ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబాను తండ్రి అని పిలుస్తున్నారంటే,
మరి ఇంతమంది పిల్లలకు ఒకే దైహికమైన తండ్రి అయితే ఉండలేరు. వీరు ఆత్మిక తండ్రి.
వీరికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఈ టేప్, మురళి మొదలైన సామాగ్రి అంతా పిల్లల కోసమే
ఉంది. పురుషోత్తములుగా అయ్యేందుకు ఇప్పుడు మనము సంగమయుగములో కూర్చున్నామని పిల్లలకు
తెలుసు. ఇది కూడా సంతోషకరమైన విషయము. తండ్రియే పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఈ
లక్ష్మీ-నారాయణులు పురుషోత్తములు కదా. ఈ సృష్టిలోనే ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు
మరియు కనిష్ట పురుషులు ఉంటారు. ఆదిలో ఉత్తములు ఉన్నారు, మధ్యలో మధ్యమ పురుషులు
ఉన్నారు, అంతిమములో కనిష్టులు ఉన్నారు. ప్రతి వస్తువు మొదట కొత్తదిగా, ఉత్తమముగా
ఉంటుంది, ఆ తరువాత మధ్యమముగా అవుతుంది, ఆ తరువాత కనిష్టముగా అనగా పాతదిగా
తయారవుతుంది. ప్రపంచము విషయములో కూడా ఇలాగే అవుతుంది. కావున ఏయే విషయాలలోనైతే
మనుష్యులకు సంశయము వస్తుందో, ఆ విషయాలపై మీరు అర్థం చేయించాలి. చాలా వరకు బ్రహ్మా
విషయములోనే అడుగుతూ ఉంటారు, వీరిని ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతూ ఉంటారు.
అప్పుడు వారిని కల్పవృక్షము చిత్రము వద్దకు తీసుకువెళ్ళాలి. ఇందులో చూడండి, వీరు
కింద కూడా తపస్య చేస్తున్నారు, మళ్ళీ వీరే పైన అంతిమములో అనేక జన్మల అంతిమ జన్మలో
నిలబడి ఉన్నారు. తండ్రి అంటారు, నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఈ విషయాలను అర్థం
చేయించేవారు చాలా తెలివైనవారై ఉండాలి. ఒక్కరు తెలివిహీనులుగా ఉన్నా బి.కె.లందరి పేరు
పాడవుతుంది. పూర్తిగా అర్థం చేయించడం రాదు. అయితే, పూర్తిగా పాస్ అయ్యేది
అంతిమములోనే, ఈ సమయములో ఎవరూ పదహారు కళల సంపూర్ణులుగా అవ్వలేరు, కానీ అర్థం
చేయించడములో మాత్రం నంబరువారుగా తప్పకుండా ఉంటారు. పరమపిత పరమాత్మ పట్ల ప్రీతి
లేకపోతే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నట్లే కదా. ఈ విషయములో మీరు ఇలా అర్థం
చేయించవచ్చు - ప్రీతి బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు విజయులుగా అవుతారు మరియు
విపరీత బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు వినాశనమవుతారు. ఈ విషయాన్ని విని కూడా
చాలామంది డిస్టర్బ్ అవుతారు. ఇక దాంతో ఏదో ఒక నింద మోపుతూ ఉంటారు. గొడవ పడడానికి
పెద్ద ఆలస్యము చేయరు. ఇందులో ఎవరైనా ఏం చేయగలరు. ఒక్కోసారి చిత్రాలకు నిప్పు
అంటించడానికి కూడా వెనుకాడరు. బాబా సలహా ఇస్తున్నారు, చిత్రాలను ఇన్ష్యూర్ చేయించండి.
పిల్లల అవస్థను గురించి కూడా తండ్రికి తెలుసు. వికారీ దృష్టి గురించి కూడా బాబా రోజూ
అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా, మీరు వికారీ దృష్టిని గురించి ఏదైతే అర్థం చేయించారో,
అది పూర్తిగా సత్యమే అని తండ్రికి వ్రాస్తారు. ఈ ప్రపంచము తమోప్రధానముగా ఉంది కదా.
రోజురోజుకు తమోప్రధానముగా అవుతూ ఉంటారు. కలియుగము ఇప్పుడింకా అంబాడుతున్న స్థాయిలో
ఉంది అని వారు అనుకుంటారు, అజ్ఞాన నిద్రలో పూర్తిగా పడుకొని ఉన్నారు. ఇది మహాభారత
యుద్ధము యొక్క సమయము కావున భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపములో ఉంటారు అని
అప్పుడప్పుడు అంటూ ఉంటారు కూడా, కానీ అతని రూపము గురించైతే ఏమీ చెప్పరు. వారు
తప్పకుండా ఎవరో ఒకరిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భాగ్యశాలి రథము అని గాయనము
చేయబడుతుంది. ఆత్మకు తనదంటూ రథము ఉంటుంది కదా. ఆ రథములోకి వచ్చి ప్రవేశిస్తారు. ఆ
రథాన్ని భాగ్యశాలి రథము అని అంటారు. అంతేకానీ వారు జన్మ తీసుకోరు. వారు ఇతని పక్కనే
కూర్చుని జ్ఞానాన్ని ఇస్తారు. ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. త్రిమూర్తి
చిత్రము కూడా ఉంది. త్రిమూర్తులు అని బ్రహ్మా, విష్ణు, శంకరులను అంటారు. తప్పకుండా
వారు ఏదో చేసి వెళ్ళి ఉంటారు, కావుననే మార్గాలకు మరియు ఇళ్ళకు త్రిమూర్తి అన్న పేరు
పెడుతుంటారు. ఉదాహరణకు ఈ రోడ్డుకు సుభాష్ మార్గ్ అన్న పేరు పెట్టారు. సుభాష్ యొక్క
జీవితచరిత్రను గురించైతే అందరికీ తెలుసు. అటువంటివారు చనిపోయిన తరువాత వారి చరిత్రను
వ్రాస్తారు. ఆ తరువాత వారి శిల్పాన్ని తయారుచేసి వారిని పెద్దవారిగా చేస్తారు. వారి
గురించి ఎన్నో గొప్పలు వ్రాస్తారు. ఏ విధముగా గురునానక్ పుస్తకాన్ని ఎంత పెద్దగా
తయారుచేసారు. వాస్తవానికి గురునానక్ అయితే అంత వ్రాయరు కదా. జ్ఞానానికి బదులుగా
భక్తి విషయాలను కూర్చుని వ్రాసారు. ఈ చిత్రాలు మొదలైనవి అర్థం చేయించేందుకని
తయారుచేయడం జరుగుతుంది. ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో, అదంతా భస్మమైపోనున్నదని
మీకు తెలుసు. అప్పుడిక ఆత్మ ఇక్కడ ఉండలేదు. తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటువంటి
విషయాలు అందరి బుద్ధిలో ఏమీ కూర్చోవు. ఒకవేళ ధారణ జరిగినట్లయితే మరి వారు క్లాసు
ఎందుకు చేయరు. 7-8 సం.లు గడిచిన తరువాత కూడా క్లాసు చేసే విధంగా ఎవరూ తయారవ్వరు.
చాలా చోట్ల అలా క్లాసు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా, మాతల పదవి ఉన్నతమైనది అని
భావిస్తారు. చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి. ఆ తరువాత మురళిని ధారణ చేసి దానిపై కొద్దిగా
అర్థం చేయిస్తారు. ఎవరైనా ఈ విధంగా చేయవచ్చు. ఇది చాలా సహజము. అయినా కానీ బ్రాహ్మణి
కావాలి అని ఎందుకు అంటారో తెలియదు. బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే ఇక అలిగి
కూర్చుండిపోతారు. క్లాసుకు రారు, పరస్పరములో ఘర్షణ ఏర్పడుతుంది. మురళిని అయితే
ఎవరైనా కూర్చుని వినిపించవచ్చు కదా. కానీ ఖాళీ లేదు అని అంటారు. దీని ద్వారా స్వయము
యొక్క కళ్యాణము కూడా చేసుకోవాలి, అలాగే ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. ఇది చాలా భారీ
సంపాదన. మనుష్యుల జీవితము వజ్రతుల్యముగా తయారయ్యేలా సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి.
స్వర్గములోకి అందరూ వెళ్తారు కదా. అక్కడ ఎల్లప్పుడూ సుఖముగానే ఉంటారు. అక్కడ ప్రజల
ఆయుష్షు తక్కువగా ఉంటుందనేమీ కాదు, అలా కాదు, ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఆ ప్రపంచమే అమరలోకము. ఇకపోతే పదవులు మాత్రము ఎక్కువగా తక్కువగా ఉంటాయి. కావున ఏ
టాపిక్ పై అయినా క్లాసు చేయాలి. మంచి బ్రాహ్మణి కావాలి అని ఎందుకు అడుగుతారు.
పరస్పరము కలిసి క్లాసు చేసుకోవచ్చు. అంతేకానీ దాని కోసం ఎవరో కావాలి అని అలా
బాధపడకూడదు. ఈ చిన్న-చిన్న కన్యలు ఏం అర్థం చేయిస్తారు అని కొంతమందికి అహంకారం
వస్తుంది. మాయ విఘ్నాలు కూడా ఎన్నో వస్తాయి. బుద్ధిలో ఏమీ కూర్చోదు.
బాబా అయితే ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. శివబాబా అయితే టాపిక్ పై అర్థం
చేయించరు కదా. వారైతే సాగరుడు, జ్ఞాన కెరటాలు ఎగసిపడుతూ ఉంటాయి. ఒక్కోసారి పిల్లలకు
అర్థం చేయిస్తారు, ఒక్కోసారి బయటివారి కోసం అర్థం చేయిస్తారు. మురళి అయితే అందరికీ
లభిస్తుంది. ఏవైనా పదాలు తెలియకపోతే నేర్చుకోవాలి కదా - తమ ఉన్నతి కొరకు పురుషార్థము
చేయాలి. తమ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. ఈ తండ్రి (బ్రహ్మాబాబా) కూడా
వినిపించగలరు కదా. కానీ పిల్లల బుద్ధియోగము శివబాబా వైపు ఉండాలి. అందుకే ఏమంటారంటే
- ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి, శివబాబానే స్మృతి చేయండి.
శివబాబా పరంధామము నుండి వచ్చి మురళి వినిపిస్తున్నారు. ఈ బ్రహ్మా అయితే పరంధామము
నుండి వచ్చి వినిపించరు కదా. శివబాబా ఈ తనువులోకి వచ్చి మాకు మురళి వినిపిస్తున్నారు
అని భావించండి. ఇది బుద్ధిలో గుర్తుండాలి. ఈ విషయము యథార్థ రీతిగా బుద్ధిలో ఉన్నా
సరే స్మృతియాత్ర ఉంటుంది కదా. కానీ ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా చాలామంది బుద్ధియోగము
అటూ-ఇటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు యాత్రలో బాగా ఉండగలరు. లేకపోతే మీ ఊరు
గుర్తుకొస్తూ ఉంటుంది, ఇళ్ళు-వాకిళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి. శివబాబా వీరిలో కూర్చుని
మమ్మల్ని చదివిస్తున్నారు అని బుద్ధిలో గుర్తుంటుంది. మనము శివబాబా స్మృతిలో మురళి
వింటుంటాము, మళ్ళీ బుద్ధియోగము ఎక్కడికో పరుగెడుతుంది. ఈ విధంగా అనేకమంది
బుద్ధియోగము వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు యాత్రలో చాలా బాగా ఉండగలరు. శివబాబా పరంధామము
నుండి వచ్చారు అని మీరు భావిస్తారు. బయట పల్లెల్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఉండదు.
శివబాబా మురళిని ఈ చెవుల ద్వారా వింటున్నాము అని కొందరు భావిస్తారు, కానీ
వినిపించేవారి నామ-రూపాలు గుర్తుండకూడదు. ఈ జ్ఞానమంతా లోలోపలకు సంబంధించినది.
శివబాబా మురళిని నేను వింటున్నాను అని లోలోపల ఆలోచన ఉండాలి. అంతేకానీ ఫలానా సోదరి
వినిపిస్తోంది అని భావించకూడదు. శివబాబా మురళిని వింటున్నాము అని భావించాలి. ఇవి
కూడా స్మృతిలో ఉండేందుకు యుక్తులు. ఎంత సమయమైతే మనము మురళిని వింటామో అంత సమయము
స్మృతిలో ఉన్నామని కాదు. అలా కాదు. బాబా అంటారు, చాలామంది బుద్ధియోగము అటూ, ఇటూ
బయటకు వెళ్ళిపోతుంది. పొలాలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. బుద్ధియోగము బయట ఎక్కడా
భ్రమించకూడదు. శివబాబాను స్మృతి చేయడములో ఏదైనా ఇబ్బంది ఉందా. కానీ మాయ స్మృతి
చేయనివ్వదు. అన్ని సమయాలలోనూ శివబాబా స్మృతి ఉండదు, ఇతర ఆలోచనలు వస్తూ ఉంటాయి.
పిల్లలు నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు కదా. ఎవరైతే చాలా సమీప సంబంధములో
ఉంటారో వారి బుద్ధిలో ఇది బాగా కూర్చుంటుంది. అందరూ అష్టరత్నాల మాలలోకి రాలేరు కదా.
జ్ఞానము, యోగము, దైవీ గుణాలు, వీటన్నింటినీ స్వయములో చూసుకోవాలి. నాలో ఏ అవగుణము
లేదు కదా? మాయకు వశమై వికర్మలేవీ జరగడం లేదు కదా? అని చూసుకోవాలి. కొందరు చాలా
లోభిగా అయిపోతారు. లోభము అనే భూతము కూడా ఉంటుంది. అక్కడ మాయ ఎలా ప్రవేశిస్తుందంటే,
ఇక వారు ఆకలి-ఆకలి అని అంటూ ఉంటారు. ఏ వ్యక్తికైతే లోభము అన్న పురుగు బుద్ధిలో
ఉంటుందో, వారు ఎంత తిన్నా, ఎంత ఉన్నా ఇంకా కావాలి, కావాలి అన్న ఆలోచనే ఉంటూ ఉంటుంది.
భోజనము కూడా నియమానుసారముగా ఉండాలి. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడింకా ఎంతోమంది
పిల్లలు తయారవ్వనున్నారు. ఎంతమంది బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు తయారవుతారు. మీరు
బ్రాహ్మణులు అయి కూర్చోండి అని పిల్లలకు కూడా చెప్తాను. మాతలను ముందుంచడం జరుగుతుంది.
శివశక్తి భారతమాతలకు జై.
తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి.
స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. స్వదర్శన చక్రధారులు బ్రాహ్మణులైన మీరు. ఈ
విషయాలను కొత్తవారెవరైనా వస్తే, వారు అర్థం చేసుకోలేరు. మీరు సర్వోత్తమమైన బ్రహ్మా
ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. ఈ విషయాలను కొత్తవారెవరైనా
వింటే, వారు అంటారు - స్వదర్శన చక్రమైతే విష్ణువుకు ఉంది కదా, కానీ వీరు అందరినీ
స్వదర్శన చక్రధారులుగా భావిస్తున్నారే. వారు అంగీకరించరు. కావుననే కొత్త-కొత్తవారిని
సభలోకి అనుమతించడం జరగదు. వారు అర్థం చేసుకోలేరు. అలా అంటే కొంతమంది డిస్టర్బ్
అవుతారు. మేము బుద్ధిహీనులమా, మమ్మల్ని లోనికి రానివ్వడం లేదు? అని ప్రశ్నిస్తారు.
ఎందుకంటే ఇతర సత్సంగాలలోనైతే ఎవరైనా సరే వెళ్ళిపోతుంటారు. అక్కడైతే శాస్త్రాల
విషయాలనే వినిపిస్తూ ఉంటారు. ఆ విషయాలను వినేందుకు అందరికీ హక్కు ఉంది. కానీ ఇక్కడ
జాగ్రత్తగా సంభాళించవలసి ఉంటుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానము బుద్ధిలో కూర్చోకపోతే డిస్టర్బ్
అవుతారు. చిత్రాలను కూడా సంభాళించుకోవలసి ఉంటుంది. ఈ ఆసురీ ప్రపంచములో మన దైవీ
రాజధానిని స్థాపన చేసుకోవాలి. ఏ విధముగా క్రైస్టు తన ధర్మ స్థాపన చేయడానికి వచ్చారో,
అలా ఈ తండ్రి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు. ఇందులో హింస యొక్క విషయమేమీ లేదు.
మీరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడానికి వీల్లేదు, అలాగే స్థూల హింస చేయడానికి వీల్లేదు.
భగవంతుడు మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరిచారు అని అంటూ ఉంటారు కూడా. మనుష్యులైతే
పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. తండ్రి వచ్చి ఘోర అంధకారము నుండి అపారమైన
ప్రకాశముగా మారుస్తారు. అయినా సరే కొందరు బాబా అని పిలిచి, మళ్ళీ ముఖము
తిప్పేసుకుంటారు, చదువును వదిలేస్తారు. భగవంతుడు విశ్వానికి యజమానులుగా
తయారుచేయడానికి చదివిస్తుంటే, మరి ఇటువంటి చదువును వదిలేస్తే, వారిని మహామూర్ఖులు
అని అంటారు. ఎంత అపారమైన ఖజానా లభిస్తుంది. ఇటువంటి తండ్రిని అసలు ఎప్పుడైనా
వదలవచ్చా. మీరు ప్రేమించినా లేక తిరస్కరించినా, మీ ద్వారాన్ని మేము ఎప్పుడూ
వదిలిపెట్టము అని ఒక పాట కూడా ఉంది. తండ్రి వచ్చినదే అనంతమైన రాజ్యాధికారాన్ని
ఇవ్వడానికి. వారిని వదిలే ప్రసక్తే లేదు. అయితే, లక్షణాలు మంచివి ధారణ చేయాలి. వీరు
మమ్మల్ని బాగా విసిగిస్తున్నారు అని స్త్రీలు రిపోర్టు వ్రాస్తూ ఉంటారు. ఈ రోజుల్లో
మనుష్యులు చాలా-చాలా చెడ్డగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరీలను సోదరులు
రక్షించాలి. ఆత్మలమైన మనము ఎట్టి పరిస్థితిలోనూ తండ్రి నుండి వారసత్వము తప్పకుండా
తీసుకోవాలి. తండ్రిని వదిలినట్లయితే వారసత్వము అంతమైపోతుంది. నిశ్చయ బుద్ధి విజయంతి,
సంశయ బుద్ధి వినశ్యంతి. అప్పుడిక పదవి బాగా తగ్గిపోతుంది. జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన
తండ్రి ఒక్కరే ఇవ్వగలరు. మిగిలినదంతా భక్తి. తమను తాము, ఎవరు ఎంత జ్ఞానులుగా
భావించినా కానీ తండ్రి అంటారు, అందరి వద్దా శాస్త్రాలు మరియు భక్తి యొక్క జ్ఞానము
ఉంది. సత్యమైన జ్ఞానము అని దేనిని అంటారు, ఇది కూడా మనుష్యులకు తెలియదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.