ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో పరమపిత
పరమాత్ముడైన శివుడిని ఇక్కడే పూజిస్తారు. వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అనైతే
బుద్ధిలో ఉంది. ఎక్కడ లింగాన్ని చూస్తే అక్కడ వారిని పూజిస్తారు. శివుడు పరంధామ
నివాసి, వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని భావిస్తారు, అందుకే వారి స్మృతిచిహ్నాలను
తయారుచేసి పూజిస్తారు. ఏ సమయంలోనైతే స్మృతి చేయడం జరుగుతుందో, ఆ సమయంలో బుద్ధిలో
తప్పకుండా - వారు నిరాకారుడు, పరంధామ నివాసి అని ఉంటుంది, వారిని ‘శివ’ అని అంటూ
పూజిస్తారు. మందిరాలకు వెళ్ళి తల వంచుతారు, వారికి పాలు, ఫలాలు, జలము మొదలైనవి
అర్పిస్తారు, కానీ అది జడమైనది. జడమైన చిత్రం యొక్క భక్తినే చేస్తారు. ఇప్పుడు మీకు
తెలుసు - వారు చైతన్యమైనవారు, వారి నివాస స్థానము పరంధామము అని. వారిని ఎప్పుడైతే
పూజిస్తారో, అప్పుడు - వారు పరంధామ నివాసి అని, వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అందుకే
ఈ చిత్రాలు తయారుచేయబడ్డాయి అని, వాటి పూజను చేయడం జరుగుతుంది అని బుద్ధిలో ఉంటుంది.
ఆ చిత్రము శివుడు కాదు, అది వారి విగ్రహము. అదే విధంగా దేవతలను కూడా పూజిస్తారు, అది
జడమైన చిత్రము, చైతన్యమైనది కాదు. కానీ ఆ చైతన్యమైనవారు ఎవరైతే ఉండేవారో, వారు
ఎక్కడికి వెళ్ళారు అన్నది అర్థం చేసుకోరు. తప్పకుండా పునర్జన్మలు తీసుకొని కిందకు
వచ్చి ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తుంది. పూజ్య దేవతలెవరైతే ఉండేవారో,
వారు పునర్జన్మలను తీసుకుంటూ వచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయితే
అదే, ఆత్మ పేరు మారదు. ఇకపోతే శరీరం పేరు మారుతుంది. ఆ ఆత్మ ఏదో ఒక శరీరములో ఉంది.
పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే. మీరు వారిని పూజిస్తారు, మొట్టమొదటి శరీరధారులు
ఎవరైతే ఉన్నారో, వారిని (సత్యయుగ లక్ష్మీనారాయణులను) పూజిస్తారు. ఈ సమయంలో తండ్రి ఏ
జ్ఞానమునైతే అందిస్తారో, దాని గురించి ఆలోచన నడుస్తుంది. మీరు అర్థం చేసుకున్నారు -
ఏ చిత్రాన్ని అయితే మనం పూజిస్తామో, వారు మొదటి నంబరువారు. ఈ లక్ష్మీ-నారాయణులు
చైతన్యముగా ఉండేవారు. వారు ఇక్కడే భారత్ లో ఉండేవారు, ఇప్పుడు వారు లేరు. వారే
పునర్జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ, భిన్న-భిన్న నామరూపాలను తీసుకుంటూ 84 జన్మల
పాత్రను అభినయిస్తూ ఉంటారని మనుష్యులు అర్థం చేసుకోరు. ఇది ఎవ్వరి ఆలోచనలోకి కూడా
రాదు. సత్యయుగములోనైతే వారు తప్పకుండా ఉండేవారు కానీ ఇప్పుడు లేరు. ఇది కూడా
ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు - డ్రామా ప్లాన్ అనుసారంగా వారు మళ్ళీ
తప్పకుండా చైతన్యములోకి వస్తారు. మనుష్యుల బుద్ధిలోకి ఈ ఆలోచన కూడా రాదు. వీరు
ఒకప్పుడు ఉండేవారు అని మాత్రం తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వారి జడ
చిత్రాలు ఉన్నాయి, కానీ ఆ చైతన్యమైనవారు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నది ఎవరి
బుద్ధిలోకీ రాదు. మనుష్యులైతే 84 లక్షల పునర్జన్మలు అని అనేస్తారు, కానీ 84 జన్మలే
తీసుకుంటారు, 84 లక్షల జన్మలు కాదు అని పిల్లలైన మీకు తెలిసింది. ఇప్పుడు
రామచంద్రుని పూజను చేస్తారు, కానీ రాముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది కూడా వారికి
తెలియదు. మీకు తెలుసు - రాముడి ఆత్మ కూడా తప్పకుండా పునర్జన్మలను తీసుకుంటూ ఉంటుంది.
ఆ ఆత్మ ఇక్కడ పరీక్షలో ఫెయిల్ అవుతుంది. కానీ ఏదో ఒక రూపంలోనైతే తప్పకుండా ఉంటుంది
కదా. వారు ఇక్కడే పురుషార్థము చేస్తూ ఉంటారు. రాముని పేరు ఇంతగా ప్రసిద్ధమైనప్పుడు
వారు తప్పకుండా వస్తారు, వారు జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని
గురించి ఏమీ తెలియదు కావున ఆ విషయాన్ని వదిలివేయాల్సి ఉంటుంది. ఈ విషయాలలోకి వెళ్ళడం
వలన కూడా సమయం వృధా అవుతుంది, దానికి బదులుగా మనం మన సమయాన్ని ఎందుకు సఫలం
చేసుకోకూడదు. మీ ఉన్నతి కొరకు బ్యాటరీని చార్జ్ చేసుకోండి. ఇతర విషయాల గురించి
ఆలోచించడము పరచింతన అవుతుంది. ఇప్పుడైతే మీరు మీ గురించి చింతన చేసుకోవాలి. మనం
తండ్రిని స్మృతి చేయాలి. వారు కూడా తప్పకుండా చదువుకుంటూ ఉండవచ్చు. తమ బ్యాటరీని
చార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు మీ బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి. మీకు మీరు
చింతన చేసుకుంటే నషా పెరుగుతుంది అని అంటూ ఉంటారు.
తండ్రి అన్నారు - ఎప్పుడైతే మీరు సతోప్రధానముగా ఉండేవారో, అప్పుడు మీ పదవి చాలా
ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి, నన్ను స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయి. ఇది గమ్యము కదా. ఈ చింతన చేస్తూ-చేస్తూ సతోప్రధానముగా
అవుతారు. నారాయణుడినే స్మరణ చేయడం ద్వారా మనం నారాయణునిగా అవుతాము. అంతిమ సమయంలో
ఎవరైతే నారాయణుడిని స్మరిస్తారో... అని అంటారు. మీరు తండ్రిని ఎలా స్మృతి చేయాలంటే,
తద్వారా పాపాలు అంతమవ్వాలి, ఆ తర్వాత నారాయణునిగా అవ్వాలి. ఇది నరుడి నుండి
నారాయణుడిగా అయ్యేందుకు ఉన్నతమైన యుక్తి. ఒక్క నారాయణుడు మాత్రమే తయారవ్వరు కదా.
ఇక్కడైతే మొత్తం వంశావళి తయారవుతుంది. తండ్రి ఉన్నతమైన పురుషార్థాన్ని చేయిస్తారు.
ఇది రాజయోగము యొక్క నాలెడ్జ్, మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వాలి. ఎంతగా
పురుషార్థం చేస్తారో, అంతగా తప్పకుండా లాభం ఉంటుంది. ఒకటేమో - స్వయాన్ని ఆత్మగా
తప్పకుండా నిశ్చయం చేసుకోండి. కొంతమంది - ఫలానా ఆత్మ మిమ్మల్ని స్మృతి చేస్తుంది అని
కూడా రాస్తారు. ఆత్మ శరీరము ద్వారా వ్రాస్తుంది. ఆత్మ యొక్క సంబంధం శివబాబాతో
ఉంటుంది. ఆత్మనైన నేను ఫలానా శరీరిక నామరూపాలు కలిగినవాడను. ఇదైతే తప్పకుండా
చెప్పవలసి ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ తీసుకునే శరీరానికే భిన్న-భిన్న పేర్లు
పెట్టడం జరుగుతుంది. ఆత్మనైన నేను మీ సంతానాన్ని, ఆత్మనైన నా యొక్క శరీరము పేరు
ఫలానా. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. ఆత్మనైన నేను ఫలానా శరీరధారిని. శరీరానికి పేరైతే
తప్పకుండా కావాలి. లేకపోతే కార్య వ్యవహారాలు నడవలేవు. ఇక్కడ తండ్రి అంటారు - నేను
కూడా ఈ బ్రహ్మా తనువులోకి తాత్కాలికంగా వస్తాను, వీరి ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను.
నేను ఈ శరీరము ద్వారా మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను. ఇది నా శరీరము కాదు. నేను
వీరిలోకి ప్రవేశించాను. నేను మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను. పిల్లలైన మీకు ఈ
మంత్రాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. అలాగని మంత్రం ఇచ్చి వెళ్ళిపోతాను అని కాదు.
అలా కాదు, పిల్లలలో ఎంతవరకు మార్పు వచ్చింది అని కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత
మార్పు తీసుకొచ్చేందుకు శిక్షణను ఇస్తూ ఉంటారు. క్షణము యొక్క జ్ఞానాన్ని ఇచ్చి
వెళ్ళిపోతే మరి జ్ఞానసాగరుడు అని కూడా పిలవడానికి లేదు. ఎంత సమయం గడిచింది, మీకు
అర్థం చేయిస్తూనే ఉంటారు. వృక్షములో భక్తి మార్గం యొక్క విషయాలు వివరంగా అర్థం
చేసుకోవాల్సినవి, వాటిని విస్తారంగా అర్థం చేయిస్తారు. హోల్ సేల్ గా చెప్పాలంటే
మన్మనాభవ. కానీ అలా చెప్పి వెళ్ళిపోరు. పాలనను కూడా చేయాల్సి ఉంటుంది (బాగోగులను
కూడా చూసుకోవాల్సి ఉంటుంది). చాలామంది పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ
మాయమైపోతారు. ఫలానా ఆత్మ పేరు ఫలానా, వారు ఎంతో బాగా చదివేవారు అని గుర్తొస్తారు కదా.
పాత పిల్లలు ఎంత బాగా ఉండేవారు, వారిని మాయ మింగేసింది. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు.
వెంటనే బాబా ఒడిలోకి వచ్చారు, భట్టీ తయారయ్యింది. ఇందులో అందరూ తమ అదృష్టాన్ని
పరీక్షించుకున్నారు. మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ-పరీక్షించుకుంటూ మాయ
పూర్తిగా ఎగరగొట్టేసింది. వారు నిలువలేకపోయారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా
ఇలాగే జరుగుతుంది. ఎంతమంది వెళ్ళిపోయారు, సగం వృక్షమైతే తప్పకుండా వెళ్ళిపోయింది.
వృక్షం తప్పకుండా వృద్ధి చెందింది కానీ పాతవారు వెళ్ళిపోయారు. వారిలో నుండి మళ్ళీ
కొంతమంది తప్పకుండా చదువుకోవడానికి వస్తారని కూడా అర్థం చేసుకోవచ్చు. మేము తండ్రి
నుండి చదువుకునేవారము, మిగిలినవారు ఇప్పటికీ చదువుకుంటా ఉన్నారు, మేము ఓడిపోయాము
అన్న స్మృతి కూడా వస్తుంది. అటువంటివారు మళ్ళీ మైదానములోకి వస్తారు. తండ్రి
రానిస్తారు, అయితే వచ్చి పురుషార్థం చేయండి, ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది.
మధురాతి-మధురమైన పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి
అని తండ్రి స్మృతిని కలిగిస్తారు. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు, తండ్రి
పరంధామంలో ఉన్నారు అని భావిస్తున్నారా? కాదు. బాబా అయితే ఇక్కడ రథంలో కూర్చున్నారు.
ఈ రథము గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. వీరు భాగ్యశాలీ రథము. వీరిలోకి వారు
వచ్చారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు వారిని పరంధామంలో గుర్తు చేసుకునేవారు కానీ
స్మృతి చేస్తే ఏమవుతుంది అనేది వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి
స్వయంగా ఈ రథములో కూర్చొని శ్రీమతాన్ని ఇస్తారు, అందుకే - తండ్రి ఇక్కడ ఈ
మృత్యులోకంలో పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
మీకు తెలుసు - మనం బ్రహ్మాను స్మృతి చేయకూడదు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి
చేయండి, నేను ఈ రథములో ఉంటూ మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. నా పరిచయాన్ని ఇస్తాను,
నేను ఇక్కడ ఉన్నాను. ఇంతకుముందు - వారు పరంధామ నివాసి, వారు ఒకప్పుడు వచ్చి వెళ్ళారు
అని మీరు భావించేవారు. అందరూ ఒకప్పుడు వచ్చి వెళ్ళారు కదా. ఎవరెవరి చిత్రాలైతే
ఉన్నాయో, ఇప్పుడు వారందరూ ఎక్కడ ఉన్నారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే వెళ్తారో,
వారు తమ సమయం అనుసారంగా మళ్ళీ వస్తారు. భిన్న-భిన్న పాత్రలను అభినయిస్తూ ఉంటారు.
స్వర్గములోకైతే ఎవరూ వెళ్ళరు. తండ్రి అర్థం చేయించారు - స్వర్గములోకి వెళ్ళేందుకు
పురుషార్థము చేయాల్సి ఉంటుంది మరియు పాత ప్రపంచము యొక్క అంతిమము, కొత్త ప్రపంచము
యొక్క ఆది జరగాలి, దానినే పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు
ఉంది. మనుష్యులకేమీ తెలియదు. శరీరము కాలిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది అని కూడా
భావిస్తారు. ఇప్పుడిది కలియుగము, మరి తప్పకుండా కలియుగములోనే జన్మను తీసుకుంటారు.
సత్యయుగములో ఉన్నప్పుడు జన్మ కూడా సత్యయుగములోనే తీసుకునేవారు. ఆత్మల స్టాక్ అంతా
నిరాకారీ లోకములో ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇదైతే బుద్ధిలో కూర్చుంది కదా. మళ్ళీ
అక్కడి నుండి వస్తారు, ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి జీవాత్మలుగా అవుతారు. అందరూ
ఇక్కడకు వచ్చి జీవాత్మలుగా అవ్వాలి. మళ్ళీ నంబరువారుగా తిరిగివెళ్ళాలి. అందరినీ
తీసుకుని వెళ్ళరు, అలా తీసుకువెళ్తే ప్రళయం జరుగుతుంది. ప్రళయం జరిగిందని చూపిస్తారు
కానీ రిజల్టు ఏమీ చూపించరు. మీకు తెలుసు - ఈ ప్రపంచం ఎప్పుడూ ఖాళీ అవ్వదు. రాముడూ
వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు, వారి పరివారములోని వారందరూ కూడా వెళ్ళిపోయారు...
అన్న గాయనము ఉంది. మొత్తం ప్రపంచమంతటిలోనూ రావణ సాంప్రదాయం ఉంది కదా. రాముని
సాంప్రదాయం చాలా కొద్దిగానే ఉంది. రాముని సాంప్రదాయం ఉండేదే సత్య, త్రేతాయుగాలలో.
ఎంతో తేడా ఉంటుంది. ఆ తర్వాత ఇతర శాఖోపశాఖలు వెలువడతాయి. ఇప్పుడు మీరు బీజము మరియు
వృక్షము గురించి కూడా తెలుసుకున్నారు. తండ్రికి అన్నీ తెలుసు కావుననే కదా వారు
వినిపిస్తూ ఉంటారు, అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఒకే విషయం ఉన్నట్లయితే
మరి శాస్త్రాలు మొదలైనవేవీ తయారవ్వలేవు. వృక్షము గురించిన వివరణను కూడా అర్థం
చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయము, నంబరువన్ సబ్జెక్టు - తండ్రిని స్మృతి చేయడము.
ఇందులోనే శ్రమ ఉంది. మొత్తమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇకపోతే వృక్షము గురించైతే
మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు అన్ని
ధర్మాలవారి తిథి-తారీఖు మొదలైనవన్నీ తెలియజేస్తారు. అర్ధ కల్పంలో వీరందరూ
వచ్చేస్తారు. ఇకపోతే సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉన్నారు. వారి కొరకు ఎన్నో
యుగాలైతే ఉండవు కదా. ఉన్నవే రెండు యుగాలు. అక్కడ మనుష్యులు కూడా కొద్దిమందే ఉంటారు.
84 లక్షల జన్మలైతే ఉండవు. మనుష్యులు వివేకం కోల్పోతారు అందుకే తండ్రి వచ్చి
వివేకాన్ని ఇస్తారు. రచయిత అయిన తండ్రే, రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల
జ్ఞానాన్ని కూర్చొని ఇస్తారు. భారతవాసులకు అసలేమీ తెలియదు. వారు అందరినీ పూజిస్తూ
ఉంటారు, ముసల్మానులను, పారసీయులు మొదలైనవారిని, ఎవరొస్తే వారిని పూజిస్తూ ఉంటారు
ఎందుకంటే వారు తమ ధర్మాన్ని మరియు తమ ధర్మస్థాపకుడిని మర్చిపోయారు. మిగిలినవారందరికీ
తమ-తమ ధర్మాల గురించి తెలుసు, అందరికీ - ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపించబడింది మరియు
దానిని ఎవరు స్థాపించారు అన్నది తెలుసు. సత్య, త్రేతాయుగాల చరిత్ర-భౌగోళికాల గురించి
ఎవ్వరికీ తెలియదు. ఇది శివబాబా రూపము అని చిత్రాన్ని కూడా చూపిస్తారు. వారే
ఉన్నతోన్నతుడైన తండ్రి. కావున స్మృతి కూడా వారినే చేయాలి. ఇక్కడ అందరికన్నా ఎక్కువగా
శ్రీకృష్ణుడిని పూజిస్తారు ఎందుకంటే వారు భగవంతుని తర్వాతవారు కదా. ప్రేమించడం కూడా
వారినే ప్రేమిస్తారు, అలాగే గీతా భగవంతుడు అని కూడా వారినే భావించారు. వినిపించేవారు
కావాలి, అప్పుడే కదా వారి నుండి వారసత్వం లభించగలదు. తండ్రే వినిపిస్తారు, కొత్త
ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనము చేయించేవారు ఒక్క తండ్రి
తప్ప ఇంకెవ్వరూ అవ్వలేరు. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, విష్ణువు
ద్వారా పాలన అని కూడా రాస్తారు. అది ఇక్కడికి సంబంధించిన విషయమే, కానీ ఏమీ అర్థం
చేసుకోరు.
మీకు తెలుసు - అది నిరాకారీ సృష్టి. ఇది సాకార సృష్టి. సృష్టి అయితే ఇదే, ఇక్కడే
రామ రాజ్యం మరియు రావణ రాజ్యం ఉంటాయి. మహిమ అంతా ఇక్కడిదే. కేవలం సూక్ష్మవతనం యొక్క
సాక్షాత్కారం జరుగుతుంది. మూలవతనంలోనైతే ఆత్మలు ఉంటాయి, మళ్ళీ ఇక్కడకు వచ్చి పాత్రను
అభినయిస్తాయి. సూక్ష్మవతనములో ఏముంది అన్న చిత్రాన్ని తయారుచేసారు, దాని గురించి
తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ విధంగా సూక్షవతనవాసులైన ఫరిశ్తాలుగా
అవ్వాలి. ఫరిశ్తాలు రక్త-మాంసాలు లేకుండా ఉంటాయి. దధీచి ఋషి తమ ఎముకలను సైతం
ఇచ్చేసారని అంటారు కదా. శంకరుడి గురించి గాయనమైతే ఎక్కడా లేదు. బ్రహ్మా, విష్ణువుల
మందిరాలున్నాయి. శంకరుడి మందిరము లేదు. అతడిని వినాశనానికి చూపించారు. వాస్తవానికి
అలా కళ్ళు తెరవడంతో వినాశనం ఎవరూ చేయరు. దేవతలు హింస చేసే కర్మలను ఎలా చేస్తారు.
వారూ అలా చేయరు, అలాగే శివబాబా కూడా అటువంటి డైరెక్షన్ ను ఇవ్వరు. అలా చేస్తే
డైరెక్షన్ ఇచ్చేవారిపైకి కూడా వచ్చేస్తుంది కదా. అలా అన్నవారు కూడా చిక్కుకుపోతారు.
వారైతే శివ శంకరులు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - నన్నొక్కరినే
స్మృతి చేయండి. అంతేకానీ శివ శంకరులను స్మృతి చేయండి అనైతే అనరు. పతిత పావనుడు అని
ఒక్కరినే అంటారు. భగవంతుడు అర్థసహితముగా అర్థం చేయిస్తారు, దీని గురించి ఎవరికీ
తెలియదు కావున చిత్రాలను చూసి తికమకపడతారు. అర్థాన్ని అయితే తప్పకుండా తెలియజేయాల్సి
ఉంటుంది కదా. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. నేను
ఎలా ఉన్నానో, ఏమై ఉన్నానో, ఆ విధంగా కోట్లలో ఏ ఒక్కరో నన్ను గుర్తించగలరు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.