04-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను
దానము ఇస్తారు, మీరు మళ్ళీ ఇతరులకు దానము ఇస్తూ ఉండండి, ఈ దానము ద్వారానే సద్గతి
జరుగుతుంది’’
ప్రశ్న:-
ఏ
కొత్త మార్గము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు?
జవాబు:-
ఇంటికి వెళ్ళే
మార్గము మరియు స్వర్గములోకి వెళ్ళే మార్గము ఇప్పుడు తండ్రి ద్వారా మీకు లభించింది.
మీకు తెలుసు - శాంతిధామము ఆత్మలైన మన ఇల్లు, స్వర్గము వేరు, శాంతిధామము వేరు. ఈ
కొత్త మార్గము మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు అంటారు - ఇప్పుడు కుంభకర్ణుని
నిద్రను వదలండి, కళ్ళు తెరవండి, పావనముగా అవ్వండి. పావనముగా అయిన తర్వాతే ఇంటికి
వెళ్ళగలుగుతారు.
పాట:-
మేలుకోండి
ప్రేయసులారా మేలుకోండి...
ఓంశాంతి
భగవానువాచ. తండ్రి అర్థం చేయించారు - మనుష్యులను లేక దేవతలను భగవంతుడు అని అనడం
జరగదు ఎందుకంటే వారికి సాకారీ రూపము ఉంది. ఇకపోతే పరమపిత పరమాత్మకు అయితే ఆకారీ
రూపమూ లేదు, సాకారీ రూపమూ లేదు, అందుకే వారిని శివ పరమాత్మాయ నమః అని అనడం
జరుగుతుంది. జ్ఞానసాగరుడు ఒక్కరే. మనుష్యులెవ్వరిలోనూ జ్ఞానము ఉండదు. దేనికి
సంబంధించిన జ్ఞానము? రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము, అలాగే ఆత్మ మరియు
పరమాత్మల జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. కావున తండ్రి వచ్చి మేలుకొలుపుతారు - ఓ
ప్రేయసులారా, ఓ భక్తురాళ్ళారా, మేలుకోండి. స్త్రీ-పురుషులందరూ భక్తురాళ్ళే.
భగవంతుడిని స్మృతి చేస్తారు. వధువులందరూ ఆ ఒక్క వరుడిని స్మృతి చేస్తారు.
ప్రేయసులైన ఆత్మలందరూ ప్రియుడైన పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. అందరూ సీతలే,
రాముడు ఒక్క పరమపిత పరమాత్మయే. రామ అన్న పదాన్ని ఎందుకు వాడుతారు? ఇది రావణ రాజ్యము
కదా. కావున దీనితో పోలుస్తూ రామ రాజ్యము అని అంటారు. రాముడు అంటే తండ్రి, వారినే
ఈశ్వరుడు అని కూడా అంటారు, భగవంతుడు అని కూడా అంటారు. వారి వాస్తవిక నామము శివ.
కావున ఇప్పుడు అంటున్నారు - మేలుకోండి, ఇప్పుడు నవయుగము వస్తోంది. పాతది సమాప్తమవుతూ
ఉంది. ఈ మహాభారత యుద్ధము తర్వాత సత్యయుగము స్థాపన అవుతుంది మరియు ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది. పాత కలియుగము సమాప్తమవుతూ ఉంది, అందుకే తండ్రి
అంటారు - పిల్లలూ, కుంభకర్ణుని నిద్రను వదలండి, ఇప్పుడు కళ్ళు తెరవండి, కొత్త
ప్రపంచము వస్తోంది. కొత్త ప్రపంచాన్నే స్వర్గము, సత్యయుగము అని అంటారు. ఇది కొత్త
మార్గము. ఇంటికి మరియు స్వర్గానికి వెళ్ళే ఈ మార్గము ఎవ్వరికీ తెలియదు. స్వర్గము
వేరు, ఆత్మలు నివసించే శాంతిధామము వేరు. ఇప్పుడు తండ్రి అంటారు - మేలుకోండి, మీరు
రావణ రాజ్యములో పతితులుగా అయిపోయారు. ఈ సమయములో పవిత్ర ఆత్మలు ఒక్కరు కూడా ఉండరు.
ఇక్కడ ఉన్నవారిని పుణ్యాత్ములు అని అనరు. మనుష్యులు దాన పుణ్యాలు చేస్తారు కానీ
వారిలో పవిత్ర ఆత్మలు ఒక్కరు కూడా లేరు. ఈ కలియుగములో ఉన్నది పతిత ఆత్మలు,
సత్యయుగములో ఉన్నది పావన ఆత్మలు. అందుకే అంటారు - ఓ శివబాబా, మీరు వచ్చి మమ్మల్ని
పావన ఆత్మలుగా తయారుచేయండి. ఇది పవిత్రత యొక్క విషయము. ఈ సమయములో తండ్రి వచ్చి
పిల్లలైన మీకు అవినాశీ జ్ఞాన రత్నాల దానము ఇస్తారు. వారు అంటారు, మీరు కూడా ఇతరులకు
దానము ఇస్తూ ఉన్నట్లయితే పంచ వికారాల గ్రహణము తొలగిపోతుంది. 5 వికారాలను దానము ఇస్తే
దుఃఖము యొక్క గ్రహణము తొలగిపోతుంది, పవిత్రముగా అయి సుఖధామములోకి వెళ్ళిపోతారు. పంచ
వికారాలలో నంబర్ వన్ కామము, దానిని వదిలి పవిత్రముగా అవ్వండి. ఓ పతితపావనా, మమ్మల్ని
పావనముగా తయారుచెయ్యండి అని స్వయం కూడా అంటారు. పతితులు అని వికారులను అంటారు. ఈ
సుఖ-దుఃఖాల ఆట భారత్ కు సంబంధించినదే. తండ్రి భారత్ లోనే వచ్చి సాధారణ తనువులో
ప్రవేశిస్తారు, ఆ తర్వాత వారి జీవిత చరిత్రను కూడా కూర్చుని తెలియజేస్తారు. వీరందరూ
బ్రాహ్మణ, బ్రాహ్మణీలు, ప్రజాపిత బ్రహ్మాకు సంతానము. మీరు అందరికీ పవిత్రముగా
తయారయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. బ్రహ్మాకుమార, కుమారీలైన మీరు వికారాలలోకి
వెళ్ళలేరు. బ్రాహ్మణులైన మీది ఈ ఒకటే జన్మ. దేవతా వర్ణములో మీరు 20 జన్మలు
తీసుకుంటారు, తర్వాత వైశ్య వర్ణము, శూద్ర వర్ణములో 63 జన్మలు తీసుకుంటారు. బ్రాహ్మణ
వర్ణములో ఈ ఒక్క అంతిమ జన్మే, ఈ జన్మలోనే పవిత్రముగా తయారవ్వాలి. తండ్రి అంటారు,
పవిత్రముగా అవ్వండి. తండ్రి స్మృతి మరియు యోగబలముతో వికర్మలు భస్మమవుతాయి. ఈ ఒక్క
జన్మ పవిత్రముగా అవ్వాలి. సత్యయుగములోనైతే పతితులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఈ అంతిమ
జన్మలో పావనముగా అయితే ఇక 21 జన్మలు పావనముగా ఉంటారు. ఒకప్పుడు పావనముగా ఉండేవారు,
ఇప్పుడు పతితముగా అయ్యారు. పతితముగా ఉన్నారు కావుననే పిలుస్తారు. పతితముగా ఎవరు
తయారుచేసారు? రావణుడి ఆసురీ మతము. నేను తప్ప పిల్లలైన మిమ్మల్ని రావణ రాజ్యము నుండి,
దుఃఖము నుండి ఎవ్వరూ విముక్తులుగా చేయలేరు. అందరూ కామచితిపై కూర్చుని భస్మమైపోయారు.
నేను వచ్చి జ్ఞాన చితిపై కూర్చోబెట్టవలసి ఉంటుంది, జ్ఞాన జలాన్ని వేయవలసి ఉంటుంది,
అందరి సద్గతి చేయవలసి ఉంటుంది. ఎవరైతే చదువును బాగా చదువుకుంటారో, వారికే సద్గతి
లభిస్తుంది. మిగిలినవారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. సత్యయుగములో కేవలం
దేవీ-దేవతలే ఉన్నారు, వారికే సద్గతి లభించి ఉంది. మిగిలినవారందరికీ గతి లేక ముక్తి
లభిస్తుంది. 5 వేల సంవత్సరాల క్రితం ఈ దేవీ-దేవతల రాజ్యము ఉండేది. ఇది లక్షల
సంవత్సరాల విషయమేమీ కాదు. ఇప్పుడు తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ,
తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. మన్మనాభవ అన్న పదము ప్రసిద్ధమైనది. భగవానువాచ - ఏ
దేహధారినీ భగవంతుడు అని అనడం జరగదు. ఆత్మలైతే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని
తీసుకుంటాయి. ఒక్కోసారి స్త్రీగా, ఒక్కోసారి పురుషునిగా అవుతారు. భగవంతుడు ఎప్పుడూ
జనన-మరణాల ఆటలోకి రారు. ఇది డ్రామానుసారముగా నిశ్చితమై ఉంది. ఒక జన్మ ఇంకొక జన్మతో
కలవదు. మళ్ళీ మీ ఈ జన్మ రిపీట్ అయినప్పుడు ఇదే పాత్రను, ఇవే ముఖకవళికలను మళ్ళీ
తీసుకుంటారు. ఈ డ్రామా అనాదిగా తయారై, తయారుచేయబడినది. ఇది మారదు. శ్రీకృష్ణునికి
సత్యయుగములో ఏ శరీరమైతే ఉండేదో, అది మళ్ళీ అక్కడే లభిస్తుంది. ఆ ఆత్మ అయితే ఇప్పుడు
ఇక్కడ ఉంది. మనమే తిరిగి అలా తయారవుతామని మీకు ఇప్పుడు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణుల
చిత్రములోని ముఖకవళికలు ఏక్యురేట్ గా లేవు, కానీ మళ్ళీ అవి అలానే తయారవుతాయి. ఈ
విషయాలను కొత్తవారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే ఎవరికైనా బాగా అర్థం
చేయిస్తారో, అప్పుడు 84 జన్మల చక్రాన్ని తెలుసుకుంటారు మరియు తప్పకుండా ప్రతి
జన్మలోనూ నామ-రూపాలు, ముఖకవళికలు మొదలైనవి వేరువేరుగా ఉంటాయి అని అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు ఇతని అంతిమ 84 వ జన్మలోని ముఖకవళికలు ఇలా ఉన్నాయి, అందుకే నారాయణుడి
చిత్రములోని ముఖకవళికలను సుమారుగా వారి పోలికతో కలిసేలా చూపించారు. లేకపోతే
మనుష్యులు అర్థం చేసుకోలేరు.
మమ్మా, బాబాయే ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడైతే
పంచ తత్వాలు పవిత్రముగా లేవు. ఈ శరీరాలన్నీ పతితముగా ఉన్నాయి. సత్యయుగములో శరీరాలు
కూడా పవిత్రముగా ఉంటాయి. శ్రీకృష్ణుడిని అత్యంత సుందరమైనవారు అని అంటారు. అక్కడ
ప్రకృతిసిద్ధమైన సౌందర్యము ఉంటుంది. ఇక్కడ విదేశాలలో మనుష్యులు తెల్లగా ఉన్నా కానీ
వారిని దేవతలు అని అంటారా. దైవీ గుణాలైతే లేవు కదా. తండ్రి ఎంత మంచి రీతులో కూర్చుని
అర్థం చేయిస్తున్నారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు, దీని నుండి మీకు ఎంత ఉన్నతమైన
సంపాదన లభిస్తుంది. లెక్కలేనన్ని వజ్ర-వైఢూర్యాలు, ధనము ఉంటుంది. అక్కడైతే
వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. కావున మీరు ఎంత
ధనవంతులుగా అవుతారు. 21 జన్మల కొరకు అపారమైన సంపాదన, ఇందులో చాలా కష్టపడవలసి ఉంటుంది.
దేహీ-అభిమానులుగా అవ్వాలి. మనము ఆత్మ, ఈ పాత శరీరాన్ని వదిలి ఇప్పుడు తిరిగి మన
ఇంటికి వెళ్ళాలి. తండ్రి ఇప్పుడు తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఆత్మ అయిన మనము 84
జన్మలను ఇప్పుడు పూర్తి చేశాము, ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి, తండ్రిని స్మృతి
చేయాలి. లేకపోతే ఇది వినాశన సమయము. శిక్షలు అనుభవించి తిరిగి వెళ్ళిపోతారు.
లెక్కాచారాలనైతే అందరూ తీర్చుకోవలసిందే. భక్తి మార్గములో కాశీలోని కత్తుల బావిలోకి
దూకి స్వయాన్ని బలి చేసుకున్నా ఎవ్వరూ ముక్తిని పొందరు. అది భక్తి మార్గము, ఇది
జ్ఞాన మార్గము. ఇందులో జీవహత్య చేసుకునే అవసరముండదు. అక్కడ అది జీవహత్యే, అయినా
ముక్తిని పొందాలి అనే భావన ఉంటుంది, అందుకే పాపాల లెక్కాచారము తీరిపోయి మళ్ళీ
కొత్తగా మొదలవుతుంది. ఇప్పుడైతే కాశీలోని కత్తుల బావిలోకి ఈ విధంగా దూకేందుకు ఎవరైనా
కష్టం మీద ధైర్యం చేస్తారు. కానీ ముక్తి మరియు జీవన్ముక్తి మాత్రము లభించవు. తండ్రి
తప్ప జీవన్ముక్తిని ఇంకెవ్వరూ ఇవ్వనేలేరు. ఆత్మలు వస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఎలా
వెళ్తారు? తండ్రియే వచ్చి సర్వుల సద్గతిని చేసి తిరిగి తీసుకువెళ్తారు. సత్యయుగములో
చాలా తక్కువమంది మనుష్యులు ఉంటారు. ఆత్మ అయితే ఎప్పుడూ వినాశనమవ్వదు. ఆత్మ అవినాశీ,
శరీరము వినాశీ. సత్యయుగములో ఆయువు ఎక్కువగా ఉంటుంది. దుఃఖము యొక్క విషయము ఉండదు. ఒక
శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. సర్పము ఉదాహరణ ఉంది కదా, దానిని మరణించడం అని
అనరు. అక్కడ దుఃఖము యొక్క విషయము లేదు. ఇప్పుడు సమయము పూర్తయ్యింది, ఈ శరీరాన్ని
వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని వారు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు ఈ శరీరము
నుండి అతీతముగా అయ్యే అభ్యాసాన్ని ఇక్కడే అలవరచుకోవాలి. నేను ఆత్మను, ఇప్పుడు నేను
ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తాను, కొత్త శరీరాన్ని ధరిస్తాను, ఈ
అభ్యాసము అలవరచుకోండి. ఆత్మ 84 శరీరాలు తీసుకుంటుందని మీకు తెలుసు. మనుష్యులేమో 84
లక్షలు అని అనేసారు. తండ్రినైతే లెక్కలేనన్ని రాళ్ళు-రప్పలలో ఉన్నారని అనేసారు.
దీనినే ధర్మగ్లాని అని అంటారు. మనుష్యులు స్వచ్ఛబుద్ధి కలవారి నుండి పూర్తిగా
తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా
తయారుచేస్తారు. స్మృతి ద్వారానే స్వచ్ఛముగా తయారవుతారు. తండ్రి అంటారు, ఇప్పుడు
నవయుగము వస్తోంది, దానికి గుర్తు ఈ మహాభారత యుద్ధము. మిసైల్స్ తో జరిగిన ఆ యుద్ధము
ఇదే, ఇందులో అనేక ధర్మాలు వినాశనమై ఏక ధర్మ స్థాపన జరిగింది, కావున తప్పకుండా ఇందులో
భగవంతుడు ఉంటారు కదా. శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎలా రాగలరు? జ్ఞానసాగరుడు నిరాకారుడా
లేక శ్రీకృష్ణుడా? శ్రీకృష్ణుడికి ఈ జ్ఞానమే ఉండదు. ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. మీవి
కూడా మళ్ళీ భక్తి మార్గములో చిత్రాలు తయారవుతాయి. పూజ్యులైన మీరే పూజారులుగా అవుతారు,
కళలు తగ్గిపోతాయి. ఆయుష్షు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే భోగీగా అవుతారు. అక్కడ
ఉన్నవారు యోగీ. అలాగని ఎవరి స్మృతిలోనో యోగము జోడిస్తారని కాదు. అక్కడ ఉండేదే
పవిత్రులు. శ్రీకృష్ణుడిని కూడా యోగేశ్వరుడు అని అంటారు. ఈ సమయములో శ్రీకృష్ణుని
ఆత్మ తండ్రితో యోగము జోడిస్తూ ఉంది. శ్రీకృష్ణుని ఆత్మ ఈ సమయములో యోగేశ్వరుడు,
వారిని సత్యయుగములో యోగేశ్వరుడు అని అనరు. అక్కడైతే యువరాజుగా అవుతారు. మీది
అంతిమములో ఎటువంటి అవస్థ ఉండాలంటే, ఒక్క తండ్రి తప్ప ఇంకే శరీరమూ గుర్తు ఉండకూడదు.
శరీరము నుండి మరియు పాత ప్రపంచము నుండి మమకారము తొలగిపోవాలి. సన్యాసులైతే పాత
ప్రపంచములోనే ఉంటారు కానీ ఇళ్ళు-వాకిళ్ళ నుండి మమకారాన్ని తొలగించేస్తారు.
బ్రహ్మమును ఈశ్వరునిగా భావిస్తూ దానితో యోగాన్ని జోడిస్తారు. స్వయాన్ని
బ్రహ్మజ్ఞానులుగా, తత్వజ్ఞానులుగా చెప్పుకుంటారు. మేము బ్రహ్మములో లీనమైపోతాము అని
భావిస్తారు. తండ్రి అంటారు, ఇవన్నీ తప్పు. నేనే రైట్, నన్నే ట్రూత్ (సత్యము) అని
అంటారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్మృతియాత్ర చాలా పక్కాగా ఉండాలి. జ్ఞానమైతే చాలా
సహజమైనది. దేహీ-అభిమానిగా అవ్వడములోనే శ్రమ ఉంది. తండ్రి అంటారు, ఎవరి దేహమూ
గుర్తుకు రాకూడదు, వస్తే అది భూతాల స్మృతి, భూత పూజ. నేనైతే అశరీరిని, మీరు నన్ను
స్మృతి చేయాలి. ఈ నేత్రాల ద్వారా చూస్తున్నా బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి.
తండ్రి డైరెక్షన్లపై నడిచినట్లయితే ధర్మరాజు శిక్షల నుండి విముక్తులవుతారు. పావనముగా
తయారైతే శిక్షలు సమాప్తమైపోతాయి, ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ప్రజలుగా తయారవ్వడమైతే
చాలా సహజము, అందులోనూ షావుకారు ప్రజలుగా, పేద ప్రజలుగా ఎవరెవరు అవ్వగలరు అనేది అంతా
అర్థం చేయిస్తారు. అంతిమములో మీ బుద్ధియోగము తండ్రి మరియు ఇంటితో ఉండాలి. ఏ విధముగా
నాటకములో పాత్రధారుల పాత్ర పూర్తి అయితే బుద్ధి ఇంటివైపుకు వెళ్ళిపోతుందో, అలా ఇది
అనంతమైన విషయము. అది హద్దులోని సంపాదన, ఇది అనంతమైన సంపాదన. మంచి పాత్రధారులకు
సంపాదన కూడా చాలా ఉంటుంది కదా. కావున తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ
బుద్ధియోగాన్ని అక్కడ జోడించాలి. వారు ఒకరికొకరు ప్రేయసీ, ప్రియులుగా అవుతారు.
ఇక్కడైతే ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయసులు. వారినే అందరూ స్మృతి చేస్తారు. వారు
అద్భుతమైన యాత్రికుడు కదా. అన్ని దుఃఖాల నుండి విడిపించి సద్గతిలోకి
తీసుకువెళ్ళేందుకని ఈ సమయములో వచ్చారు. వారిని సత్యాతి-సత్యమైన ప్రియుడు అని అంటారు.
వాళ్ళు శరీరాలను చూసి ప్రేమించుకుంటారు, వికారాల విషయమేమీ ఉండదు. దానిని దేహాభిమాన
యోగము అని అంటారు. అది భూతాలను స్మృతి చేసినట్లు అవుతుంది. మనుష్యులను స్మృతి చేయడము
అనగా పంచ భూతాలను, ప్రకృతిని స్మృతి చేయడము. తండ్రి అంటారు, ప్రకృతిని మరచి నన్ను
స్మృతి చేయండి. ఇది శ్రమతో కూడుకున్నది కదా. దీనితోపాటు దైవీ గుణాలు కూడా కావాలి.
ఎవరిపైనైనా ప్రతీకారము తీర్చుకోవడము, ఇది కూడా ఆసురీ గుణమే. సత్యయుగములో ఉండేదే ఒక
ధర్మము, అక్కడ ప్రతీకారము యొక్క విషయమేమీ ఉండదు. అది ఉన్నదే అద్వైత దేవతా ధర్మము,
దానిని శివబాబా తప్ప ఇంకెవ్వరూ స్థాపన చేయలేరు. సూక్ష్మవతనవాసీ దేవతలను ఫరిశ్తాలు
అని అంటారు. ఈ సమయములో మీరు బ్రాహ్మణులు, ఆ తర్వాత ఫరిశ్తాలుగా అవుతారు. మళ్ళీ
తిరిగి ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి వచ్చి దైవీ గుణాలు కల
మనుష్యులుగా అనగా దేవతలుగా అవుతారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు.
ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా అవ్వకపోతే వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. వీరు
ప్రజాపిత బ్రహ్మా మరియు మమ్మా, వీరే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇప్పుడు
చూడండి, మీతో, జైన ధర్మము వారు మా జైన ధర్మము అన్నింటికన్నా పురాతనమైనది అని అంటారు.
ఇప్పుడు వాస్తవానికి మహావీర్ అని ఆదిదేవ్ అయిన బ్రహ్మానే అంటారు. వాస్తవానికి అది
బ్రహ్మాయే, కానీ ఎవరో ఒక జైన ముని వస్తే అతనికి మహావీర్ అన్న పేరును పెట్టారు.
ఇప్పుడు మీరందరూ మహావీరులే కదా. మాయపై విజయము పొందుతున్నారు. మీరందరూ వీరులుగా
అవుతారు. సత్యాతి, సత్యమైన మహావీరులు, మహావీరనీలు మీరే. మీ పేరు శివశక్తి, మీ స్వారీ
సింహముపై ఉంది, అలాగే మహారథుల స్వారీ ఏనుగుపై. అయినా కూడా తండ్రి అంటారు, ఇది చాలా
ఉన్నతమైన గమ్యము. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే మార్గమూ
లేదు. యోగబలముతో మీరు విశ్వముపై రాజ్యము చేస్తారు. ఆత్మ అంటుంది, ఇప్పుడు నేను
ఇంటికి వెళ్ళాలి, ఇది పాత ప్రపంచము, ఇది అనంతమైన సన్యాసము. గృహస్థ వ్యవహారములో ఉంటూ
పవిత్రముగా అవ్వాలి మరియు చక్రాన్ని అర్థం చేసుకోవడము ద్వారా చక్రవర్తీ రాజులుగా
అవుతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఎవరి దేహాన్నీ స్మృతి చేయకూడదు, ఈ
కళ్ళ ద్వారా అన్నీ చూస్తూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అశరీరులుగా అయ్యే అభ్యాసము
చేయాలి. పావనముగా అవ్వాలి.
2. ముక్తి మరియు జీవన్ముక్తి మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు నాటకము
పూర్తయ్యింది, ఇక ఇంటికి వెళ్ళాలి - ఈ స్మృతితో అనంతమైన సంపాదనను జమ చేసుకోవాలి.
వరదానము:-
ఒక్క క్షణము యొక్క ఆటతో మొత్తం కల్పము యొక్క భాగ్యాన్ని
తయారుచేసుకునే శ్రేష్ఠ భాగ్యవాన్భవ
ఈ సంగమయుగ సమయానికి వరదానము లభించింది - ఏది కావాలనుకుంటే
అది, ఎలా కావాలనుకుంటే అలా, ఎంత కావాలనుకుంటే అంత భాగ్యాన్ని తయారుచేసుకోగలరు
ఎందుకంటే భాగ్యవిధాత అయిన తండ్రి భాగ్యాన్ని తయారుచేసుకునే తాళంచెవిని పిల్లల చేతికి
ఇచ్చారు. చివరిలోని వారు కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ లోకి రాగలరు. కేవలం సేవల
విస్తారములో స్వయం యొక్క స్థితిని క్షణములో సార స్వరూపముగా తయారుచేసుకునే అభ్యాసము
చేయండి. ఒక్క క్షణములో మాస్టర్బీజరూపులుగా అయిపోండి అని ఇప్పుడిప్పుడే
డైరెక్షన్లభిస్తే దానికి సమయం పట్టకూడదు. ఈ ఒక్క క్షణము యొక్క ఆటతో మొత్తం కల్పము
యొక్క భాగ్యాన్ని తయారుచేసుకోవచ్చు.
స్లోగన్:-
డబల్సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసినట్లయితే ప్రకృతి దాసిగా
అయిపోతుంది.
అవ్యక్త సూచనలు -
ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకత మరియు ఏకాగ్రతను అలవరచుకోండి
అనేక వృక్షాల కొమ్మలు
ఇప్పుడు ఒకే చందన వృక్షముగా అయ్యాయి. ఇద్దరు, నలుగురు మాతలు కూడా ఒకేచోట కలిసి
ఉండలేరు అని మనుష్యులు అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మాతలు మొత్తము విశ్వములో ఏకతను
స్థాపన చేయడానికి నిమిత్తముగా ఉన్నారు. మాతలే భిన్నత్వములో ఏకత్వాన్ని తీసుకువచ్చారు.
దేశాలు వేర్వేరు, భాషలు వేర్వేరు, సంస్కృతి వేర్వేరు, కానీ మీరు భిన్నత్వములో
ఏకత్వాన్ని తీసుకువచ్చారు.
| | |