ఓంశాంతి
మా దౌర్భాగ్యపు రోజులు పోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయని
పిల్లలకు అర్థమైంది. నంబరువారు పురుషార్థానుసారముగా భాగ్యము మారుతూనే ఉంటుంది.
స్కూల్లో కూడా భాగ్యము మారుతూ ఉంటుంది కదా అనగా ఉన్నతి చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఈ
రాత్రి సమాప్తమవ్వనున్నదని, ఇప్పుడు భాగ్యము మారుతోందని మీకు బాగా తెలుసు. జ్ఞాన
వర్షము కురుస్తూ ఉంటుంది. తప్పకుండా దౌర్భాగ్యుల నుండి మేము సౌభాగ్యశాలురుగా
అవుతున్నామని అనగా స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని తెలివైన పిల్లలు అర్థం
చేసుకుంటారు. నంబరువారు పురుషార్థానుసారముగా మనము మన దౌర్భాగ్యాన్ని సౌభాగ్యముగా
తయారుచేసుకుంటున్నాము. ఇప్పుడు రాత్రి నుండి పగలుగా మారుతోంది. ఇది పిల్లలైన మీకు
తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బాబా గుప్తముగా ఉన్నారు, అలాగే వారి మాటలు కూడా గుప్తముగా
ఉన్నాయి. మనుష్యులు కూర్చుని సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము యొక్క విషయాలను
శాస్త్రాలలో వ్రాశారు కానీ ఎవరైతే వ్రాశారో వారు చనిపోయారు. ఇక ఎవరైతే చదువుతారో
వారు ఏమీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎంత తేడా ఉంది. మీరు
కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. అందరూ ఒకేలాంటి పురుషార్థము
చెయ్యరు. దౌర్భాగ్యము అని దేనిని, సౌభాగ్యము అని దేనిని అంటారు అన్నది కేవలం
బ్రాహ్మణులైన మీకే తెలుసు. మిగిలినవారందరూ ఘోర అంధకారములో ఉన్నారు. వారికి అర్థం
చేయించి మేల్కొలపాలి. సౌభాగ్యశాలురు అని సూర్యవంశీయులను అంటారు, 16 కళల సంపూర్ణులు
వారే. మనము తండ్రి ద్వారా స్వర్గము కోసము సౌభాగ్యాన్ని తయారుచేసుకుంటున్నాము, ఆ
తండ్రే స్వర్గాన్ని రచించేవారు. ఇంగ్లీషు భాష తెలిసినవారికి కూడా మీరు ఇలా అర్థం
చేయించవచ్చు - మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా హెవెన్ కోసము సౌభాగ్యాన్ని
తయారుచేసుకుంటున్నాము, హెవెన్ లో సుఖము ఉంటుంది, హెల్ లో దుఃఖము ఉంటుంది. గోల్డెన్
ఏజ్ అనగా సత్యయుగము, సుఖము, ఐరన్ ఏజ్ అనగా కలియుగము, దుఃఖము. పూర్తిగా సహజమైన విషయము.
మనము ఇప్పుడు పురుషార్థము చేస్తున్నాము. ఆంగ్లేయులు, క్రిస్టియన్లు మొదలైనవారు
చాలామంది వస్తారు. మేము ఇప్పుడు కేవలం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరినే స్మృతి చేస్తాము
ఎందుకంటే మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్పండి. తండ్రి అంటారు, మీరు నా వద్దకు
రావాలి. తీర్థ స్థానాలకు వెళ్తారు కదా. బౌద్ధులకు తమ తీర్థ స్థానము ఉంది,
క్రిస్టియన్లకు వారిది ఉంది. ప్రతి ఒక్కరి ఆచార-వ్యవహారాలు ఎవరివి వారికి ఉంటాయి.
మనది బుద్ధియోగ విషయము. ఎక్కడి నుండైతే పాత్రను అభినయించడానికి వచ్చామో, అక్కడకు
మళ్ళీ వెళ్ళాలి. వారు హెవెన్ ను స్థాపన చేసే గాడ్ ఫాదర్. వారు మాకు తెలియజేశారు,
మేము మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియజేస్తాము. తండ్రి అయిన గాడ్ ఫాదర్ ను స్మృతి
చేస్తే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఎవరైనా అనారోగ్యము పాలైతే అందరూ
వెళ్ళి ‘రామ’ అని అనమని వారిని సావధాన పరుస్తారు. బెంగాల్లో ఎవరైనా చనిపోయేలా ఉంటే
వారిని గంగా నదీ తీరం వద్దకు తీసుకువెళ్తారు, హరి, హరి అని అనమని వారికి చెప్తారు,
అలా అన్నట్లయితే హరి వద్దకు వెళ్ళిపోతారు అని భావిస్తారు. కానీ ఎవ్వరూ వెళ్ళరు.
సత్యయుగములోనైతే రామ, రామ అని అనమని లేక హరి, హరి అని అనమని చెప్పరు. ద్వాపరము నుండి
మళ్ళీ ఈ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. సత్యయుగములో భగవంతుడిని కానీ, గురువును కానీ
తలచుకుంటారని కాదు. అక్కడ కేవలం తమ ఆత్మనే తలచుకోవడం జరుగుతుంది, ఆత్మ అయిన మేము ఒక
శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. తమ రాజ్యము గుర్తుకువస్తుంది. మేము
రాజ్యములోకి వెళ్ళి జన్మ తీసుకుంటామని అర్థం చేసుకుంటారు. రాజ్యమైతే తప్పకుండా
లభించేదే ఉంది అని ఇప్పుడు పక్కా నిశ్చయమైతే ఉంది కదా. ఇక ఎవరినైనా స్మృతి చేస్తారా
లేక దాన-పుణ్యాలు చేస్తారా? అక్కడ కూర్చుని దాన-పుణ్యాలు చేయడానికి పేదవారే ఉండరు.
భక్తి మార్గపు ఆచార-వ్యవహారాలు వేరు, జ్ఞాన మార్గపు ఆచార-వ్యవహారాలు వేరు. ఇప్పుడు
తండ్రికి సర్వస్వాన్ని ఇచ్చి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకున్నారు, అంతే, ఇక
దాన-పుణ్యాలు చేయవలసిన అవసరమేమీ లేదు. ఈశ్వరుడైన తండ్రికి మనము సర్వస్వము
ఇచ్చేస్తాము. ఈశ్వరుడే స్వీకరిస్తారు. స్వీకరించకపోతే ఇక వారికి ఎలా ఇస్తాము?
స్వీకరించకపోతే అది కూడా దుర్భాగ్యమే. వాళ్ళకు దానిపైనున్న మమకారము తొలగడం కోసం
స్వీకరించవలసి ఉంటుంది. ఈ రహస్యము కూడా పిల్లలైన మీకు తెలుసు. అవసరమే లేకపోతే ఇక ఏమి
స్వీకరిస్తారు? ఇక్కడైతే ఏదీ పోగు చేసేది లేదు. ఇక్కడి నుండైతే మమకారాన్ని
తొలగించవలసి ఉంటుంది.
బాబా అర్థం చేయించారు - బయటకు ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని చాలా తేలికగా
భావించండి. మేము తండ్రి పిల్లలము, ఆత్మ అయిన నేను రాకెట్ కన్నా తీక్షణమైనవాడిని. ఇలా
దేహీ-అభిమానులై కాలినడకన వెళ్తే ఎప్పుడూ అలసిపోరు. దేహ భానము రాదు. ఈ కాళ్ళు అసలు
నడుస్తున్నట్లే ఉండదు. మేము ఎగురుతూ వెళ్తున్నాము అన్నట్లు అనిపిస్తుంది.
దేహీ-అభిమానులై మీరు ఎక్కడికైనా వెళ్ళండి. పూర్వము మనుష్యులు తీర్థ స్థానాలకు
కాలినడకనే వెళ్ళేవారు. ఆ సమయములో మనుష్యుల బుద్ధి తమోప్రధానముగా లేదు. చాలా శ్రద్ధతో
వెళ్ళేవారు, అలసిపోయేవారు కాదు. బాబాను స్మృతి చేయడము ద్వారా సహాయమైతే లభిస్తుంది
కదా. అది రాతి విగ్రహమైనా కానీ బాబా ఆ సమయములో అల్పకాలికముగా మనోకామనను పూర్తి
చేస్తారు. ఆ సమయములో రజోప్రధానమైన స్మృతి ఉండేది కావున దాని ద్వారా కూడా బలము
లభించేది, అలసట కలిగేది కాదు. ఇప్పుడైతే పెద్ద వ్యక్తులు వెంటనే అలసిపోతారు. పేదవారు
చాలా తీర్థ యాత్రలకు వెళ్తారు. షావుకార్లు చాలా ఘనముగా గుర్రాలు మొదలైనవాటిపై
వెళ్తారు. ఆ పేదవారైతే కాలినడకనే వెళ్ళిపోతారు. భావనకు ఫలము ఎంతైతే పేదవారికి
లభిస్తుందో అంత షావుకారులకు లభించదు. ఈ సమయములో కూడా బాబా పేదల పాలిటి పెన్నిధి అని
మీకు తెలుసు కావున ఇక ఎందుకు తికమకపడతారు? ఎందుకు మర్చిపోతారు? బాబా అంటారు, మీరేమి
కష్టపడవలసిన అవసరం లేదు. కేవలం ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. మీరందరూ ప్రేయసులు
కావున ప్రియుడిని స్మృతి చెయ్యాలి. ఆ ప్రియునికి భోగ్ పెట్టకుండా తినడానికి మీకు
సిగ్గుగా అనిపించదా? వారు ప్రియుడు కూడా, తండ్రి కూడా. వారు అంటారు - మీరు నాకు
తినిపించరా! మీరు నాకు తినిపించాలి కదా! చూడండి, బాబా యుక్తులు తెలియజేస్తారు. మీరు
తండ్రి లేక ప్రియునిగా భావిస్తారు కదా. ఎవరైతే తినిపిస్తారో, ముందుగా వారికి
తినిపించాలి కదా. బాబా అంటారు, నాకు భోగ్ సమర్పించి, నా స్మృతిలో తినండి. ఇందులో
చాలా శ్రమ ఉంది. బాబా పదే-పదే అర్థం చేయిస్తారు, బాబాను తప్పకుండా స్మృతి చెయ్యాలి.
బాబా స్వయం కూడా పదే-పదే పురుషార్థము చేస్తూ ఉంటారు. కుమారీలైన మీకైతే చాలా సహజము.
మీరు అసలు మెట్లు ఎక్కనే లేదు. కన్యకు అయితే ప్రియునితో తప్పకుండా నిశ్చితార్థము
అవుతుంది. కావున ఇటువంటి ప్రియుడిని స్మృతి చేస్తూ భోజనము తినాలి. వారిని మనము
స్మృతి చేస్తాము మరియు వారు మన వద్దకు వచ్చేస్తారు. వారిని స్మృతి చేస్తే వారు ఆ
భావనను, ఆ సువాసనను స్వీకరిస్తారు. కావున బాబాతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి.
రాత్రివేళ మేలుకున్నట్లయితే మీకు ఇది అభ్యాసమవుతుంది. అభ్యాసమైనట్లయితే ఇక పగలు కూడా
స్మృతి ఉంటుంది. భోజనము చేసేటప్పుడు కూడా స్మృతి చేయాలి. ప్రియునితో మీ
నిశ్చితార్థము జరిగింది. నీతోనే తింటాను... అని పక్కా ప్రతిజ్ఞ చెయ్యాలి. ఎప్పుడైతే
మీరు స్మృతి చేస్తారో, అప్పుడే వారు తింటారు కదా. వారికైతే మీ భావన, ఆ సువాసనే
అందుతుంది ఎందుకంటే వారికి తన శరీరమైతే లేదు. కుమారీలకైతే ఇది చాలా సహజము, వారికి
ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. శివబాబా మన సుందరమైన ప్రియుడు, వారు ఎంత మధురమైనవారు.
అర్ధకల్పము మేము మిమ్మల్ని స్మృతి చేసాము, ఇప్పుడు మీరు వచ్చి కలిశారు! మేము ఏదైతే
తింటామో, అది మీరు కూడా తినండి. అలాగని ఒక్కసారి స్మృతి చేసి ఇక మీరు మాత్రమే తింటూ
ఉండడం మరియు వారికి తినిపించడాన్ని మర్చిపోవడం కాదు. వారిని మర్చిపోతే అది వారికి
అందదు. భోజన పదార్థాలైతే చాలా తింటారు, కిచిడీ తింటారు, మామిడిపళ్ళు తింటారు,
మిఠాయిలు తింటారు... మరి తినే ముందు స్మృతి చేసి ఇక తర్వాత స్మృతి చేయకపోతే, వారు
మిగిలిన పదార్థాలను ఎలా తింటారు. ప్రియుడు తినకపోతే మాయ మధ్యలో తినేస్తుంది, అది
వారిని తిననివ్వదు. నేను చూస్తాను కదా, మాయ తినేస్తే అది శక్తివంతమైపోతుంది మరియు
మిమ్మల్ని ఓడించేస్తుంది. బాబా యుక్తులన్నింటినీ వినిపిస్తారు. బాబాను స్మృతి
చేసినట్లయితే ఆ తండ్రి మరియు ప్రియుడు చాలా సంతోషిస్తారు. బాబా, నీతోనే కూర్చోవాలి,
నీతోనే తినాలి అని అంటారు. మేము మిమ్మల్ని స్మృతి చేసి తింటాము అని అంటారు. జ్ఞానము
ద్వారా తెలిసిన విషయమేమిటంటే, వారు కేవలం భావననే, సువాసననే తీసుకుంటారు. ఇది అప్పుగా
తీసుకున్న శరీరము కదా. స్మృతి చేసినట్లయితే వారు వస్తారు. మొత్తమంతా మీ స్మృతిపైనే
ఆధారపడి ఉంది. దీనినే యోగము అని అంటారు. యోగములో కృషి ఉంది. సన్యాసులు మొదలైనవారు
ఎప్పుడూ ఇలా అనరు. మీరు ఒకవేళ పురుషార్థము చెయ్యాలంటే బాబా శ్రీమతాన్ని నోట్
చేసుకోండి. పూర్తి పురుషార్థము చెయ్యండి. బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు -
వారేమంటారంటే, నేను ఎటువంటి కర్మలను చేస్తానో, అవే మీరూ చేయండి. అవే కర్మలను నేను
మీకు నేర్పిస్తాను. బాబా అయితే కర్మలు చెయ్యనక్కర్లేదు. సత్యయుగములో కర్మలకు
పశ్చాత్తాపపడరు. బాబా చాలా సహజమైన విషయాలు తెలియజేస్తారు. నీతోనే కూర్చుంటాను,
వింటాను, నీతోనే తింటాను... అనే గాయనము మీదే. ప్రియుని రూపములోనైనా లేక తండ్రి
రూపములోనైనా స్మృతి చెయ్యండి. విచార సాగర మంథనము చేసి జ్ఞాన పాయింట్లను వెలికి
తీస్తారు అని అంటూ ఉంటారు కదా. ఈ అభ్యాసముతో వికర్మలు కూడా వినాశనమవుతాయి,
ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు. ఎవరైతే పురుషార్థము చేస్తారో, వారికి లాభము ఉంటుంది,
ఎవరైతే చెయ్యరో వారికి నష్టము కలుగుతుంది. మొత్తం ప్రపంచమంతా అయితే స్వర్గానికి
యజమానిగా అవ్వదు. ఇది కూడా లెక్కే.
బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. పాట ద్వారా విన్నారు కదా, తప్పకుండా మనము
యాత్రలో వెళ్తున్నాము. యాత్రలో భోజనము మొదలైనవి అయితే తినవలసే వస్తుంది, ప్రేయసి
ప్రియునితో, పిల్లలు తండ్రితో కలిసి భోజనము చేస్తారు. ఇక్కడ కూడా అలాగే. మీకు
ప్రియుని పట్ల ఎంత ప్రేమ, తపన ఉంటుందో, అంతగా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది.
నిశ్చయబుద్ధి కలవారు విజయంతి అవుతూ ఉంటారు. యోగము అంటే పరుగు. ఇది బుద్ధియోగపు పరుగు.
మనము విద్యార్థులము, టీచర్ మనకు పరుగెత్తడం నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు,
దినములో కేవలం కర్మలే చెయ్యాలి అని అనుకోకండి. తాబేలులా కర్మలు చేసి ఇక స్మృతిలో
కూర్చుండిపోండి. భ్రమరము రోజంతా భూ, భూ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత కొన్ని పురుగులు
ఎగిరిపోతాయి, కొన్ని చనిపోతాయి, అది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు భూ-భూ చేస్తూ మీ సమానముగా
తయారుచేస్తారు. అందులో కొందరికైతే చాలా ప్రేమ ఉంటుంది, కొందరు కుళ్ళిపోతారు, కొందరు
అసంపూర్ణముగా మిగిలిపోతారు, కొందరు పారిపోతారు, వెళ్ళి మళ్ళీ పురుగులా మారిపోతారు.
ఈ విధముగా భూ-భూ చేయడము చాలా సహజము. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి
భగవంతునికి ఎంతో సమయము పట్టదు. ఇప్పుడు మనం యోగము జోడిస్తున్నాము, దేవతలుగా అయ్యే
పురుషార్థము చేస్తున్నాము. ఈ జ్ఞానమే గీతలో ఉండేది. వారు మనుష్యుల నుండి దేవతలుగా
తయారుచేసి వెళ్ళారు. సత్యయుగములోనైతే అందరూ దేవతలే ఉండేవారు. తప్పకుండా వారందరినీ
సంగమములోనే వచ్చి దేవతలుగా తయారుచేసి ఉంటారు. అక్కడైతే దేవతలుగా తయారయ్యే యోగాన్ని
నేర్పించరు. సత్యయుగ ఆదిలో దేవీ-దేవతా ధర్మము ఉండేది మరియు కలియుగ అంతిమములో ఆసురీ
ధర్మము ఉంటుంది. ఈ విషయము కేవలం గీతలోనే వ్రాయబడి ఉంది. మనుష్యులను దేవతలుగా
తయారుచేయడానికి పెద్ద సమయమేమీ పట్టదు ఎందుకంటే లక్ష్యము-ఉద్దేశ్యాన్ని చెప్పేస్తారు.
అక్కడ మొత్తము ప్రపంచములో ఒకే ధర్మము ఉంటుంది. ప్రపంచము మొత్తమంతా ఉంటుంది కదా, చైనా,
యూరప్ మొదలైనవి ఉండవని కాదు, అవి ఉంటాయి కానీ అక్కడ మనుష్యులు ఉండరు. కేవలం దేవతా
ధర్మమువారే ఉంటారు, ఇతర ధర్మాలవారు ఉండరు. ఇప్పుడున్నది కలియుగము. మనము భగవంతుని
ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. తండ్రి అంటారు, మీరు 21 జన్మలు సదా
సుఖవంతులుగా అవుతారు. ఇందులో కష్టమైన విషయమేదీ లేదు. భక్తి మార్గములో భగవంతుని
వద్దకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించారు. నిర్వాణము చెందారు అని అంటారు. భగవంతుని వద్దకు
వెళ్ళారు అని ఎప్పుడూ అనరు. స్వర్గానికి వెళ్ళారు అని అంటారు. ఒక్కరు వెళ్ళడముతో
స్వర్గమైతే తయారవ్వదు. అందరూ వెళ్ళాలి. భగవంతుడు కాలుడికే కాలుడు అని గీతలో వ్రాయబడి
ఉంది. దోమల గుంపులా అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. చక్రము రిపీట్ అయ్యేది ఉంది అని
బుద్ధి కూడా చెప్తుంది. కావున మొట్టమొదట తప్పకుండా సత్యయుగీ దేవీ-దేవతా ధర్మమే
రిపీట్ అవుతుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు రిపీట్ అవుతాయి. బాబా ఎంత సహజముగా
తెలియజేస్తారు - మన్మనాభవ. అంతే. 5000 సంవత్సరాల క్రితము కూడా గీతా భగవంతుడు -
ప్రియమైన పిల్లలూ అని అన్నారు. ఒకవేళ శ్రీకృష్ణుడు ఆ మాట అని ఉంటే ఇతర ధర్మాలవారు
ఎవరూ వినలేరు. భగవంతుడు ఆ మాట అంటే అందరికీ అనిపిస్తుంది - గాడ్ ఫాదర్ స్వర్గాన్ని
స్థాపన చేస్తారు, అందులోకి మేము మళ్ళీ వెళ్ళి చక్రవర్తీ రాజులుగా అవుతాము అని.
ఇందులో ఖర్చు మొదలైనవాటి విషయమేదీ లేదు, కేవలం సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి.
పిల్లలైన మీరు విచార సాగర మంథనము చెయ్యాలి. కర్మలు చేస్తూ రాత్రింబవళ్ళు ఇలా
పురుషార్థము చేస్తూ ఉండండి. విచార సాగర మంథనము చెయ్యకపోతే లేక తండ్రిని స్మృతి
చెయ్యకపోతే, కేవలం కర్మలే చేస్తూ ఉంటే ఇక రాత్రివేళ కూడా అవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి.
ఇళ్ళు కట్టేవారికి ఇళ్ళ ఆలోచనలే నడుస్తాయి. విచార సాగర మంథనము చేసే బాధ్యత వీరిపై
ఉంది, కానీ - కలశము లక్ష్మికి ఇచ్చారు కావున మీరు లక్ష్మిగా అవుతారు కదా అని అంటారు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.