30-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - దుఃఖహర్త, సుఖకర్త ఒక్క తండ్రే, వారే మీ దుఃఖాలన్నింటినీ దూరం చేస్తారు, మనుష్యులు ఎవరి దుఃఖాలనూ దూరం చేయలేరు’’

ప్రశ్న:-
విశ్వములో ఆశాంతికి కారణం ఏమిటి? శాంతి స్థాపన ఎలా జరుగుతుంది?

జవాబు:-
విశ్వములోని అశాంతికి కారణము అనేకానేక ధర్మాలు. కలియుగాంతములో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది. తండ్రి వచ్చి ఒక్క సత్య ధర్మ స్థాపనను చేస్తారు. అక్కడ శాంతి ఏర్పడుతుంది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో శాంతి ఉండేదని, పవిత్ర ధర్మము, పవిత్ర కర్మ ఉండేవని మీరు అర్థం చేసుకోగలరు. కళ్యాణకారి అయిన తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు. అందులో అశాంతి అన్న మాటే ఉండదు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరుడు అని అంటారు. ఇది పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. బొంబాయిలో కూడా ఎంతోమంది సమాజ సేవకులు ఉన్నారు, వారి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బొంబాయిలో విశేషముగా ఎక్కడైతే మీటింగ్ జరుపుతారో దాని పేరు భారతీయ విద్యా భవన్. ఇప్పుడు విద్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో దైహికమైన విద్య, అది స్కూళ్ళలో, కాలేజీలలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దానిని విద్యా భవన్ అని అంటారు అంటే తప్పకుండా అక్కడ ఇంకేదో ఉంది. ఇప్పుడు విద్య అని దేనినంటారు, ఇది మనుష్యులకు తెలియనే తెలియదు. ఇక్కడ ఇది ఆత్మిక విద్యా భవన్ గా ఉండాలి. విద్య అని జ్ఞానాన్ని అంటారు. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. శ్రీకృష్ణుడిని జ్ఞానసాగరుడు అని అనరు. శివబాబా మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. భారతవాసులు తికమకపడ్డారు. శ్రీకృష్ణుడిని గీతా భగవానుడిగా భావించి కూర్చున్నారు కావుననే విద్యా భవన్ మొదలైనవి తెరుస్తూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. విద్య అంటే గీతా జ్ఞానము. ఆ జ్ఞానము ఒక్క తండ్రిలోనే ఉంది, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు, వారి గురించి మనుష్యమాత్రులకు తెలియదు. భారతవాసుల ధర్మ శాస్త్రము వాస్తవానికి ఒక్కటే, అదే సర్వ శాస్త్రమయి శిరోమణి అయిన భగవద్గీత. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి, అది కూడా ఈ సమయములో భారతవాసులు అర్థం చేసుకోరు. అయితే శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అనేస్తారు లేక రాముడినైనా అనేస్తారు లేక తమను తామే పరమాత్మ అని పిలుచుకుంటారు. ఇప్పుడైతే సమయము కూడా తమోప్రధానముగా ఉంది, ఇది రావణ రాజ్యము కదా.

పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు శివ భగవానువాచ అని అర్థం చేయించండి. మొదట - జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మయేనని, వారి పేరు శివ అని అర్థం చేసుకోవాలి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ ఎవ్వరికీ అర్థం కాదు. తప్పకుండా శివుడు వచ్చారు, కావుననే వారి రాత్రిని జరుపుకుంటారు. శివుడు ఎవరు - అది కూడా తెలియదు. తండ్రి అంటారు, భగవంతుడైతే అందరికీ ఒక్కరే. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. ఆత్మల తండ్రి ఒక్క పరమపిత పరమాత్మయే, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. దేవతలలో ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము మానవమాత్రులెవ్వరిలోనూ లేదు. ప్రాచీన ఋషులు, మునులకు కూడా అది తెలియదు అని అంటారు. ప్రాచీనము యొక్క అర్థము కూడా వారికి తెలియదు. సత్య, త్రేతాయుగాలు ప్రాచీనమైనవి. సత్యయుగము కొత్త ప్రపంచము. అక్కడైతే ఋషులు, మునులు లేనే లేరు. ఈ ఋషులు, మునులు మొదలైనవారందరూ తర్వాత వచ్చారు. వారికి కూడా ఈ జ్ఞానాన్ని గురించి తెలియదు. మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటారు. వారికే తెలియకపోతే ఇక భారతవాసులెవరైతే ఇప్పుడు తమోగుణీగా అయ్యారో, వారు ఎలా తెలుసుకోగలరు?

ఈ సమయములో సైన్స్ గర్వము కూడా ఎంతగా ఉంది. ఈ సైన్స్ ద్వారా భారత్ స్వర్గముగా అయిపోయిందని భావిస్తారు. దీనిని మాయ ఆర్భాటము అని అంటారు. ఫాల్ ఆఫ్ పాంప్ (ఆర్భాటము తగ్గిపోవుట) అని ఒక నాటకము కూడా ఉంది. ఈ సమయంలో భారత్ యొక్క పతనము జరుగుతోంది అని కూడా అంటారు. సత్యయుగములో ఉన్నతి ఉంది, ఇప్పుడు పతనము ఉంది. ఇది స్వర్గమేమీ కాదు. ఇదంతా మాయ ఆర్భాటము, ఇది అంతమవ్వవలసిందే. విమానాలు ఉన్నాయి, పెద్ద-పెద్ద మహళ్ళు, విద్యుత్తు ఉంది, ఇదే స్వర్గము అని మనుష్యులు భావిస్తారు. ఎవరైనా మరణించినా కూడా స్వర్గస్థులయ్యారు అని భావిస్తారు. స్వర్గస్థులయ్యారు అని అంటున్నారంటే తప్పకుండా స్వర్గము అనేది ఇంకేదో ఉన్నట్లే కదా, ఇది కూడా అర్థం చేసుకోరు. ఇది రావణుడి ఆర్భాటము. అనంతమైన తండ్రి స్వర్గ స్థాపనను చేస్తున్నారు. ఈ సమయములో ఇది మాయ మరియు ఈశ్వరుడు, ఆసురీ ప్రపంచము మరియు ఈశ్వరీయ ప్రపంచము మధ్యన సంఘర్షణ. ఇది కూడా భారతవాసులకు అర్థం చేయించవలసి ఉంటుంది. దుఃఖాలైతే ఇంకా ఎన్నో రానున్నాయి. అపారమైన దుఃఖము రానున్నది. స్వర్గమైతే సత్యయుగములో ఉంటుంది, అది కలియుగములో ఉండదు. పురుషోత్తమ సంగమయుగము అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి అని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. అంధకారములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడిని కలుసుకునేందుకు ఎన్ని వేద-శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. బ్రహ్మా యొక్క పగలు మరియు రాత్రియే బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి. సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరే. వారైతే కలియుగ కుఖవంశావళి బ్రాహ్మణులు. మీరు పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. ఈ విషయాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే - తాము ఏమి చేస్తున్నారు అనేది అర్థం చేసుకోగలరు. భారత్ సతోప్రధానముగా ఉండేది, దానినే స్వర్గము అని అంటారు. కావున తప్పకుండా ఇది నరకమే, అందుకే నరకము నుండి స్వర్గములోకి వెళ్తారు. అక్కడ శాంతి కూడా ఉంది, సుఖము కూడా ఉంది. అది లక్ష్మీ-నారాయణుల రాజ్యము కదా. మనుష్యుల వృద్ధి ఏ విధంగా తగ్గగలదో, అశాంతి ఏ విధముగా తగ్గగలదో మీరు అర్థం చేయించవచ్చు. అశాంతి పాత ప్రపంచమైన కలియుగములోనే ఉంది. కొత్త ప్రపంచములోనే శాంతి ఉంటుంది. స్వర్గములో శాంతి ఉంది కదా. దానినే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అని అంటారు. హిందూ ధర్మము ఇప్పటిదే, దీనిని ఆది సనాతన ధర్మము అని అనలేరు. హిందుస్థాన్ అన్న పేరు వల్ల వీరు హిందువులు అని అనేస్తారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. అక్కడ సంపూర్ణ పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్యము, సంపద మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాము, ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. ఇప్పుడు పతిత-పావనుడు ఎవరు అన్నది ప్రశ్న. శ్రీకృష్ణుడినైతే అలా అనరు. పతిత-పావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. వారే వచ్చి చదివిస్తారు. జ్ఞానాన్ని చదువు అని అంటారు. మొత్తం ఆధారమంతా గీత పైనే ఉంది. ఇప్పుడు మీరు ప్రదర్శిని, మ్యూజియం మొదలైనవి తయారుచేస్తారు కానీ ఇప్పటివరకూ వారు బి.కె. అన్న పదము యొక్క అర్థాన్ని అర్థం చేసుకోలేదు. ఇదేదో కొత్త ధర్మము అని భావిస్తారు. వింటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా తమోప్రధానమైన రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు అని తండ్రి అన్నారు. ఈ సమయములో విజ్ఞాన గర్వితులు కూడా ఎందరో తయారయ్యారు, సైన్స్ ద్వారానే తమ వినాశనము చేసుకుంటారు కావున రాతిబుద్ధి అనే అంటారు కదా. వారిని పారసబుద్ధి కలవారు అని అనరు. బాంబులు మొదలైనవాటిని తమ వినాశనం కొరకే తయారుచేసుకుంటారు. శంకరుడు వినాశనం చేస్తారనేమీ కాదు. వారు తమ వినాశనం కొరకే అన్నీ తయారుచేసుకున్నారు. కానీ తమోప్రధానమైన రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు. ఏవైతే తయారుచేస్తారో అవన్నీ ఈ పాత సృష్టి వినాశనం కొరకే. వినాశనం జరిగితేనే మళ్ళీ కొత్త ప్రపంచ జయజయకారాలు జరుగుతాయి. స్త్రీల దుఃఖాన్ని ఎలా దూరం చేయాలి? అని వారు భావిస్తారు. కానీ మనుష్యులు ఎవరి దుఃఖాన్నీ దూరం చేయలేరు. దుఃఖహర్త, సుఖకర్త అయితే ఒక్క తండ్రే. అలా దేవతలను కూడా అనరు. శ్రీకృష్ణుడు కూడా దేవత, వారిని భగవంతుడు అని అనలేరు. ఇది కూడా అర్థం చేసుకోరు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా అయి ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. రాజ్య పదవికి చెందినవారు లేక దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వెలువడుతారు. లక్ష్మీ-నారాయణులు స్వర్గాధిపతులుగా ఎలా అయ్యారు, ఏ కర్మలు చేసిన కారణముగా విశ్వాధిపతులుగా అయ్యారు? ఈ సమయములో కలియుగాంతములో అనేకానేక ధర్మాలున్నాయి కావున అశాంతి ఉంది. కొత్త ప్రపంచములో ఇలా జరుగదు. ఇప్పుడు ఇది సంగమయుగము, ఈ సమయములో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రే కర్మ-అకర్మ-వికర్మల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఆత్మ శరీరాన్ని తీసుకొని కర్మలు చేయడానికి వస్తుంది. సత్యయుగములో ఏ కర్మలనైతే చేస్తారో అవి అకర్మలుగా అవుతాయి, అక్కడ వికర్మలు జరగవు, దుఃఖమనేదే ఉండదు. కర్మ-అకర్మ-వికర్మల గతులను తండ్రే వచ్చి అంతిమములో వినిపిస్తారు. నేను వీరి అనేక జన్మల అంతిమములోని అంతిమ సమయములో వస్తాను. ఈ రథములో ప్రవేశిస్తాను. అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది రథము. కేవలం ఒక అమృత్సర్ లోనే కాదు, మనుష్యులందరిదీ అకాల సింహాసనమే. ఆత్మ అకాలమూర్తి. ఈ శరీరము మాట్లాడుతుంది, నడుస్తుంది. అకాల ఆత్మకు ఇది చైతన్యమైన సింహాసనము. అందరూ అకాలమూర్తులే, ఇకపోతే శరీరమును మృత్యువు కబళిస్తుంది. ఆత్మ అయితే అకాల్ (అమరమైనది). ఈ సింహాసనమైన శరీరాన్ని అంతం చేసేస్తారు. సత్యయుగములో ఇలా ఎక్కువ సింహాసనాలు (శరీరాలు) ఉండవు. ఈ సమయములో కోట్లాదిమంది ఆత్మల సింహాసనాలు ఉన్నాయి. అకాల్ (అమరము) అని ఆత్మనే అంటారు. ఆత్మయే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుంది. నేనైతే సదా సతోప్రధానముగా, పవిత్రముగా ఉంటాను. ప్రాచీన భారత్ యొక్క యోగము అని అంటారు కానీ వారు కూడా దానిని శ్రీకృష్ణుడే నేర్పించారని భావిస్తారు. గీతనే ఖండితము చేసేసారు. జీవిత గాథలో పేరును మార్చేశారు. తండ్రికి బదులుగా కొడుకు పేరును వేసేశారు. శివరాత్రిని జరుపుకుంటారు కానీ వారు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. శివుడు పరమ ఆత్మ. వారి మహిమ పూర్తిగా వేరు, ఆత్మల మహిమ వేరు. రాధ-కృష్ణులే లక్ష్మీ-నారాయణులు అని పిల్లలకు తెలుసు. లక్ష్మీ-నారాయణుల యొక్క రెండు రూపాలనే విష్ణువు అని అంటారు. తేడా ఏమీ లేదు. కానీ నాలుగు భుజాలు, ఎనిమిది భుజాలు కల మనుష్యులు ఎవ్వరూ ఉండరు. దేవీలు మొదలైనవారికి ఎన్ని భుజాలను చూపించారు. ఇవి అర్థం చేయించడానికి సమయం పడుతుంది.

తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. ఎప్పుడైతే భారత్ నిరుపేదగా అయిపోతుందో అప్పుడే నేను వస్తాను. అప్పుడు రాహు గ్రహణము కూర్చుంటుంది. బృహస్పతి దశ ఉండేది, ఇప్పుడు రాహు గ్రహణము కేవలం భారత్ పైనే కాదు, మొత్తం ప్రపంచమంతటి పైనా ఉంది. అందుకే తండ్రి మళ్ళీ భారత్ లోకి వస్తారు, వారు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు, దానినే స్వర్గము అని అంటారు. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా, ద్వికిరీటధారులైన స్వర్గాధిపతులుగా తయారుచేస్తాను. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండి 5000 సంవత్సరాలయ్యింది. ఇప్పుడది లేదు. తమోప్రధానముగా అయిపోయారు. తండ్రి స్వయమే తమ యథార్థ పరిచయాన్ని అనగా రచయిత మరియు రచనల పరిచయాన్ని ఇస్తారు. మీ వద్ద ప్రదర్శినీలకు, మ్యూజియంలకు ఎంతోమంది వస్తారు కానీ అందరూ అర్థం చేసుకోరు. అరుదుగా ఏ కొందరో అర్థం చేసుకొని కోర్స్ చేస్తారు, రచయిత మరియు రచనలను తెలుసుకుంటారు. రచయిత అనంతమైన తండ్రి. వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. మళ్ళీ రాజ్యము లభిస్తే ఇక అక్కడ జ్ఞానము యొక్క అవసరం ఉండదు. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని సద్గతి అని అంటారు, పాత ప్రపంచమైన నరకాన్ని దుర్గతి అని అంటారు. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా ఈ విధంగా అర్థం చేయించాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూపించాలి. ఇక్కడ విశ్వములో శాంతి స్థాపన జరుగుతుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క పునాది లేదు, దానిని తండ్రి స్థాపిస్తున్నారు. దేవతలది పవిత్ర ధర్మము, పవిత్ర కర్మలు. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచము, శివాలయము అని అంటారు. ఇప్పుడు అర్థం చేయించవలసి ఉంటుంది, అప్పుడు పాపం వారి కళ్యాణము జరుగుతుంది. తండ్రినే కళ్యాణకారి అని అంటారు. వారు పురుషోత్తమ సంగమయుగములోనే వస్తారు. కళ్యాణకారీ యుగములో కళ్యాణకారి అయిన తండ్రి వచ్చి సర్వుల కళ్యాణమును చేస్తారు. వారు పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. దీని గురించి రోజూ సమయాన్ని తీసుకొని అర్థం చేయించవచ్చు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను గురించి మాకే తెలుసు, స్వయంగా భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పించిన గీతా అధ్యాయము ఇప్పుడు జరుగుతోంది అని చెప్పండి. వారు డబుల్ కిరీటధారులుగా తయారుచేసారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా రాజయోగము ద్వారా ఈ విధంగా అయ్యారు. ఈ పురుషోత్తమ సంగమయుగములో తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. బాబా ప్రతి విషయాన్ని ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రాజయోగము యొక్క చదువు సంపాదనకు ఆధారము ఎందుకంటే దీని ద్వారానే మనం రాజులకే రాజులుగా అవుతాము. ఈ ఆత్మిక చదువును రోజూ చదవాలి మరియు చదివించాలి.

2. బ్రాహ్మణులమైన మేము సత్యమైన ముఖవంశావళి, మేము కలియుగ రాత్రి నుండి బయటకు వచ్చి పగలులోకి వచ్చాము అన్న నషా సదా ఉండాలి. ఇది కళ్యాణకారీ పురుషోత్తమ యుగము, ఇందులో స్వ కళ్యాణమును మరియు సర్వుల కళ్యాణమును చేయాలి.

వరదానము:-

ప్రతి శ్రేష్ఠ సంకల్పమును కర్మలోకి తీసుకువచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ

మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సంకల్పము మరియు కర్మ సమానముగా ఉండాలి. ఒకవేళ సంకల్పము చాలా శ్రేష్ఠముగా ఉంటూ కర్మ సంకల్పమనుసారముగా లేకపోతే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు. కావున చెక్ చేసుకోండి, ఏ శ్రేష్ఠ సంకల్పమునైతే చేస్తున్నారో అది కర్మ వరకు వస్తుందా, లేదా. ఏ శక్తి ఏ సమయములో అవసరమో ఆ శక్తి కార్యములోకి రావడమే మాస్టర్ సర్వశక్తివంతులకు గుర్తు. స్థూలమైన మరియు సూక్ష్మమైన శక్తులన్నీ ఎంతగా కంట్రోల్ లో ఉండాలంటే, ఏ సమయములో ఏ శక్తి అవసరమో ఆ సమయములో దానిని కార్యములో వినియోగించగలగాలి.

స్లోగన్:-

జ్ఞానీ ఆత్మలైన పిల్లలలో క్రోధము ఉన్నట్లయితే దాని ద్వారా తండ్రి పేరుకు గ్లాని జరుగుతుంది.