22-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 17.03.2003


‘‘సదా మీ స్వమానములో ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, అందరికీ సహయోగులుగా అవ్వండి మరియు సమర్థులుగా తయారుచెయ్యండి’’

ఈ రోజు భాగ్యవిధాత అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి మస్తకముపై మూడు భాగ్యపు రేఖలను చూస్తున్నారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ, రెండవది సత్యమైన శిక్షకుని శ్రేష్ఠ శిక్షణ యొక్క భాగ్యపు రేఖ, మూడవది శ్రీమతము యొక్క మెరుస్తూ ఉన్న రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకము మధ్యలో మూడు రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ మూడు భాగ్యపు రేఖలను చూస్తున్నారు కదా. భాగ్యవిధాతయే పిల్లలైన మీకు తండ్రి అన్నప్పుడు మీకు కాకుండా శ్రేష్ఠ భాగ్యము ఇంకెవరికి ఉండగలదు. బాప్ దాదా చూస్తున్నారు, విశ్వములో అనేక కోట్ల ఆత్మలు ఉన్నారు కానీ అన్ని కోట్ల నుండి 6 లక్షల మంది పరివారము అంటే... ఎంత కొద్దిమంది! కోట్లలో కొద్దిమంది అయ్యారు కదా! ఆ మాటకొస్తే ప్రతి మానవుని జీవితములో ఈ మూడు విషయాలు - పాలన, చదువు మరియు శ్రేష్ఠ మతము, ఈ మూడూ అవసరమే. కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మలు లేక మానవాత్మల మతము, పాలన, చదువుకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. కనుక ఇంతటి శ్రేష్ఠ భాగ్యము సంకల్పములో కూడా లేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసు - ‘పొందేసాము’ అని పాడుతుంది. పొందేసారా లేక పొందాలా? ఏమంటారు? పొందేసారు కదా! బాబా కూడా ఇటువంటి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. పిల్లలేమో - వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు బాబా - వాహ్ పిల్లలూ వాహ్ అని అంటారు. ఈ భాగ్యాన్ని కేవలము స్మృతిలోనే ఉంచుకోవడం కాదు, కానీ సదా స్మృతి స్వరూపులుగా ఉండాలి. చాలామంది పిల్లలు చాలా బాగా ఆలోచిస్తారు కానీ ఆలోచనా స్వరూపులుగా అవ్వకూడదు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు. ఆలోచనా స్వరూపమనేది సమర్థ స్వరూపము కాదు.

బాప్ దాదా పిల్లల యొక్క రకరకాల లీలలను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కొందరు ఆలోచనా స్వరూపులుగా ఉంటారు, సదా స్మృతి స్వరూపులుగా ఉండరు. ఒక్కోసారి ఆలోచనా స్వరూపము, ఒక్కోసారి స్మృతి స్వరూపము. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో, వారు నిరంతరము న్యాచురల్ స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచనా స్వరూపులుగా ఉంటారో, వారు శ్రమ చెయ్యవలసి ఉంటుంది. ఈ సంగమయుగము శ్రమ పడే యుగము కాదు, ఇది సర్వ ప్రాప్తుల అనుభవాల యుగము. 63 జన్మలు శ్రమించారు కానీ ఇప్పుడిది శ్రమకు ఫలాన్ని ప్రాప్తి చేసుకునే యుగము అనగా సమయము.

దేహభానపు స్మృతిలో ఉండటానికి ఏమి శ్రమ చేసారు అన్నది బాప్ దాదా చూస్తున్నారు. నేను ఫలానాను, నేను ఫలానాను... అని ఈ శ్రమ ఏమైనా చేసారా? అది న్యాచురల్ గానే ఉంది కదా! దేహాభిమానము అనేది స్వభావము అయిపోయింది కదా! అది ఎంత పక్కా స్వభావము అయిపోయిందంటే, ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలకు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో దేహాభిమానము తనవైపుకు ఆకర్షిస్తుంది. నేను ఆత్మను, నేను ఆత్మను అని అనుకుంటారు, కానీ దేహభానము ఎంత సహజము అయిపోయిందంటే, అది పదే-పదే వద్దనుకుంటున్నా, ఆలోచించకపోయినా దేహభానములోకి వచ్చేస్తారు. బాప్ దాదా చెప్తున్నారు - ఇప్పుడు మరజీవా జన్మలో ఆత్మాభిమానము అనగా దేహీ-అభిమానీ స్థితి కూడా అంతే స్వభావము వలె మరియు సహజము అయిపోవాలి. నేను ఆత్మను, నేను ఆత్మను అని శ్రమ చెయ్యాల్సిన అవసరము రాకూడదు. ఉదాహరణకు పిల్లలు జన్మించిన తర్వాత, వారికి కాస్త అర్థం చేసుకునే తెలివి వచ్చినప్పుడు - నువ్వు ఎవరివి, ఎవరివాడివి అని ఆ బిడ్డకు పరిచయము ఇస్తారు, అలాగే బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకు జన్మించటంతోనే ఏ పరిచయము లభించింది? మీరు ఎవరు? ఆత్మ పాఠము పక్కా చేయించటం జరిగింది కదా! కనుక ఈ మొదటి పరిచయము న్యాచురల్ నేచర్ (సహజ స్వభావముగా) అయిపోవాలి. స్వభావము అనేది సహజముగా మరియు నిరంతరము ఉంటుంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము ఉండదు, అలాగే బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమయమనుసారముగా దేహీ-అభిమానీ స్థితి సహజముగా ఉండాలి. కొందరు పిల్లలకు అలా ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉండటం లేదు, స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఇప్పుడు నిరంతరము మరియు సహజముగా స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణులందరికీ చివర్లో వచ్చే చిన్నపాటి అంతిమ పరీక్ష ఇదే - ‘‘నష్టోమోహా స్మృతి స్వరూపము’’.

మరి ఈ సంవత్సరము ఏం చేస్తారు? ఈ సంవత్సరములో ఏ విశేష లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. కావున బాప్ దాదా అంటున్నారు - సదా దేహీ-అభిమానీ, స్మృతి స్వరూప భవ. జీవన్ముక్తి అయితే ప్రాప్తి అయ్యేదే ఉంది కానీ జీవన్ముక్తులుగా అయ్యే కంటే ముందు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఈ స్థితి సమయాన్ని సమీపముగా తీసుకువస్తుంది మరియు మొత్తము విశ్వములోని మీ సోదర-సోదరీలను దుఃఖము, అశాంతి నుండి విముక్తులుగా చేస్తుంది. మీ ఈ స్థితి ఆత్మల కొరకు ముక్తిధామము యొక్క తలుపులను తెరుస్తుంది. మరి మీ సోదర-సోదరీలపై దయ కలగటం లేదా! నలువైపులా ఆత్మలు ఎంతగా ఆర్తనాదాలు చేస్తున్నారు. మీ ముక్తి సర్వులకు ముక్తిని ఇప్పిస్తుంది. సహజముగా స్మృతి మరియు సమర్థ స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు అన్నదానిని చెక్ చేసుకోండి. సమర్థ స్వరూపులుగా అవ్వటమే వ్యర్థాన్ని సహజముగా సమాప్తము చేస్తుంది. పదే-పదే శ్రమ చెయ్యాల్సిన అవసరము ఉండదు.

ఇప్పుడు ఈ సంవత్సరము బాప్ దాదా పిల్లలపై ఉన్న స్నేహము కారణంగా ఏ బిడ్డ యొక్క ఏ సమస్యలోనూ శ్రమను చూడాలనుకోవటం లేదు. సమస్య సమాప్తమైపోవాలి మరియు సమాధాన సమర్థ స్వరూపము ఉండాలి. ఇది సాధ్యమేనా? దాదీలూ చెప్పండి, ఇది సాధ్యమేనా? టీచర్లు చెప్పండి, సాధ్యమేనా? పాండవులూ, సాధ్యమేనా? మళ్ళీ సాకులు చెప్పకండి - ఇది ఉంది కదా, ఇలా జరిగింది కదా, ఇది జరగకపోతే ఇలా అయ్యేది కాదు! బాప్ దాదా చాలా మధురాతి-మధురమైన ఆటలను చూసి ఉన్నారు. ఏదేమైనా కానీ, హిమాలయము కంటే పెద్దగా, 100 రెట్లు సమస్యా స్వరూపము ఉన్నా కానీ, తనువు ద్వారానైనా, మనసు ద్వారానైనా, వ్యక్తుల ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా సమస్య వస్తే, ఆ పర-స్థితి అనేది మీ స్వ-స్థితి ముందు అసలేమీ కాదు మరియు స్వ-స్థితికి సాధనము - స్వమానము. సహజ రూపములో స్వమానము ఉండాలి. లేదు, లేదు, నేను స్వదర్శన చక్రధారిని, నేను కంటిరత్నాన్ని, నేను హృదయ సింహాసనాధికారిని... అని గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఉండకూడదు, పదే-పదే శ్రమపడాల్సిన అవసరం రాకూడదు. నేను అలా ఉన్నాను - అంతే! మీరు కాకుండా మరెవరైనా అలా అయ్యేది ఉందా! కల్పపూర్వము ఎవరు అయ్యారు? వేరే ఎవరైనా అయ్యారా లేక మీరే అయ్యారా? మీరే అలా ఉండేవారు, ఇప్పుడూ మీరే అలా ఉన్నారు, ప్రతి కల్పము మీరే అలా అవుతారు. ఇది నిశ్చితము. వీరు ఆ కల్పపూర్వము వారే అని బాప్ దాదా అందరి ముఖాలను చూస్తున్నారు. ఈ కల్పానికి చెందినవారా లేక అనేక కల్పాలకు చెందినవారా? అనేక కల్పాలకు చెందినవారు కదా! అవునా? ప్రతి కల్పానికి చెందినవారు చేతులెత్తండి. మరి ఇది నిశ్చితమే కదా, మీకైతే పాస్ సర్టిఫికేట్ లభించేసింది కదా లేక తీసుకోవాలా? లభించేసింది కదా? లభించిందా లేక తీసుకోవాలా? కల్పపూర్వము లభించింది, ఇప్పుడెందుకు లభించదు. కనుక సర్టిఫికేట్ లభించి ఉంది అన్న ఈ స్మృతి స్వరూపులుగానే అవ్వండి. పాస్ విత్ ఆనర్లుగా అయినా లేక కేవలం పాస్ అయినా, ఈ తేడా అయితే ఉంటుంది కానీ అది మాత్రము మేమే. పక్కా కదా! లేదా ట్రైన్ లో వెళ్తూ-వెళ్తూ మర్చిపోతారా, విమానం ఎక్కిన తరువాత ఎగిరిపోతుందా? లేదు.

చూడండి, శివరాత్రిని నలువైపులా ఉల్లాస-ఉత్సాహాలతో జరుపుకోవాలి అని ఈ సంవత్సరము దృఢ సంకల్పము చేసారు కదా, జరుపుకున్నారు కదా! దృఢ సంకల్పముతో ఏదైతే అనుకున్నారో అది జరిగింది కదా! మరి ఇది ఏ విషయములో అద్భుతము? ఏకత మరియు దృఢత. 67 ప్రోగ్రాములు చెయ్యాలని అనుకున్నారు కానీ బాప్ దాదా చూసారు - కొంతమంది పిల్లలు దానికంటే కూడా ఎక్కువ ప్రోగ్రాములు చేసారు. ఇది సమర్థ స్వరూపానికి గుర్తు, ఇది ఉల్లాస-ఉత్సాహాలకు ప్రత్యక్ష ప్రమాణము. స్వతహాగానే నలువైపులా చేసారు కదా! ఇదే విధంగా అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఈ సంకల్పము చెయ్యండి - ఇప్పుడు సమయాన్ని సమీపముగా తీసుకురావాల్సిందే. ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి. కానీ ఎప్పుడైతే మీరు ఆలోచనను స్మృతి స్వరూపములోకి తీసుకువస్తారో, అప్పుడే ఇది జరుగుతుంది.

బాప్ దాదా విన్నారు - విదేశీయులకు విశేషముగా స్నేహ మిలనము మరియు మీటింగు ఉంది మరియు భారత్ వారికి కూడా మీటింగు ఉంది. మరి మీటింగులో కేవలం సేవా ప్లాన్లను తయారుచెయ్యటమే కాదు, వాటిని తయారుచెయ్యండి కానీ బ్యాలెన్సుతో కూడిన ప్లాన్లు తయారుచెయ్యండి. ఒకరికొకరు ఏ విధంగా సహయోగులుగా అవ్వండి అంటే ఇక అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ముందుకు ఎగురుతూ వెళ్ళాలి. దాతగా అయ్యి సహయోగాన్ని ఇవ్వండి. విషయాలను చూడకండి, సహయోగులుగా అవ్వండి. స్వమానములో ఉండండి మరియు గౌరవాన్ని ఇస్తూ సహయోగులుగా అవ్వండి ఎందుకంటే ఏ ఆత్మకైనా మీరు హృదయపూర్వకముగా గౌరవాన్ని ఇచ్చినట్లయితే అది చాలా-చాలా పెద్ద పుణ్యము ఎందుకంటే బలహీన ఆత్మను ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువస్తే అదెంత పెద్ద పుణ్యము! పడిపోయినవారిని ఇంకా పడేయకూడదు, వారిని ఆలింగనం చేసుకోవాలి అనగా బాహ్యంగా ఆలింగనం చేసుకోవటము కాదు, ఆలింగనం చేసుకోవటము అనగా బాబా సమానముగా తయారుచెయ్యటము, సహయోగాన్ని ఇవ్వటము.

ఈ సంవత్సరము ఏమేమి చెయ్యాలి అని అడిగారు కదా? గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానములో ఉండండి, అంతే. సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారుచెయ్యండి. వ్యర్థ విషయాలలోకి వెళ్ళకండి. బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది, వారి బలహీనతనే చూస్తూ ఉంటే సహయోగిగా ఎలా అవుతారు! సహయోగము ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. అన్నింటికంటే సహజ పురుషార్థము, వేరే ఇంకేమీ చెయ్యలేకపోతే అన్నింటికంటే సహజ పురుషార్థము - ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. గౌరవాన్ని ఇవ్వండి మరియు మహిమాయోగ్యులుగా అవ్వండి. గౌరవాన్ని ఇచ్చేవారే అందరి ద్వారా గౌరవనీయులుగా అవుతారు. మరియు ఎంతగా ఇప్పుడు గౌరవనీయులుగా అవుతారో, అంతగానే రాజ్యాధికారులుగా మరియు పూజ్యాత్మలుగా అవుతారు. ఇస్తూ వెళ్ళండి, తీసుకునేది లేదు. తీసుకుని ఇవ్వటము అంటే అది బిజినెస్ చేసేవారి పని. మీరైతే దాత పిల్లలు. ఇకపోతే బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. అందరూ మంచి సేవ చేసారు. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా! వాణి ద్వారా అందరూ మంచి సేవ చేసారు, సాధనాల ద్వారా కూడా సేవా రిజల్టును మంచిగా తీసుకువచ్చారు. అనేకాత్మల ఫిర్యాదును కూడా సమాప్తము చేసారు. వీటితోపాటు సమయము యొక్క తీవ్రగతితో కూడిన వేగాన్ని చూసి బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - కేవలం కొద్దిమంది ఆత్మలకు సేవ చెయ్యటము కాదు, కానీ విశ్వములోని సర్వాత్మలకు ముక్తిదాతలుగా మీరు నిమిత్తమయ్యారు ఎందుకంటే మీరు బాబాకు సహచరులు. అందుకే ఇప్పుడు సమయము యొక్క వేగము అనుసారంగా ఒకే సమయములో మూడు సేవలను కలిపి చెయ్యాలి:- ఒకటి వాణి, రెండవది స్వయము యొక్క శక్తిశాలి స్థితి మరియు మూడవది శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్లు. ఎక్కడ సేవ చేసినా అక్కడ ఎటువంటి ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యండి అంటే ఆ వైబ్రేషన్ల ప్రభావములో వారు సహజముగానే ఆకర్షితులవుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ అందరి జడ చిత్రాలు ఎలా సేవ చేస్తున్నాయి? అవి వాణి ద్వారా మాట్లాతున్నాయా? వైబ్రేషన్లు ఎలా ఉంటాయంటే భక్తులకు వారి భావనకు ఫలము సహజంగా లభిస్తుంది. అలా వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి, వైబ్రేషన్లలో సర్వశక్తుల కిరణాలు వ్యాపిస్తూ ఉండాలి, వాయుమండలము మారిపోవాలి. వైబ్రేషన్లు ఎటువంటివంటే అవి మనసులో ముద్రించబడిపోతాయి. మీ అందరికీ అనుభవము ఉంది కదా, ఏ ఆత్మ పట్లనైనా మీ మనస్సులో మంచి లేక చెడు వైబ్రేషన్లు కూర్చుండిపోతే, అవి ఎంత సమయము నడుస్తాయి? చాలా సమయము నడుస్తాయి కదా! తొలగించుకోవాలి అనుకున్నా తొలగవు. ఎవరి గురించైనా చెడు వైబ్రేషన్లు ఉంటే అవి సహజముగా తొలగిపోతాయా? కనుక మీ సర్వశక్తుల కిరణాల వైబ్రేషన్లు ముద్ర వలె పని చేస్తాయి. వాణిని మర్చిపోవచ్చు కానీ వైబ్రేషన్ల ముద్ర సహజముగా తొలగదు. అనుభవముంది కదా! ఉంది కదా అనుభవము?

గుజరాత్ వారు, బొంబాయి వారు ఏవైతే ఉల్లాస-ఉత్సాహాలను చూపించారో, వారికి కూడా బాప్ దాదా పదమాల, పదమాల రెట్ల అభినందనలను ఇస్తారు. ఎందుకని? ఏ విశేషత ఉంది? ఎందుకు అభినందనలు ఇస్తారు? ఫంక్షన్లు అయితే పెద్ద-పెద్దవి చేస్తూనే ఉంటారు కానీ ప్రత్యేకంగా అభినందనలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈ రెండు స్థానాలలోనూ ఏకత మరియు దృఢత అనే విశేషత ఉండినది. ఎక్కడైతే ఏకత మరియు దృఢత ఉంటాయో, అక్కడ ఒక్క సంవత్సరానికి బదులుగా ఒక నెల ఒక సంవత్సరముతో సమానముగా ఉంటుంది. గుజరాత్ వారూ, బొంబాయి వారూ విన్నారా. అచ్ఛా!

ఇప్పుడు సెకెండులో జ్ఞాన సూర్య స్థితిలో స్థితులై నలువైపులా భయభీతులై అలజడిలో ఉన్న ఆత్మలకు సర్వశక్తుల కిరణాలను వ్యాపింపజెయ్యండి. చాలా భయభీతులుగా ఉన్నారు, శక్తిని ఇవ్వండి, వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. అచ్ఛా. (బాప్ దాదా డ్రిల్ చేయించారు)

నలువైపులా ఉన్న పిల్లల నుండి రకరకాల ప్రియస్మృతులు మరియు సమాచార పత్రాలు మరియు ఈ-మెయిల్స్ బాబా వద్దకు చేరుకున్నాయి. నా స్మృతిని కూడా ఇవ్వండి, నా స్మృతిని కూడా ఇవ్వండి అని అందరూ అంటారు. బాప్ దాదా అంటున్నారు - ప్రియమైన పిల్లల ప్రతి ఒక్కరి స్మృతి బాప్ దాదా వద్దకు చేరుకుంది. దూరంగా కూర్చుని ఉన్నా కానీ బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు. కావున మీ అందరికీ - మా స్మృతిని ఇవ్వండి, మా స్మృతిని ఇవ్వండి అని ఎవరెవరైతే చెప్పారో, వారందరి స్మృతులు బాబా వద్దకు చేరుకున్నాయి. ఇదే పిల్లల ప్రేమ మరియు బాబా ప్రేమ పిల్లలను ఎగిరేలా చేస్తుంది. అచ్ఛా!

నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులకు, కోట్లలో కొద్దిమంది అయిన విశేష ఆత్మలకు, సదా స్వమానములో ఉండేవారికి, గౌరవాన్ని ఇచ్చేవారికి, సర్వీసబుల్ పిల్లలకు, సదా స్మృతి స్వరూప మరియు సమర్థ స్వరూప ఆత్మలకు, సదా చలించని, స్థిరమైన స్థితి అనే ఆసనముపై స్థితులై ఉండే సర్వ శక్తి స్వరూప పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీతో:- బాప్ దాదా మీ విషయములో విశేషముగా సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? విశేషముగా ఏ విషయములో సంతోషిస్తున్నారంటే - ఏ విధంగా బ్రహ్మాబాబా అందరినీ - ఇది చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి అని ఆజ్ఞాపించేవారో అలా మీరు కూడా బ్రాహ్మాబాబాను ఫాలో చేసారు. (మీరు కూడా నాతోపాటు ఉన్నారు) అదైతే ఉండనే ఉంటుంది, నిమిత్తమైతే మీరు అయ్యారు కదా. మరియు ఎటువంటి దృఢ సంకల్పము చేసారంటే దానివలన నలువైపులా సఫలత ఉంది, అందుకే మీలో ఆత్మిక శక్తి చాలా గుప్తముగా నిండి ఉంది. ఆరోగ్యము బాగుంది, ఆత్మిక శక్తి ఎంతగా నిండి ఉందంటే ఇక ఆరోగ్యము అసలేమీ కాదు. అద్భుతము కదా!

దాదీలు బాబాను కలవడాన్ని చూస్తుంటే అందరికీ - మేము కూడా దాదీలమై ఉంటే కలిసేవారము కదా అని అనిపిస్తుంది. మీరు కూడా దాదీగా అవుతారు. ఇప్పుడు బాప్ దాదా మనసులో ప్లాన్ ను తయారుచేసారు, దానిని ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. ఎవరైతే సేవలో, బ్రహ్మాబాబా యొక్క సాకార సమయములో ఆదిరత్నాలు వెలువడ్డారో, వారి సంగఠనను పక్కా చెయ్యాలి. (ఎప్పుడు చేస్తారు?) మీరు చేసినప్పుడు. ఈ డ్యూటీ మీది (జానకి దాదీది). మీ మనసులో కూడా ఈ సంకల్పము ఉంది కదా? ఎందుకంటే ఏ విధంగా దాదీలైన మీ ఏకత మరియు దృఢతతో కూడిన సంగఠన పక్కాగా ఉందో, అలా ఆది సేవా రత్నాల సంగఠన పక్కాగా ఉండాలి, ఇది చాలా-చాలా అవసరము ఎందుకంటే సేవ అయితే పెరిగేదే ఉంది. సంగఠన శక్తి ఏది కావాలంటే అది చెయ్యగలదు. సంగఠన యొక్క గుర్తుకు స్మృతిచిహ్నము పంచ పాండవులు. ఐదుగురే ఉన్నారు కానీ వారు సంగఠనకు గుర్తు. అచ్ఛా - ఇప్పుడు ఎవరైతే సాకార బ్రహ్మా ఉన్న సమయములో సేవ కోసము సెంటరులో ఉన్నారో, సేవలో నిమగ్నమై ఉన్నారో, వారు లేచి నిలబడండి. సోదరులు కూడా ఉన్నారు, పాండవులు లేకపోతే గతే లేదు. ఇక్కడైతే కొద్దిమందే ఉన్నారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. సంగఠనను జమ చేసే బాధ్యత వీరిది (జానకి దాదీది). వీరు (పెద్ద దాది) వెన్నెముక. చాలా మంచి-మంచి రత్నాలు ఉన్నారు. అచ్ఛా! అంతా బాగుంది. ఏది చేస్తూ ఉన్నా సరే, మీ సంగఠనకు చాలా మహానత ఉంది. కోట దృఢముగా ఉంది. అచ్ఛా!

వరదానము:-
స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ప్రతి పరిస్థితినీ దాటివేసే సదా విజయీ భవ

సదా మీ ఈ స్వమానమనే సీటుపై స్థితులై ఉండండి - నేను విజయీ రత్నాన్ని, మాస్టర్ సర్వశక్తివంతుడిని, అప్పుడు ఎటువంటి సీటు ఉంటుందో అటువంటి లక్షణాలు వస్తాయి. ఎటువంటి పరిస్థితి అయినా ఎదురుగా వస్తే, క్షణములో మీ ఈ సీటుపై సెట్ అయిపోండి. సీటుపై ఉన్నవారి ఆర్డర్ నే పాటించటం జరుగుతుంది. సీటుపై ఉన్నట్లయితే విజయులుగా అయిపోతారు. సంగమయుగము ఉన్నదే సదా విజయులుగా అయ్యే యుగము, ఈ యుగానికి ఈ వరదానము ఉంది, కావున వరదానులుగా అయ్యి విజయులుగా అవ్వండి.

స్లోగన్:-
అన్ని ఆసక్తులపైనా విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే శివ శక్తి పాండవ సేన.