13-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ డ్రామాలో మీరు హీరో-హీరోయిన్ పాత్రధారులు, మొత్తం కల్పములో మీ వంటి హీరో పాత్ర ఇంకెవ్వరికీ లేదు’’

ప్రశ్న:-
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను ఎవరు పాస్ అవ్వగలరు?

జవాబు:-
ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తూ తండ్రి సమానముగా పవిత్రముగా అవుతారో, వారే ఈ పరీక్షను పాస్ అవ్వగలరు. 21 జన్మల అనంతమైన వారసత్వము లభిస్తుంది కనుక తప్పకుండా కాస్త శ్రమ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు శ్రమ చేయకపోతే కల్ప-కల్పము చేయరు, అప్పుడు ఉన్నత పదవిని ఎలా పొందుతారు. పవిత్రముగా అయినట్లయితే మంచి పదవిని పొందుతారు, లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలతో బాబా సమ్ముఖముగా మాట్లాడుతున్నారు. మాతో అనంతమైన తండ్రి మాట్లాడుతున్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు అందరికంటే అతి మధురమైనవారు. తండ్రి కూడా మధురముగా ఉంటారు, టీచరు కూడా మధురముగా ఉంటారు ఎందుకంటే ఇరువురి నుండి వారసత్వము లభిస్తుంది. గురువు నుండి భక్తి యొక్క వారసత్వము లభిస్తుంది. ఇక్కడైతే ఒక్కరి నుండే మూడు లభిస్తాయి. సంతోషము కూడా కలుగుతుంది. మీరు వారి సమ్ముఖములో కూర్చున్నారు. అనంతమైన తండ్రి, ఎవరినైతే పతిత-పావనుడని అంటారో, వారే మనుష్య సృష్టికి బీజరూపుడని మీకు తెలుసు. ఆ బీజము జడమైనది, బాబా చైతన్యమైనవారు. వారిని సత్ చిత్ ఆనంద స్వరూపుడని అంటారు. వారికి మహిమ కూడా ఉంది. వారు జ్ఞానసాగరుడు, కానీ వారి నుండి ఏ జ్ఞానము లభిస్తుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఎవరికైతే తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారో, వారే భక్తి మార్గములో వారి మందిరాలు, శాస్త్రాలు మొదలైనవి తయారుచేస్తారని మీకు తెలుసు. తప్పకుండా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కల్పము యొక్క ఈ సంగమము వస్తుందని కూడా మీకు తెలుసు. దీనిని ఆత్మిక అవినాశీ పురుషోత్తమ సంగమయుగమని అంటారు. వాస్తవానికి ఉత్తమ పురుషులైతే చాలామంది ఉంటారు. కానీ వారు ఒక్క జన్మలో ఉత్తమ పురుషులుగా అవుతారు, తర్వాత మధ్యములుగా, కనిష్ఠులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులను చూడండి, ఎంత ఉత్తమ పురుషులుగా ఉన్నారు. వీరు పురుషోత్తముడు మరియు పురుషోత్తమని. ఇరువురిని అటువంటి ఉత్తములుగా ఎవరు తయారుచేసారు? భగవంతుడు ఉన్నతోన్నతమైనవారని, వారు పైన ఉంటారని అంటూ ఉంటారు. మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతమైనవారు ఈ విశ్వ మహారాజు-మహారాణి. ఉన్నతోన్నతమైన భారత్ లో రాజ్యము చేసేవారు. ఇప్పుడు వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ తెలియదు. మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసే తండ్రి ఎంత మధురముగా అనిపించాలి. వారి మతముపై నడవాలి. అంత ఉన్నతముగా, విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రి ఎంత సాధారణ రీతిలో చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి భారత్ లో వస్తారని కూడా మీకు తెలుసు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. వారు వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. స్వర్గవాసులుగా ఉన్న మేము 84 జన్మలను అనుభవించి నరకవాసులుగా అయ్యామని ఇప్పుడు స్మృతి కలిగింది. బాబా మళ్ళీ స్వర్గవాసులుగా తయారుచేయడానికి వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుంది. సతోప్రధానముగా అవ్వకుండా తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు, లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు కూడా ఆత్మకే లభిస్తాయి కదా. గర్భ జైలులో శరీరాన్ని ధరింపజేసి అప్పుడు శిక్షలు ఇస్తారు. పిల్లలు చాలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది, దుఃఖములో రక్షణ కోసం అలమటిస్తారు. ఇక మళ్ళీ పాపం చేయను అని అంటారు. పిల్లలైన మీరైతే గర్భ జైలులోకి వెళ్ళకూడదు. అక్కడ గర్భ మహలు ఉంటుంది ఎందుకంటే పాపముండదు. ఇక్కడ రావణ రాజ్యములో పాపముంటుంది, అందుకే రామ రాజ్యాన్ని కోరుకుంటారు. కానీ రావణ రాజ్యము అంటే ఏమిటి అనేది వారికి తెలియదు. రావణుడిని కాలుస్తున్నారు కనుక సమాప్తమవ్వాలి. కానీ మళ్ళీ-మళ్ళీ కాలుస్తారు అంటే అతడు ఇంకా మరణించలేదు. మరి అవన్నీ చేయడము వలన లాభమేమిటి? వారు వెళ్ళి లంకను దోచుకుని వస్తారు. ఒక వృక్షానికి ఒక వ్యాధి ఉంటుంది (అప్పుడు దానిపై పసుపు రంగు కనిపిస్తుంది) దానిని బంగారముగా భావించి తీసుకువస్తారు (ఇది ఒక ఆచారము). వాస్తవానికి మీరు ఈ సమయములో రావణుడిపై విజయము పొందుతారు మరియు బంగారుయుగానికి యజమానులుగా అవుతారు. అజ్మేర్ లో వైకుంఠము యొక్క మోడల్ ను తయారుచేసారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా పిల్లలను మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారు, మనము వజ్ర-వైఢూర్యాల మహళ్ళలో రాజ్యము చేస్తాము.

ఇప్పుడు పిల్లలైన మీరు యోగబలముతో నిర్వికారిగా, సతోప్రధానముగా అవుతారు. ఆత్మ సంపూర్ణ నిర్వికారిగా అయి మళ్ళీ శాంతిధామానికి వెళ్ళిపోతుంది, అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు. బాబా అర్థం చేయించారు, ఈ నాటకములో మీది అందరి కన్నా పెద్ద ముఖ్యమైన పాత్ర, అది హీరో-హీరోయిన్ల పాత్ర. రాజ్యాన్ని తీసుకోవడము మరియు పోగొట్టుకోవడము - ఇది ఆట. హీరో-హీరోయిన్లు మీరు. హీరో అంటే ముఖ్యమైన పాత్రధారి అని అర్థం. మీరు బంగారుయుగములో పవిత్ర గృహస్థ ఆశ్రమములో ఉండేవారు. ఇనుపయుగములో అపవిత్ర గృహస్థ వ్యవహారముంది. ఇప్పుడు బాబా బంగారుయుగములోకి తీసుకువెళ్తారు. అక్కడ సూర్యవంశీయులైన లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది. వారు పునర్జన్మలు తీసుకుని చంద్రవంశములోకి వస్తారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కోట్లమంది అయిపోయారు. ఇప్పుడిక జనాభా తగ్గాలి అని అంటారు. ఎవరికైతే ఒకరిద్దరు పిల్లలే ఉంటారో, వారు ఆపరు కదా. జనాభాను తగ్గించడమైతే తండ్రి చేతిలో ఉంది అనే వార్తను ఇప్పుడు మీరు చెప్పవచ్చు. ఎక్కువమంది మనుష్యులు ఉంటే మరణిస్తారని తండ్రికి తెలుసు. నేను అందరినీ సమాప్తము చేసి ఏక ధర్మ స్థాపన చేయడానికి వచ్చాను. అక్కడ 9 లక్షల మంది ఉంటారు. ఇది మ్యాజిక్ కదా. కలియుగము రూపీ రాత్రి పూర్తయి పగలు మొదలవుతుంది. జనాభా నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేస్తారు. తండ్రి వద్ద ఎలాంటి ఖర్చు లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, అంతా సమాప్తమైపోతుంది, డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు ఏ ప్లాన్లనైతే తయారుచేస్తున్నారో, అవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. యూరోప్ వాసులు యాదవులు. భారతవాసులు కౌరవులు మరియు పాండవులు. వారంతా ఒకవైపు ఉన్నారు, ఇటువైపు ఇరువురు సోదరులు ఉన్నారు. భారత్ లో సోదరులున్నారు. ఇప్పుడు కలియుగములో సోదరులుగా ఉన్న మీరు బయటకు వచ్చి సంగమములోకి వచ్చారు. కౌరవులు మరియు పాండవులు ఒకే ఇంటి వారు. వాస్తవానికి ఆత్మలందరూ పరస్పరములో సోదరులు. ఆత్మలైన మిమ్మల్నే బాబా మొట్టమొదట కలిశారు. ఎవరైతే రేస్ లో మొట్టమొదట చేరుకుంటారో, వారు బహుమతిని తీసుకుంటారు. మీది స్మృతి యొక్క పరుగు. ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. తండ్రి అంటారు - నాతో యోగము జోడించండి. ఈ యోగము యొక్క యాత్ర ఈ సమయములోనే ఉంటుంది. ఈ యాత్రను ఇంకెవ్వరూ నేర్పించలేరు. సత్యయుగములో ఆత్మిక యోగము ఉండదు, శారీరక యోగము ఉండదు - అక్కడ అవసరమే ఉండదు. ఈ విషయము ఈ సమయములో మీ బుద్ధిలో కూర్చుంటుంది. డ్రామాలోని ఒక్కొక్క సెకెండు యొక్క పాత్రను అర్థం చేయించారు, దీనిని స్వదర్శన చక్రమని అంటారు. వాస్తవానికి స్వదర్శన చక్రధారులుగా ఇప్పుడు మీరు అవుతారు. మీకు 84 జన్మలు మరియు సృష్టి చక్రము యొక్క జ్ఞానము ఉంది. స్వ అనగా ఆత్మ. ఆత్మకు ఈ జ్ఞానముంది కనుక ఇప్పుడు పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. నేను మిమ్మల్ని ఆత్మిక పిల్లలు, స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కుల భూషణులు అని అంటాను. ఈ పదాల అర్థాన్ని కొత్తవారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ అలంకారాలను మీకు ఇవ్వరు ఎందుకంటే మీలో చాలామంది పారిపోతారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రముంది. ఇప్పుడు నంబరువన్ లోకి వెళ్తారు. ముందు ఇంటికి వెళ్ళి తర్వాత దేవతలుగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎవరైనా ఈ మాత్రం గుర్తు చేసుకున్నా, అహో సౌభాగ్యము. ఇంకా కొద్ది సమయమే ఉంది, తర్వాత మనము స్వర్గములోకి వెళ్తాము. ఇకపోతే, శాస్త్రాలలోనైతే చాలా కల్పిత కథలను వ్రాశారు. అందరికీ ప్రియమైన శ్రీకృష్ణుని గురించి కూడా వ్రాశారు - పాము కాటేసింది, ఇలా జరిగింది... అని. శ్రీకృష్ణుడు రాధ కన్నా ప్రియముగా అనిపిస్తారు ఎందుకంటే వారు మురళీని వాయించారు. ఇది వాస్తవానికి జ్ఞానానికి సంబంధించిన విషయము. మీరు ఈ సమయములో జ్ఞాన-జ్ఞానేశ్వరీలు, మీరు చదువుకుని రాజ-రాజేశ్వరీలుగా అవుతారు. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. ఇక్కడి ఉద్దేశ్యమేమిటి అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి - మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము. మనమే దేవతలుగా ఉండేవారము. 84 జన్మల తర్వాత శూద్రులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత దేవతలుగా అవుతాము. చదివించేవారు జ్ఞాన సాగరుడైన పరమాత్మ, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. ఈ రాజయోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. మీరంటారు - బాబా, మేము కల్ప-కల్పము వచ్చి మీ నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. ఈ విషయము కూడా మీకు తెలుసు. ఈ మహాభారీ యుద్ధముతోనే స్వర్గము యొక్క గేట్లు తెరుచుకోనున్నాయి. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు కనుక తప్పకుండా స్వర్గము కావాలి. నరకము సమాప్తమవ్వాలి. ఈ మహాభారీ యుద్ధము గురించి శాస్త్రాలలో ఉంది.

(దగ్గు వచ్చింది) ఇది ఎవరికి వచ్చింది? శివబాబాకా లేక బ్రహ్మాబాబాకా? (బ్రహ్మాకు) ఇది కర్మభోగము. చివరి వరకు వస్తూనే ఉంటుంది, సంపూర్ణము అయ్యేంతవరకు వస్తుంది, అప్పుడిక ఈ శరీరము కూడా ఉండదు. అప్పటివరకు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, దీనినే కర్మభోగమని అంటారు. సత్యయుగములో కర్మభోగముండదు. అనారోగ్యాలు మొదలైనవేవీ ఉండవు. మనము సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతాము, సదా హర్షితముగా ఉంటాము ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మళ్ళీ అర్ధకల్పము తర్వాత దుఃఖము మొదలవుతుంది. అది కూడా ఎప్పుడైతే భక్తి వ్యభిచారిగా అవుతుందో, అప్పుడు దుఃఖము ఎక్కువవుతుంది. అప్పుడు ఆర్తనాదాలు చేస్తారు మరియు తర్వాత వినాశనము అయిపోతుంది. ఇప్పుడు మీరు సమ్ముఖముగా వింటుంటే, ఎంత మజా అనిపిస్తుంది. వీరు మన సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువని తెలుసు. ఈ మహిమ ఒక్క నిరాకార తండ్రిది మాత్రమే. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఆ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. వీరు సాధు-సత్పురుషులు లేక మహాత్ముల వలె సింహాసనముపై కూర్చోరు. ఎప్పుడూ కాళ్ళకు కూడా నమస్కరించనివ్వరు. తండ్రి అంటారు - నేను మీ విధేయుడైన సేవకుడను. నాకు కాళ్ళు ఎక్కడున్నాయి? మీరు దేనికి తల వంచి నమస్కరిస్తారు? చాలామంది గురువుల ముందు తల వంచి నమస్కరిస్తూ-నమస్కరిస్తూ మీ నుదురే అరిగిపోయింది. ఏదైతే భక్తి మార్గములో ఉంటుందో, అది జ్ఞాన మార్గములో ఉండదు. భక్తి మార్గములో ఓ రామా... అని అంటారు. తండ్రి అంటారు, ఇక్కడ ఏ శబ్దము చేయకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ గుప్తముగా తండ్రిని స్మృతి చేయాలి. ఓ శివా... అని కూడా అనకూడదు. మీరు శబ్దానికి అతీతముగా వెళ్ళాలి. పిల్లలకు లోలోపల తండ్రి స్మృతి ఉంటుంది. వీరు మా బాబా అని ఆత్మకు తెలుసు. మీరు లోలోపల గుప్తముగా స్మృతి చేయాలి, దీనిని అజపాజప (నిరంతర) స్మృతి అని అంటారు. ఇక్కడ జపం చేయకూడదు. మాలను లోపల తిప్పినా లేక బయట తిప్పినా, విషయము ఒక్కటే. లోపల తిప్పడాన్ని గుప్తమని ఏమీ అనరు. గుప్తమైన విషయమేమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము. వారు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మా. మిమ్మల్ని అలంకరించడానికి మీకు డబల్ ఇంజన్ లభిస్తుంది. వీరి ఆత్మ కూడా అలంకరించబడుతూ ఉంది. తర్వాత అందరూ పుట్టింటికి వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ అత్తవారింటికి, విష్ణుపురిలోకి వస్తారు. ఇది డబల్ పుట్టినిల్లు - అలౌకికమైనది. అది లౌకికమైనది, ఇంకొకటి పారలౌకికమైనది. ఈ అలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు, అందుకే ఈ దాదాను ఎందుకు కూర్చోబెట్టారని అంటారు. ఈ తనువు ద్వారా పరమాత్మ చదివిస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. వీరు అనేక జన్మల అంతిమములో పూజ్యుని నుండి పూజారిగా అయ్యారు, రాజు నుండి నిరుపేదగా అయ్యారు. బాబా అర్థం చేయిస్తున్నారు - ఈ తనువులో నేను ప్రవేశిస్తాను. అయినా సరే ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. మందిరాలలో నందిని పెట్టారు. ఇప్పుడు శంకరుడైతే సూక్ష్మవతనవాసి. సూక్ష్మవతనములో ఎద్దు మొదలైనవి ఉండనే ఉండవు. ఎద్దు అనగా మేల్ (పురుషునికి గుర్తు). భగీరథుడిని పురుషునిగా చూపిస్తారు. మనుష్యులైతే పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారు. తండ్రి అంటారు - రావణుడు తెలివిహీనులుగా చేసాడు. రామ రాజ్యము కావాలని తమంతట తామే అంటారు. ఇప్పుడు రామ రాజ్యమైతే సత్యయుగములో ఉంటుంది. కలియుగములో రావణ రాజ్యముంటుంది. రాముడు మరియు రావణుడు భారత్ లోనే ఉంటారు. శివ జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. రావణ జయంతిని జరుపుకోరు ఎందుకంటే అతడు శత్రువు. ఎవరైతే సుఖాన్ని ఇస్తారో, వారి జయంతినే జరుపుకోవడము జరుగుతుంది. ఇప్పుడు శివబాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. రావణుడు ఎవరు, ఎప్పుడు వస్తారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఏక్యురేట్ లెక్కను తెలియజేయడము జరుగుతుంది. ఈ విషయాలను మంచి రీతిలో ధారణ చేయండి, మర్చిపోకండి. జ్ఞాన సాగరుని వద్దకు మేఘాలై వచ్చారు. నింపుకుని వర్షాన్ని కురిపించాలి. ధారణ చాలా బాగుండాలి. ఇక్కడ మీరు సమ్ముఖముగా కూర్చున్నారు. మేము అనంతమైన తండ్రికి సమ్ముఖముగా, ఇంటిలో కూర్చున్నామని అనుభూతి కలుగుతుంది. మీరు బ్రాహ్మణ కుల భూషణులు కూడా. మమ్మా, బాబా కూడా ఉన్నారు. బాబా మనల్ని టీచరు రూపములో చదివిస్తున్నారు. సద్గురువు రూపములో తమతో పాటు తీసుకువెళ్తారు. ఆ గురువులు తీసుకువెళ్ళరు. గురువు పని ఫాలోవర్స్ ను తమతో పాటు తీసుకువెళ్ళడము. వాస్తవానికి వారు ఫాలోవర్స్ కూడా కాదు. ఆ గురువులు సన్యాసులు, మరి ఆ గృహస్థులు ఫాలోవర్స్ ఎలా అవుతారు. మీరు శివబాబాను కూడా ఫాలో చేస్తారు, బ్రహ్మాబాబాను కూడా ఫాలో చేస్తారు. వీరు ఎలా తయారవుతారో, మీరు కూడా అలాగే తయారవుతారు. ఆత్మలమైన మనము పవిత్రముగా అయి బాబా వద్దకు వెళ్తాము. బాబా అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. సత్యాతి-సత్యమైన ఫాలోవర్స్ మీరే.

తండ్రి అంటారు - నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకే వచ్చాను. ఇప్పుడు జ్ఞాన-చితిపై కూర్చున్నట్లయితే తీసుకువెళ్తాను. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఆ సమయములో మిగిలిన ధర్మాల వారంతా శాంతిధామములో ఉండేవారు. ఈ విషయాలు చాలా సహజమైనవి. బాబాకు ఫాలోవర్స్ గా అవ్వండి. ఎంతగా పవిత్రముగా అవుతారో, అంత మంచి పదవిని పొందుతారు, లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. వెళ్ళడమైతే తప్పకుండా వెళ్ళాలి, 21 జన్మల వారసత్వము లభిస్తుంది అన్నప్పుడు ఎందుకు శ్రమించకూడదు. ఇప్పుడు శ్రమించకపోతే, ఇక కల్ప-కల్పము శ్రమించరు. మరి ఉన్నత పదవిని ఎలా పొందుతారు. ఇది పెద్ద అనంతమైన క్లాస్. ఒకే పరీక్ష ఉంది - మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రికి సత్యాతి-సత్యమైన ఫాలోవర్స్ గా అయి పూర్తి పవిత్రముగా అవ్వాలి. 21 జన్మల వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేయాలి.

2. నోటితో ‘‘ఓ శివబాబా’’ అని కూడా అనకూడదు. శబ్దానికి అతీతముగా వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ లోలోపల తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-
సదా తమ రాయల్ కులము యొక్క స్మృతి ద్వారా ఉన్నతమైన స్థితిలో ఉండే గుణమూర్త భవ

రాయల్ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారెప్పుడూ భూమిపై, మట్టిపై పాదాన్ని మోపరు. ఇక్కడ దేహాభిమానము మట్టి, ఇందులోకి దిగకండి, ఈ మట్టి నుండి సదా దూరముగా ఉండండి. ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క రాయల్ ఫ్యామిలీకి చెందిన ఉన్నత స్థితిలో ఉండే పిల్లలము అన్న స్మృతి సదా ఉన్నట్లయితే మీ దృష్టి కిందకు వెళ్ళదు. సదా స్వయాన్ని గుణమూర్తిగా చూసుకుంటూ ఉన్నతమైన స్టేజ్ లో స్థితులై ఉండండి. లోపాన్ని చూసుకుంటూ సమాప్తము చేసుకుంటూ వెళ్ళండి, దాని గురించి పదే-పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ లోపము అలాగే ఉండిపోతుంది.

స్లోగన్:-
ఎవరైతే తమ హర్షిత ముఖము ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేయిస్తారో, వారు రాయల్ ఆత్మలు.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఎప్పుడైతే స్థూలము మరియు సూక్ష్మము, ఈ రెండింటిలోనూ తేడా సమాప్తమైపోతుందో, అప్పుడు సంపూర్ణ స్థితికి సమీపముగా వస్తారు. ఈ వ్యక్త దేశము అవ్యక్త దేశముగా అయిపోతుంది. ఎలా అయితే బాప్ దాదా వ్యక్తములోకి వచ్చినా కూడా అవ్యక్త రూపము యొక్క, అవ్యక్త దేశము యొక్క అవ్యక్త ప్రవాహములో ఉంటారో, దానినే పిల్లలకు అనుభవము చేయిస్తారో, అలా మీరు కూడా మీ అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని ఇతరులకు అనుభవం చేయించండి.