14-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఉదయముదయమే లేచి తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు, అమృతవేళ సమయము చాలా మంచిది’’

ప్రశ్న:-
ఆజ్ఞాకారీ పిల్లల గుర్తులేమిటి?

జవాబు:-
ఆజ్ఞాకారీ పిల్లలు - ఉన్నతోన్నతమైన తండ్రి మహావాక్యాలను శిరస్సుపై పెట్టుకుంటారు అనగా తమ జీవితములో ధారణ చేస్తారు. వారి నడవడిక చాలా రాయల్ గా ఉంటుంది. వారు చాలా ఓర్పు కలిగి ఉంటారు. వారికి విశ్వాధిపత్యము యొక్క గుప్తమైన నషా ఉంటుంది. ఆజ్ఞాకారీ పిల్లలు తమ యొక్క ఏ కర్మ ద్వారా కూడా బాప్ దాదాకు అవమానము కలగనివ్వరు. అవమానపరిచేవారు అనగా ఆజ్ఞను ఉల్లంఘించే పిల్లలు చాలా డిస్సర్వీస్ చేస్తారు. ఆజ్ఞాకారీ పిల్లలు సదా ఫాలో ఫాదర్ చేస్తారు, ఎప్పుడూ తప్పుడు పనులు చేయరు.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు రెండు పదాలను విన్నారు. ఇప్పుడు పిల్లలైతే దీని అర్థాన్ని తెలుసుకున్నారు - తండ్రి ఇక్కడ ఉన్నారు అని. తండ్రి కూర్చుని రైట్ విషయాలను అర్థం చేయిస్తారు ఎందుకంటే మనుష్యులు జ్ఞానము గురించి, ఈశ్వరుడిని కలుసుకోవడము గురించి చెప్పే విషయాలన్నీ రాంగ్. ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి... అని ఇప్పుడు పాటలోని లైన్లను విన్నారు. కానీ ఆకాశ సింహాసనము అంటే ఏమిటి, ఇది ఎవరికీ తెలియదు. పతిత-పావనుడైతే రావాల్సిందే. కొందరు, భగవంతుడు అసలు లేరు అని అంటారు. మరికొందరు, అందరూ భగవంతులే భగవంతులు అని అంటారు. మరి వారు ఎందుకు వస్తారు? తండ్రి వచ్చారని పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఇక భక్తి మార్గపు ఈ గాయనము మొదలైనవన్నీ వినడము ఇష్టం అనిపించదు. పతిత-పావనుడు వచ్చి తమ పరిచయాన్ని ఇచ్చి రచన ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ విషయాలను ప్రపంచములోని మిగతావారు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా ఎన్ని మతాల వ్యక్తులు ఉన్నారు. మనుష్యులు పవిత్రముగా అవ్వడమనేది జరగదు అని అంటారు. అది కూడా, తప్పకుండా భగవంతుడు ఎప్పటివరకైతే రారో, అప్పటివరకు పవిత్రముగా ఎలా అవ్వగలరు. పరమాత్మయే వచ్చి శిక్షణనిస్తారు మరియు ఇందులో ఎంత భారీ ప్రాప్తి ఉంది అనే ఆకర్షణ కలిగిస్తారు. నాకు చెందినవారిగా అయి శ్రీమతముపై నడవకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని తండ్రి అంటారని మీకు తెలుసు. ఎలాగైతే ఒక తండ్రి తన చిన్న పిల్లల ప్రవర్తన బాగోలేకపోవడము చూస్తే, చెంపదెబ్బ కొడతారు, ఈ తండ్రి అయితే చెంపదెబ్బ కొట్టరు. కేవలం అర్థం చేయిస్తారు. ప్రతిజ్ఞను రక్తముతో కూడా వ్రాసి ఇస్తారు, అయినా ఓడిపోతారు. పవిత్రముగా అవ్వడము వలన ఏం లభిస్తుంది అనేది మనుష్యులకు తెలియనే తెలియదు. పతితులు అని ఎవరిని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే వికారాలలోకి వెళ్తారో, వారు పతితులు. వికారాలను వదలడము అసంభవమని మనుష్యులు భావిస్తారు. వారికి చెప్పండి - దేవీ-దేవతలైతే సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు. చిత్రాలను చూపించాలి. ఈ ప్రపంచము నిర్వికారిగా ఉండేది కదా. పవిత్రత ఉన్నప్పుడు భారత్ ఎంత షావుకారుగా ఉండేది, శివాలయముగా ఉండేది. వికారాలు లేకుండా ప్రపంచము ఎలా వృద్ధి చెందుతుంది అని మనుష్యులకు ఈ చింత ఉంటుంది. అరే, గవర్నమెంట్ విసిగిపోయింది, జనాభా వృద్ధి చెందకూడదు అని, అయినా ప్రతి సంవత్సరము ఎంతమంది మనుష్యులు పెరిగిపోతూ ఉన్నారు. జనాభా తగ్గడమైతే చాలా కష్టము. ఇక్కడ అనంతమైన తండ్రి చెప్తున్నారు - ఒకవేళ మీరు పవిత్రముగా అయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇది చాలా భారీ సంపాదన. మేము మాయాజీతులుగా అయినట్లయితే తప్పకుండా జగత్ జీతులుగా అవుతామని పిల్లలకు తెలుసు. రావణుడిని జయించి రామ రాజ్యాన్ని పొందుతారు. అక్కడ ఈ వికారాలు ఉండవు. ఆ వికారాలను మీరు జయించారు కదా. ఈ విషయాలను ఎవరో కష్టం మీద అర్థం చేసుకుంటారు. ఇవి లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుంది అని అంటారు! ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, వారు ఆది సనాతన ధర్మము వారు కారు అని అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడ భాషణ చేసినా సరే, ఇదే చెప్పండి - భగవానువాచ, కామము మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారు, దానిపై విజయాన్ని పొందితే మీరు జగత్ జీతులుగా అవుతారు. వివరణ చాలా స్పష్టముగా ఉంది, అయినా వారు అర్థం చేసుకోరు, లేదా అర్థం చేయించేవారిలో తెలివి లేదు. బాబాకైతే అర్థమవుతుంది - పిల్లలు రూపాయిలో 5 అణాలు కూడా కష్టం మీద నేర్చుకున్నారు లేదా స్వయం పూర్తి యోగులుగా అవ్వలేదు కనుక శక్తి లభించదు. స్మృతితోనే శక్తి లభిస్తుంది. బాబా సర్వశక్తివంతుడైన అథారిటీ కదా. యోగముంటే శక్తి కూడా లభిస్తుంది. యోగమైతే చాలామంది పిల్లలది చాలా తక్కువగా ఉంది. సత్యాన్ని కూడా ఎవరూ వ్రాయరు. స్మృతి చార్టును కూడా కష్టం మీద వ్రాస్తారు. టీచర్లే చార్టు పెట్టకపోతే, విద్యార్థులు ఎలా పెడతారు. చాలామంది విద్యార్థులు యోగములో చాలా చురుకుగా ఉన్నారు. ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయాలి. యోగము అనే పదం శాస్త్రాలకు సంబంధించినది. మనుష్యులు విని తికమకపడతారు. యోగము నేర్పించండి అని అంటారు. అరే, యోగము అనేది నేర్చుకునే విషయమేమీ కాదు. ఉదయాన్నే లేచి మీకు మీరే స్మృతి చేయాలి. ఇందులో కూర్చుని నేర్పించేందుకు టీచరు అవసరమేముంది, అందుకే స్మృతి అనే పదం సరైనది. యోగము అనేది నేర్చుకునే విషయము కాదు. ఈ అలవాటు చేసుకోకూడదు. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు. అమృతవేళలో స్మృతి చేయడము మంచిది. భక్తిని కూడా ఉదయాన్నే లేచి చేస్తారు. వీరు (బ్రహ్మా) కూడా తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే తండ్రి నుండి వారసత్వము లభించాలి. భక్తి మార్గములో శివుడిని స్మృతి చేస్తారు కానీ ఆ శివుడి నుండి ఏం లభించేది ఉందో వారికి తెలియదు. ఈ విషయము కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు - మీ కళ్యాణము చేసుకునేందుకు నన్ను స్మృతి చేయండి. స్మృతితోనే శక్తి వస్తుంది. శక్తితో వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానముతో వికర్మలు వినాశనమవ్వవు. జ్ఞానముతో పదవి లభిస్తుంది. పతితము నుండి పావనముగా స్మృతితోనే అవుతారు. చాలామంది పిల్లలు ఇందులో ఫెయిల్ అవుతారు. చాలా మంచి మహారథులు 5 అణాల స్మృతి కూడా కష్టం మీద చేస్తారు. కొందరైతే ఒక్క పైసా అంత కూడా స్మృతి చేయరు, ఇందులో చాలా శ్రమ ఉంది. వివరణ అయితే వెంటనే నేర్చుకుంటారు, కానీ ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో, అప్పుడే నావ తీరం చేరుకుంటుంది. అప్పుడే జన్మజన్మల వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రిని పిలుస్తారు - మీరు వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనముగా చేయండి అని. పావనముగా అయితే ఎంతోమంది అవుతారు కానీ ఎవరైతే స్మృతిలో మంచి రీతిలో ఉంటారో, వారే ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు. మీ కన్నా కూడా, బంధనములో ఉన్న కుమార్తెలెవరైతే ఉన్నారో, వారు ఎక్కువగా స్మృతి చేస్తారు. స్మృతితోనే వికర్మలు వినాశనమవ్వగలవు. ఎవరైనా పవిత్రముగా ఉండడము అసంభవమని అంటే, ఇక అటువంటివారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు. భారత్ నిర్వికారిగా ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేది. కానీ షావుకారుల బుద్ధిలో ఈ జ్ఞానము కూర్చోవడమే కష్టం ఎందుకంటే స్మృతిలోనే శ్రమ ఉంది.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ వారితో కూడా సంబంధాలను నిర్వర్తించండి. వాస్తవానికి నియమాలు చాలా కఠినమైనవి. మీరు జన్మజన్మలుగా పాపాత్ములకు దానమిస్తూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు. ఇప్పుడు మీరు పాపాత్ములకు ధనాన్ని ఇవ్వలేరు. కానీ తాతగారి వారసత్వాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే తండ్రి అంటారు - ముందు అన్ని (లౌకిక) పనులను పూర్తి చేసి తర్వాత సరెండర్ అవ్వండి. ఇటువంటివారు కూడా కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు. ఇది చాలా పెద్ద గమ్యము. ఫాలో ఫాదర్ చేయాలి. నష్టోమోహులుగా అవ్వడమనేది అంత సులువైన విషయమేమీ కాదు, ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది ఎంత భారీ ప్రాప్తి. కల్ప-కల్పము ఎవరైతే విశ్వానికి యజమానులుగా అయ్యారో, వారే మళ్ళీ అవుతారు. డ్రామా రహస్యము కూడా కొంతమంది బుద్ధిలోనే కూర్చుంటుంది. షావుకారులైతే కష్టం మీద మేలుకుంటారు. పేదవారైతే వెంటనే అంటారు - బాబా, ఇదంతా మీదే. తర్వాత వారు సేవ కూడా చేయాలి. పావనముగా అయ్యేందుకు స్మృతి కూడా కావాలి. లేదంటే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు అనుభవిస్తే పదవి కూడా తగ్గిపోతుంది. ఎవరైతే స్మృతి చేయరో, వారు శిక్షలు అనుభవిస్తారు. జ్ఞానము ఎంత తీసుకున్నా సరే, దానితో వికర్మలు వినాశనమవ్వవు. శిక్షలు తిని తర్వాత చిన్న పదవిని పొందడమంటే, అది వారసత్వమేమీ కాదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రికి ఆజ్ఞాకారులుగా అవ్వాలి. ఉన్నతోన్నతమైన తండ్రి మహావాక్యాలను శిరస్సుపై పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఈ సమయములో వారసత్వాన్ని తీసుకుంటుంది. ఈ లక్ష్మీ-నారాయణుల అనేక జన్మల అంతిమములో నేను వారిని మళ్ళీ చదివించి వారసత్వాన్ని ఇస్తాను. మీలో కూడా రాకుమార-రాకుమారీలుగా అయ్యేవారు ఉంటారు కదా. రాయల్ వంశములోకి వచ్చే వారి నడవడిక చాలా ఓర్పు కలదిగా ఉంటుంది, గుప్తమైన నషా ఉంటుంది. బాబా ఎంత సాధారణముగా ఉంటారు. బాబాకు తెలుసు - ఇంకా కొద్ది సమయమే ఉంది, నేను వెళ్ళి విశ్వ మహారాజుగా అవ్వాలి. వీరు కూడా పతితముగా ఉండేవారు. వీరు బాబా రథము, అందుకే ఇక్కడ గద్దెపై కూర్చోవాల్సి ఉంటుంది. లేదంటే బాబా ఎక్కడ కూర్చోవాలి. వీరు కూడా మీలాంటి విద్యార్థియే, చదువుకుంటున్నారు. చాలామంది పిల్లలు తండ్రిని గుర్తించరు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. తండ్రి అంటారు - నా ఆజ్ఞను పాటించకుండా, నన్ను అవమానపరిస్తే ధర్మరాజు చాలా శిక్షలను విధిస్తారు. మీరు డైరెక్టుగా, నా ఆజ్ఞను మరియు నా బిడ్డ ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు. తండ్రికి చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన బిడ్డ ఒకే ఒకరు ఉన్నారు. ప్రేమ అయితే ఉంటుంది కదా. వీరిని అవమానపరిస్తే ఎన్ని శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కొద్దిగా ఆపదలు రానివ్వండి, అప్పుడు చూడండి, ఎంతమంది పరుగెత్తుకుంటూ వస్తారో. మీరందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు, వీరేమీ ఇంద్రజాలం మొదలైనవి చేయలేదు. ఇంద్రజాలికుడు శివబాబా. వీరిలోకి శివబాబా వస్తారు అనే అటెన్షన్ కూడా లేనివారు చాలామంది ఉన్నారు. శివబాబా ఎదురుగా మనము ఏదైనా తప్పు చేస్తే, అప్పుడు తండ్రి ఇతడు యోగ్యుడైన బిడ్డ కాదు అని అంటారు. వీరిలో ఇద్దరు ఉన్నారు కదా, అందుకే టెలిగ్రామ్ లో ‘బాప్ దాదా’ అని వ్రాస్తారు. కానీ పిల్లలు, బాప్ దాదా ఇరువురూ ఎలా కలిసి ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోరు. తండ్రి, దాదా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బాప్ దాదా ఎవరో మీకు తెలుసా? అని మీ అంతట మీరే ఈ విషయాన్ని తీసుకురావాలి. మీరు బాప్ దాదా అని ఎవరిని అంటారు అని ఎవరైనా అడగవచ్చు. బాప్ దాదా అనేది ఒక్కరి పేరు అవ్వదు. కనుక పిల్లలు యుక్తిగా అర్థం చేయించాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారి బుద్ధిలో కూర్చోవాలి - శివబాబా దాదా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు, ఇప్పుడు వినాశనమైతే జరగనున్నది, దానికంటే ముందు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మీరు కూడా నేర్చుకోండి, ఏ తండ్రినైతే అర్ధకల్పము బట్టి పిలిచారో, వారు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు అని చెప్పండి. అయినా కూడా, ఇది అర్థం చేసుకునేందుకు తీరిక లేదు అని అంటారు. అప్పుడు మీరంటారు - మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కాదు, మీ భాగ్యములో స్వర్గ సుఖాలు లేవు. ఇకపోతే, ఇక్కడ తల వంచి నమస్కరించడము మొదలైనవేమీ చేయకూడదు. సన్యాసుల పాదాల పైన తప్పకుండా పడతారు. బాబా గుప్తమైనవారు కదా. మున్ముందు చాలా ప్రభావము వెలువడుతుంది. ఆ సమయములో చాలా గుంపు ఏర్పడుతుంది. గుంపులలో ఎంతమంది మనుష్యులు మరణిస్తారు. ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారి దర్శనము చేసుకునేందుకు ఎంత పెద్ద సమూహము నిలబడి ఉంటుంది. ఇక్కడ బాబా పిల్లలతో పాటు ఎంత గుప్తముగా కూర్చున్నారు. ఇక్కడ ఎవరిని చూస్తారు? వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారని వీరి గురించైతే తెలుసు. బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని ఎలా రచించారు అనేది శాస్త్రాలలో కూడా ఉంది. తండ్రి అంటారు - నేను వీరిలో ప్రవేశించి రచిస్తాను. ఇది కూడా వ్రాయబడి ఉంది కానీ రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు.

తండ్రి వచ్చి పిల్లలను పతితము నుండి పావనముగా తయారుచేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇకపోతే, కొత్త రచనను ఏమీ రచించరు. ఇది పతితులను పావనముగా తయారుచేసే యుక్తి. విరాట రూప చిత్రము తప్పకుండా ఉండాలి. చిత్రము పెద్దదిగా ఉంటే, అర్థం చేయించడము కూడా సులభమవుతుంది. రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారుచేయడము - ఇది సులభమైన విషయమేమీ కాదు. కొందరైతే వెర్రి వారిలా చూసి వెళ్ళిపోతారు. ప్రజలుగా అయ్యే వారు ఉంటే, ఎంతోకొంత బుద్ధిలో కూర్చుంటుంది. మనమే బ్రాహ్మణులుగా, తర్వాత మనమే దేవతలుగా అవుతాము, హమ్ సో అర్థాన్ని తండ్రి ఎంత బాగా అర్థం చేయించారు. వారు ఆత్మయే పరమాత్మ, అంతే అని అంటారు. మనము ఆత్మలమేనని ఇక్కడ మీకు తెలుసు. ఆత్మలమైన మనము ముందు బ్రాహ్మణులుగా, తర్వాత మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా... అవుతాము. మనము ఎన్ని రకాల వర్ణాలలోకి వస్తాము! 84 జన్మల చక్రములో తిరుగుతాము. ఇకపోతే, ఎవరైతే తర్వాత వస్తారో, వారికి సుమారుగా ఎన్ని జన్మలు ఉంటాయి! లెక్క తీయవచ్చు. చిత్రాలు చాలా చక్కగా, బాబా మనసుకు నచ్చే విధముగా తయారవ్వాలి. చిత్రాలను తయారుచేయడములో సహాయము చేయగల ఇద్దరు లేక నలుగురు మంచి పిల్లలు కావాలి. బాబా ఖర్చు ఇచ్చేందుకు సిద్ధముగా ఉన్నారు. ఆ తర్వాత హుండీని బాబా వారంతట వారే నింపిస్తారు. బాబా అంటారు, ముఖ్యమైన చిత్రాలను ట్రాన్స్ లైట్ తో తయారుచేయాలి. మనుష్యులు వాటిని చూసి సంతోషిస్తారు. మొత్తం ప్రదర్శినీ ఈ విధముగా తయారవ్వాలి. కానీ పిల్లలను నిలబెట్టడానికి బాబాకు శ్రమించాల్సి ఉంటుంది.

తండ్రి స్మృతి ముఖ్యమైనది. స్మృతితోనే మీరు పతితము నుండి పావనముగా, సృష్టికి యజమానులుగా అవుతారు. ఇంకే ఉపాయము లేదు. నడుస్తూ-తిరుగుతూ బాబాను స్మృతి చేయండి. చక్రాన్ని స్మృతి చేయాలి. మీ స్వభావము చాలా రాయల్ గా ఉండాలి. నడుస్తూ-నడుస్తూ కొందరిని లోభము, కొందరిని మోహము పట్టుకుంటుంది. కొంతమంది ఇష్టమైన వస్తువులను పొందడానికి అలవాటు పడి ఉంటారు, లభించకపోతే జబ్బు పడిపోతారు. అందుకే ఏ అలవాట్లను ఉంచుకోకూడదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ కళ్యాణము చేసుకునేందుకు తండ్రి ఆజ్ఞను పాటించాలి. బాప్ దాదా ఆజ్ఞను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. లోభము, మోహము యొక్క అలవాట్లు ఏవీ ఉంచుకోకూడదు.

2. తమ స్వభావాన్ని చాలా రాయల్ గా తయారుచేసుకోవాలి. ఉదయముదయమే అమృతవేళ లేచి తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి.

వరదానము:-
సర్వాత్మలకు శక్తుల దానాన్ని ఇచ్చే మాస్టర్ బీజరూప భవ

అనేకమంది భక్తాత్మల రూపీ ఆకులు ఏవైతే ఎండిపోయాయో, వాడిపోయాయో, వాటికి మళ్ళీ మీ బీజరూప స్థితి ద్వారా శక్తుల దానమివ్వండి. వారికి సర్వ ప్రాప్తులను చేయించేందుకు ఆధారము మీ ‘ఇచ్ఛా మాత్రం అవిద్య’ (కోరిక అంటే ఏమిటో తెలియని) స్థితి. ఎప్పుడైతే స్వయం ఇచ్ఛా మాత్రం అవిద్యులుగా అవుతారో, అప్పుడు ఇతర ఆత్మల సర్వ కోరికలను పూర్తి చేయగలరు. ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి. కావున మాస్టర్ బీజరూపులుగా అయి భక్తుల పిలుపులు వినండి, ప్రాప్తి చేయించండి.

స్లోగన్:-
సదా సుప్రీమ్ ఆత్మ యొక్క ఛత్రఛాయలో ఉండటమే అలౌకిక జీవితములో రక్షణకు సాధనము.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఈ సమయాన్ని అమూల్యముగా భావిస్తూ ప్రయోగించండి, అప్పుడు సంపూర్ణము అవ్వగలరు. సంపూర్ణముగా అవ్వడానికి వ్యర్థ సంకల్పాలు ఆటంకాన్ని కలిగిస్తాయి, వాటి నుండి రక్షించుకునేందుకై ఎప్పుడూ కూడా లోపల మరియు బయట రెస్ట్ తీసుకోకండి. రెస్ట్ లో లేకపోతే వేస్ట్ గా పోవు. మరొకటి, స్వయాన్ని సదా గెస్ట్ గా భావించండి.