03-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మ రూపీ జ్యోతిలో జ్ఞాన-యోగాలనే తైలాన్ని వేసినట్లయితే జ్యోతి వెలిగి ఉంటుంది, జ్ఞానము మరియు యోగము మధ్యన వ్యత్యాసాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి’’

ప్రశ్న:-
తండ్రి యొక్క కార్యము ప్రేరణ ద్వారా జరగదు, వారు ఇక్కడకు రావలసే ఉంటుంది, ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే మనుష్యుల బుద్ధి పూర్తిగా తమోప్రధానముగా ఉంది. తమోప్రధానమైన బుద్ధి ప్రేరణను క్యాచ్ చేయలేదు. తండ్రి వస్తారు కావుననే, ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని అంటారు.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి...

ఓంశాంతి
భక్తులు ఈ పాటను తయారుచేసారు. ఇప్పుడు దీని అర్థం ఎంత బాగుంది. ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని అంటారు. ఇప్పుడు ఆకాశమైతే ఇక్కడే ఉంది. ఇది నివసించే స్థానము. ఆకాశము నుండైతే ఏ వస్తువూ రాదు. ఆకాశ సింహాసనము అని అంటారు. ఆకాశ తత్వములోనైతే మీరు నివసిస్తున్నారు మరియు తండ్రి నివసించేది మహాతత్వములో. దానిని బ్రహ్మము లేక మహాతత్వము అని అంటారు, అక్కడ ఆత్మలు నివాసముంటాయి. తండ్రి రావడము కూడా తప్పకుండా అక్కడి నుండే వస్తారు. మీరు వచ్చి మా జ్యోతిని వెలిగించండి అని అంటున్నారంటే తప్పకుండా ఎవరో అయితే వస్తారనే కదా. ఒకటేమో అంధుని పిల్లలు అంధులు అని మరియు మరొకటి నేత్రాలు ఉన్నవారి పిల్లలు చూడగలరు అని గాయనము కూడా ఉంది. ధృతరాష్ట్రుడు మరియు యుధిష్టిరుడి పేర్లు చూపిస్తారు. ఇప్పుడు వీరైతే రావణుడికి సంతానము. మాయ రూపీ రావణుడు ఉన్నాడు కదా. అందరిదీ రావణ బుద్ధి, ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి కలవారు. తండ్రి మీ బుద్ధి తాళాన్ని ఇప్పుడు తెరుస్తున్నారు. రావణుడు తాళాన్ని వేసేస్తాడు. ఎవరైనా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోకపోతే, వారిని రాతి బుద్ధి కలవారని అంటారు. తండ్రి వచ్చి ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు కదా. ప్రేరణ ద్వారా పనేమీ జరగదు. ఆత్మ ఏదైతే సతోప్రధానముగా ఉండేదో, దాని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది, తమోప్రధానముగా అయిపోయింది. పూర్తిగా డిమ్ గా అయిపోయింది. మనుష్యులు ఎవరైనా మరణిస్తే వారికి జ్యోతిని వెలిగిస్తారు. అసలు ఆ జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు? జ్యోతి ఆరిపోవడం వలన అంధకారము వ్యాపిస్తుందేమో అని భావిస్తారు, అందుకే జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు ఇక్కడి జ్యోతిని వెలిగించడం ద్వారా అక్కడికి ప్రకాశము ఎలా చేరుకుంటుంది? ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు వివేకవంతమైన బుద్ధి కలవారిగా అవుతారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారుచేస్తాను. జ్ఞానమనే తైలము వేస్తాను. ఇది కూడా అర్థం చేయించవలసిన విషయము. జ్ఞానము మరియు యోగము, రెండూ వేరు-వేరు విషయాలు. యోగాన్ని జ్ఞానము అని అనరు. భగవంతుడు వచ్చి - నన్ను స్మృతి చేయండి అని ఈ జ్ఞానాన్ని కూడా ఇచ్చారు కదా అని కొందరు భావిస్తారు. కాని ఈ విషయాన్ని జ్ఞానము అని అనరు. ఇక్కడైతే తండ్రి మరియు పిల్లలు ఉన్నారు. వీరు మా బాబా అని పిల్లలకు తెలుసు, దీనిని జ్ఞానము యొక్క విషయము అని అనరు. జ్ఞానము విస్తారమైనది. ఇది కేవలం స్మృతి మాత్రమే. తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి, అంతే. ఇది సాధారణమైన విషయము. దీనిని జ్ఞానము అని అనరు. బిడ్డ జన్మ తీసుకున్నాక తన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాడు కదా. జ్ఞానము విస్తారమైనది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి - ఇది జ్ఞానము కాదు. మనము ఆత్మ అని, మన తండ్రి పరమ ఆత్మ, పరమాత్మ అని మీకు స్వయం తెలుసు. దీనిని జ్ఞానము అని ఏమైనా అంటారా? తండ్రిని పిలుస్తూ ఉంటారు. జ్ఞానము అనేది నాలెడ్జ్. ఎలాగైతే కొందరు ఎమ్.ఎ. చదువుతారు, కొందరు బి.ఎ. చదువుతారు, ఎన్ని పుస్తకాలు చదవవలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు నా పిల్లలు కదా, నేను మీ తండ్రిని. నాతోనే యోగాన్ని జోడించండి అనగా నన్నే స్మృతి చేయండి. దీనిని జ్ఞానము అని అనరు. మీరు ఎలాగూ నాకు పిల్లలే. ఆత్మలైన మీరు ఎప్పటికీ వినాశనము పొందరు. ఎవరైనా మరణిస్తే అతని ఆత్మను పిలుస్తారు, వాస్తవానికి ఆ శరీరమైతే అంతమైపోయింది. ఆత్మ భోజనాన్ని ఎలా స్వీకరిస్తుంది? ఆ భోజనమైతే ఎంతైనా బ్రాహ్మణులే తింటారు. కానీ ఇవన్నీ భక్తి మార్గపు ఆచారాలు. అలాగని మనము ఇలా చెప్పినంత మాత్రాన ఆ భక్తి మార్గము ఆగిపోతుందని కాదు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఆత్మ అయితే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది.

పిల్లల బుద్ధిలో జ్ఞానము మరియు యోగము యొక్క వ్యత్యాసము స్పష్టముగా ఉండాలి. తండ్రి నన్ను స్మృతి చేయండి అని ఏదైతే చెప్తున్నారో ఇది జ్ఞానము కాదు. తండ్రి ఇలా డైరెక్షన్ ఇస్తున్నారు, దీనిని యోగము అని అంటారు. జ్ఞానము అనగా సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్నదానికి సంబంధించిన నాలెడ్జ్. యోగము అనగా స్మృతి. పిల్లల కర్తవ్యము తండ్రిని స్మృతి చేయడము. వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. కావున జ్ఞానము వేరు. పిల్లలకు ఏమైనా తండ్రిని స్మృతి చేయండి అని చెప్పవలసి ఉంటుందా. లౌకిక తండ్రి అయితే జన్మించినప్పటి నుండి గుర్తు ఉంటారు. ఇక్కడ తండ్రి స్మృతిని ఇప్పించవలసి వస్తుంది. ఇందులో శ్రమ అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి - ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకే బాబా అంటారు, యోగములో స్థిరంగా ఉండలేకపోతారు అని. పిల్లలు - బాబా, మేము స్మృతిని మర్చిపోతున్నాము అని వ్రాస్తారు, అంతేకానీ జ్ఞానాన్ని మర్చిపోతున్నాము అని అనరు. జ్ఞానమైతే చాలా సహజము. స్మృతిని జ్ఞానము అని అనరు, ఇందులో మాయ తుఫానులు చాలా వస్తాయి. కొందరు జ్ఞానములో చాలా చురుకుగా ఉండి ఉండవచ్చు, మురళీని చాలా బాగా వినిపిస్తూ ఉండవచ్చు, కానీ బాబా అడుగుతారు - ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అన్న స్మృతి చార్టును వ్రాయండి. బాబాకు స్మృతి చార్టును యథార్థ రీతిగా వ్రాసి చూపించండి. స్మృతియే ముఖ్యమైన విషయము. మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పతితులే పిలుస్తారు. ముఖ్యమైనది పావనముగా అయ్యే విషయము. ఇందులోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. శివ భగవానువాచ - స్మృతిలో అందరూ చాలా కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నారు. మంచి-మంచి పిల్లలు ఎవరైతే మురళిని చాలా బాగా వినిపిస్తారో, వారు కూడా స్మృతిలో చాలా బలహీనముగా ఉన్నారు. యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. యోగము ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శాంతించగలవు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు, ఏ దేహము కూడా గుర్తుకు రాకూడదు. ఈ ప్రపంచమంతా వినాశనమవ్వనున్నదని, ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తామని, మళ్ళీ రాజధానిలోకి వస్తాము అని ఆత్మకు తెలుసు. ఇది సదా బుద్ధిలో ఉండాలి. జ్ఞానము ఏదైతే లభిస్తుందో అది ఆత్మలో ఉండాలి. తండ్రి యోగేశ్వరుడు, వారు స్మృతి చేయడాన్ని నేర్పిస్తారు. వాస్తవానికి ఈశ్వరుడిని యోగేశ్వరుడు అని అనరు. మీరే యోగేశ్వరులు. ఈశ్వరుడైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతిని నేర్పించేవారు ఈశ్వరుడైన తండ్రి. ఆ నిరాకారుడైన తండ్రి శరీరము ద్వారా వినిపిస్తారు. పిల్లలు కూడా శరీరాల ద్వారానే వింటారు. కొందరైతే యోగములో చాలా కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నారు. అసలు ఏమాత్రమూ స్మృతి చేయరు. జన్మ-జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ శిక్షలు అనుభవిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైతే పాపాలు చేస్తారో, వాటికైతే ఇంకా 100 రెట్లు శిక్షలు అనుభవిస్తారు. జ్ఞానమైతే చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు, కానీ యోగము ఏమాత్రమూ లేదు, దాని కారణముగా పాపాలు భస్మమవ్వవు, అపరిపక్వముగానే ఉండిపోతారు, అందుకే సత్యాతి-సత్యమైన మాల 8 రత్నాలదే తయారైంది. నవ రత్నాలు ప్రసిద్ధమైనవి. 108 రత్నాలు అని ఎప్పుడైనా విన్నారా? 108 రత్నాలతో ఏ వస్తువునూ తయారుచేయరు. ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోనివారు చాలామంది ఉన్నారు. స్మృతిని జ్ఞానము అని అనరు. జ్ఞానము అని సృష్టిచక్రాన్ని అంటారు. శాస్త్రాలలో జ్ఞానము లేదు, అవి భక్తి మార్గపు శాస్త్రాలు. తండ్రి స్వయంగా అంటారు - నేను వీటి ద్వారా లభించను. సాధువులు మొదలైనవారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. వారు బ్రహ్మములో లీనమవ్వాలి అని భావిస్తారు. దానికి నీటి బుడగ నీటిలో కలిసిపోతుంది అన్న ఉదాహరణను ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్పరు. ఆత్మలమైన మనము తండ్రి పిల్లలము అని మీకు తెలుసు. ‘‘నన్నొక్కరినే స్మృతి చేయండి’’ అన్న మాట కూడా చెప్తారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మనము ఆత్మ అని అంటారు కానీ, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు - ఈ జ్ఞానము అస్సలు లేదు. దీనిని తండ్రియే వచ్చి వినిపిస్తారు. ఆత్మలైన మన ఇల్లు అది అని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ పూర్తి వంశవృక్షము ఉంది. ప్రతి ఒక్క ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది. సుఖము ఎవరు ఇస్తారు, దుఃఖము ఎవరు ఇస్తారు - ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.

భక్తి రాత్రి, జ్ఞానము పగలు. 63 జన్మలు మీరు ఎదురుదెబ్బలు తింటారు. ఆ తర్వాత జ్ఞానము ఇస్తాను, దానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణము. క్షణములో జీవన్ముక్తి అన్న గాయనము కూడా ఉంది. వారు మీ తండ్రి కదా, వారే పతిత-పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారా మీరు పావనముగా అయిపోతారు. సత్యయుగము, త్రేతా, ద్వాపర, కలియుగాల యొక్క చక్రము ఇది. ఈ పేర్లు కూడా తెలుసు కానీ ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే, సమయము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది ఘోర కలియుగమని అర్థం చేసుకుంటారు కూడా. ఒకవేళ కలియుగము ఇప్పటికీ ఇంకా కొనసాగితే ఇంకా ఘోర అంధకారము వ్యాపిస్తుంది, అందుకే దీనికి గుర్తుగా చెప్తూ ఉంటారు - కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు, అంతలో వినాశనము జరిగిపోయింది అని. కాస్త జ్ఞానము విన్నా ప్రజలుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎక్కడ, ప్రజలు ఎక్కడ! చదివించేవారైతే ఒక్కరే. ప్రతీ ఒక్కరికీ వారి-వారి భాగ్యము ఉంది. కొందరైతే స్కాలర్షిప్ ను తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. రాముడికి బాణము యొక్క గుర్తును ఎందుకు చూపించారు? ఎందుకంటే ఫెయిల్ అయ్యారు. ఇది కూడా గీతా పాఠశాల, కొందరైతే ఏ మార్కులూ తీసుకునేందుకు అర్హులుగా లేరు. ఆత్మనైన నేను బిందువును, తండ్రి కూడా బిందువు, ఈ విధంగా వారిని స్మృతి చేయాలి. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం కూడా చేసుకోరో, వారు ఏ పదవిని పొందుతారు! స్మృతిలో లేకపోవడం వలన ఎంతో నష్టము కలుగుతుంది. స్మృతి బలము ఎంతో అద్భుతాన్ని చేస్తుంది, కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిగా, శీతలముగా అయిపోతాయి. జ్ఞానముతో అవి శాంతిగా అవ్వవు, యోగబలముతో శాంతిస్తాయి. మీరు వచ్చి మాకు ఆ గీతా జ్ఞానాన్ని వినిపించండి అని భారతవాసులు పిలుస్తూ ఉంటారు, ఇప్పుడు ఎవరు వస్తారు? శ్రీకృష్ణుడి ఆత్మ అయితే ఇక్కడే ఉంది. మీరు పిలవడానికి ఆకాశములో ఎవరైనా సింహాసనముపై కూర్చున్నారా. ఒకవేళ ఎవరైనా మేము క్రైస్టు ఆత్మను స్మృతి చేస్తాము అని అంటే, అరే, వారైతే ఇక్కడే ఉన్నారు. క్రైస్టు ఆత్మ ఇక్కడే ఉన్నారని, వారు తిరిగి వెళ్ళలేదని వారికేమి తెలుసు? మొదటి నంబరువారైన లక్ష్మీ-నారాయణులే పూర్తి 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నప్పుడు ఇక మిగిలినవారు తిరిగి ఎలా వెళ్ళగలరు. ఆ లెక్కలన్నీ ఉన్నాయి కదా. మనుష్యులు ఏదైతే చెప్తారో అదంతా అసత్యము. అర్ధకల్పము అసత్య ఖండము ఉంది, అర్ధకల్పము సత్యఖండము ఉంటుంది. ఈ సమయములో అందరూ నరకవాసులేనని, మళ్ళీ స్వర్గవాసులుగా కూడా భారతవాసులే అవుతారని ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ అర్థం చేయించాలి. మనుష్యులు ఎన్ని వేద-శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతారు, వాటి ద్వారా ముక్తిని ఏమైనా పొందుతారా? ప్రతీ ఒక్కరూ క్రిందికి దిగవలసిందే. ప్రతీ వస్తువు సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. కొత్త ప్రపంచము అని దేనిని అంటారు, ఎవ్వరికీ ఈ జ్ఞానము లేదు. ఇది తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు. దేవీ-దేవతా ధర్మాన్ని ఎప్పుడు, ఎవరు స్థాపన చేశారు - భారతవాసులకు ఏమీ తెలియదు. కావున తండ్రి అర్థం చేయించారు - జ్ఞానములో ఎంత బాగా ఉన్నా కానీ యోగములో చాలా మంది పిల్లలు ఫెయిల్ ఉన్నారు. యోగము లేకపోతే వికర్మలు వినాశనమవ్వవు, ఉన్నత పదవిని పొందరు. ఎవరైతే యోగములో నిమగ్నమై ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలముగా అయిపోతాయి. దేహ సహితముగా సర్వస్వము మరచి దేహీ-అభిమానులుగా అవుతారు. మనము అశరీరులము, ఇప్పుడు ఇంటికి వెళ్తాము. లేస్తూ, కూర్చుంటూ - ఇప్పుడిక ఈ శరీరాన్ని వదిలేయాలి, ఇంతవరకూ నేను పాత్రను అభినయించాను, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్తాను అని భావించండి. జ్ఞానమైతే లభించింది, ఎలాగైతే తండ్రిలో జ్ఞానము ఉంది, వారికైతే ఎవరినీ స్మృతి చేయవలసిన అవసరం లేదు. స్మృతి అనేది పిల్లలైన మీరు చేయవలసి ఉంటుంది. తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు, యోగసాగరుడు అని అనరు కదా. చక్రము యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. స్మృతిని జ్ఞానము అని అనరు. స్మృతి అనేది పిల్లలకు స్వతహాగానే కలుగుతుంది. స్మృతి అయితే చేయవలసిందే, లేకపోతే వారసత్వము ఎలా లభిస్తుంది? తండ్రి ఉన్నారు కావున వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఇక మిగిలినదంతా జ్ఞానము. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము, తమోప్రధానము నుండి సతోప్రధానముగా, సతోప్రధానము నుండి తమోప్రధానముగా ఎలా అవుతాము, ఇది తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానులుగా అవ్వాలి. ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి వద్దకు వచ్చారు, వారికి శరీరము యొక్క ఆధారమైతే కావాలి కదా. వారు అంటారు, నేను వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. ఈ సమయములో ఉన్నది వానప్రస్థావస్థ. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున మొత్తం సృష్టి యొక్క కళ్యాణము జరుగుతుంది. ఇది భాగ్యశాలి రథము, వీరి ద్వారా ఎంత సేవ జరుగుతుంది. ఈ శరీరము యొక్క భానాన్ని వదిలేందుకు స్మృతి చేయాలి. ఇందులో జ్ఞానము యొక్క విషయము కాదు, ఎక్కువగా స్మృతిని నేర్పించాలి. జ్ఞానమైతే సహజమైనది. చిన్న పిల్లలు కూడా వినిపించగలరు. ఇకపోతే స్మృతిలోనే శ్రమ ఉంది. ఒక్కరి స్మృతియే ఉండాలి, దీనినే అవ్యభిచారి స్మృతి అని అంటారు. ఎవరి శరీరమునైనా స్మృతి చేయడము - అది వ్యభిచారీ స్మృతి వంటిది. స్మృతి ద్వారా అందరినీ మరచి అశరీరిగా అవ్వాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాతా-పితా బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి బలముతో మీ కర్మేంద్రియాలను శీతలముగా, శాంతిగా తయారుచేసుకోవాలి. పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థ రీతిలో తండ్రిని స్మృతి చేసి పావనముగా అవ్వాలి.

2. లేస్తూ-కూర్చుంటూ బుద్ధిలో ఉండాలి - ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్తాము. ఏ విధంగా తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉందో, అలా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి.

వరదానము:-
కంబైండు స్వరూపము యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనే సీట్ పై సెట్ అయ్యి ఉండే సదా సంపన్న భవ

సంగమయుగములో శివశక్తి కంబైండ్ స్వరూపము యొక్క స్మృతిలో ఉండడము ద్వారా ప్రతి అసంభవ కార్యము సంభవమైపోతుంది. ఇదే సర్వ శ్రేష్ఠ స్వరూపము. ఈ స్వరూపములో స్థితులై ఉండడము ద్వారా సంపన్న భవ యొక్క వరదానము లభిస్తుంది. బాప్ దాదా పిల్లలందరికీ సదా సుఖదాయి స్థితి యొక్క సీట్ ను ఇస్తారు. సదా ఇదే సీట్ పై సెట్ అయ్యి ఉన్నట్లయితే అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు, కేవలం విస్మృతి సంస్కారాలను సమాప్తము చేయండి.

స్లోగన్:-
శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగీలుగా తయారుచేయండి.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడు ఏకమతము యొక్క వాతావరణము తయారవుతుంది. అందుకే భిన్నత్వాన్ని ఇముడ్చుకోండి, అప్పుడు పరస్పరం ఏకతతో సమీపముగా వస్తారు మరియు సర్వుల ఎదురుగా ఉదాహరణ రూపముగా అవుతారు. బ్రాహ్మణ పరివారము యొక్క విశేషత ఏమిటంటే - అనేకము ఉన్నప్పటికీ ఏకత. ఈ ఏకత యొక్క వైబ్రేషన్లు మొత్తం విశ్వములో ఒకే ధర్మాన్ని, ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తాయి, అందుకే విశేషమైన అటెన్షన్ఉంచి భిన్నత్వాన్ని తొలగించి ఏకతను తీసుకురావాలి.