05-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ శరీరము రూపీ వస్త్రాలను ఇక్కడే
వదిలేయాలి, అందుకే వీటి నుండి మమకారాన్ని తొలగించండి, మిత్ర-సంబంధీకులెవ్వరూ
గుర్తుకు రాకూడదు’’
ప్రశ్న:-
ఏ పిల్లలలోనైతే
యోగబలము ఉందో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
వారికి ఏ
విషయములోనూ కొద్దిగా కూడా అలజడి కలగదు, ఎక్కడా కూడా మోహము ఉండదు. ఒకవేళ ఈ రోజు
ఎవరైనా శరీరము వదిలినా వారికి దుఃఖము కలగదు, ఎందుకంటే వారికి తెలుసు - డ్రామాలో వారి
పాత్ర అంతే ఉంది, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది.
ఓంశాంతి
ఈ జ్ఞానము చాలా గుప్తమైనది, ఇందులో నమస్తే కూడా చెప్పవలసిన అవసరము ఉండదు. ప్రపంచములో
నమస్తే అని లేక రామ-రామ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఆ విషయాలేవీ నడవవు ఎందుకంటే ఇది ఒక
కుటుంబము. కుటుంబములో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడము అంతగా
శోభించదు. ఇంట్లోనైతే ఆహార-పానీయాలు తీసుకుంటారు, ఆఫీసుకు వెళ్తారు, మళ్ళీ వస్తారు,
ఇలా నడుస్తూ ఉంటుంది. నమస్తే చెప్పవలసిన అవసరము ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పే
ఫ్యాషన్ కూడా యూరోపియన్ల నుండి వచ్చింది. లేకుంటే ఇంతకుముందు ఇవేమీ ఉండేవి కాదు.
కొన్ని సత్సంగాలలో పరస్పరం కలుసుకున్నప్పుడు నమస్తే చెప్పుకుంటారు, పాదాలకు
నమస్కరిస్తారు. ఈ పాదాలకు నమస్కరించడము మొదలైనవి నమ్రత కోసము నేర్పిస్తారు. ఇక్కడైతే
పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మ, ఆత్మకు ఏమి చేస్తుంది? అయినా కూడా
ఇలా చెప్పవలసి అయితే ఉంటుంది. ఎలాగైతే బాబాకు - బాబా, నమస్తే అని చెప్తారు. ఇప్పుడు
తండ్రి కూడా అంటారు - నేను సాధారణ బ్రహ్మా తనువు ద్వారా మిమ్మల్ని చదివిస్తాను, ఇతని
ద్వారా స్థాపన చేయిస్తాను. ఎలా? అది కూడా ఎప్పుడైతే తండ్రి సమ్ముఖముగా ఉంటారో
అప్పుడే అర్థం చేయించగలరు, లేదంటే ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలరు. ఈ తండ్రి సమ్ముఖముగా
కూర్చుని అర్థం చేయించినట్లయితే అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. బాప్ దాదా,
నమస్తే! అని ఇరువురికీ నమస్తే చెప్పవలసి ఉంటుంది. బయటివారు ఒకవేళ ఎవరైనా ఇది వింటే
- వీరు ‘బాప్ దాదా’ అని అంటున్నారేమిటి అని తికమకపడతారు. డబుల్ పేర్లు కూడా చాలా
మంది మనుష్యులకు ఉంటాయి కదా. ఏ విధంగా లక్ష్మీనారాయణ మరియు రాధాకృష్ణ... అన్న పేర్లు
కూడా ఉన్నాయి. ఇది స్త్రీ-పురుషులు కలిసిపోయినట్లు ఉంది. ఇప్పుడు వీరైతే బాప్ దాదా.
ఈ విషయాలనైతే పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. తప్పకుండా వీరిరువురిలో తండ్రియే
పెద్దవారు. వాళ్ళకు పేర్లు డబల్ ఉన్నా వ్యక్తి అయితే ఒక్కరే కదా. మరి రెండు పేర్లూ
ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలైన మీకు - ఈ పేర్లు తప్పు అని తెలుసు. బాబాను
ఇంకెవ్వరూ గుర్తించలేరు. మీరు - నమస్తే బాప్ దాదా అని అంటారు, అప్పుడు తండ్రి -
నమస్తే దైహిక మరియు ఆత్మిక పిల్లలూ అని అంటారు, కానీ అంత పొడుగ్గా ఉంటే అది శోభించదు.
పదాలైతే సరైనవే. మీరు ఇప్పుడు దైహికమైన పిల్లలు కూడా మరియు ఆత్మిక పిల్లలు కూడా.
శివబాబా ఆత్మలందరికీ తండ్రి మరియు ప్రజాపిత కూడా తప్పకుండా ఉన్నారు. ప్రజాపిత
బ్రహ్మాకు సంతానము సోదరీ-సోదరులు. అది ప్రవృత్తి మార్గము అవుతుంది. మీరందరూ
బ్రహ్మాకుమార-కుమారీలు. బ్రహ్మాకుమార-కుమారీలు అవ్వడముతో ప్రజాపిత ఉన్నారని కూడా
నిరూపణ అవుతుంది. ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయమేమీ లేదు. మీరు ఇలా చెప్పండి -
బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, బ్రహ్మా నుండి
లభించదు. బ్రహ్మా కూడా శివబాబా సంతానమే. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులు
రచన. వీరి రచయిత శివుడు. శివుని విషయములోనైతే - వీరి రచయిత ఎవరు అన్నది ఎవ్వరూ
చెప్పలేరు. శివుడిని రచించేవారు ఎవ్వరూ ఉండరు. బ్రహ్మా, విష్ణు, శంకరులు - వీరు రచన.
వీరికంటే కూడా పైన ఉన్నవారు శివుడు, వారు సర్వాత్మలకూ తండ్రి. ఇప్పుడు వారు రచయిత
అయినట్లయితే, మరి ఎప్పుడు రచించారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదైతే అనాది.
ఇంతమంది ఆత్మలను ఎప్పుడు రచించారు? ఈ ప్రశ్న ఉత్పన్నమవ్వడానికి లేదు. ఈ అనాది డ్రామా
నడుస్తూ ఉంటుంది, ఇది అనంతమైనది. ఇది ఎప్పటికీ అంతమవ్వదు. ఈ విషయాలు పిల్లలైన మీలో
కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజము. ఎవరైనా మరణించినా లేక జీవించి
ఉన్నా కూడా, ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మోహము ఉండకూడదు. తల్లి మరణించినా
హల్వా తినండి... అన్న గాయనము కూడా ఉంది. ఎవరు మరణించినా సరే చింతించవలసిన విషయమేమీ
లేదు ఎందుకంటే ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. డ్రామానుసారముగా వారు ఈ సమయములో
వెళ్ళవలసే ఉంది, ఇందులో చేయగలిగినది ఏముంది. కొద్దిగా కూడా దుఃఖితులుగా అయ్యే విషయము
లేదు. ఇది యోగబలము యొక్క అవస్థ. కొద్దిగా కూడా అలజడిలోకి రాకూడదు అని ‘నియమము’
చెప్తుంది. అందరూ పాత్రధారులే కదా. తమ-తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు. పిల్లలకు
జ్ఞానము లభించి ఉంది.
తండ్రితో అంటారు - ఓ పరమపిత పరమాత్మా, మీరు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఇన్ని
శరీరాలన్నింటినీ వినాశనము చేయించి ఆత్మలందరినీ తమతోపాటు తీసుకువెళ్ళడము, ఇది చాలా
పెద్ద పని. ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే 12 నెలలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి అయితే
ఇన్ని లెక్కలేనన్ని ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. అందరి శరీరాలను ఇక్కడే వదిలేస్తారు.
మహాభారత యుద్ధము మొదలైతే ఇక దోమల గుంపులా వెళ్తూనే ఉంటారు అని పిల్లలకు తెలుసు.
ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. ఈ మొత్తం ప్రపంచమంతా మారుతుంది. ఇప్పుడు
చూడండి, ఇంగ్లాండ్, రష్యా మొదలైనవి ఎంత పెద్ద-పెద్దవి. సత్యయుగములో ఇవన్నీ ఉండేవా
ఏమిటి? అసలు మన రాజ్యములో వీరెవ్వరూ ఉండేవారు కాదు అన్న విషయము కూడా ప్రపంచములో ఎవరి
బుద్ధిలోకి రాదు. ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేవి, మీలో కూడా ఇది మంచి రీతిలో బుద్ధి
కూర్చోవడంలో నంబరువారుగా ఉన్నారు. ఒకవేళ ధారణ ఉన్నట్లయితే ఆ నషా సదా ఎక్కి ఉండాలి.
నషా కొందరికి చాలా కష్టం మీద ఎక్కి ఉంటుంది. మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరి వైపు
నుండి స్మృతిని తొలగించి ఒక్క అనంతమైన సంతోషములో స్థితులవ్వాలి, ఇది చాలా అద్భుతము.
అవును, ఇది కూడా అంతిమములో జరుగుతుంది. చివరిలోనే కర్మాతీత అవస్థను పొందుతారు.
శరీరము పట్ల నుండి కూడా భానము తెగిపోతుంది. ఏ విధంగానైతే నాటకములోనివారు పాత్రను
అభినయించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారో, అలా ఇప్పుడిక మనము వెళ్ళిపోతాము అనేది ఒక
సామాన్యమైన విషయములా అయిపోతుంది. ఈ దేహము రూపీ వస్త్రాలను అయితే మీరు ఇక్కడే
వదిలేయాలి. ఈ వస్త్రాలను (దేహాలను) ఇక్కడే తీసుకుంటారు, ఇక్కడే వదిలేస్తారు. ఈ
కొత్త విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి, ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. అల్ఫ్ మరియు బే (భగవంతుడు
మరియు రాజ్యాధికారము). భగవంతుడు అందరికంటే పైన ఉన్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన,
శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన అని అంటారు కూడా. అచ్ఛా, మరి శివుని
కర్తవ్యము ఏమిటి? ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. వారు సర్వవ్యాపి,
ఇవన్నీ వారి రూపాలే అని అనేస్తారు. మొత్తము ప్రపంచములోని వారందరి బుద్ధిలోనూ ఇది
పక్కా అయిపోయింది, అందుకే అందరూ తమోప్రధానముగా అయ్యారు. తండ్రి అంటారు - మొత్తము
ప్రపంచమంతా దుర్గతిని పొందింది, మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. ఒకవేళ
సర్వవ్యాపి అయినట్లయితే మరి అందరూ భగవంతుడిగా అయిపోతారా? ఒకవైపు అందరూ సోదరులే అని
అంటారు, ఇంకొకవైపు అందరూ తండ్రులే అని అంటారు, ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు
పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే
మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఈ దాదాను లేక మమ్మాను కూడా స్మృతి చేయకూడదు. తండ్రి
అయితే అంటారు - మమ్మాకు గాని, బాబాకు గాని ఎవరికీ ఏ మహిమ లేదు. శివబాబా లేకపోతే ఈ
బ్రహ్మా కూడా ఏమి చేస్తారు? వీరిని స్మృతి చేయడము ద్వారా ఏమి జరుగుతుంది! వీరి
ద్వారా మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని, అంతేకానీ వీరి నుండి కాదు
అని మీకు తెలుసు. వీరు కూడా వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు, కావున స్మృతి
వారినే చేయాలి. వీరు మధ్యలో మధ్యవర్తి వంటివారు. అబ్బాయికి మరియు అమ్మాయికి
నిశ్చితార్థమయ్యాక, వారు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు కదా. వివాహము చేయించేవారు
మధ్యలోని మధ్యవర్తి. వీరి ద్వారా తండ్రి ఆత్మలైన మీ నిశ్చితార్థం తమతో
చేయించుకుంటారు, అందుకే సద్గురువు మధ్యవర్తి రూపములో లభించారు అన్న గాయనము కూడా ఉంది.
వాస్తవానికి సద్గురువు మధ్యవర్తి ఏమీ కాదు. సద్గురువు అయితే నిరాకారుడు. గురు
బ్రహ్మా, గురు విష్ణు అని అంటారు కానీ వారు గురువు ఏమీ కారు. సద్గురువు ఒక్క తండ్రి
మాత్రమే, వారే సర్వులకు సద్గతిని ఇస్తారు. తండ్రి మీకు నేర్పించారు కావున మీరు
ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తారు మరియు అందరికీ - చూస్తూ కూడా చూడకండి అని
చెప్తారు. బుద్ధి శివబాబాతో జోడించబడి ఉండాలి. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అది
స్మశానగ్రస్థమవ్వనున్నది. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి, అంతేకానీ వీరిని కాదు.
వారసత్వము వీరి ద్వారా లభించదని, వారసత్వమైతే తండ్రి నుండే లభించనున్నది అని బుద్ధి
చెప్తుంది. వెళ్ళాల్సింది కూడా తండ్రి వద్దకే. విద్యార్థి, విద్యార్థిని ఏమైనా
గుర్తు చేస్తారా. విద్యార్థి అయితే టీచరునే గుర్తు చేస్తారు కదా. స్కూల్లో చురుకైన
పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఇతరులను కూడా ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నము
చేస్తారు. తండ్రి కూడా అంటారు, ఒకరినొకరు ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నము
చేయండి, కానీ భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా చేయరు. కొంచెంలోనే సంతోషపడిపోతారు.
ప్రదర్శినీకి ఎంతోమంది వస్తారు, అనేకులకు అర్థం చేయించడం ద్వారా ఉన్నతి ఎంతగానో
జరుగుతుంది అని అర్థం చేయించాలి. ఆహ్వానము ఇచ్చి పిలవండి, అప్పుడు గొప్ప-గొప్ప
వివేకవంతులైన వ్యక్తులు వస్తారు. ఆహ్వానము లేకుండానైతే అనేక రకాలవారు వచ్చేస్తారు.
ఏవేవో తప్పుడు మాటలు మాట్లడుతూ ఉంటారు. రాయల్ మనుష్యుల యొక్క నడత, నడవడిక కూడా రాయల్
గా ఉంటుంది. రాయల్ వ్యక్తులు రాయల్టీతో లోపలికి ప్రవేశిస్తారు. వారి నడవడములో కూడా
చాలా వ్యత్యాసముంటుంది. మిగతావారి యొక్క నడవడములో, మాట్లాడటములో సభ్యత ఉండదు.
మేళాలోనైతే అన్ని రకాలవారు వచ్చేస్తారు, ఎవరినీ ఆపడం జరగదు, అందుకే ఎక్కడైనా
ప్రదర్శినీ పెట్టినప్పుడు ఆహ్వాన కార్డు ద్వారా ఆహ్వానించినట్లయితే మంచి-మంచి రాయల్
వ్యక్తులు వస్తారు. వారు వెళ్ళి ఇతరులకు కూడా వినిపిస్తారు. ఎప్పుడైనా స్త్రీలకు
సంబంధించిన కార్యక్రమాన్ని పెడితే, కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు ఎందుకంటే
కొన్ని చోట్ల స్త్రీలు తెర వెనుక ఉంటారు. కావున కేవలం స్త్రీల కోసము మాత్రమే కొన్ని
కార్యక్రమాలు ఉండాలి. అక్కడకు పురుషులు ఎవ్వరూ రాకూడదు. బాబా అర్థం చేయించారు,
మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడు అన్నది అర్థం చేయించాలి. శివబాబా మరియు ప్రజాపిత
బ్రహ్మా, ఇద్దరూ తండ్రులే. ఇద్దరి తండ్రుల నుండీ వారసత్వాన్ని పొందేందుకు ఇద్దరూ
ఒకేలా ఉండరు. వారసత్వము తాతగారిది లేక తండ్రిది లభిస్తుంది. తాతగారి ఆస్తిపై హక్కు
ఉంటుంది. ఎటువంటి కుపుత్రుడైనా కానీ తాతగారి వారసత్వము లభిస్తుంది. ఇది ఇక్కడి
నియమము. ఇతనికి డబ్బు లభిస్తే ఒక సంవత్సరం లోపల పోగొట్టేస్తాడని అర్థం చేసుకుంటారు
కూడా, కానీ ప్రభుత్వము యొక్క నియమము అలా ఉన్న కారణముగా ఇవ్వవలసి వస్తుంది.
ప్రభుత్వము ఏమీ చేయలేదు. బాబా అయితే అనుభవజ్ఞులు. ఒక రాజుకు కొడుకు ఉండేవాడు, అతను
ఒక కోటి రూపాయలను 12 నెలలలో సమాప్తము చేసేసాడు. అలాంటివారు కూడా ఉంటారు. నేను
అలాంటివాళ్ళను చూసాను అని శివబాబా అయితే అనరు. నేను అలాంటి ఉదాహరణలను ఎన్నో చూసానని
ఈ దాదా అంటారు. ఈ ప్రపంచమైతే చాలా అశుద్ధముగా ఉంది. ఇది ఉన్నదే పాత ప్రపంచము, పాత
ఇల్లు. పాత ఇంటిని ఎప్పుడూ పడగొట్టవలసి ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యగృహాలు
చూడండి, ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి.
ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటున్నారు మరియు మీరు కూడా నరుని నుండి
నారాయణునిగా అవుతారు. ఇదే సత్యనారాయణుని కథ. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం
చేసుకుంటారు. మీలో కూడా పూర్తిగా పుష్పాలులా ఇప్పుడింకా తయారవ్వలేదు, ఇందులో రాయల్టీ
చాలా బాగా ఉండాలి. మీరు రోజురోజుకు ఉన్నతి చెందుతూ ఉంటారు. పుష్పాలుగా తయారవుతూ
ఉంటారు.
పిల్లలైన మీరు ప్రేమగా ‘‘బాప్ దాదా’’ అని అంటారు. ఇది కూడా మీ కొత్త భాష, ఇది
మనుష్యులకు అర్థం కాదు. బాబా ఎక్కడికైనా వెళ్తే పిల్లలు - బాప్ దాదా, నమస్తే అని
చెప్తారు. బాబా, ఆత్మికమైన మరియు దైహికమైన పిల్లలకు నమస్తే అని రెస్పాన్స్ ఇస్తారు.
ఇలా చెప్పవలసి ఉంటుంది కదా. ఎవరైనా వింటే ఏమంటారంటే - ఇదేదో కొత్త విషయములా ఉంది,
బాప్ దాదా అని కలిపి ఎలా అంటున్నారు, తండ్రి మరియు దాదా, ఇరువురూ ఎప్పుడైనా ఒక్కరే
అవుతారా ఏమిటి? పేర్లు కూడా ఇరువురివీ వేరుగా ఉన్నాయి. శివబాబా, బ్రహ్మాదాదా, మీరు
వీరిరువురికి పిల్లలు. వీరి లోపల శివబాబా కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. మనము బాప్
దాదాకు పిల్లలము. ఈ విషయము బుద్ధిలో గుర్తున్నా సరే సంతోషము యొక్క పాదరసము పైకి
ఎక్కి ఉంటుంది మరియు డ్రామాపై కూడా పక్కాగా ఉండాలి. ఎవరైనా శరీరాన్ని వదిలితే వారు
వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తారు. ప్రతి ఒక్క ఆత్మకు అవినాశీ పాత్ర లభించి ఉంది,
ఇందులో ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. వారు వెళ్ళి ఇంకొక పాత్రను అభినయించవలసి
ఉంటుంది. తిరిగి వెనక్కి పిలవలేరు. ఇది డ్రామా కదా. ఇందులో ఏడవవలసిన విషయమేమీ లేదు.
ఇటువంటి అవస్థ కలవారే వెళ్ళి నిర్మోహీ రాజులుగా అవుతారు. సత్యయుగములో అందరూ
నిర్మోహులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగా ఏడుస్తారు. తండ్రిని పొందిన
తర్వాత ఇక ఏడవవలసిన అవసరమే లేదు. బాబా ఎంత చక్కటి మార్గాన్ని తెలియజేస్తారు.
కన్యలకైతే ఇది చాలా మంచిది. లౌకిక తండ్రి వృధాగా డబ్బు ఖర్చుపెడతారు మరియు మీరు
వెళ్ళి నరకములో పడతారు. దానికంటే మీరు ఇలా చెప్పండి - మేము ఈ డబ్బుతో ఆత్మిక
యూనివర్శిటీ మరియు హాస్పిటల్ ను తెరుస్తాము, ఎంతోమంది కళ్యాణము చేసినట్లయితే మీకు
కూడా పుణ్యము, మాకూ కూడా పుణ్యము. మేము భారత్ ను స్వర్గముగా తయారుచేసేందుకు తనువు,
మనసు, ధనము అన్నీ ఖర్చు పెడతాము అని ఆ పిల్లలు స్వయం కూడా ఉత్సాహములో ఉండేవారై
ఉండాలి. ఇంతటి నషా ఉండాలి. ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. మీరు స్వ కళ్యాణాన్ని
మరియు అనేకుల కళ్యాణాన్ని చేసుకోవాలని అనుకోవడం లేదా? ఇంతటి నషా ఉండాలి. విశేషముగా
కుమారీలైతే చాలా దృఢముగా ఉండాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ నడత, నడవడికను చాలా రాయల్ గా ఉంచుకోవాలి. చాలా సభ్యతతో మాట్లాడాలి. నమ్రతా
గుణాన్ని ధారణ చేయాలి.
2. ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో - అదంతా స్మశానగ్రస్థమవ్వనున్నది, అందుకే దీనిని
చూస్తూ కూడా చూడకూడదు. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి, ఏ దేహధారినీ కాదు.
వరదానము:-
మాస్టర్జ్ఞాన సాగరులుగా అయి బొమ్మల ఆటను సమాప్తము చేసే స్మృతి
మరియు సమర్థీ స్వరూప భవ
ఏ విధంగా భక్తి మార్గములో విగ్రహాలను తయారుచేసి పూజ
మొదలైనవి చేస్తారు, ఆ తర్వాత వాటిని ముంచేస్తారు, అందుకే మీరు దానిని బొమ్మల పూజ
అని అంటారు. అదే విధంగా మీ ముందుకు కూడా ఎప్పుడైనా, ఏవైనా నిర్జీవమైన,
నిస్సారమైన విషయాలు, ఈర్ష్య, అనుమానము, ఆవేశము మొదలైనవాటితో కూడిన విషయాలు వస్తాయో
మరియు అవి వచ్చినప్పుడు మీరు వాటిని విస్తారము చేసి ఇవే సత్యము అని అనుభవం చేస్తారో
మరియు చేయిస్తారో, అప్పుడు మీరు వాటిలో ప్రాణము నింపినట్లు అవుతుంది. మళ్ళీ వాటిని
జ్ఞానసాగరుడైన తండ్రి యొక్క స్మృతితో, గతించినదేదో గతించిపోయింది అని భావిస్తూ
స్వఉన్నతి అనే అలలలో ముంచేస్తారు కూడా, కానీ ఇందులో కూడా సమయమైతే వ్యర్థమవుతుంది
కదా, అందుకే ముందు నుండే మాస్టర్జ్ఞానసాగరులుగా అయి, స్మృతి మరియు సమర్థీ భవ అన్న
వరదానముతో ఈ బొమ్మల ఆటను సమాప్తము చేయండి.
స్లోగన్:-
ఎవరైతే
సమయానికి సహయోగులుగా అవుతారో, వారికి ఒకటికి పదమాల రెట్లు ఫలము లభిస్తుంది.
అవ్యక్త సూచనలు -
ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి
రాజకీయ నేతలు మరియు
ధర్మ నేతలు ఎవరైతే ఉన్నారో, వారికి ‘‘పవిత్రత మరియు ఏకతను’’ అనుభవం చేయించండి. ఈ
లోటు కారణముగానే రెండు సత్తాలు బలహీనముగా ఉన్నాయి. ధర్మసత్తాను ఆ బలహీనత నుండి దూరం
చేసేందుకు విశేషమైన పద్ధతి - పవిత్రతను నిరూపించడము మరియు రాజ్య సత్తా వారి ఎదురుగా
ఏకతను నిరూపించండి.
| | |