30-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు), మన్మతాన్ని వదిలి శ్రీమతముపై నడవండి, అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు’’

ప్రశ్న:-
ఏ పిల్లల యొక్క రక్షణను తండ్రి తప్పకుండా చేస్తారు?

జవాబు:-
ఏ పిల్లలైతే సత్యముగా ఉంటారో, వారి రక్షణ తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ రక్షణ జరగడం లేదంటే లోపల తప్పకుండా ఏదో ఒక అసత్యము ఉండి ఉంటుంది. చదువును మిస్ చేయడము, సంశయములోకి రావడము అనగా లోలోపల ఏదో ఒక అసత్యము ఉంది. వారిని మాయ గట్టిగా దెబ్బ వేసి కిందకు పడేస్తుంది.

ప్రశ్న:-
ఏ పిల్లల కొరకు మాయ అయస్కాంతము వంటిది?

జవాబు:-
ఎవరైతే మాయ యొక్క సౌందర్యము వైపుకు ఆకర్షితులవుతారో, వారి కొరకు మాయ అయస్కాంతము వంటిది. శ్రీమతముపై నడిచే పిల్లలు ఆకర్షితులవ్వరు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు అనైతే పిల్లలకు నిశ్చయము ఉంది. దీని గురించే ఆత్మ, పరమాత్మ ఎంతోకాలం వేరుగా ఉన్నారు... అన్న గాయనము ఉంది. మూలవతనములో వేరుగా ఉండరు. అక్కడైతే అందరూ కలిసే ఉంటారు. వేరుగా ఉన్నారు అంటున్నారంటే తప్పకుండా ఆత్మలు అక్కడి నుండి విడిపోతాయి, అక్కడి నుండి వచ్చి తమ-తమ పాత్రను అభినయిస్తారు. సతోప్రధానము నుండి దిగుతూ, దిగుతూ తమోప్రధానముగా అవుతారు. పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పిలుస్తారు. తండ్రి కూడా అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఈ సృష్టి చక్రమే 5000 సంవత్సరాలది. ఇంతకుముందు మీకు ఇది తెలిసేది కాదు. శివబాబా అర్థం చేయిస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక తనువు ద్వారానే అర్థం చేయిస్తారు. పై నుండి శబ్దమేమీ చేయరు కదా. శక్తి లేక ప్రేరణ మొదలైనవాటి విషయమేమీ లేదు. ఆత్మయైన మీరు శరీరములోకి వచ్చి మాట్లాడుతారు. అదే విధంగా, నేను కూడా శరీరము ద్వారా డైరెక్షన్లు ఇస్తాను అని తండ్రి అంటారు. ఆపై ఎవరు ఎంతగా వారు చెప్పినట్లు నడుస్తారో అంతగా తమ కళ్యాణమునే చేసుకుంటారు. శ్రీమతముపై నడిచినా, నడవకపోయినా, టీచర్ చెప్పింది విన్నా, వినకపోయినా తమ కొరకు తామే కళ్యాణమును లేక అకళ్యాణమును చేసుకుంటారు. చదువుకోకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు. శివబాబా ద్వారా నేర్చుకుని మళ్ళీ ఇతరులకు నేర్పించాలి అని కూడా అర్థం చేయిస్తారు. ఫాదర్ షోస్ సన్ (తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు) ఇందులో దైహిక తండ్రి యొక్క విషయము లేదు, వీరు ఆత్మిక తండ్రి. ఎంతగా మనము శ్రీమతముపై నడుస్తామో అంతగా వారసత్వాన్ని పొందుతాము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. పూర్తిగా నడిచేవారు ఉన్నత పదవిని పొందుతారు. అలా నడవనివారు ఉన్నత పదవిని పొందరు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. రావణ రాజ్యములో మీపై పాపాలు ఎన్నో ఉన్నాయి. వికారాలలోకి వెళ్ళడము ద్వారానే పాప ఆత్మగా అవుతారు. పుణ్య ఆత్మ మరియు పాప ఆత్మ తప్పకుండా ఉంటారు. పుణ్య ఆత్మల ఎదురుగా పాప ఆత్మలు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. దేవతలెవరైతే పుణ్య ఆత్మలో, వారే మళ్ళీ పునర్జన్మలలోకి వస్తూ-వస్తూ పాప ఆత్మలుగా అవుతారని మనుష్యులకు తెలియదు, వారు సదా పుణ్య ఆత్మలుగానే ఉంటారు అని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ సతోప్రధానము నుండి తమోప్రధానము వరకూ వస్తారు. ఎప్పుడైతే పూర్తిగా పాప ఆత్మలుగా అయిపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎప్పుడైతే పుణ్య ఆత్మలుగా ఉంటారో అప్పుడు స్మృతి చేయవలసిన అవసరము ఉండదు. ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేయించాలి, సేవ చేయాలి. తండ్రి అయితే వెళ్ళి అందరికీ వినిపించరు కదా. పిల్లలు సేవ చేయడానికి యోగ్యులుగా ఉంటే పిల్లలే వెళ్ళాలి. మనుష్యులైతే రోజురోజుకు అసురులుగా అవుతూ ఉంటారు. గుర్తించని కారణముగా అనవసరమైన మాటలు మాట్లాడడానికి కూడా సంకోచించరు. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని మనుష్యులు అంటారు. కానీ వారు దేహధారి అని, వారిని దేవత అని అంటారు అని మీరు అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు. ఇక్కడైతే అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మలకు వేరే తండ్రి ఎవరూ ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మా కూడా - నిరాకారుడైన తండ్రినే స్మృతి చేయాలి అని చెప్తారు. ఇతను సాకార తండ్రి. వాస్తవానికి ఎంతో అర్థం చేయించడం జరుగుతుంది, కొందరు పూర్తిగా అర్థం చేసుకోకుండా తప్పుడు మార్గములోకి వెళ్ళి అడవిలోకి చేరుకుంటారు. తండ్రి అయితే స్వర్గములోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తారు, అయినా కానీ అడవి వైపుకు వెళ్ళిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు, మిమ్మల్ని అడవి వైపుకు తీసుకువెళ్ళేది రావణుడు. మీరు మాయ చేతిలో ఓడిపోతారు, దారి మర్చిపోతారు, అప్పుడిక ఆ అడవిలోని ముళ్ళుగా అయిపోతారు. అటువంటివారు స్వర్గములోకి ఆలస్యముగా వస్తారు. ఇక్కడకు మీరు స్వర్గములోకి వెళ్ళే పురుషార్థము చేయడానికే వచ్చారు. త్రేతాను కూడా స్వర్గము అని అనరు. 25 శాతం తక్కువైపోతుంది కదా. మీరు ఇక్కడకు పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకే వచ్చారు. త్రేతాను కొత్త ప్రపంచము అని అనరు. ఫెయిల్ అయినవారు అక్కడకు వెళ్ళిపోతారు ఎందుకంటే వారు సరైన మార్గాన్ని పట్టుకోరు. కింద-మీద అవుతూ ఉంటారు. ఏ స్మృతి అయితే ఉండాలో, అది ఉండటం లేదు అని అనుభవం చేస్తారు. ఎవరైతే స్వర్గవాసులుగా అవుతారో వారిని మంచిగా పాస్ అయినవారు అని అంటారు. త్రేతా వారు ఫెయిల్ అయినవారిగా లెక్కింపబడతారు. మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. లేకపోతే మరి ఫెయిల్ అయినవారు అనే అంటారు. ఆ చదువులోనైతే మళ్ళీ ఇంకొకసారి చదువుతారు. ఇందులో మరో సంవత్సరము చదివే విషయమేదీ లేదు. జన్మ-జన్మాంతరాలూ, కల్ప-కల్పాంతరాలూ కల్పపూర్వము ఏదైతే చేసారో అదే పరీక్షను పాస్ అవుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మేము ఇక ముందుకు వెళ్ళలేము అని కొందరు భావిస్తారు. వృద్ధులుగా ఉన్నట్లయితే, వారిని చేయి పట్టుకుని నడిపిస్తేనే నడవగలరు లేకపోతే పడిపోతారు. కానీ భాగ్యములో లేకపోతే పుష్పాలుగా తయారుచేయడానికి ఎంతగా కృషి చేసినా అలా తయారవ్వరు. జిల్లేడు కూడా పుష్పమే. ఈ ముళ్ళు అయితే గుచ్చుకుంటాయి.

తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. నిన్న మీరు ఏ శివుడినైతే పూజించేవారో వారు ఈ రోజు మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రతి విషయములోనూ పురుషార్థము కొరకే ప్రేరణ ఇవ్వబడుతుంది. మాయ మంచి-మంచి పుష్పాలను కింద పడేస్తుందని గమనించడం జరిగింది, అది ఎముకలను విరిచేస్తుంది, ఇక వారిని ట్రెయిటర్లు (ద్రోహులు) అని అంటారు. ఎవరైతే ఒక రాజధానిని వదిలి మరొక రాజధానిలోకి వెళ్ళిపోతారో వారిని ద్రోహులు అని అంటారు. తండ్రి కూడా అంటారు, నాకు చెందినవారిగా అయి మళ్ళీ మాయకు చెందినవారిగా అయిపోతే వారిని కూడా ద్రోహులు అని అంటారు. వారి నడవడికే అలా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి మాయ నుండి విడిపించడానికి వచ్చారు. పిల్లలు అంటారు, మాయ చాలా శక్తివంతమైనది, తనవైపుకు ఎంతోమందిని ఆకర్షిస్తుంది. మాయ అయస్కాంతము వంటిది. ఈ సమయములో అది అయస్కాంత రూపాన్ని ధరిస్తుంది. ప్రపంచములో సౌందర్యము ఎంతగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఈ సినిమాలు మొదలైనవి ఉండేవి కావు. అవన్నీ 100 సంవత్సరాలలో వెలువడ్డాయి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. పిల్లలు ఈ డ్రామా యొక్క గుహ్యమైన రహస్యాలను బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి విషయమూ ఏక్యురేట్ గా రచింపబడి ఉంది. 100 సంవత్సరాలలో ఇది ఒక అపోజిషన్ కొరకు స్వర్గములా అయిపోయింది. కావున ఇప్పుడు స్వర్గము ఇంకా త్వరగా రానున్నది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. విజ్ఞానము కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎంతో సుఖాన్ని కూడా ఇస్తుంది కదా. ఆ సుఖము స్థిరముగా ఉండేందుకు ఈ పాత ప్రపంచపు వినాశనము కూడా జరగాలి. సత్యయుగ సుఖాలు భారత్ యొక్క భాగ్యములోనే ఉన్నాయి. వారంతా తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో అప్పుడే వస్తారు. భారతవాసులు ఎప్పుడైతే పడిపోతారో అప్పుడు ఇతర ధర్మాలవారు నంబరువారుగా వస్తారు. భారత్ పడిపోతూ, పడిపోతూ పూర్తిగా నేలపైకి వచ్చేస్తుంది, మళ్ళీ పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా ఎక్కుతారు, మళ్ళీ పడిపోతారు. ఎంతగా పడిపోతారంటే ఇక అడగకండి. బాబా మనల్ని చదివిస్తున్నారు అని కొందరు అంగీకరించనే అంగీకరించరు. మంచి-మంచి సేవాధారులనెవరినైతే తండ్రి మహిమ చేస్తారో, వారు కూడా మాయ పంజాలోకి వచ్చేస్తారు. కుస్తీ జరుగుతుంది కదా. మాయ కూడా అలాగే పోరాడుతుంది. పూర్తిగా కింద పడేస్తుంది. మున్ముందు పిల్లలైన మీకు తెలుస్తూ ఉంటుంది. మాయ పూర్తిగా పడుకునేలా చేసేస్తుంది. అయినా కానీ తండ్రి అంటారు, ఒక్కసారి జ్ఞానము వింటే స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కానీ పదవినైతే పొందలేరు కదా. కల్పక్రితము ఎవరు ఏ పురుషార్థము చేశారో లేక పురుషార్థము చేస్తూ-చేస్తూ పడిపోయారో, అలాగే ఇప్పుడు కూడా పడిపోతూ మరియు ఎక్కుతూ ఉంటారు. ఓటమి మరియు గెలుపు ఉంటాయి కదా. పిల్లల కొరకు మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. పిల్లలకు ఈ తరగని ఖజానా లభిస్తుంది. వారు ఎన్ని లక్షల్లో దివాలా తీస్తారు. కొందరు లక్షాధికారులుగా అవుతారు, అది కూడా ఒక్క జన్మలో. మరుసటి జన్మలో అంతటి ధనమైతే ఉండదు కదా. కర్మభోగము కూడా ఎంతో ఉంది. అక్కడ స్వర్గములోనైతే కర్మభోగము యొక్క విషయము ఉండదు. ఈ సమయములో మీరు 21 జన్మల కొరకు ఎంతగా జమ చేసుకుంటారు. ఎవరైతే పూర్తి పురుషార్థము చేస్తారో, వారు పూర్తి స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. మేము తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని పొందుతాము అని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ కిందకు పడిపోతాము కదా అని ఆలోచించకూడదు. వీరు అందరికన్నా ఎక్కువగా పడిపోయారు, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కవలసిందే. ఆటోమేటిక్ గా పురుషార్థము కూడా అవుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు - మాయ ఎంత ప్రబలమైనదో చూడండి. మనుష్యులలో ఎంత అజ్ఞానము నిండిపోయింది, అజ్ఞానము కారణముగా తండ్రిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. భారత్ ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉండేది. మనము ఆ విధంగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా అవుతున్నాము అని మీరు భావిస్తారు. ఈ దేవతలకు ఎంతటి మహిమ ఉంది, కానీ అది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అనంతమైన తండ్రి అయిన జ్ఞానసాగరుడు వచ్చి మనల్ని చదివిస్తారని మీకే తెలుసు, అయినా కానీ మాయ అనేకులను సంశయములోకి తీసుకువచ్చేస్తుంది. అసత్యాన్ని, కపటాన్ని వదలరు. అందుకే తండ్రి అంటారు - మీ సత్యాతి-సత్యమైన చార్టును వ్రాయండి. కానీ దేహాభిమానము కారణముగా సత్యము చెప్పరు. కావున అది కూడా వికర్మగా అయిపోతుంది. సత్యము చెప్పాలి కదా. లేకపోతే ఎంతో శిక్ష అనుభవించవలసి ఉంటుంది. గర్భ జైలులో కూడా ఎంతో శిక్ష లభిస్తుంది. పశ్చాత్తాపపడి క్షమించండి అని కోరుకుంటారు, మేము మళ్ళీ ఇలాంటి పనులు చేయము అని అంటారు. ఎవరికైనా దెబ్బలు పడినప్పుడు కూడా, వారు ఈ విధంగా క్షమించమని కోరుకుంటారు. అలాగే శిక్ష పడినప్పుడు కూడా ఈ విధంగా వేడుకుంటారు. మాయ రాజ్యము ఎప్పటినుండి ప్రారంభమైంది అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. వీరు అంతగా మధురముగా, మృదువుగా అవ్వడం లేదు అని తండ్రి గమనిస్తారు. తండ్రి ఎంత మృదువుగా, చిన్న పిల్లవాడిలా నడుచుకుంటారు, ఎందుకంటే డ్రామానుసారముగా నడుచుకుంటూ ఉంటారు. ఏదైతే జరిగిందో అదంతా డ్రామాలో రచించబడి ఉంది అని అంటారు. మున్ముందు మళ్ళీ ఇలా జరగకూడదు అని అర్థం చేయిస్తారు కూడా. ఇక్కడ బాప్ దాదా, ఇరువురూ కలిసి ఉన్నారు కదా. దాదా డైరెక్షన్ దాదాది, ఈశ్వరుని డైరెక్షన్ ఈశ్వరునిది. ఈ డైరెక్షన్లు ఎవరు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇతను కూడా తండ్రే కదా. తండ్రి చెప్పిందైతే వినాలి కదా. బాబా అయితే పెద్ద తండ్రి కదా, అందుకే బాబా అంటారు, శివబాబాయే అర్థం చేయిస్తున్నారు అని భావించండి. అలా భావించకపోతే పదవిని కూడా పొందలేరు. డ్రామా ప్లాన్ అనుసారముగా తండ్రి కూడా ఉన్నారు, దాదా కూడా ఉన్నారు. తండ్రి శ్రీమతము లభిస్తుంది. మాయ ఎటువంటిదంటే అది మహావీరులు, శక్తివంతుల చేత కూడా ఏదో ఒక తప్పుడు పనిని చేయించేస్తుంది. వారు తండ్రి మతముపై నడవడం లేదు అని భావించడం జరుగుతుంది. నేను నా ఆసురీ మతముపై నడుస్తున్నాను అని వారు స్వయం కూడా ఫీల్ అవుతారు. శ్రీమతాన్ని ఇచ్చేవారు వచ్చి ఉపస్థితులై ఉన్నారు. వారిది ఈశ్వరీయ మతము. తండ్రి స్వయంగా అంటారు, ఇతని ద్వారా అటువంటి డైరెక్షన్ ఏదైనా లభించినా కానీ దానిని సరిదిద్దేందుకు నేను కూర్చుని ఉన్నాను. ఎంతైనా, నేను ఈ రథాన్ని తీసుకున్నాను కదా. నేను ఇతని రథాన్ని తీసుకున్నాను కావుననే ఇతను నిందలు పడ్డారు. లేదంటే అసలు ఎప్పుడూ వీరు నిందలు పడలేదు. నా కారణముగా ఎన్ని నిందలు పడతారు. కావున ఇతడిని కూడా సంభాళించవలసి ఉంటుంది. తండ్రి తప్పకుండా రక్షిస్తారు. ఏ విధంగా పిల్లల రక్షణను తండ్రి చేస్తారు కదా. ఎంతగా సత్యతపై నడుస్తారో అంతగా రక్షణ జరుగుతుంది. అసత్యముగా ఉండేవారి రక్షణ జరగదు. వారి కొరకైతే శిక్ష ఫిక్స్ అయిపోతుంది, అందుకే తండ్రి అర్థం చేయిస్తారు - మాయ అయితే పూర్తిగా ముక్కు పట్టుకుని అంతం చేసేస్తుంది. మాయ తినేస్తుందని, కావుననే చదువును వదిలేస్తారని పిల్లలు స్వయం భావిస్తారు. తండ్రి అంటారు, చదువును తప్పకుండా చదవండి. అచ్ఛా, ఎక్కడైనా, ఎవరిదైనా దోషము ఉంటే, ఇందులో ఎవరు ఎలా చేస్తే, వారు అలా భవిష్యత్తులో పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము మారుతోంది. మాయ ఎటువంటి దెబ్బ వేసి కింద పడేస్తుందంటే, ఇక ఆ సంతోషము ఉండదు. అప్పుడు - బాబా, ఏమవుతుందో తెలియడం లేదు అని ఆర్తనాదాలు చేస్తారు. ఎక్కడా ఎవరూ దెబ్బ వేయకుండా యుద్ధ మైదానములో ఎంతో అప్రమత్తముగా ఉంటారు. అయినా కానీ ఎక్కువ శక్తివంతులుగా ఉంటే, వారు ఇతరులను పడేస్తారు, మళ్ళీ మరుసటి రోజు అది కొనసాగుతుంది. ఈ మాయ యుద్ధమైతే అంతిమము వరకూ కొనసాగుతూ ఉంటుంది. కిందికి-పైకి అవుతూ ఉంటారు. కొందరు పిల్లలు సత్యము చెప్పరు. బాబా ఏమంటారో అని, తమ గౌరవము విషయములో ఎంతో భయపడతారు. ఎప్పటివరకైతే సత్యము తెలియజేయరో అప్పటివరకూ ముందుకు వెళ్ళలేరు. అది లోలోపల తింటూ ఉంటుంది, ఇక అది పెరిగిపోతుంది. ఎప్పుడూ తమకు తాముగా సత్యము వినిపించరు. ఎక్కడైనా ఇద్దరు ఉంటే, అతను బాబాకు వినిపిస్తే మరి నేను కూడా వినిపిస్తాను అని భావిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. వారి భాగ్యములో అంతటి ఉన్నత పదవి లేదు, కావుననే సర్జన్ నుండి దాచిపెడుతున్నారు అని భావించడం జరుగుతుంది. అలా దాచిపెట్టడం వలన రోగము పోదు. ఎంతగా దాచిపెడుతూ ఉంటారో అంతగా పడిపోతూనే ఉంటారు. భూతాలైతే అందరిలోనూ ఉన్నాయి కదా. ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ తయారవ్వదో అప్పటివరకూ అశుద్ధ దృష్టి కూడా వదలదు. అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము. కొందరు పడిపోతారు. శివబాబాను తప్ప ఇంకే దేహధారినీ స్మృతి చేయకూడదు అని బాబా అయితే పదే-పదే అర్థం చేయిస్తారు. కొందరు ఎంత పక్కాగా ఉన్నారంటే, వారికి ఎప్పుడూ ఇంకెవ్వరి స్మృతీ కూడా రాదు. పతివ్రతా స్త్రీ ఉంటారు కదా, ఆమెకు ఎప్పుడూ చెడు బుద్ధి ఉండదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరుడు, అనంతమైన తండ్రి, ఇందులో ఎప్పుడూ సంశయము కలగనివ్వకూడదు, అసత్యాన్ని, కపటాన్ని వదిలి మీ సత్యాతి-సత్యమైన చార్టును పెట్టుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వకూడదు.

2. డ్రామాను బుద్ధిలో ఉంచుకుని తండ్రి సమానముగా చాలా-చాలా మధురముగా, మృదువుగా (నమ్రచిత్తులుగా) అయి ఉండాలి. తమ అహంకారాన్ని చూపించకూడదు. తమ మతాన్ని వదిలి ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠ మతముపై నడవాలి.

వరదానము:-

ఒక్క తండ్రి ప్రేమలో లవలీనులై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్త భవ

బాప్ దాదా పిల్లలను తమ స్నేహము మరియు సహయోగము అనే ఒడిలో కూర్చోబెట్టుకుని గమ్యము వైపుకు తీసుకువెళ్తున్నారు. ఈ మార్గము కష్టమైనది కాదు కానీ ఎప్పుడైతే హైవేకు బదులుగా సందులలోకి వెళ్ళిపోతారో లేక గమ్యము దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారో, అప్పుడు తిరిగి వచ్చేందుకు కష్టపడాల్సి వస్తుంది. శ్రమ నుండి రక్షించబడేందుకు సాధనము - ఒక్కరి ప్రేమలో ఉండండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ప్రతి కార్యాన్ని చేసినట్లయితే ఇంకేమీ కనిపించదు. సర్వ ఆకర్షణల నుండి ముక్తులైపోతారు.

స్లోగన్:-

మీ భాగ్యము యొక్క అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి.