02-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.12.2003


‘‘ఈ సంవత్సరము నిమిత్తముగా మరియు నిర్మానముగా అయ్యి జమ ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానులుగా అవ్వండి’’

ఈ రోజు అనేక భుజాధారీ అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు. కొన్ని భుజాలు సాకారములో సమ్ముఖముగా ఉన్నారు మరియు కొన్ని భుజాలు సూక్ష్మరూపములో కనిపిస్తున్నారు. బాప్ దాదా తమ అనేక భుజాలను చూసి హర్షిస్తున్నారు. అన్ని భుజాలు నంబరువారుగా చాలా ఆల్రౌండర్, ఎవర్రెడీ, ఆజ్ఞాకారీ భుజాలు. బాప్ దాదా కేవలం సూచనను ఇవ్వగానే ఆ కుడి భుజాలు - సరే బాబా, హాజరుగా ఉన్నాము బాబా, ఇప్పుడే చేస్తాము బాబా అని అంటారు. ఇటువంటి అతి ప్రియమైన పిల్లలను చూస్తుంటే ఎంత సంతోషము కలుగుతుంది! బాప్ దాదాకు ఆత్మిక నషా ఉంది, ఏ విషయములో అంటే - కేవలం బాప్ దాదాకు తప్ప మరే ఇతర ధర్మాత్మలకు గానీ, మహానాత్మలకు గానీ ఇటువంటి భుజాలు మరియు ఇంతటి సహయోగీ భుజాలు దొరకరు. చూడండి, మొత్తము కల్పమంతా తిరిగి రండి, ఇటువంటి భుజాలు ఎవరికైనా లభించారా? కనుక బాప్ దాదా ప్రతి భుజము యొక్క విశేషతను చూస్తున్నారు. మీరు మొత్తము విశ్వము నుండి ఎన్నుకోబడిన విశేషమైన భుజాలు, పరమాత్ముని సహయోగీ భుజాలు. చూడండి, ఈ రోజు ఈ హాల్ లోకి కూడా ఎంతమంది చేరుకున్నారు! (ఈ రోజు హాల్ లో 18000 మంది కంటే కూడా ఎక్కువమంది సోదరీ, సోదరులు కూర్చుని ఉన్నారు) అందరూ తమను తాము, మేము పరమాత్ముని భుజాలము అని అనుభవం చేస్తున్నారా? ఆ నషా ఉంది కదా!

నలువైపుల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ చేరుకున్నారు అని బాప్ దాదాకు సంతోషముగా ఉంది. కానీ కొత్త సంవత్సరము ఏం గుర్తుకు తెప్పిస్తుంది? కొత్త యుగాన్ని, కొత్త జన్మను. ఎంతగా ఇది అతి పాత చివరి జన్మనో, అంతగానే కొత్త మొదటి జన్మ ఎంత సుందరమైనది! ఇది శ్యామము మరియు అది సుందరము. అది ఎంత స్పష్టముగా ఉందంటే - ఎలాగైతే ఈ రోజు పాత సంవత్సరము కూడా స్పష్టముగా ఉంది మరియు కొత్త సంవత్సరము కూడా ఎదురుగా స్పష్టముగా ఉంది. ఇలా మీ కొత్త యుగము, కొత్త జన్మ స్పష్టముగా ఎదురుగా వస్తున్నాయా? ఈ రోజు చివరి జన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలో ఉంటారు. స్పష్టముగా ఉందా? ఎదురుగా వస్తుందా? ఆది పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మాబాబా విషయములో ఇది అనుభవం చేసారు. బ్రహ్మాబాబాకు తన కొత్త జన్మ, కొత్త జన్మలోని రాజ్య శరీరము రూపీ వస్త్రము సదా ఎదురుగా గోడకు ఉన్న మేకుకు తగిలించి ఉన్నట్లుగా కనిపించేది. పిల్లలు ఎవరు కలవడానికి వెళ్ళినా వారూ అనుభవం చేసేవారు, బ్రహ్మాబాబా స్వయమూ అనుభవం చేసారు - ఈ రోజు వృద్ధుడిని, రేపు చిన్న బాలుడిలా అవుతాను అని. గుర్తుంది కదా! పాతవారికి గుర్తుందా? ఇదంతా ఈ రోజు మరియు రేపు యొక్క ఆట. ఇంత స్పష్టముగా భవిష్యత్తు అనుభవమవ్వాలి. ఈ రోజు స్వరాజ్య అధికారులు, రేపు విశ్వ రాజ్య అధికారులు. ఉందా నషా? చూడండి, ఈ రోజు చిన్న పిల్లలు కిరీటము ధరించి కూర్చున్నారు. (రిట్రీట్ లో వచ్చిన డబుల్విదేశీ చిన్న పిల్లలు కిరీటము ధరించి కూర్చున్నారు) మరి ఏ నషా ఉంది? కిరీటము ధరించి ఏ నషా కలిగింది? వీరు ఫరిశ్తా నషాలో ఉన్నారు. మేము నషాలో ఉన్నామంటూ చేతులు ఊపుతున్నారు.

మరి ఈ సంవత్సరము ఏమి చేస్తారు? కొత్త సంవత్సరములో ఏ నవీనత చేస్తారు? ఏదైనా ప్లాన్తయారుచేసారా? ఏ నవీనత చేస్తారు? ప్రోగ్రామ్ లు అయితే చేస్తూ ఉంటారు, లక్షమందిది కూడా చేసారు, రెండు లక్షలమందిది కూడా చేసారు, నవీనత ఏం చేస్తారు? ఈ రోజుల్లోని వారు ఒకవైపు స్వ ప్రాప్తిని కోరుకుంటున్నారు కానీ ధైర్యహీనులుగా ఉన్నారు. ధైర్యము లేదు. వినాలని అనుకుంటున్నారు కూడా, కానీ అలా తయారయ్యే ధైర్యము లేదు. ఇటువంటి ఆత్మలను పరివర్తన చేయడానికి ముందుగా ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇవ్వండి. ధైర్యము అనే రెక్కలకు ఆధారము అనుభవం. అనుభవం చేయించండి. అనుభవం ఎటువంటిదంటే అది కొద్దిగా దోసిలి అంత లభించిన తర్వాత అనుభవం జరిగితే ఇక అనుభవం అనే రెక్కలు అనండి లేక అనుభవం అనే పాదాలు అనండి, వాటితో ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతారు. దీని కోసం విశేషముగా ఈ సంవత్సరము నిరంతర అఖండ మహాదానిగా అవ్వాలి, అఖండ. మనసా ద్వారా శక్తి స్వరూపులుగా తయారుచేయండి. మహాదానిగా అయి మనసా ద్వారా, వైబ్రేషన్ల ద్వారా నిరంతరం శక్తుల అనుభవాన్ని చేయించండి. వాచ ద్వారా జ్ఞాన దానాన్ని ఇవ్వండి, కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి. మొత్తం రోజంతా మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మల ద్వారానైనా, మూడింటి ద్వారా అఖండ మహాదానిగా అవ్వండి. సమయమనుసారముగా ఇప్పుడు దానిగా కాదు, అప్పుడప్పుడు దానము చేసారు అన్నట్లు కాదు, అఖండ దాని, ఎందుకంటే ఆత్మలకు అవసరము ఉంది. మరి మహాదానిగా అవ్వడానికి ముందుగా మీ జమ ఖాతాను చెక్చేసుకోండి. నాలుగు సబ్జెక్టులలోనూ జమ ఖాతా ఎంత శాతములో ఉంది? ఒకవేళ స్వయములో జమ ఖాతా లేకపోతే మహాదానిగా ఎలా అవుతారు! మరియు జమ ఖాతాను చెక్చేసుకునేందుకు గుర్తు ఏమిటి? మనసా, వాచా, కర్మల ద్వారా సేవనైతే చేసారు కానీ జమ అయ్యింది అన్నదానికి గుర్తు ఏమిటంటే - సేవ చేస్తూ ముందుగా స్వయం యొక్క సంతుష్టత. దానితోపాటుగా ఎవరి సేవ అయితే చేస్తారో, ఆ ఆత్మలలో సంతోషముతో కూడిన సంతుష్టత వచ్చిందా? ఒకవేళ రెండు వైపులా సంతుష్టత లేకపోతే సేవ ఖాతాలో మీ సేవ యొక్క ఫలము జమ అవ్వలేదు అని అర్థం చేసుకోండి.

బాప్ దాదా అప్పుడప్పుడూ పిల్లల యొక్క జమ ఖాతాను చూస్తారు. అందులో అక్కడక్కడ శ్రమ ఎక్కువగా ఉంది కానీ జమ యొక్క ఫలము తక్కువగా ఉంది. కారణము? రెండు వైపులా సంతుష్టత యొక్క లోటు. ఒకవేళ సంతుష్టతను అనుభవం చేయలేదు అంటే, అది స్వయం కావచ్చు, ఇతరులు కావచ్చు, అప్పుడు జమ ఖాతా తక్కువ అవుతుంది. బాప్ దాదా జమ ఖాతాను చాలా సహజముగా పెంచుకునేందుకు గోల్డెన్తాళంచెవిని పిల్లలకు ఇచ్చారు. ఆ తాళంచెవి ఏమిటో తెలుసా? లభించడమైతే లభించింది కదా! సహజముగా జమ ఖాతాను నిండుగా చేసుకోవడానికి గోల్డెన్తాళంచెవి ఏమిటంటే - మనసా, వాచా, కర్మణా, ఏ రకమైన సేవ చేస్తున్నా కానీ ఒకటేమో స్వయములో నిమిత్త భావము యొక్క స్మృతి. నిమిత్త భావము, నిర్మాన భావము, శుభ భావము, ఆత్మిక స్నేహ భావము, ఒకవేళ ఈ భావాల యొక్క స్థితిలో స్థితి అయ్యి సేవ చేస్తే సహజముగానే మీ ఈ భావాలతో ఆత్మల భావన పూర్తవుతుంది. ఈ రోజుల్లోనివారు ప్రతి ఒక్కరిలోని భావము ఏముంది అనేది నోట్చేస్తున్నారు. నిమిత్త భావముతో చేస్తున్నారా లేక అభిమాన భావముతో చేస్తున్నారా! ఎక్కడైతే నిమిత్త భావము ఉంటుందో అక్కడ నిర్మాన భావము ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరి చెక్చేసుకోండి - ఏమి జమ అయ్యింది? ఎంత జమ అయ్యింది? ఎందుకంటే ఈ సమయములో సంగమయుగమే జమ చేసుకునే యుగము. ఇక ఆ తర్వాత, కల్పమంతా జమ చేసుకున్నదానికి ప్రారబ్ధము ఉంటుంది.

మరి ఈ సంవత్సరము ఏ విశేష అటెన్షన్పెట్టాలి? మీ, మీ జమ ఖాతాలను చెక్చేసుకోండి. చెకర్ గా కూడా అవ్వండి, మేకర్ గా కూడా అవ్వండి ఎందుకంటే సమయ సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు. మరియు అందరూ బాప్ దాదాతో - మేము సమానంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేసారు. ప్రతిజ్ఞ చేసారు కదా? ఎవరైతే ప్రతిజ్ఞ చేసారో వారు చేతులెత్తండి. పక్కాగా చేసారా? లేక పర్సెంటేజ్ లో చేసారా? పక్కాగా చేసారు కదా? మరి బ్రహ్మాబాబా సమానమైన ఖాతా జమ అయ్యి ఉండాలి కదా! బ్రహ్మాబాబా సమానముగా అవ్వాలంటే బ్రహ్మాబాబా యొక్క విశేష చరిత్ర ఏమి చూసారు? ఆది నుండి మొదలుకుని అంతిమము వరకు, ప్రతి విషయములో, నేను అన్నారా లేక బాబా అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు. ఎవరిని కలవడానికి వచ్చారు? బాబాను కలవడానికి వచ్చారు. నేను అనేది లేకుండా ఉండటాన్ని, అది అవిద్యగా ఉండటాన్ని చూసారు కదా! చూసారా? ప్రతి మురళిలో బాబా, బాబా అంటూ ఎన్ని సార్లు గుర్తు చేయిస్తారు? మరి సమానముగా అవ్వడము అంటే అర్థము ముందుగా నేను అన్నది లేకుండా ఉండాలి. బ్రాహ్మణులలో నేను అన్న భావన కూడా చాలా రాయల్ గా ఉంటుంది అని ఇంతకుముందు వినిపించాము. గుర్తుంది కదా? వినిపించాము కదా! బాప్ దాదా ప్రత్యక్షత జరగాలి, బాప్ దాదాను ప్రత్యక్షము చేయాలి అని అందరూ కోరుకుంటారు. ప్లాన్లు చాలా తయారుచేస్తారు. మంచి ప్లాన్లు తయారుచేస్తారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ ఈ రాయల్రూపములో ఉండే నేను అన్న భావన ప్లాన్ లో, సఫలతలో కొంత పర్సెంటేజ్ ను తగ్గించేస్తుంది. నేచురల్గా సంకల్పాలలో, మాటలలో, కర్మలలో, ప్రతి సంకల్పములో బాబా, బాబా అన్నది స్మృతిలో ఉండాలి. నేను అన్న భావన కాదు. బాప్ దాదా చేయించేవారు చేయిస్తున్నారు. జగదాంబ యొక్క విశేష ధారణ ఇదే. జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా, పాతవారికి గుర్తుండి ఉంటుంది. గుర్తుందా? చెప్పండి (హుక్మీ హుకుమ్చలాయే రహా - ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు) ఇదే జగదాంబ యొక్క విశేష ధారణ. మరి నంబరు తీసుకోవాలి, సమానముగా అవ్వాలి అంటే నేను అన్న భావన సమాప్తమవ్వాలి. నోటి నుండి ఆటోమేటిక్ గా బాబా-బాబా అన్న పదమే వెలువడాలి. కర్మలలో, మీ ముఖములో బాబా యొక్క మూర్తి కనిపించాలి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది.

బాప్ దాదా ఈ రాయల్రూపము యొక్క నేను-నేను అనే పాటలు చాలా వింటుంటారు. నేను ఏదైతే చేసానో అదే రైట్, నేను ఏదైతే ఆలోచించానో అదే రైట్, అదే జరగాలి, ఈ నేను అనేది మోసం చేస్తుంది. ఆలోచించండి, చెప్పండి కానీ నిమిత్త మరియు నిర్మాన భావముతో. బాప్ దాదా ఇంతకుముందు కూడా ఒక ఆత్మిక డ్రిల్ను నేర్పించారు, ఏ డ్రిల్అది? ఇప్పుడిప్పుడే మాలిక్ (యజమాని), ఇప్పుడిప్పుడే బాలక్. ఆలోచన అందించేటప్పుడు యజమాని స్థితి, మెజారిటీ వారు చెప్పినది ఫైనల్అయిన తర్వాత బాలక స్థితి. ఈ విధంగా యజమాని మరియు బాలకుడు... ఈ ఆత్మిక డ్రిల్చాలా-చాలా అవసరము. కేవలం బాప్ దాదా శిక్షణ రూపములో ఇచ్చిన మూడు పదాలను గుర్తుంచుకోండి - అందరికీ గుర్తున్నాయా! మనసాలో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఎప్పుడు సంకల్పము చేసినా నిరాకారి స్థితిలో స్థితి అయ్యి సంకల్పము చేయండి, మిగిలినవన్నీ మర్చిపోయినా కానీ ఈ మూడు పదాలను మర్చిపోకండి. సాకార రూపములో వారు ఇచ్చిన ఈ మూడు పదాల శిక్షణే కానుక. మరి బ్రహ్మాబాబాపై సాకార రూపములో కూడా ప్రేమ ఉండినది... ఇప్పుడు కూడా డబుల్విదేశీయులు ఎన్నో అనుభవాలు వినిపిస్తుంటారు, బ్రహ్మాబాబాపై ఎంతో ప్రేమ ఉంది అని. చూడకపోయినా కానీ ప్రేమ అయితే ఉంది. ఉందా? మరి డబుల్విదేశీయులు, బ్రహ్మాబాబాపై ప్రేమ ఎక్కువ ఉంది కదా? ఉంది కదా? మరి ఎవరిపై ప్రేమ ఉంటుందో వారు ఇచ్చిన కానుకను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. కానుక చిన్నదైనా కానీ ఎవరి పట్లనైతే అత్యంత ప్రేమ ఉంటుందో, వారు ఇచ్చిన కానుకను దాచి పెట్టుకుంటారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. మరి బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంటే ఈ మూడు పదాల శిక్షణ పట్ల ప్రేమ ఉంటుంది. వీటి ఆధారముగా సంపన్నముగా అవ్వడము లేక సమానముగా అవ్వడము చాలా సహజమైపోతుంది. బ్రహ్మాబాబా ఏమి చెప్పారో గుర్తు తెచ్చుకోండి!

కనుక కొత్త సంవత్సరములో వాచా సేవ చేయండి, బాగా చేయండి కానీ అనుభవం చేయించే సేవను సదా అటెన్షన్లో పెట్టుకోండి. ఈ సోదరి ద్వారా లేక ఈ సోదరుని ద్వారా మాకు శక్తి యొక్క అనుభవం కలిగింది, శాంతి యొక్క అనుభవం కలిగింది అని అందరూ అనుభవం చేయాలి ఎందుకంటే అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోరు. విన్నవాటిని మర్చిపోతారు. మంచిగా అనిపిస్తుంది కానీ మర్చిపోతారు. అనుభవమనేది ఎటువంటిదంటే అది వారిని లాక్కుని మీ దగ్గరకు తీసుకువస్తుంది. సంపర్కములోనివారు సంబంధములోకి వస్తూ ఉంటారు ఎందుకంటే సంబంధము లేకుండా వారసత్వానికి అధికారిగా అవ్వలేరు. కనుక అనుభవం సంబంధములోకి తీసుకొచ్చేటటువంటిది. అచ్ఛా.

అర్థమయిందా, ఏమి చేస్తారు? చెక్చేసుకోండి, చెకర్ గా కూడా అవ్వండి, మేకర్ గా కూడా అవ్వండి. అనుభవం చేయించే మేకర్ గా అవ్వండి, జమ ఖాతాను చెక్చేసుకునే చెకర్ గా అవ్వండి. అచ్ఛా.

ఇప్పుడు అందరూ ఏమి చేస్తారు? బాప్ దాదాకు కొత్త సంవత్సరానికి ఏదైనా కానుకను ఇస్తారా లేదా? కొత్త సంవత్సరములో ఏమి చేస్తారు? ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు కదా. ఒక కార్డు ఇస్తారు, ఒక కానుకను ఇస్తారు. మరి బాప్ దాదాకు కార్డు వద్దు, రికార్డు కావాలి. పిల్లలందరి రికార్డు నంబర్ వన్ గా ఉండాలి, ఈ రికార్డు కావాలి. నిర్విఘ్నముగా ఉండాలి. ఇప్పుడు కొన్ని-కొన్ని విఘ్నాల విషయాల గురించి వింటుంటారు కదా, అప్పుడు బాప్ దాదాకు నవ్వు తెప్పించే ఒక ఆట గుర్తుకొస్తుంది. ఆ నవ్వు తెప్పించే ఆట ఏమిటో తెలుసా? ఆ ఆట ఏమిటంటే - వృద్ధాప్యములో ఉన్నవారు బొమ్మలాట ఆడుతున్నారు. ఉన్నదేమో వృద్ధులుగా కానీ బొమ్మలతో ఆడుతున్నారు. మరి ఇది నవ్వు తెప్పించే ఆట కదా. ఇప్పుడు ఏవైతే చిన్న-చిన్న విషయాలను వింటున్నామో, చూస్తున్నామో, అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే - ఉన్నదేమో వానప్రస్థ అవస్థలో కానీ ఈ విషయాలు ఎంత చిన్నవిగా ఉన్నాయి! ఈ రికార్డు బాబాకు నచ్చడం లేదు. దీనికి బదులు, కార్డుకు బదులు రికార్డు ఇవ్వండి, అదేమిటంటే - నిర్విఘ్నము, చిన్న విషయాలు సమాప్తము. పెద్దవాటిని చిన్నగా చేయడము నేర్చుకోండి మరియు చిన్నవాటిని సమాప్తం చేయడం నేర్చుకోండి. బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరి ముఖాన్ని, బాప్ దాదా ముఖము కనిపించే దర్పణములా తయారుచేయాలని కోరుకుంటున్నారు. మీ దర్పణములో బాప్ దాదా కనిపించాలి. మరి ఇటువంటి విచిత్రమైన దర్పణాన్ని బాప్ దాదాకు కానుకగా ఇవ్వండి. ప్రపంచములోనైతే పరమాత్మ కనిపించే దర్పణము వంటిది లేనే లేదు. మరి మీరు ఈ కొత్త సంవత్సరములో ఎటువంటి కానుకను ఇవ్వండి అంటే - మీరు విచిత్ర దర్పణములా తయారవ్వండి. ఎవరు చూసినా, ఎవరు విన్నా వారికి బాప్ దాదాయే కనిపించాలి, వినిపించాలి. బాబా యొక్క వాయిస్ వినిపించాలి. మరి కానుకను ఇస్తారా? ఇస్తారా? ఎవరైతే ఇవ్వాలి అనే దృఢ సంకల్పము చేస్తున్నారో వారు చేతులెత్తండి. దృఢ సంకల్పమనే చేతిని ఎత్తండి. డబుల్విదేశీయులు కూడా ఎత్తుతున్నారు. సింధీ గ్రూప్ కూడా ఎత్తుతుంది. ఆలోచించి ఎత్తుతున్నారు.

మంచిది - బాప్ దాదాకు సింధీ గ్రూపుపై ఆశ ఉంది, ఏ ఆశ ఉందో చెప్పమంటారా? ఏ ఆశ ఉందంటే, సింధీ గ్రూప్ నుండి ఒకరు ఎటువంటి మైక్ తయారవ్వాలంటే, వారు - ఎలా ఉండేవారము మరియు ఎలా తయారయ్యాము అని ఛాలెంజ్చెయ్యగలగాలి. వారు సింధీలను మేల్కొలపాలి. పాపం వారు, గుర్తించడమే లేదు. వారి దేశములోని అవతారమునే గుర్తించడం లేదు. కనుక సింధీ గ్రూప్ లో ఎటువంటి మైక్ వెలువడాలంటే - వారు, యథార్థమేమిటో మేము వినిపిస్తాము అని ఛాలెంజ్ చేసి చెప్పాలి. సరేనా? ఆశను పూర్తి చేస్తారా? అచ్ఛా.

నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు, నలువైపులా ఉన్న బాబా యొక్క కుడి భుజాలకు, ఆజ్ఞాకారి భుజాలకు, నలువైపులా ఉన్న సదా సర్వ ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇచ్చే ధైర్యశాలి ఆత్మలకు, నలువైపులా ఉన్న సదా బాబా సమానముగా ప్రతి కర్మలో ఫాలో చేసేవారికి, బ్రహ్మాబాబా మరియు జగదాంబ శిక్షణలను సదా ప్రాక్టికల్జీవితములోకి తీసుకువచ్చే పిల్లలందరికీ చాలా చాలా ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే.

డబుల్విదేశీయులకు మరియు భారత్ పిల్లలకు డబుల్గుడ్ నైట్మరియు గుడ్ మార్నింగ్, రెండూ చెప్తున్నాము. ఎలా అయితే ఇప్పుడు సంతోషిస్తున్నారో అలాగే ఎప్పుడైనా ఏదైనా విషయము వస్తే ఈ రోజును గుర్తు తెచ్చుకుని సంతోషములో ఊగండి. సంతోషమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దుఃఖము యొక్క అల రాకూడదు. దుఃఖాన్ని ఇచ్చేవారైతే ప్రపంచములో అనేకమంది ఆత్మలు ఉన్నారు, మీరు సుఖాన్ని ఇచ్చేవారు, సుఖాన్ని తీసుకునేవారు, సుఖదాత పిల్లలు సుఖ స్వరూపులు. ఒక్కోసారి సుఖము అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి ప్రేమ అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి శాంతి అనే ఊయలలో ఊగండి. ఊగుతూనే ఉండండి. కింద మట్టిలో పాదము పెట్టకండి. ఊగుతూనే ఉండండి. సంతోషముగా ఉండండి మరియు అందరినీ సంతోషపరచండి మరియు అందరికీ సంతోషాన్ని పంచండి. అచ్ఛా. ఓం శాంతి.

వరదానము:-
ఫరిశ్తా స్వరూపపు స్థితి ద్వారా బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూప భవ

ఫరిశ్తా స్వరూపపు స్థితిలో స్థితులవ్వడమే బాబా స్నేహానికి రిటర్న్ ఇవ్వడము, ఈ విధంగా రిటర్న్ ఇచ్చేవారే సమాధాన స్వరూపులుగా అవుతారు. సమాధాన స్వరూపులుగా అవ్వడము ద్వారా స్వయం యొక్క లేక అన్యాత్మల యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఇది అటువంటి సేవ చేసే సమయము, తీసుకోవడముతోపాటు ఇచ్చే సమయము. అందుకే ఇప్పుడు బాబా సమానముగా ఉపకారులుగా అయి పిలుపును విని మీ ఫరిశ్తా రూపము ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకోండి మరియు సమస్యలతో అలిసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి.

స్లోగన్:-
వ్యర్థము విషయములో నిశ్చింతులుగా అవ్వండి, అంతేకానీ మర్యాదలలో కాదు.

అవ్యక్త ప్రేరణలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

పరస్పరం సంస్కారాలలో ఏదైతే భిన్నత ఉందో, దానిని ఏకతలోకి తీసుకురావాలి. ఏకత కోసం వర్తమానములో ఉన్న భిన్నత్వాన్ని తొలగించి రెండు విషయాలను తీసుకురావలసి ఉంటుంది - ఒకటి, ఏకనామీగా (ఒకే నామము) అయ్యి సదా ప్రతి విషయములో ఒక్కరి నామాన్నే తీసుకోండి, దానితోపాటు సంకల్పాలను, సమయాన్ని మరియు జ్ఞాన ఖజానాను ఎకానమీ (పొదుపు) చేయండి. అప్పుడు నేను అన్నది మాయమై ఒక్క బాబాలోనే అన్ని భిన్నత్వాలు ఇమిడిపోతాయి.