయిపోతారు. ఆ సమయములో చాలా నిశ్శబ్దముగా ఉంటుంది. అమృతవేళ యొక్క స్మృతి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. బాబా చాలావరకు రాత్రి మెలకువగా ఉంటూ ఉంటారు. సూక్ష్మ సేవలో అలసట ఉండదు. సంపాదనతోనైతే సంతోషము కలుగుతుంది. పిల్లలైన మీరు ఉదయాన్నే లేచి మీ అవినాశీ సంపాదనను చేసుకుంటూ ఉండండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. 21 జన్మల కొరకు సదా సుఖమయముగా అయ్యేందుకు ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. శ్రీమతము ద్వారా శ్రేష్ఠముగా అవ్వాలి. మన్మతాన్ని మరియు పరమతాన్ని త్యాగము చేయాలి. ఏ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.

2. ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చుని సంపాదన చేసుకోవాలి. సృష్టిని స్వర్గముగా చేసే సేవను తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా చేయాలి.

వరదానము:-
సమయము మరియు సంకల్పాల సహితముగా తమ సర్వ ఖజానాలను వీలునామా చేసే మోహజీత్ భవ

ఏ విధముగా లౌకికములో తమ పిల్లలకు సర్వస్వాన్ని వీలునామా చేయడము జరుగుతుందో, అలా మీరు కూడా బాబాను మీ వారసునిగా చేసుకుని సర్వస్వాన్ని వీలునామా చేసినట్లయితే విల్ పవర్ వచ్చేస్తుంది. ఈ విల్ పవర్ ద్వారా మోహము స్వతహాగానే నశించిపోతుంది. ఏ విధముగా సాకార బాబా పూర్తిగా తమను తాము వీలునామా చేసుకున్నారో, అలా మీ యొక్క స్మృతి ఏదైతే ఉందో, సమయము మరియు సంకల్పాల ఖజానా ఏదైతే ఉందో, దానిని వీలునామా చేయండి అనగా శ్రీమతమనుసారముగా సేవలలో వినియోగించండి, అప్పుడు మోహజీతులుగా, బంధనముక్తులుగా అయిపోతారు.

స్లోగన్:-
పరస్పరములో స్నేహీలుగా అయ్యేందుకు సరళత మరియు సహనశీలతా గుణాలను ధారణ చేయండి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

బాప్ దాదా వరదానము ఏమిటంటే - సదా సంతోషముగా ఉండండి, సంతోషమనే ఖజానాను పంచండి, సంతోషపు అలను అందరిలోనూ వ్యాపింపజేయండి. మీ ముఖముపై సదా సంతోషముతో కూడిన చిరునవ్వు మెరుస్తూ ఉండాలి. అటువంటి హర్షితముఖులుగా ఉండండి. దీని కోసం మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత తప్పకుండా ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలంటే, ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రాప్తిని అనుభవము చేయాలి.