01-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మలైన మీ స్వధర్మము శాంతి, మీ దేశము శాంతిధామము, ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు, అందుకే మీరు శాంతిని యాచించలేరు’’

ప్రశ్న:-
మీ యోగబలము ఏ అద్భుతము చేస్తుంది?

జవాబు:-
యోగబలముతో మీరు మొత్తము ప్రపంచమంతటినీ పవిత్రముగా తయారుచేస్తారు, ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు యోగబలముతో ఈ పర్వతమంతటినీ ఎత్తివేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు. పంచ తత్వాలు సతోప్రధానముగా అవుతాయి, మంచి ఫలాలను ఇస్తాయి. సతోప్రధాన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్దపెద్దవిగా, రుచికరముగా ఉంటాయి.

ఓంశాంతి
‘ఓం శాంతి’ అని అన్నప్పుడు చాలా సంతోషము కలగాలి ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము, దాని స్వధర్మమే శాంతి. దీని గురించి సన్యాసులు కూడా అంటారు - శాంతి అనేది మీ మెడలో హారములా పడి ఉంది. శాంతిని బయట ఎక్కడ వెతుకుతారు. ఆత్మ స్వతహాగా శాంతి స్వరూపము. ఈ శరీరములోకి పాత్రను అభినయించడానికి రావలసి వస్తుంది. ఆత్మ సదా శాంతిగా ఉన్నట్లయితే మరి కర్మలు ఎలా చేస్తుంది? కర్మలైతే చేయవలసిందే. అయితే, శాంతిధామములో ఆత్మలు శాంతిగా ఉంటాయి. అక్కడ శరీరము ఉండదు. నేను ఆత్మను, శాంతిధామ నివాసిని అని సన్యాసులు మొదలైనవారెవ్వరూ భావించరు. శాంతిధామము మన దేశమని, తర్వాత మనము సుఖధామములోకి వచ్చి పాత్రను అభినయిస్తామని, ఆ తర్వాత దుఃఖధామములో రావణ రాజ్యము ఉంటుందని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. ఇది 84 జన్మల కథ. నీకు నీ జన్మల గురించి తెలియదు అని అర్జునుడి కోసం భగవానువాచ ఉంది కదా. కేవలం అతనొక్కరికే ఎందుకు చెప్పారు? ఎందుకంటే అతనొక్కరిదే గ్యారంటీ ఉంది. ఈ రాధ-కృష్ణులది గ్యారంటీ ఉంది కదా, అందుకే వీరికే చెప్పారు. ఈ పిల్లలంతా ఎవరైతే ఉన్నారో, అందరూ ఏమీ 84 జన్మలు తీసుకోరు అని తండ్రికి కూడా తెలుసు, అలాగే పిల్లలకు కూడా తెలుసు. కొందరు మధ్యలో వస్తారు, కొందరు అంతిమములో వస్తారు. ఇతని పాత్ర మాత్రము నిశ్చితమైనది. ఇతడినే హే బచ్చే అని అంటారు, కావున ఇతను అర్జునుడు అయినట్లు కదా. తండ్రి ఈ రథములో కూర్చున్నారు కదా. మనము జన్మ ఎలా తీసుకుంటాము అనేది పిల్లలు స్వయం కూడా అర్థం చేసుకోగలరు. సేవయే చేయకపోతే ఇక సత్యయుగ కొత్త ప్రపంచములోకి మొట్టమొదట ఎలా రాగలరు? వారి భాగ్యములో ఏముంటుంది. తర్వాతర్వాత ఎవరైతే జన్మ తీసుకుంటారో, వారికైతే ఇది పాత ఇంటిలా అవుతూ ఉంటుంది కదా. ఎవరి విషయములోనైతే మీరు కూడా నిశ్చితము అని అనుకుంటారో, నేను వారి కోసమే చెప్తున్నాను. మమ్మా, బాబా 84 జన్మలు తీసుకుంటారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. కుమారకా ఉన్నారు, జనక్ ఉన్నారు, ఇటువంటి మహారథులు ఎవరైతే ఉన్నారో, వారు 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే సేవ చేయరో వారు తప్పకుండా కొన్ని జన్మల తర్వాత వస్తారు. మేము అయితే ఫెయిల్ అయిపోతాము, చివరిలో అంతిమములోనే వస్తాము అని వారు కూడా అర్థం చేసుకుంటారు. స్కూల్ లో పరుగు పందెములో లక్ష్యము వరకూ చేరుకుని మళ్ళీ తిరిగి వస్తారు కదా. అందరూ ఒకేలా ఉండలేరు. రేస్ లో ఒక్క పావు అంగుళము తేడా వచ్చినా, రెండవ నంబరులోకి వచ్చేస్తారు. ఇది కూడా అశ్వ రేస్ వంటిదే. అశ్వము అని గుర్రాన్ని అంటారు. అలాగే రథాన్ని కూడా గుర్రము అని అంటారు. ఇకపోతే దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని రచించారని, ఆ యజ్ఞములో గుర్రాన్ని ఆహుతి చేశారని ఏదైతే చూపిస్తారో, వాస్తవానికి ఆ విషయాలేవీ లేవు. దక్ష ప్రజాపిత కూడా లేరు, అలాగే అతను యజ్ఞాన్ని ఏమీ రచించలేదు. పుస్తకాలలో భక్తి మార్గానికి చెందినవి ఎన్ని కట్టుకథలు ఉన్నాయి. వాటి పేరే కథలు. ఎన్నో కథలు వింటూ ఉంటారు. మీరైతే ఇక్కడ చదువుకుంటున్నారు. చదువును కథ అని అనరు. స్కూల్లో చదువుకుంటారు, మాకు ఈ చదువు ద్వారా ఈ ఉద్యోగము లభిస్తుంది అని ఒక లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. ఏదో ఒకటి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఇదే శ్రమతో కూడుకున్నది. తండ్రిని స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశనమవుతాయి. ప్రత్యేకముగా స్మృతి చేయవలసి ఉంటుంది. నేనైతే శివబాబా బిడ్డనే కదా, ఇక స్మృతి చేయడానికి ఏముంది అన్నట్లు కాదు. అలా కాదు. స్వయాన్ని విద్యార్థిగా భావిస్తూ స్మృతి చేయాలి. ఆత్మలైన మనల్ని శివబాబా చదివిస్తున్నారు, ఇది కూడా మర్చిపోతారు. టీచర్ అయిన శివబాబా ఒక్కరే సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తారు, ఇది కూడా గుర్తు ఉండదు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - ఎంత సమయము తండ్రి స్మృతి నిలుస్తుంది? ఎక్కువ సమయమైతే బాహ్యముఖతలోనే పోతుంది. ఈ స్మృతియే ముఖ్యమైనది. ఈ భారత్ యొక్క యోగానికి చాలా మహిమ ఉంది. కానీ యోగాన్ని ఎవరు నేర్పిస్తారు - ఇది ఎవరికీ తెలియదు. గీతలో శ్రీకృష్ణుడి పేరును వేసేసారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని స్మృతి చేయడము ద్వారానైతే ఒక్క పాపము కూడా కట్ అవ్వదు కాదు ఎందుకంటే అతను ఒక శరీరధారి మాత్రమే. శరీరము పంచ తత్వాలతో నిర్మితమైనది. అతడిని స్మృతి చేయడమంటే మట్టిని స్మృతి చేయడము వంటిది లేక పంచ తత్వాలను స్మృతి చేయడము వంటిది. శివబాబా అయితే అశరీరి కావున - అశరీరిగా అవ్వండి, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తారు.

ఓ పతిత-పావనా అని అంటారు కూడా. మరి వారు ఒక్కరే అయినట్లు కదా. గీతా భగవానుడు ఎవరు అని యుక్తిగా అడగాలి. రచయిత అయిన భగవంతుడు అయితే ఒక్కరే ఉంటారు. ఒకవేళ మనుష్యులు తమను తాము భగవంతునిగా చెప్పుకున్నా కూడా, మీరందరూ నా పిల్లలూ అని ఎప్పుడూ అనరు. వారు తతత్వం అని అంటారు లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. నేను కూడా భగవంతుడినే, నీవు కూడా భగవంతుడివే, ఎక్కడ చూసినా నీవే నీవు, రాళ్ళల్లో కూడా నీవే... అని అనేస్తారు. అంతేకానీ మీరు నా పిల్లలు అని అనలేరు. ఓ నా ప్రియమైన ఆత్మిక పిల్లలూ, అని తండ్రియే అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. ఒకవేళ ఎవరైనా ముసల్మానులను ‘నా ప్రియమైన పిల్లలూ’ అని అంటే చెంపదెబ్బ కొడతారు. ఈ విధంగా ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే అనగలుగుతారు. ఇంకెవ్వరూ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వలేరు. 84 జన్మల మెట్ల యొక్క రహస్యము గురించి నిరాకారుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వారి యథార్థమైన పేరు శివ. వారికి మనుష్యులు ఎన్నో పేర్లు పెట్టారు. అనేక భాషలు ఉన్నాయి కావున తమ-తమ భాషలలో పేర్లు పెడుతూ ఉంటారు. బొంబాయిలో బబుల్ నాథ్ అని అంటారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. వారు ముళ్ళను పుష్పాలుగా తయారుచేసేవారు అని మీరు అర్థం చేసుకున్నారు. భారత్ లో శివబాబాకు కొన్ని వేల పేర్లు ఉంటాయి, వాటి అర్థమేమీ తెలియదు. తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు. అందులోనూ మాతలను బాబా ఎక్కువ ముందు ఉంచుతారు. ఈ రోజుల్లో స్త్రీలను కూడా గౌరవిస్తున్నారు, ఎందుకంటే తండ్రి వచ్చారు కదా. తండ్రి మాతల మహిమను ఉన్నతముగా చేస్తారు. మీరు శివశక్తి సైన్యము, మీకే శివబాబా గురించి తెలుసు. సత్యమైతే ఒక్కటే. సత్యము యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ ఎప్పుడూ మునగదు అని గానం చేయబడుతుంది కూడా. కావున మీరే ఆ సత్యమైనవారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మిగిలిన అసత్యమైన నావలన్నీ అంతమైపోతాయి. మీరు కూడా ఇక్కడ రాజ్యమేమీ చేయరు. మీరు మరుసటి జన్మలోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. ఇవి చాలా గుప్తమైన విషయాలు, ఇవి మీకు మాత్రమే తెలుసు. ఈ బాబా దొరికి ఉండకపోతే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసుకున్నాము.

ఇతను యుధిష్టరుడు, ఇతను యుద్ధ మైదానములో పిల్లలను నిలబెడతారు. ఇది అహింసాయుతమైనది. మనుష్యులు కొట్టుకోవడాన్నే హింస అని అనుకుంటారు. తండ్రి అంటారు, మొట్టమొదటి ముఖ్యమైన హింస కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. అందుకే కామము మహాశత్రువు అని అన్నారు, దీనిపైనే విజయము పొందాలి. ముఖ్యమైన విషయమే కామ వికారానికి సంబంధించినది. పతితులు అనగా వికారులు. పతితముగా అయ్యేవారినే వికారులు అని అంటారు, వారు వికారులలోకి వెళ్తారు. క్రోధము చేసేవారిని, వీరు వికారులు అని అనరు. క్రోధము కలవారిని క్రోధి అని, లోభము కలవారిని లోభి అని అంటారు. దేవతలను నిర్వికారులు అని అంటారు. దేవతలు నిర్లోభులు, నిర్మోహులు మరియు నిర్వికారులు. వారు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారు అని మిమ్మల్ని అడుగుతారు. మరి దేవతలను నిర్వికారులుగా భావిస్తారు కదా. ఆ ప్రపంచమే నిర్వికారీ ప్రపంచము. ద్వాపర, కలియుగాలు వికారీ ప్రపంచము. స్వయాన్ని వికారులు అని, దేవతలను నిర్వికారులు అని అంటారు కదా. ఒకప్పుడు మనము కూడా వికారులమేనని మీకు తెలుసు. ఇప్పుడు వీరిలా నిర్వికారులుగా తయారవుతున్నాము. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా స్మృతి బలముతో ఈ పదవిని పొందారు, మళ్ళీ పొందుతున్నారు. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారము, మనము కల్పపూర్వము ఇటువంటి రాజ్యాన్ని పొందాము, దానిని పోగొట్టుకున్నాము, మళ్ళీ మనము పొందుతున్నాము. ఈ చింతనయే బుద్ధిలో ఉన్నా సంతోషము ఉంటుంది. కానీ మాయ ఈ స్మృతిని మరపింపజేస్తుంది. మీరు స్థిరమైన స్మృతిలో ఉండలేరని బాబాకు తెలుసు. పిల్లలైన మీరు అచలముగా ఉంటూ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే త్వరగా కర్మాతీత అవస్థ తయారవుతుంది మరియు ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది. కానీ అలా జరగదు. మొదటి నంబరులోనైతే ఇతను వెళ్తారు. ఆ తర్వాత శివబాబా ఊరేగింపు. వివాహములో మాతలు మట్టిపాత్రలో జ్యోతిని వెలిగించి తీసుకువెళ్తారు కదా, ఇది దానికే గుర్తు. ప్రియుడైన శివబాబా అయితే సదా వెలుగుతూ ఉండే జ్యోతి. వారు మిగిలిన మనందరి జ్యోతులను వెలిగించారు. ఇక్కడి ఈ విషయాన్ని వారు భక్తి మార్గములోకి తీసుకువెళ్ళారు. మీరు యోగబలముతో మీ జ్యోతిని వెలిగించుకుంటారు. యోగముతో మీరు పవిత్రముగా అవుతారు. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది, చదువును సంపాదనకు ఆధారము అని అంటారు కదా. యోగబలముతో మీరు విశేషముగా భారత్ ను మరియు మొత్తం విశ్వమంతటినీ పవిత్రముగా తయారుచేస్తారు. ఇందులో కన్యలు చాలా చక్కటి సహాయకులుగా అవ్వగలరు. సేవ చేసి ఉన్నత పదవిని పొందాలి. జీవితాన్ని వజ్రతుల్యముగా తయారుచేసుకోవాలి, తక్కువగా కాదు. మాత, పితలను అనుసరించండి అని గానం చేస్తూ ఉంటారు. మాత, పితలను మరియు అనన్యులైన సోదరీ, సోదరులను చూడండి.

మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు - లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి అని మీరు ప్రదర్శనీలో కూడా అర్థం చేయించవచ్చు. వీరిరువురిలో పెద్ద ఎవరు? తప్పకుండా అనంతమైన తండ్రియే పెద్దవారు కదా. వారసత్వము వారి నుండే లభించాలి. ఇప్పుడు వారు వారసత్వాన్ని ఇస్తున్నారు, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. భగవానువాచ - మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, అప్పుడు మీరు మరుసటి జన్మలో విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి కల్పకల్పమూ భారత్ లోకి వచ్చి భారత్ ను చాలా షావుకారుగా తయారుచేస్తారు. మీరు ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది? ఇక్కడైతే మీరు 21 జన్మల కొరకు వజ్రము వలె తయారవుతారు. ఆ చదువుకూ, ఈ చదువుకూ రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ తండ్రి, టీచర్ మరియు గురువు ఒక్కరే. కావున తండ్రి యొక్క వారసత్వాన్ని, టీచర్ యొక్క వారసత్వాన్ని మరియు గురువు యొక్క వారసత్వాన్ని, అన్నింటినీ ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహ సహితముగా అందరినీ మర్చిపోవాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించి ప్రపంచమంతా మరణించినట్లే. తండ్రికి దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయిన తర్వాత ఇంకెవరిని స్మృతి చేస్తారు. ఇతరులను చూస్తున్నా చూడనట్లుగా ఉంటారు. పాత్రను కూడా అభినయిస్తారు కానీ - ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడకు వచ్చి పాత్రను అభినయించాలి అని బుద్ధిలో ఉంది. ఈ విషయము బుద్ధిలో ఉన్నా ఎంతో సంతోషము ఉంటుంది. పిల్లలు దేహ భానాన్ని వదిలేయాలి. ఈ పాత వస్తువును ఇక్కడ వదిలేసి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నాటకము పూర్తి అవుతుంది. పాత సృష్టికి నిప్పు అంటుకుంటుంది. అంధుల పిల్లలు అంధులు, అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. దీనికి వారు నిద్రపోతున్న మనిషిని చూపించారేమో అని అనుకుంటారు, కానీ ఇది అజ్ఞాన నిద్రకు చిహ్నము, ఆ నిద్ర నుండి మీరు ఇప్పుడు మేలుకొలుపుతారు. జ్ఞానము అనగా దినము, సత్యయుగము. అజ్ఞానము అనగా రాత్రి, కలియుగము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కన్య వివాహము చేసుకుంటే తన తల్లితండ్రులు, అత్తమామలు మొదలైనవారంతా కూడా గుర్తుకొస్తారు. వారిని మర్చిపోవలసి ఉంటుంది. మేము యుగళులు అయ్యుండి కూడా ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని సన్యాసులకు చూపించే యుగళులు కూడా ఉన్నారు. జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉంది. పవిత్రముగా ఉండాలి అన్నది తండ్రి ఆజ్ఞ. చూడండి, రమేష్ మరియు ఉష ఉన్నారు, వారు ఎప్పుడూ పతితముగా అవ్వలేదు. ఒకవేళ మేము పతితముగా అయ్యామంటే 21 జన్మల రాజ్యము కోల్పోతాము, దివాలా తీస్తాము అన్న భయము ఉంది. ఇందులో కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. గాంధర్వ వివాహము అన్న పేరు అయితే ఉంది కదా. పవిత్రముగా ఉన్నట్లయితే చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది అని మీకు తెలుసు. ఒక్క జన్మ కొరకు పవిత్రముగా అవ్వాలి. యోగబలముతో కర్మేంద్రియాలపై కూడా కంట్రోల్ వచ్చేస్తుంది. యోగబలముతో మీరు మొత్తము ప్రపంచమంతటినీ పవిత్రముగా తయారుచేస్తారు. ఎంత తక్కువమంది పిల్లలైన మీరు యోగబలముతో ఈ పర్వతమంతటినీ ఎత్తివేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. వారు గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. తండ్రియే వచ్చి మొత్తం ప్రపంచమంతటినీ బంగారు యుగముగా తయారుచేస్తారు. అంతేకానీ హిమాలయ పర్వతము బంగారముగా మారిపోతుంది అని కాదు. అక్కడ బంగారము యొక్క గనులు నిండుగా ఉంటాయి. పంచ తత్వాలు సతోప్రధానముగా ఉంటాయి, ఫలాలు కూడా బాగా ఇస్తాయి. సతోప్రధానమైన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్దపెద్దవిగా, రుచికరముగా ఉంటాయి. దాని పేరే స్వర్గము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము ద్వారానే వికారాలు వదిలిపోతాయి. దేహాభిమానము రావడం వలన వికారాల చేష్ట జరుగుతుంది. యోగీ ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. జ్ఞాన బలము ఉన్నా యోగీగా లేకపోతే కింద పడిపోతారు. పురుషార్థము గొప్పదా లేక ప్రారబ్ధము గొప్పదా? అని అడిగినట్లయితే పురుషార్థమే గొప్పది అని అంటారు. అదే విధంగా ఈ రెండింటిలో యోగమే గొప్పది అని అంటారు. యోగముతోనే పతితము నుండి పావనముగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరైతే - మేము అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అని అంటారు. మనుష్యుల ద్వారా చదువుకుంటే ఏమి లభిస్తుంది. నెలకు ఎంత సంపాదన ఉంటుంది? ఇక్కడ మీరు ఒక్కొక్క రత్నాన్ని ధారణ చేస్తారు. ఇవి లక్షల రూపాయలు విలువ చేస్తాయి. అక్కడ ధనాన్ని లెక్క పెట్టరు. లెక్కలేనంత ధనము ఉంటుంది. అందరికీ తమ-తమ పొలాలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. పురుషార్థము చేసి ఉన్నతముగా తయారవ్వాలి. రాజధాని స్థాపన అవుతోంది. ఈ లక్ష్మీ-నారాయణులు ప్రారబ్ధాన్ని ఎలా పొందారు - వీరి ప్రారబ్ధాన్ని తెలుసుకుంటే ఇక ఇంకేమి కావాలి. ప్రతి కల్పము 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారని, వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. కావున పిల్లలకు సేవ చేయాలి అన్న ఉల్లాసము ఉండాలి. ఎప్పటివరకైతే ఎవరికీ దారి తెలియజేయమో, అప్పటివరకూ భోజనము చెయ్యము - ఇంతటి ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈశ్వరీయ సేవ చేస్తూ మీ జీవితాన్ని 21 జన్మల కొరకు వజ్రము వలె తయారుచేసుకోవాలి. మాత, పితలను మరియు అనన్యులైన సోదరీ, సోదరులనే అనుసరించాలి.

2. కర్మాతీత అవస్థను తయారుచేసుకునేందుకు దేహ సహితముగా అందరినీ మర్చిపోవాలి. మీ స్మృతిని అచలముగా మరియు స్థిరముగా తయారుచేసుకోవాలి. దేవతల వలె నిర్లోభులుగా, నిర్మోహులుగా, నిర్వికారులుగా అవ్వాలి.

వరదానము:-
తపిస్తున్న ఆత్మలకు ఒక్క క్షణములో గతి, సద్గతులను ఇచ్చే మాస్టర్దాతా భవ

ఏ విధంగా స్థూలమైన సీజన్కోసం ఏర్పాట్లు చేస్తారో, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, సమయము వృధా కాకూడదని సేవాధారులను, సామాగ్రిని అన్నింటినీ సిద్ధం చేస్తారో, అలాగే ఇప్పుడు సర్వాత్మల గతి, సద్గతిని చేసే అంతిమ సీజన్రాబోతుంది. తపిస్తున్న ఆత్మలకు క్యూలో నిలబడే కష్టము ఇవ్వకండి, వారు వస్తూ ఉండాలి మరియు తీసుకుంటూ ఉండాలి. దీని కోసం ఎవర్రెడీగా అవ్వండి. పురుషార్థీ జీవితములో ఉండడం కంటే కూడా ఉన్నతముగా ఇప్పుడు దాత స్వరూపపు స్థితిలో ఉండండి. ప్రతి సంకల్పములో, ప్రతి క్షణములో మాస్టర్దాతగా ఉంటూ వెళ్ళండి.

స్లోగన్:-
ప్రభువును బుద్ధిలో హాజర్ గా ఉంచుకున్నట్లయితే సర్వ ప్రాప్తులు చిత్తం ప్రభూ అంటూ హాజరవుతాయి.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏకతతోపాటు ఏకాంతప్రియులుగా అవ్వాలి. ఎవరికైతే అనేకవైపుల నుండి బుద్ధియోగము తెగిపోయి ఉంటుందో మరియు ఒక్కరికే ప్రియులుగా ఉంటారో, వారే ఏకాంతప్రియులు. ఒక్కరికే ప్రియులుగా ఉన్న కారణముగా ఒక్కరి స్మృతిలోనే ఉండగలరు. ఏకాంతప్రియులు అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు. సర్వ సంబంధాలను, సర్వ ఆనందాలను ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంతప్రియులుగా అవ్వగలరు.