ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు. వారు అర్థం చేయిస్తారు కూడా, ఆ తర్వాత
అడుగుతారు కూడా. ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు. కొందరు సర్వవ్యాపి అని
కూడా అంటారు కానీ దానికన్నా ముందు ఆ తండ్రి ఎవరు? అన్నదైతే గుర్తించాలి కదా. ముందు
గుర్తించి, ఆ తర్వాత చెప్పాలి. తండ్రి నివాస స్థానము ఎక్కడ? తండ్రి గురించే
తెలియకపోతే ఇక వారి నివాస స్థానము గురించి ఎలా తెలుస్తుంది. వారు నామ-రూపాలకు
అతీతుడు అని అనేస్తారు అనగా వారు అసలు లేనే లేరు అని. మరి ఎవరైతే లేనే లేరో వారి
నివాస స్థానము గురించి ఇక ఎలా ఆలోచించాలి? ఇది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి
మొట్టమొదట తమ పరిచయాన్ని ఇచ్చారు, ఆ తర్వాత వారి నివాస స్థానము గురించి అర్థం
చేయించడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను మీకు ఈ రథము ద్వారా నా పరిచయాన్ని
ఇవ్వడానికి వచ్చాను. నేను మీ అందరికీ తండ్రిని, నన్ను పరమపిత అని అంటారు. ఆత్మను
గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రి యొక్క నామ, రూప, దేశ, కాలాలు లేకపోతే ఇక
పిల్లలవి ఎక్కడి నుండి వస్తాయి? తండ్రే నామ-రూపాలకు అతీతుడైతే ఇక పిల్లలు ఎక్కడి
నుండి వస్తారు? పిల్లలు ఉన్నారంటే తప్పకుండా తండ్రి కూడా ఉన్నట్లే. తద్వారా వారు
నామ-రూపాలకు అతీతుడు కాదు అని నిరూపించబడుతోంది. పిల్లలకు కూడా నామ-రూపాలు ఉన్నాయి.
ఆత్మ ఎంత సూక్ష్మమైనదైనా నామ-రూపాలైతే ఉన్నాయి కదా. ఆకాశము సూక్ష్మమైనదైనా కానీ
ఆకాశము అన్న పేరైతే ఉంది కదా. ఏ విధంగా ఆకాశము సూక్ష్మమైనదో అలాగే తండ్రి కూడా చాలా
సూక్ష్మమైనవారు. వారు ఒక అద్భుత సితార, వారు ఇతనిలోకి ప్రవేశిస్తారు, వారిని ఆత్మ
అని అంటారని పిల్లలు వర్ణన చేస్తారు. తండ్రి పరంధామములోనే ఉంటారు, అది నివాస స్థానము.
దృష్టి పైకే వెళ్తుంది కదా. వేలితో పైకి సైగ చేసి వారిని తలచుకుంటారు. మరి ఎవరినైతే
తలచుకుంటున్నారో వారు ఎవరో ఉండి ఉంటారు కదా. పరమపిత పరమాత్మ అని అయితే అంటారు కదా,
అయినా కానీ వారిని నామ-రూపాలకు అతీతుడు అని అనడము - దీనిని అజ్ఞానము అని అంటారు.
తండ్రిని తెలుసుకోవడాన్ని జ్ఞానము అని అంటారు. మనం మొదట అజ్ఞానులుగా ఉండేవారము అని
కూడా మీరే అర్థం చేసుకుంటారు. తండ్రి గురించి కూడా తెలియదు, స్వయము గురించి కూడా
తెలియదు. మనం ఒక ఆత్మ, శరీరము కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మను అవినాశీ
అని అంటారు కావున తప్పకుండా అదంటూ ఒకటి ఉన్నట్లే కదా. అవినాశీ అన్నది పేరు కాదు.
అవినాశీ అనగా వినాశనము పొందనిది. కావున తప్పకుండా దాని అస్తిత్వము ఉన్నట్లు.
పిల్లలకు బాగా అర్థం చేయించడం జరిగింది - మధురాతి మధురమైన పిల్లలు అని ఎవరినైతే
పిల్లలూ, పిల్లలూ అని అంటారో ఆ ఆత్మలు అవినాశీ. ఆ ఆత్మల తండ్రి అయిన పరమపిత పరమాత్మ
కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ ఆట ఒకేసారి జరుగుతుంది, ఆ సమయములోనే తండ్రి వచ్చి
పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు. నేను కూడా పాత్రధారినే. నేను ఏ విధముగా పాత్రను
అభినయిస్తాను అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. పాత అనగా పతిత ఆత్మను కొత్తగా, పావనముగా
తయారుచేస్తారు కావున శరీరము కూడా మీది అక్కడ పుష్పము వలె ఉంటుంది. ఇది అయితే
బుద్ధిలో ఉంది కదా.
ఇప్పుడు మీరు బాబా-బాబా అని అంటారు, ఈ పాత్ర నడుస్తోంది కదా. పిల్లలైన మమ్మల్ని
శాంతిధామమైన ఇంటికి తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చి ఉన్నారు అని ఆత్మ అంటుంది.
శాంతిధామము తర్వాత ఉన్నది సుఖధామమే. శాంతిధామము తర్వాత దుఃఖధామము ఉండదు. కొత్త
ప్రపంచములో సుఖమే ఉంటుంది అని అంటారు. ఈ దేవీ-దేవతలు ఒకవేళ చైతన్యముగా ఉన్నట్లయితే
మరియు వారిని ఎవరైనా మీరు ఎక్కడి నివాసులు అని అడిగినట్లయితే - మేము స్వర్గవాసులము
అని చెప్తారు. ఇప్పుడు ఈ జడమూర్తులైతే అలా జవాబు చెప్పలేవు. మీరైతే చెప్పగలరు కదా -
మేము వాస్తవానికి స్వర్గములో ఉండే దేవీ-దేవతలము, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి
ఇప్పుడు సంగమములోకి వచ్చాము అని. ఇది ట్రాన్స్ఫర్ అయ్యే పురుషోత్తమ సంగమయుగము. మేము
చాలా ఉత్తమ పురుషులుగా అవుతాము అని పిల్లలకు తెలుసు. మనము ప్రతి 5000 సంవత్సరాల
తర్వాత సతోప్రధానముగా అవుతాము. సతోప్రధానముగా కూడా నంబరువారుగా అవుతారని అంటారు. ఈ
పాత్ర అంతా ఆత్మకు లభించింది. మనిషికి పాత్ర లభించింది అని అనరు. ఆత్మ అయిన నాకు
పాత్ర లభించింది. ఆత్మనైన నేను 84 జన్మలను తీసుకుంటాను. ఆత్మలమైన మనము వారసులము.
వారసులుగా ఎప్పుడూ పురుషులే ఉంటారు, స్త్రీలు ఉండరు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు -
ఆత్మలమైన మనమందరమూ పురుషులమే అన్న విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోవాలి. అందరికీ
అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. హద్దులోని లౌకిక తండ్రి నుండి కేవలం
కొడుకులకే వారసత్వము లభిస్తుంది, కూతురుకు లభించదు. అలాగని ఆత్మ ఎప్పుడూ స్త్రీగానే
జన్మిస్తుందని కాదు. తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మయైన మీరు ఒకసారి పురుషుని శరీరము,
మరొకసారి స్త్రీ శరీరము తీసుకుంటారు. ఈ సమయములో మీరందరూ పురుషులే. ఆత్మలందరికీ ఒక్క
తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. అందరూ కొడుకులే. అందరి తండ్రి ఒక్కరే. తండ్రి
కూడా అంటారు - ఓ పిల్లలూ, ఆత్మలైన మీరందరూ పురుషులే. మీరు నా ఆత్మిక పిల్లలు. మళ్ళీ
పాత్రను అభినయించేందుకు స్త్రీ-పురుషులు ఇరువురూ కావాలి. అప్పుడే మనుష్య సృష్టి
వృద్ధి జరుగుతుంది. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మనమంతా సోదరులము
అని అంటారు కానీ అర్థం చేసుకోరు.
ఇప్పుడు మీరు అంటారు - బాబా, మీ నుండి మేము అనేక సార్లు వారసత్వాన్ని
తీసుకున్నాము. ఆత్మకు ఇది పక్కా అయిపోతుంది. ఓ బాబా, దయ చూపించండి అని ఆత్మ తండ్రిని
తప్పకుండా స్మృతి చేస్తుంది. బాబా, ఇప్పుడు మీరు రండి, మేమందరమూ మీకు పిల్లలుగా
అవుతాము. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలనూ వదిలి ఆత్మలైన మేము మిమ్మల్నే స్మృతి
చేస్తాము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి
అర్థం చేయించారు. తండ్రి నుండి మనము వారసత్వాన్ని ఎలా పొందుతాము, ప్రతి 5000
సంవత్సరాల తర్వాత మనం ఈ దేవతలుగా ఎలా అవుతాము, ఇది కూడా తెలుసుకోవాలి కదా. స్వర్గ
వారసత్వము ఎవరి నుండి లభిస్తుంది, ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి
అయితే స్వర్గవాసి కారు, వారు పిల్లలను ఆ విధంగా తయారుచేస్తారు. వారు స్వయమైతే
నరకములోకే వస్తారు, మీరు తండ్రిని పిలవడము కూడా నరకములోకే పిలుస్తారు, మీరు
తమోప్రధానముగా అయినప్పుడు పిలుస్తారు. ఇది తమోప్రధానమైన ప్రపంచము కదా. సతోప్రధానమైన
ప్రపంచము ఉండేది, 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యము ఉండేది. ఈ విషయాల గురించి, ఈ
చదువు గురించి ఇప్పుడు మీకే తెలుసు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు
చెప్పే చదువు. మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు.
కొడుకుగా అవ్వగానే వారసుడిగా అవుతారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరందరూ నా కొడుకులు.
మీకు వారసత్వాన్ని ఇస్తాను. మీరు పరస్పరం సోదరులు, మీ నివాస స్థానము మూలవతనము లేక
నిర్వాణధామము, దానిని నిరాకారీ లోకము అని కూడా అంటారు. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఈ
సూర్యచంద్రాదులకు కూడా అతీతముగా ఉన్న ఆ స్థానము మీ స్వీట్ సైలెన్స్ ఇల్లు, కానీ
అక్కడే కూర్చుండిపోకూడదు. అలా కూర్చుని ఏమి చేస్తారు. అది జడ అవస్థ వంటిదే. ఆత్మ
ఎప్పుడైతే పాత్రను అభినయిస్తుందో అప్పుడే చైతన్యముగా పిలవబడుతుంది. చైతన్యముగా ఉన్నా
పాత్రను అభినయించకపోతే అది జడమైనట్లే కదా. మీరు ఇక్కడ నిలబడి కాళ్ళూ-చేతులూ కదలకుండా
ఉన్నట్లయితే జడమైనట్లే. అక్కడైతే సహజసిద్ధమైన శాంతి ఉంటుంది, ఆత్మలు జడముగా ఉన్నట్లు
ఉంటాయి, పాత్రనేమీ అభినయించవు. శోభ అనేది పాత్రలోనే ఉంటుంది కదా. శాంతిధామములో శోభ
ఏముంటుంది? ఆత్మలు సుఖ-దుఃఖాల అనుభూతి నుండి అతీతముగా ఉంటారు. అసలు పాత్రనే
అభినయించకపోతే ఇక అక్కడ ఉండి లాభమేముంది? మొట్టమొదట సుఖము యొక్క పాత్రను అభినయించాలి.
ప్రతి ఒక్కరికీ ముందు నుండే పాత్ర లభించి ఉంది. కొందరు మాకు మోక్షము కావాలి అని
అంటారు. అలా అయితే నీటిబుడగ నీటిలో కలిసిపోయినట్లే, ఇక ఆత్మ అస్థిత్వము లేనట్లే. ఏ
పాత్రనూ అభినయించకపోతే మరి జడము అనే అంటారు. చైతన్యమై ఉండి కూడా జడముగా పడి
ఉన్నట్లయితే లాభమేముంది? పాత్రను అయితే అందరూ అభినయించవలసిందే. ముఖ్యమైనది
హీరో-హీరోయిన్ పాత్ర అని అనబడుతుంది. పిల్లలైన మీకు హీరో-హీరోయిన్ టైటిల్ లభిస్తుంది.
ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. మొదట సుఖమయమైన రాజ్యాన్ని పరిపాలిస్తుంది, ఆ
తర్వాత రావణుని దుఃఖపు రాజ్యములోకి వెళ్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలైన మీరు
అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వండి. టీచరుగా అయి ఇతరులకు అర్థం చేయించండి. ఎవరైతే టీచరుగా
అవ్వరో వారి పదవి తక్కువగా ఉంటుంది. టీచరుగా అవ్వకుండా ఎవరికైనా ఆశీర్వాదము ఎలా
లభిస్తుంది? ఎవరికైనా ధనము ఇస్తే వారికి సంతోషము కలుగుతుంది కదా. బి.కే.లు మాపై ఎంతో
దయ చూపిస్తున్నారు, దానితో మేము ఎలా ఉన్నవారము ఎలా అవుతున్నాము అని లోలోపల
భావిస్తారు. వాస్తవానికి మహిమ అనేది ఒక్క తండ్రినే చేస్తారు - వాహ్ బాబా, మీరు ఈ
పిల్లల ద్వారా మా కళ్యాణాన్ని ఎంతగా చేస్తారు! ఎవరో ఒకరి ద్వారానైతే జరుగుతుంది కదా.
తండ్రి చేసేవారు మరియు చేయించేవారు, మీ ద్వారా చేయిస్తారు. మీ కళ్యాణము జరుగుతుంది.
అప్పుడు మీరు ఇతరులకు అంటు కడతారు. ఎవరెవరు ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని
పొందుతారు. రాజుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. మళ్ళీ ఎవరైతే మంచి
నంబరులోకి వస్తారో వారు కూడా రాజులుగా అవుతారు. మాల తయారవుతుంది కదా. మిమ్మల్ని మీరు
ప్రశ్నించుకోవాలి - మేము మాలలో ఏ నంబరు వారిగా అవుతాము? నవ రత్నాలు ముఖ్యమైనవి కదా.
మధ్యలో వజ్రముగా తయారుచేసేవారు ఉన్నారు. వజ్రాన్ని మధ్యలో పెడతారు. మాలలో పైన
పుష్పము కూడా ఉంది కదా. రాజ్యవంశములోకి వచ్చే ముఖ్యమైన మణులుగా ఎవరెవరు అవుతారు
అనేది అంతిమములో మీకు తెలుస్తుంది. చివరిలో మీకు అంతా తప్పకుండా సాక్షాత్కారమవుతుంది.
ఏ విధముగా అందరూ శిక్షలు పొందుతారో మీరు చూస్తారు. ప్రారంభములో దివ్యదృష్టి ద్వారా
మీరు సూక్ష్మవతనములో చూసేవారు. ఇది కూడా గుప్తమే. ఆత్మ శిక్షలు ఎక్కడ పొందుతుంది -
ఇది కూడా డ్రామాలోని పాత్ర. గర్భ జైలులో శిక్షలు లభిస్తాయి. జైలులో ధర్మరాజును
చూస్తారు, అప్పుడు మమ్మల్ని బయటకు తీయండి అని అంటారు. అనారోగ్యాలు మొదలైనవి వస్తాయి,
అది కూడా కర్మల లెక్కాచారమే కదా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి అయితే
తప్పకుండా యథార్థమే వినిపిస్తారు కదా. ఇప్పుడు మీరు ధర్మయుక్తమైనవారిగా అవుతారు.
ఎవరైతే తండ్రి నుండి చాలా శక్తిని తీసుకుంటారో వారినే ధర్మయుక్తమైనవారు అని అంటారు.
మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా. ఎంతటి శక్తి ఉంటుంది. గొడవలు మొదలైనవాటి
విషయమేదీ ఉండదు. శక్తి తక్కువగా ఉంటే ఎన్ని గొడవలు జరుగుతాయి. పిల్లలైన మీకు
అర్ధకల్పము కొరకు శక్తి లభిస్తుంది, అది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా.
ఒకేలాంటి శక్తిని పొందలేరు, అలాగే ఒకేలాంటి పదవిని కూడా పొందలేరు. ఇది కూడా ముందు
నుండే నిశ్చితమై ఉంది. డ్రామాలో అనాదిగా రచింపబడి ఉంది. కొందరు చివరిలో వస్తారు,
వారు ఒకటి రెండు జన్మలను తీసుకుంటారు మరియు శరీరాన్ని వదిలేస్తారు. ఏ విధముగా
దీపావళి సమయములో దోమలు రాత్రి పుడతాయి, మళ్ళీ ఉదయం చూస్తే చనిపోయి ఉంటాయి. అవి
లెక్కలేనన్ని ఉంటాయి. మనుష్యుల విషయములోనైతే ఎంతైనా లెక్క ఉంటుంది. మొట్టమొదట ఏ
ఆత్మలైతే వస్తారో, వారి ఆయువు ఎంత ఎక్కువగా ఉంటుంది! మేము చాలా పెద్ద ఆయువు కలవారిగా
అవుతాము అని పిల్లలైన మీకు సంతోషము ఉండాలి. మీరు పూర్తి పాత్రను అభినయిస్తారు. మీరు
ఏ విధంగా పూర్తి పాత్రను అభినయిస్తారు అనేది తండ్రి మీకే అర్థం చేయిస్తారు. పాత్రను
అభినయించడానికి చదువు అనుసారముగా పై నుండి వస్తారు. మీ ఈ చదువు కొత్త ప్రపంచము కొరకే.
తండ్రి అంటారు, నేను అనేక సార్లు మిమ్మల్ని చదివిస్తాను. ఈ చదువు అవినాశీగా
అయిపోతుంది. అర్ధకల్పము మీరు ప్రారబ్ధాన్ని పొందుతారు. ఆ వినాశీ చదువు ద్వారా సుఖము
కూడా అల్పకాలము కొరకే లభిస్తుంది. ఇప్పుడు ఎవరైనా బ్యారిస్టరుగా అయితే మళ్ళీ కల్పము
తర్వాత బ్యారిస్టరుగా అవుతారు. ఇది కూడా మీకు తెలుసు, అందరి పాత్ర ఏదైతే ఉందో, అదే
పాత్ర కల్ప-కల్పమూ అభినయించబడుతుంది. దేవతలైనా, శూద్రులైనా, ప్రతి ఒక్కరి పాత్రా
కల్ప-కల్పమూ ఏదైతే అభినయించబడుతుందో, అదే మళ్ళీ అభినయించబడుతుంది. అందులో ఎటువంటి
తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఇదంతా తయారై, తయారుచేయబడిన
నాటకము. పురుషార్థము గొప్పదా లేక ప్రారబ్ధము గొప్పదా అని అడుగుతారు? ఇప్పుడు
పురుషార్థము లేకుండానైతే ప్రారబ్ధము లభించదు. పురుషార్థము ద్వారా ప్రారబ్ధము
లభిస్తుంది, డ్రామానుసారముగా. కావున మొత్తం భారమంతా డ్రామాపైకి వచ్చేస్తుంది.
పురుషార్థము కొందరు చేస్తారు, కొందరు చేయరు. వస్తారు కూడా, కానీ పురుషార్థము
చేయకపోతే ఇక ప్రారబ్ధము లభించదు. మొత్తం ప్రపంచములో ఏ పాత్ర అయితే నడుస్తుందో, అదంతా
తయారై, తయారుచేయబడిన డ్రామా. ఆత్మలో ఆది నుండి అంతిమము వరకూ పాత్ర అంతా మొదటే
నిశ్చితమై ఉంది. అదే విధముగా మీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది, తద్వారా అది వజ్రముగా
కూడా అవుతుంది, అలాగే గవ్వగా కూడా అవుతుంది. ఈ విషయాలన్నింటినీ మీరు ఇప్పుడు వింటారు.
స్కూల్లో ఎవరైనా పాస్ అవ్వకపోతే వారిని బుద్ధిహీనులు అని అంటారు. వారికి ధారణ జరగదు.
దీనిని వెరైటీ వృక్షము, వెరైటీ రూపురేఖలు అని అంటారు. ఈ వెరైటీ వృక్షము యొక్క
జ్ఞానాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. కల్పవృక్షము గురించి కూడా అర్థం చేయిస్తారు.
మర్రి వృక్ష ఉదాహరణ కూడా దీనికి వర్తించేదే. దాని శాఖలు ఎంతగానో విస్తరిస్తాయి.
మా ఆత్మ అవినాశీ, శరీరము వినాశనమైపోతుంది అని పిల్లలు భావిస్తారు. ఆత్మయే ధారణ
చేస్తుంది, ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది, శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఆత్మ అయితే
అదే, ఆత్మయే భిన్న-భిన్న శరీరాలను తీసుకుని పాత్రను అభినయిస్తుంది. ఇది కొత్త విషయము
కదా. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు ఈ జ్ఞానము లభించింది. కల్పపూర్వము కూడా ఇలా అర్థం
చేసుకున్నారు. తండ్రి రావడము కూడా భారత్ లోకే వస్తారు. మీరు అందరికీ సందేశాన్ని
ఇస్తూ ఉంటారు. సందేశము లభించనివారంటూ ఎవరూ ఉండరు. సందేశాన్ని వినడము అందరి హక్కు,
అప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకుంటారు. ఎంతోకొంత వింటారు కదా, ఎంతైనా
తండ్రి పిల్లలే కదా. తండ్రి అర్థం చేయిస్తారు, నేను ఆత్మలైన మీ తండ్రిని. నా ద్వారా
ఈ రచన ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు. మిగిలినవారంతా
ముక్తిలోకి వెళ్ళిపోతారు. తండ్రి అయితే అందరి సద్గతిని చేస్తారు. ఓహో బాబా, నీ లీల...
అని పాడుతారు, అది ఏ లీల? ఎటువంటి లీల? అది ఈ పాత ప్రపంచాన్ని మార్చే లీల. దాని
గురించి తెలియాలి కదా. మనుష్యులే తెలుసుకుంటారు కదా. తండ్రి వచ్చి పిల్లలైన మీకే
అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్. మిమ్మల్ని కూడా నాలెడ్జ్
ఫుల్ గా తయారుచేస్తారు. మీరు నంబరువారుగా అలా తయారవుతారు. స్కాలర్షిప్ తీసుకునేవారు
నాలెడ్జ్ ఫుల్ గా పిలవబడతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.