31-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, లోలోపల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే నిద్రాజీతులుగా అయిపోతారు, ఆవలింతలు మొదలైనవి రావు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు తండ్రిపై ఎందుకు బలిహారమయ్యారు? బలిహారమవ్వడమంటే అర్థమేమిటి?

జవాబు:-
బలిహారమవ్వడం అనగా తండ్రి స్మృతిలో ఇమిడిపోవడం. ఎప్పుడైతే స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడు ఆత్మా రూపీ బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఆత్మా రూపే బ్యాటరీ నిరాకారుడైన తండ్రితో జోడించబడినప్పుడు బ్యాటరీ చార్జ్ అవుతుంది, వికర్మలు వినాశనమవుతాయి, సంపాదన జమ అవుతుంది.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ మీరు శరీరముతోపాటు కూర్చున్నారు. మృత్యులోకములో ఇది అంతిమ శరీరమని మీకు తెలుసు. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తండ్రితోపాటు శాంతిధామములో కలిసి ఉంటారు. అక్కడ ఈ శరీరము ఉండదు. మళ్ళీ స్వర్గములోకి నంబరువారు పురుషార్థానుసారముగా వస్తారు, అందరూ ఒకేసారి కలిసి రారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఏ విధముగా తండ్రి శాంతి, సుఖము యొక్క సాగరుడో అలాగే పిల్లలను కూడా శాంతి, సుఖము యొక్క సాగరులుగా తయారుచేస్తున్నారు. ఆ తర్వాత వెళ్ళి శాంతిధామములో విరాజమానమవ్వాలి. కావున తండ్రిని, ఇంటిని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఇక్కడ మీరు ఎంతెంతగా ఈ అవస్థలో కూర్చుంటారో, అంతంతగా మీ జన్మజన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి, దీనినే యోగాగ్ని అని అంటారు. సన్యాసులేమీ సర్వశక్తివంతునితో యోగాన్ని జోడించరు. వారు ఆ నివాస స్థానమైన బ్రహ్మముతో యోగాన్ని జోడిస్తారు. వారు తత్వయోగులు, వారు బ్రహ్మము లేక తత్వముతో యోగాన్ని జోడిస్తారు. ఇక్కడ జీవాత్మల ఆట జరుగుతుంది, అక్కడ మధురమైన ఇంటిలో కేవలం ఆత్మలే ఉంటాయి. ఆ మధురమైన ఇంటికి వెళ్ళేందుకు మొత్తం ప్రపంచమంతా పురుషార్థం చేస్తుంది. సన్యాసులు కూడా, మేము బ్రహ్మములో లీనమవ్వాలి అని అంటారు, మేము బ్రహ్మములోకి వెళ్ళి నివసిస్తాము అని అనరు. ఈ విషయాలను పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గములో ఎన్ని వ్యతిరేకమైన విషయాలు వింటూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి కేవలం రెండు విషయాలనే అర్థం చేయిస్తారు. ఏ విధంగా మంత్రాన్ని జపిస్తారు కదా. కొందరు గురువును తలచుకుంటారు, కొందరు ఇంకెవరినో తలచుకుంటారు. విద్యార్థులు టీచరును తలచుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు కేవలం తండ్రి మరియు ఇల్లు మాత్రమే గుర్తుంది. తండ్రి ద్వారా మీరు శాంతిధామము మరియు సుఖధామము యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. అదే మీ హృదయములో గుర్తుంటుంది. నోటితో ఏమీ అనవలసిన అవసరం లేదు. శాంతిధామము తర్వాత సుఖధామము అని బుద్ధి ద్వారా మీకు తెలుసు. మనం మొదట ముక్తిలోకి వెళ్తాము, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తాము. ముక్తి-జీవన్ముక్తుల దాత ఒక్క తండ్రే. సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని తండ్రి పిల్లలకు పదే, పదే అర్థం చేయిస్తారు. జన్మజన్మాంతరాల పాపాల భారము శిరస్సుపై ఉంది. ఈ జన్మలో చేసిన పాపాలు మొదలైనవాటి స్మృతి అయితే ఉంటుంది. సత్యయుగములో ఈ విషయాలేవీ ఉండవు. జన్మజన్మాంతరాల పాపాల భారము ఉందని ఇక్కడ పిల్లలకు తెలుసు. మొట్టమొదటిది కామ వికారపు వికర్మ, దానిని జన్మజన్మాంతరాలు చేస్తూ