సంతుష్టతా శక్తిని ముఖములో మరియు నడవడికలో ధారణ చేసి
బ్రహ్మాబాబా సమానముగా అవ్వండి, సదా సంతోషముగా ఉండండి మరియు
సంతోషాన్ని పంచండి
ఈ రోజు సమ్ముఖములో ఉన్న మరియు దూరంగా ఉన్న సంతుష్టమణి
పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ తమ సంతుష్టతా శక్తితో
ప్రకాశిస్తూ చిరునవ్వుతో మిలనాన్ని జరుపుకుంటున్నారు. ఈ
సంతుష్టతా శక్తి అన్నింటికన్నా గొప్పది, అందుకే ఇందులో సర్వ
ప్రాప్తులు ఉన్నాయి. సంతుష్టతా శక్తిని ధారణ చేసే సంతుష్టమణులు
స్వయానికి కూడా ప్రియులుగా, బాబాకు కూడా ప్రియులుగా,
పరివారానికి కూడా ప్రియులుగా ఉంటారు, ఎందుకంటే సంతుష్టత
ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్వ శక్తులు సంతుష్టతలో ఇమిడి ఉంటాయి.
సంతుష్టతా శక్తి యొక్క వాయుమండలము నలువైపులా వ్యాపిస్తుంది.
సంతుష్టమణి ఆత్మలు ఎప్పుడూ కూడా మాయతో ఓడిపోలేరు, మాయే
ఓడిపోతుంది. సంతుష్టమణి ఆత్మలు సర్వుల హృదయాలను తమవిగా
చేసుకోగలరు. సంతుష్టమణి ఆత్మ, మాయ లేక ప్రకృతి ద్వారా వచ్చే
భిన్న-భిన్న అలజడులను ఒక కార్టూన్ చూస్తున్నట్లుగా అనుభవం
చేస్తారు. ఈ విధముగా ప్రతి బిడ్డ స్వయాన్ని సంతుష్టతా శక్తిలో
సంపన్నముగా ఉన్నట్లుగా భావిస్తున్నారా? స్వయాన్ని
ప్రశ్నించుకోండి - నేను సంతుష్టమణిగా ఉన్నానా? కొంతమంది
పిల్లలేమంటారంటే - అప్పుడప్పుడూ సంతుష్టముగా ఉంటున్నాము, సదా
ఉండటం లేదు. కానీ బాప్ దాదాకు ‘అప్పుడప్పుడూ’ అన్న పదం బాగా
అనిపించదు. బాప్ దాదా సదా ప్రతి బిడ్డకు ప్రియస్మృతులను ఇస్తారు,
సంతోషాన్ని ఇస్తారు. బాప్ దాదాకు ‘అప్పుడప్పుడూ’ అన్న పదం బాగా
అనిపించదు, సదా సంతోషముగా ఉండాలి. బాప్ దాదా ఇదే
కోరుకుంటున్నారు - ఈ ‘అప్పుడప్పుడూ’ అన్న పదాన్ని పరివర్తన
చేయగలరా! ‘అప్పుడప్పుడూ’ అన్న పదము బ్రాహ్మణుల డిక్షనరీలోనే
లేదు, సదా. పిల్లలందరూ ఎవరైతే బాబాకు ప్రియముగా, మాయ
ప్రభావానికి అతీతముగా అయ్యారో, వారు ఈ రోజు ‘అప్పుడప్పుడూ’ అనే
పదాన్ని సమాప్తము చెయ్యగలరా? చెయ్యగలరా? ఎందుకంటే బాప్ దాదా
చాలా సమయము నుండి చెప్తూ ఉన్నారు - ఏ అలజడి అయినా అకస్మాత్తుగా
వస్తుంది. ఆ ఏర్పాట్లలో ఒకవేళ ఇప్పటికీ ‘అప్పుడప్పుడూ’ అనే
సంస్కారము ఉన్నట్లయితే సదాకాలికమైన రాజ్యభాగ్యానికి అధికారులుగా
అవ్వగలరా? బ్రహ్మాబాబా పట్ల అందరికీ హృదయపూర్వక ప్రేమ ఉంది.
‘కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యము చేస్తాము’ అని
బ్రహ్మాబాబాతో ప్రతిజ్ఞ చేసారు. ఈ ప్రతిజ్ఞ పక్కా కదా! తల ఊపండి.
పక్కానా? ఎంత పక్కా? బ్రహ్మాబాబా ఎప్పుడైనా ‘అప్పుడప్పుడూ’ అని
అన్నారా! మీ అందరికీ కూడా సదా అమృతవేళలో ప్రియస్మృతులను ఇవ్వడము
జరిగింది, సదా బాబాతో కలిసి జ్ఞాన విషయాలను, స్నేహ విషయాలను,
ఉల్లాస-ఉత్సాహాల విషయాలను వినిపించాము. బాప్ దాదా పట్ల ప్రేమ
ఉంటే చేతులెత్తండి అని ఒకవేళ అందరి చేత చేతులెత్తిస్తే అందరూ
రెండు-రెండు చేతులు ఎత్తుతారు. అవును కదా! పక్కానా? ప్రేమ ఉంటే,
ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి ఒక్కొక్క మాట పట్ల కూడా ప్రేమ
ఉంటుంది. బ్రహ్మాబాబా ఎప్పుడూ శివబాబాకు ‘అప్పుడప్పుడూ అవుతుంది’
అని చెప్పలేదు. సదా ఫాలో ఫాదర్ చేసారు, అంతేకాక మీతో కూడా
చేయించారు ఎందుకంటే బ్రహ్మాబాబాకు పిల్లల పట్ల గాఢమైన ప్రేమ
ఉంది, అందుకే మీ పేరు కూడా ఏమిటి? బ్రహ్మాకుమారి, అంతేకానీ
శివకుమారి కాదు. మరి బ్రహ్మాబాబా పట్ల ప్రేమ అంటే బ్రహ్మాబాబా
చెప్పడము మరియు బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు మాట వినడము.
ప్రేమ అంటే బలిహారము. దేనిపై బలిహారమవుతారు? వారి ఆజ్ఞపై. ఏది
చెప్తారో అది చెయ్యడము, ఎందుకంటే బ్రహ్మాబాబాతో పాటు శివబాబా
ఉన్నారు. వారు ఒక్కరే లేరు. బాప్ దాదా, బాప్ దాదా అంటారు కదా!
ఈ రోజు బాప్ దాదా ‘అప్పుడప్పుడూ’ అన్న పదాన్ని ప్రతి బిడ్డ
నోటి నుండి సమాప్తము చేయాలని అనుకుంటున్నారు. మరి పిల్లలైన
మీరందరూ బాబాతో పాటు ఉన్నారు. ప్రేమ ఉంది కదా! ప్రేమలోనైతే తమను
తాము బలిహారము కూడా చేసేసుకుంటారు, ఇక్కడైతే కేవలం ఒక పదాన్ని
బలిహారము చేయాలి, ఎందుకంటే బాప్ దాదా ప్రతి బిడ్డను మాలలోని
విజయీ రత్నాలుగా చేయాలని కోరుకుంటున్నారు. మరి స్వయాన్ని
మాలలోని పూసగా భావిస్తున్నారా? విజయులుగా భావిస్తున్నారా?
కొంతమంది పిల్లలు ఏమంటారంటే, బ్రాహ్మణుల సంఖ్య అయితే చాలా ఉంది,
కానీ మాల 108 మణులది మాత్రమే, అంటే 108 మందే వస్తారు కదా! కానీ
ఒకవేళ మీరు సంపన్నముగా అయితే, విజయులుగా అయితే 108 మాలయే ఉంది
కదా అని అనుకోకండి, బాప్ దాదా మధ్యలో వరుసలను కూడా జోడిస్తారు.
కానీ మీరు విజయులుగా అవ్వండి. కొంతమంది పిల్లలు ఏమని
ఆలోచిస్తారంటే, ‘ఏమో తెలియదు నంబరు లభిస్తుందో లేదో’. మీరు
ఒకవేళ సంపన్నముగా అయితే బాబా నంబర్ తప్పకుండా ఇస్తారు ఎందుకంటే
బాబాకు ప్రతి బిడ్డ పట్ల ప్రేమ ఉంది. వినిపించాము కూడా కదా,
ఒకవేళ చివరి బిడ్డ అయినా కానీ, వారి పట్ల కూడా బాబాకు ప్రేమ
ఉంది ఎందుకంటే ఆ బిడ్డ స్వభావానికి వశమై ఉన్నా కానీ, బాబాను
తెలుసుకుని ‘నా బాబా’ అనైతే అన్నారు. ప్రపంచములో ఎంత
పెద్ద-పెద్ద పదవులలో ఉన్నవారు బాబాను గుర్తించలేదు, కానీ ఈ
బిడ్డ అయితే గుర్తించారు. ఏదో ఒక బలహీనతకు వశమై ఉన్నా కానీ
బాబానైతే గుర్తించారు. ‘నా బాబా’ అని ప్రేమతో అన్నారు. అందుకే
బాబా ఇంతకుముందు కూడా వినిపించారు, చివరి బిడ్డపై కూడా బాబాకు
ప్రేమ అయితే ఉండనే ఉంది, అంతేకాక ఆ బిడ్డ పట్ల ప్రత్యేకముగా
కళ్యాణ దృష్టి, కళ్యాణ వృత్తి కూడా ఉంది - ఈ బిడ్డ ఎంతోకొంత
ముందుకు వెళ్తూ ఉండాలి అని. బాప్ దాదా ఈ రోజు స్పష్టముగా
వినిపిస్తున్నారు - ఇది ఎలా జరుగుతుంది, ఇది ఏమవుతుంది అంటూ
మీరు మరే విషయాలనూ ఆలోచించకండి, మీరు స్వయాన్ని యోగ్య ఆత్మగా
తయారుచేసుకోండి, కర్మయోగి ఆత్మగా తయారుచేసుకోండి. అంతేకాక
పిల్లలు ఎవరైతే ఈ విధముగా యోగ్యముగా అవుతారో బాబా వారికి సర్వ
ప్రాప్తుల వరదానాన్ని కూడా ఇచ్చి ముందుకు తీసుకువెళ్తారు,
వెనుక ఉండనివ్వరు.
బాప్ దాదా ఈ రోజు అమృతవేళలో నలువైపులా దేశములో, విదేశాలలో
చుట్టు తిరిగి రావడానికి వెళ్ళారు. ఆ మాటకొస్తే బాప్ దాదా
మెజారిటీ తిరిగి వస్తూ ఉంటారు, కానీ ఈ రోజు తిరిగినప్పుడు,
వినిపించాము కదా, బాప్ దాదా ఈ విధముగా తిరగడానికి వెళ్ళినప్పుడు
విశేషముగా మీ పూర్వజులైన దాదీలు కూడా బాబాతో పాటు తిరగడానికి
వెళ్తారు, మరి అలా తిరుగుతున్నప్పుడు ఏమి చూసారు? మీకు కూడా
తెలుసు. మంచి-మంచి సంకల్పాలు చేస్తారు - చేసే చూపిస్తాము,
తయారయ్యే చూపిస్తాము, చేతిలో చేయి వేసే నడుస్తాము అని. మరి చేయి
అంటే ఏమిటి? శివబాబాకైతే ఫరిశ్తా రూపము కూడా లేదు, మరి చేయి
ఏమిటి? శ్రీమతము అనేది చేయి. విదేశాలలో చేతిలో చేయి వేసుకుని
నడిచే ఫ్యాషన్ ఉంది. మరి ఇక్కడ చేయి అంటే శ్రీమతము. మరి అందరూ
చేతిలో చేయి వేసి నడిచేవారే కదా! ఉందా శక్తి? బ్రహ్మాబాబాను
చూడండి, అడుగడుగులోనూ శ్రీమతముపై నడిచి మీ అందరికీ చేసి
చూపించారు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఉదాహరణగా నిలిచారు.
సాకారములో ఉదాహరణగా నిలిచారు. నిరాకారుని విషయము విడిచిపెట్టండి,
కానీ బ్రహ్మాబాబా సాకారములో మీతో పాటు ఉన్నారు. ఎలా అయితే
బ్రహ్మాబాబా శ్రీమతమనే చేతిలో చేయి వేసి ఫరిశ్తాగా అయిపోయారో,
అదే విధముగా ఫాలో ఫాదర్ చేయాలి కదా! ఫాలో ఫాదర్ గుర్తుంది కదా!
మరి ఏమి ఫాలో చేయాలి? అన్ని విషయాలు స్పష్టం చేసి చూపించారు.
బ్రహ్మాబాబా ముఖము మరియు నడవడిక గురించి అందరికీ తెలుసు కదా!
మీ బుద్ధి ద్వారానైతే బ్రహ్మాబాబాను ఇమర్జ్ చేసుకోగలరు కదా!
బ్రహ్మాబాబా ఏ దినచర్యనైతే, ఎటువంటి దినచర్యనైతే సాకార తనువులో
ఉంటూ పాటించారో, సాకారములో కూడా అన్నీ అనుభవం చేసారు,
బ్రహ్మాబాబా చరిత్ర అయితే అందరికీ తెలుసు. మరి ఫాలో ఫాదర్.
మిమ్మల్ని పక్కా చేయడానికని బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగు
రివైజ్ కూడా చేయబడింది. ఏమేమి చేసారు అని 8 అడుగులు చదువుతారు
కదా! కేవలం వాటిని ఫాలో చేయాలి. ఫాలో చేయడము అంటే బ్రహ్మాబాబా
సమానముగా అవ్వడము. మరి ఆలోచించండి, తండ్రి పట్ల ప్రేమ ఉంది,
ఇద్దరు తండ్రుల పట్ల ప్రేమ ఉంది. ప్రేమ అంటే, ఇంతకుముందు కూడా
వినిపించి ఉన్నాము, ప్రేమకు ప్రాక్టికల్ రూపము బ్రహ్మాబాబా
చెప్పినదానిని పిల్లలు బాబా సమానముగా చేయడము, ఇది సత్యమైన
హృదయపూర్వక ప్రేమ. కొంతమంది పిల్లలు ఏమి చేస్తారు? బ్రహ్మాబాబా
సమానముగా చేయాలి అని అనుకుంటారు కానీ ముందు చేసి తర్వాత
ఆలోచిస్తారు, అంటే బ్రహ్మాబాబా సమానముగా చేసినట్లు కాదు. వారికి
అనిపించింది చేసేసారు. కానీ ఫాలో చేయాలంటే ముందు ఆలోచించండి,
సంకల్పము చేసేకంటే ముందు ఆలోచించండి - ఈ సంకల్పము బ్రహ్మాబాబా
సంకల్పమేనా! అవును అంటే ప్రాక్టికల్ లో చేయండి. చేసిన తర్వాత
ఆలోచించకండి. ముందు ఆలోచించి ఆ తర్వాత ఫాలో చేయండి.
బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యడమంటే బ్రహ్మాబాబా సమానముగా అవ్వడము.
ధైర్యముందా? ఫాలో చేసే ధైర్యముందా? ఎవరైతే ‘చెయ్యాల్సిందే’ అని
భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ముందు ఆలోచించండి, ఆ
తర్వాత చేయండి. చేసిన తర్వాత ఆలోచించడము కాదు.
ఈ రోజు బాప్ దాదా విశేషముగా సంతుష్టతా శక్తిని ప్రతి బిడ్డలో
బ్రహ్మాబాబా సమానముగా చూడాలనుకుంటున్నారు. ఈ ఒక్క సంతుష్టతా
శక్తిలో అన్ని శక్తులూ వచ్చేస్తాయి. మరి ఈ రోజు బాప్ దాదా
ఇస్తున్న విశేషమైన వరదానము - సంతుష్టతా శక్తి భవ! ఏం జరిగినా
కానీ మీ సంతుష్టతను ఎప్పుడూ వదిలి పెట్టకండి. కొంతమంది
ఏమంటారంటే, ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, అప్పుడు ఏమంటారంటే,
సంతుష్టముగా అవ్వడము సహజమే కానీ సంతుష్టపరచడము చాలా కష్టము.
ఎవరు ఏమి చేసినా కానీ, అది మంచిది కాదని మీకు అర్థమవుతుంది,
అయినా మనసులో ఎందుకు పెట్టుకుంటారు? వీరిలా చేస్తారు, వీరిలా
చేస్తారు, వీరి స్వభావము ఇలా ఉంటుంది, వీరిది ఇలా ఉంటుంది...
మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మీరు మనసులో బాబాను
కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకున్నారు కదా? తల ఊపండి.
కూర్చోబెట్టుకున్నారా, పక్కానా? లేక ఒక్కోసారి తీస్తూ,
ఒక్కోసారి కూర్చోబెట్టుకుంటూ ఉంటారా? ఒకవేళ బాబాను
కూర్చోబెట్టుకుంటే మరి మనసులో బాబాతో పాటు విషయాన్ని కూడా
కూర్చోబెట్టుకుంటారా? కనుక, మనసులో పెట్టుకోకండి.
బాప్ దాదా ఇంతకుముందు కూడా ఈ యుక్తిని వినిపించారు,
అదేమిటంటే - సదా అటువంటి ఆత్మల పట్ల శుభ భావనను, శుభ కామనను
ఉంచుతూ మీ శుభ కామనను కార్యములో ఉపయోగించండి. మామూలుగా కూడా
చూడండి, ఫలానావారు మంచిగా చెయ్యలేదు అని మీకు అర్థమవుతుంది,
అంటే అది మంచి వస్తువు కాదు అని అర్థం కదా. మరి మీకు ఎవరైనా
పాడైన వస్తువును ఇస్తే మీరు తీసుకుంటారా? మరి మంచిది కాదని
అర్థమైనప్పుడు దానిని బుద్ధిలో పెట్టుకోవడము, మనసులో
పెట్టుకోవడము ఎందుకు? పాడైన వస్తువును అసలెందుకు తీసుకున్నారు?
మీ మనసులో సదా బాబానే పెట్టుకుంటూ ఉంటే బాబా సమానముగా అయిపోతారు.
ఈ ప్రతిజ్ఞ అయితే ఉంది కదా, బాబా సమానముగా అవ్వాలి కదా! పక్కాగా
అవ్వాలా? లేక అవుతామో లేదో తెలియదు అని అంటారా? ఇలా అయితే
ఆలోచించడము లేదు కదా? ప్రేమ అంటే ఫాలో ఫాదర్. బాప్ దాదా ఇప్పుడు
ఒక్కొక్క బిడ్డను శుభ భావన, శుభ కామనలతో సంపన్న ఆత్మగా
చూడాలనుకుంటున్నారు.
టీచర్లు తయారవుతారా? టీచర్ల పట్ల బాప్ దాదాకు విశేషమైన
ప్రేమ ఉంది. ఎందుకని ప్రేమ ఉంది? ఎందుకంటే బాబా యొక్క గద్దెపై
కూర్చునే ధైర్యము చేసారు. కనుక టీచర్లలో ధైర్యముంది కదా! ప్రతి
టీచర్ నుండి బాబా ఏమి కోరుకుంటున్నారంటే - ప్రతి ఒక్కరి ఫీచర్స్
నుండి ఫ్యూచర్ కనిపించాలి. నిమిత్తమైన టీచర్లకు బాప్ దాదా
చెప్తున్నారు కానీ మీరు కూడా తోడుగా ఉన్నారు కదా! బాప్ దాదా
బోర్డింగ్ లో ప్రారంభములో చిన్న-చిన్న పిల్లలకు ఇదే శిక్షణను
ఇచ్చారు - సంతోషముగా ఉన్నవారు, అదృష్టము కలిగినవారు అని ప్రతి
ఒక్కరి ముఖము ఈ విధముగా ఉండాలి. ఇప్పుడు కూడా బాప్ దాదా ఇదే
కోరుకుంటున్నారు - ప్రతి బిడ్డ తమ ముఖము ద్వారా ‘వీరు సంతోషముగా
ఉన్నవారు, అదృష్టము కలిగినవారు’ అన్నట్లు కనిపించాలి. వాణి
ద్వారా సేవను చాలా చేసారు మరియు బాగా చేసారు, దాని కోసం
సర్టిఫికేట్ అయితే ఉంది, కానీ ఇప్పుడు మీ ముఖము మరియు నడవడికతో
సేవలో ముందుకు వెళ్ళండి. ఎలా అయితే ఒక పేదవానికి లాటరీ వస్తే
అతని ముఖము మరియు నడవడిక మాట్లాడుతుంది కదా! అతని ముఖము చూసి
ఇతనికేదో లభించిందని అందరికీ అనుభవమవుతుంది! అదే విధముగా మీ
ముఖము మరియు నడవడికతో - వీరికి ఏదో విశేషమైన ప్రాప్తి లభించింది
అని తెలుసుకోవాలి.
ఈ రోజు బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? బ్రహ్మాబాబా సమానముగా
అవ్వండి. ఫాలో ఫాదర్, ఎందుకంటే సమయము యొక్క పరిస్థితులైతే
అలజడిలోకి వస్తున్నాయి కూడా మరియు మరింత రానున్నాయి కూడా,
అందుకే బాప్ దాదా ప్రతి బిడ్డకు ఇదే శిక్షణను
ఇవ్వాలనుకుంటున్నారు, అదేమిటంటే - సదా సంతోషముగా ఉండండి మరియు
సంతోషాన్ని పంచండి. ఎంతగా సంతోషాన్ని పంచుతారో, అంతగా సంతోషము
పెరుగుతుంది. మిమ్మల్ని సంతోషముగా చూసి ఎదుటివారు కూడా 5
నిమిషాల కోసమైనా సంతోషపడాలి. దుఃఖముతో ఉన్న ఆత్మలు ఒకవేళ
మిమ్మల్ని చూసి 5 నిమిషాలైనా సంతోషపడితే ఇది వారికి బాగా మనసుకు
నచ్చిన విషయము అవుతుంది. ఈ రోజు బాప్ దాదా ప్రతి బిడ్డకు -
విశేషముగా సంతుష్టతా శక్తిని నడవడిక మరియు ముఖము ద్వారా ధారణ
చేసి ఇతరుల చేత కూడా చేయించడం పట్ల విశేషముగా అటెన్షన్ ను
ఇప్పిస్తున్నారు. అచ్ఛా.
ఈ రోజు మొదటిసారి వచ్చినవారందరూ లేవండి. చూడండి, మీకు
కనిపిస్తుందా. సగం క్లాసు కొత్తవారే ఉన్నారు. చేతులెత్తండి.
చూడండి, అందరి చేతులు చూడండి. మీ కొత్త-కొత్త సోదర-సోదరీలు
ఎంతమంది మీకు సహచరులుగా అయ్యారు. అభినందనలు, చాలా-చాలా
అభినందనలు. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడవరకు చేరుకున్నారో, బాప్
దాదాను కలుసుకునేంత వరకు చేరుకున్నారు, ఇకముందు ఏమి చేయాలి?
ఫాలో బ్రహ్మాబాబా. బాప్ దాదాకు కూడా పిల్లలైన మిమ్మల్ని చూసి
సంతోషముగా అనిపిస్తుంది - వాహ్! బిడ్డ వచ్చేసాడు! అలాగే, మా
సోదర-సోదరీలు వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అని పూర్తి
పరివారమంతటికీ కూడా సంతోషముగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫాలో
బ్రహ్మాబాబా. ఎప్పుడైనా ఏమైనా జరిగినా కానీ, ఏదైనా ప్రశ్న ఉన్నా,
ఏదైనా సమస్య ఉన్నా, ఇది సమస్యల ప్రపంచమే కదా! మీరు వెంటనే మీ
టీచర్ ద్వారా దాని పరిష్కారాన్ని పొందండి. రెండు రోజులు
గడిచిపోయినా సమస్య ఇలాగే ఉంది అని అనకండి, ఎందుకంటే చాలా వెనుక
వచ్చారు కదా, కానీ ముందుకు వెళ్ళాలని అనుకుంటారు కదా! వెనుక
ఉండాలనుకుంటున్నారా? కాదు. ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్లయితే
ముందుకు వెళ్ళేందుకు ఈ ఒకే ఒక్క విషయము చేయండి - మనసులో ఎటువంటి
వ్యర్థమైన విషయాన్ని పెట్టుకోకండి. దాని కోసం అమృతవేళ బాబాతో
మిలనము అయ్యాక, ఒకటేమో అమృతవేళ తప్పకుండా చేయండి మరియు దాని
తర్వాత మీ రోజంతటి దినచర్యలో, అందులో మనసు బిజీగా ఉండాలి. ఏదో
ఒక డ్రిల్, అనేక డ్రిల్స్ ను బాప్ దాదా వినిపించి ఉన్నారు, కానీ
ఏదో ఒక డ్రిల్ ను తప్పకుండా చేస్తూ ఉండండి. బాప్ దాదా అందరి
కోసం చెప్తున్నారు, మధ్యమధ్యలో సమయాన్ని కేటాయించి, కొత్తవారైనా
లేక పాతవారైనా, అందరూ పూర్తిగా అశరీరిగా అయ్యే డ్రిల్ ను
తప్పకుండా చేయాలి ఎందుకంటే రాబోయే సమయములో సెకండులో అశరీరిగా
అవ్వవలసే ఉంటుంది. ఈ డ్రిల్ చెయ్యటానికి మాకు సమయము లభించలేదు
అంటే, ఎవరు ఎంత బిజీగా ఉన్నా కానీ, దాహం వేస్తే నీళ్ళు
త్రాగడానికి లేవరా! అత్యవసరం అని భావించి లేస్తారు కదా! అలాగే
ఒక్క నిమిషము అశరీరిగా అయ్యే డ్రిల్ ను తప్పకుండా ప్రాక్టీస్
చేయండి. లేదంటే పరిస్థితి సమయములో ప్రాక్టీస్ చేయలేకపోతారు.
సమయము వచ్చినప్పుడు చేసేద్దాములే అని కొందరు అనుకుంటారు కదా.
కానీ అలా చేయలేరు. జన్మజన్మల నుండి ఉన్న ఈ దేహ-అభిమానము యొక్క
అభ్యాసము ఆ సమయములో అశరీరిగా అవ్వనివ్వదు, అందుకే ఇప్పటినుండే
ఏదో ఒక సమయాన్ని కేటాయించి రోజంతటిలో ఎప్పటికప్పుడు ఏ సమయమైతే
నిశ్చితము చేసుకున్నారో, ఆ సమయములో ఒక్క క్షణములో ‘నేను అశరీరి
ఆత్మను’ అని ఆత్మ స్వరూపములో స్థితులైపోండి. దేహాభిమానము తన
వైపుకు ఆకర్షించకూడదు. ఈ అభ్యాసము అందరూ చేయాలి. కొత్తవారైనా
లేక పాతవారైనా, ఈ అభ్యాసము చేయాల్సిందే, ఎందుకంటే బాప్ దాదా
కొంత సమయము నుండి ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు, దీనిని తప్పకుండా
చేయాలి. లేకపోతే శ్రీమతము అనే చేతిలో చేయి వేసి వెళ్ళలేరు.
కలిసి వెళ్తాము, కలిసి రాజ్యములోకి వస్తాము అన్నది మీ ప్రతిజ్ఞ
కదా. కావున ఈ డ్రిల్ అందరూ చేయాలి. ఇకపోతే ఎవరైతే కొత్తవారు
వచ్చారో, మీరు సంతోషముగా ఉండండి, సమృద్ధిగా ఉండండి, ఇంకా-ఇంకా
ముందుకు వెళ్తా ఉండండి. అచ్ఛా!
నలువైపులా ఉన్నవారిని, దూరంగా కూర్చుని ఉన్నా మనసులో
ఇమిడిపోయే పిల్లలను బాప్ దాదా కూడా చూస్తున్నారు. అందరిలో ఉన్న
ప్రేమ అనే సుగంధము మధుబన్ కు చేరుకుంటూ ఉంది. అందరూ ఇప్పుడు
తీవ్రగతితో నడవాలి, తీవ్ర పురుషార్థము చేయాలి, ఆ తీవ్రత
ప్రపంచములోని వారిలో సుఖాన్ని తీసుకురావాలి. దుఃఖితులను
సుఖవంతులుగా చేయాలి. సుఖవంతులుగా చేసే ఈ సందేశాన్ని ఇచ్చి
అందరినీ సుఖవంతులుగా తయారుచేయాలి. ఈ సేవలో తీవ్రత ఉంది కూడా
మరియు మరింత తీవ్రతను తీసుకురావాలి కూడా. అచ్ఛా. అందరూ
మనస్ఫూర్వకమైన ప్రియస్మృతులను స్వీకరించండి.