ఓంశాంతి
మిమ్మల్ని పొంది మొత్తం విశ్వ రాజ్యాన్ని పొందుతాము అని ఈ విధంగా ఎవరన్నారు? ఇప్పుడు
మీరు విద్యార్థులు కూడా, అలాగే పిల్లలు కూడా. మీకు తెలుసు, అనంతమైన తండ్రి పిల్లలైన
మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారు. వారి ఎదురుగా మేము కూర్చుని
ఉన్నాము మరియు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అనగా విశ్వానికి కిరీటధారులైన
యువరాజులు-యువరాణులుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు చదువుకోవడానికి వచ్చారు అనగా
చదువుకుంటారు. ఈ పాట అయితే భక్తి మార్గములో గానం చేయబడింది. మేము విశ్వ
మహారాజులు-మహారాణులుగా అవుతామని బుద్ధి ద్వారా పిల్లలు తెలుసుకుంటారు. తండ్రి
జ్ఞానసాగరుడు, ఉన్నతోన్నతమైన (సుప్రీమ్) ఆత్మిక తండ్రి, వారు కూర్చొని ఆత్మలను
చదివిస్తారు. ఆత్మ ఈ శరీర రూపీ కర్మేంద్రియాల ద్వారా - మేము తండ్రి ద్వారా విశ్వ
కిరీటధారులైన యువరాజులు-యువరాణులుగా అయ్యేందుకు పాఠశాలలో కూర్చున్నామని
తెలుసుకుంటుంది. ఎంత నషా ఉండాలి. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - ఇంతటి నషా
విద్యార్థులమైన మాలో ఉందా? ఇదేమి కొత్త విషయము కూడా కాదు. మేము కల్ప-కల్పమూ విశ్వ
కిరీటధారులైన యువరాజులుగా మరియు యువరాణులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము. ఈ
తండ్రి మనకు తండ్రి కూడా, టీచరు కూడా. తండ్రి అడిగినప్పుడు, అందరూ - మేము సూర్యవంశీ
కిరీటధారులైన యువరాజులు-యువరాణులుగా లేక లక్ష్మీ-నారాయణులుగా అవుతామని అంటారు. తమ
హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను ఇటువంటి పురుషార్థము చేస్తున్నానా? అనంతమైన
తండ్రి ఎవరైతే స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారో, వారు మనకు
తండ్రి-టీచర్-గురువు కూడా కావున తప్పకుండా వారసత్వము కూడా అంతే ఉన్నతోన్నతమైనది
ఇస్తారు. నేను ఈ రోజు చదువుకుంటున్నాను, రేపు కిరీటధారి యువరాజుగా అవుతానని ఇంతటి
సంతోషము ఉందా అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది సంగమము కదా. ఇప్పుడు ఈ తీరములో
ఉన్నారు, ఆ తీరములోకి అనగా స్వర్గములోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. అక్కడికైతే
సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అయ్యే వెళ్తారు. నేను అంతటి యోగ్యునిగా
అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇది ఒక్క భక్తుడైన నారదుడి విషయమే కాదు.
మీరందరూ ఒకప్పుడు భక్తులుగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి భక్తి నుండి విడిపిస్తారు.
మేము తండ్రికి పిల్లలుగా అయ్యాము, వారి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు, విశ్వ
కిరీటధారి యువరాజులుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. తండ్రి అంటారు - మీ గృహస్థ
వ్యవహారములో ఉండండి. వానప్రస్థ అవస్థలో ఉన్నవారు గృహస్థ వ్యవహారములో ఉండవలసిన అవసరం
లేదు మరియు కుమార-కుమారీలు కూడా గృహస్థ వ్యవహారములో లేరు. వారిది కూడా విద్యార్థి
జీవితమే. బ్రహ్మచర్యములోనే చదువును చదువుకుంటారు. ఇప్పుడు ఈ చదువు చాలా ఉన్నతమైనది,
ఇక్కడ సదా కొరకు పవిత్రముగా అవ్వాలి. వారైతే బ్రహ్మచర్యములో చదువుకొని మళ్ళీ
వికారాలలోకి వెళ్తారు. ఇక్కడ మీరు బ్రహ్మచర్యములో ఉంటూ పూర్తి చదువును చదువుకుంటారు.
తండ్రి అంటారు - నేను పవిత్రతా సాగరుడిని, మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారుచేస్తాను.
మీకు తెలుసు, మనము అర్ధకల్పము పవిత్రముగా ఉండేవారము. బాబా, మేము ఎందుకు పవిత్రముగా
అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వము అని తప్పకుండా తండ్రితో ప్రతిజ్ఞ చేసారు.
వీరు ఎంత గొప్ప తండ్రి, వారిది సాధారణ తనువే, కానీ ఆత్మకు నషా ఎక్కుతుంది కదా.
తండ్రి పవిత్రముగా తయారుచేసేందుకు వచ్చారు. వారు అంటారు - మీరు వికారాలలోకి
వెళ్తూ-వెళ్తూ వేశ్యాలయములోకి వచ్చి పడ్డారు. మీరు సత్యయుగములో పవిత్రముగా ఉండేవారు,
ఈ రాధా-కృష్ణులు పవిత్రమైన యువరాజు-యువరాణి కదా. రుద్ర మాలను కూడా చూడండి, విష్ణు
మాలను కూడా చూడండి. రుద్ర మాలయే మళ్ళీ విష్ణు మాలగా అవుతుంది. వైజయంతి మాలలోకి
వచ్చేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మొదటైతే నిరంతరము తండ్రిని స్మృతి చేయండి,
మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ గవ్వల వెనుక కోతుల వలె అవ్వకండి. కోతులు శనగలు
తింటాయి. ఇప్పుడు తండ్రి మీకు రత్నాలను ఇస్తున్నారు. మళ్ళీ గవ్వలు అనగా శనగలు వెనుక
వెళ్ళినట్లయితే గతి ఏమవుతుంది! రావణుడి జైలులోకి వెళ్ళిపోతారు. తండ్రి వచ్చి రావణుడి
జైలు నుండి విడిపిస్తారు. వారు అంటారు, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను బుద్ధితో
త్యాగం చేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. తండ్రి అంటారు, నేను
కల్ప-కల్పము భారత్ లోనే వస్తాను. భారతవాసులైన పిల్లలను విశ్వ కిరీటధారులైన యువరాజులు,
యువరాణులుగా తయారుచేస్తాను. వారు ఎంత సహజంగా చదివిస్తారు, అలాగని 4-8 గంటలు వచ్చి
కూర్చోండి అని కూడా చెప్పరు. అలా కాదు, గృహస్థ వ్యవహారములో ఉంటూ స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనముగా అవుతారు.
వికారాలలోకి వెళ్ళేవారిని పతితులు అని అంటారు. దేవతలు పావనమైనవారు అందుకే వారి
మహిమను గాయనం చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అది అల్పకాలిక క్షణభంగురమైన
సుఖము. సుఖమనేది కాకిరెట్టతో సమానమైనది అని సన్యాసులు సరిగ్గా చెప్తారు. కానీ
దేవతలకు ఎంత సుఖము ఉంటుంది అనేది వారికి తెలియదు. దాని పేరే సుఖధామము. ఇది దుఃఖధామము.
ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తండ్రియే వచ్చి కల్ప-కల్పము అర్థం
చేయిస్తారు, దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నీవు
ఆత్మవు, దేహము కాదు. దేహానికి నీవు యజమానివి, దేహము నీకు యజమాని కాదు. 84 జన్మలు
తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు మీరు తమోప్రధానముగా అయిపోయారు. మీ ఆత్మ మరియు శరీరము
రెండూ పతితముగా అయిపోయాయి. దేహాభిమానులుగా అవ్వడము వలన మీ ద్వారా పాపాలు జరిగాయి.
ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. నాతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మను
మరియు శరీరాన్ని, రెండింటినీ శుద్ధముగా తయారుచేసేందుకు, తండ్రి అంటారు - మన్మనాభవ.
తండ్రి మీకు రావణుడి నుండి అర్ధకల్పము స్వతంత్రాన్ని ఇప్పించారు, ఇప్పుడు మళ్ళీ
స్వతంత్రాన్ని ఇప్పిస్తున్నారు. అర్ధకల్పము మీరు స్వతంత్రంగా రాజ్యం చేయండి. అక్కడ
5 వికారాల పేరే ఉండదు. ఇప్పుడు శ్రీమతముపై నడుస్తూ శ్రేష్టంగా తయారవ్వాలి. స్వయాన్ని
ప్రశ్నించుకోండి - మాలో వికారాలు ఎంతవరకు ఉన్నాయి? తండ్రి అంటారు - ఒకటేమో
నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు ఎటువంటి గొడవలు-కొట్లాటలు చేయకూడదు. లేకపోతే మీరు
పవిత్రముగా ఎలా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చిందే పురుషార్థము చేసి మాలలో
స్మరింపబడేందుకు. ఫెయిల్ అయితే మాలలో స్మరింపబడలేరు. కల్ప-కల్పపు రాజ్యాధికారమును
పోగొట్టుకుంటారు. ఆ తర్వాత అంతిమములో చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఆ చదువులో కూడా
రిజిస్టర్ ఉంటుంది. వారి లక్షణాలను కూడా చూస్తారు. ఇది కూడా చదువే, ఉదయమే లేచి మీకు
మీరుగా చదువుకోండి. రోజంతటిలో కర్మలు చేయవలసిందే. తీరిక లభించకపోతే భక్తి కూడా
మనుష్యులు ఉదయమే లేచి చేస్తారు. ఇదైతే జ్ఞాన మార్గము. భక్తిలో కూడా పూజలు చేస్తూ-
చేస్తూ మళ్ళీ బుద్ధిలోకి ఎవరో ఒక దేహధారి స్మృతి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు
తండ్రిని స్మృతి చేస్తారు, మళ్ళీ వ్యాపార-వ్వవహారాలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి.
ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా పాపాలు కట్ అవుతూ ఉంటాయి.
పిల్లలైన మీరు ఎప్పుడైతే పురుషార్థము చేస్తూ-చేస్తూ పూర్తిగా పవిత్రముగా
అయిపోతారో, అప్పుడు ఈ మాల తయారవుతుంది. పూర్తిగా పురుషార్థము చేయకపోతే ప్రజలలోకి
వెళ్ళిపోతారు. మంచి రీతిలో యోగం జోడించినట్లయితే, చదువుకున్నట్లయితే, మీ
బ్యాగ్-బ్యాగేజ్ ను భవిష్యత్తు కొరకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దానికి రిటర్న్ లో
భవిష్యత్తులో లభిస్తుంది. ఈశ్వరార్థము ఇచ్చినట్లయితే మరుసటి జన్మలో దానికి రిటర్న్
లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి అంటారు - నేను డైరెక్ట్ గా వస్తాను. ఇప్పుడు మీరు
ఏం చేసుకున్నా అది మీ కోసమే చేసుకుంటారు. మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు, అది ఇన్
డైరెక్ట్. ఈ సమయములో మీరు తండ్రికి ఎంతో సహాయము చేస్తారు. ఈ ధనమంతా సమాప్తమైపోతుందని
తెలుసు. దీనికి బదులు తండ్రికి ఎందుకు సహాయం చేయకూడదు. తండ్రి రాజ్యాన్ని ఎలా
స్థాపన చేస్తారు. తండ్రి వద్ద సైన్యము లేదు, అలాగని మారణాయుధాలు మొదలైనవి లేవు.
ఇక్కడ అంతా గుప్తము. కన్యకు కొందరు గుప్తముగా కట్నము ఇస్తారు. పెట్టెను మూసివేసి
తాళాన్ని చేతికి ఇచ్చేస్తారు. కొందరు చాలా ఆర్భాటం చేస్తారు, కొందరు గుప్తముగా
ఇస్తారు. తండ్రి కూడా అంటారు, మీరు ప్రేయసులు, మిమ్మల్ని నేను విశ్వానికి యజమానులుగా
తయారుచేయడానికి వచ్చాను. మీరు గుప్తముగా సహాయము చేస్తారు. ఆత్మకు తెలుసు, బాహ్య
ఆర్భాటాలు అసలేమీ కాదు. ఇది ఉన్నదే వికారీ పతిత ప్రపంచము. సృష్టి యొక్క వృద్ధి అయితే
జరగాల్సిందే. ఆత్మలు తప్పకుండా రావాల్సిందే. జన్మలైతే ఇంకా ఎక్కువగా జరిగేదే ఉంది.
ఈ లెక్కన ధాన్యము పూర్తిగా సరిపోదు అని కూడా అంటారు. ఇది అసురీ బుద్ధి. పిల్లలైన
మీకు ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధి లభించింది. భగవంతుడు చదివిస్తున్నారు కావున వారిపై ఎంత
గౌరవము ఉంచాలి. ఎంతగా చదువుకోవాలి. చాలా మంది పిల్లలకు చదువుకోవాలి అన్న అభిరుచి
లేదు. మేము బాబా ద్వారా కిరీటధారులైన యువరాజులు, యువరాణులుగా అవుతున్నాము అన్నదైతే
పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి కదా. ఇప్పుడు తండ్రి అంటారు - నా మతముపై నడవండి,
తండ్రిని స్మృతి చేయండి. మేము మర్చిపోతున్నాము అని ఘడియ-ఘడియ అంటారు. మేము పాఠము
మర్చిపోతున్నాము అని విద్యార్థి అంటే, టీచరు ఏం చేయగలరు! స్మృతి చేయకపోతే వికర్మలు
వినాశనమవ్వవు. వీరు పాస్ అయిపోవాలి అని టీచరు ఏమైనా అందరి పైన కృప లేదా ఆశీర్వాదాలను
చూపిస్తారా. ఇక్కడ ఈ ఆశీర్వాదాలు, కృప యొక్క విషయము లేదు. చదువుకోండి అని తండ్రి
అంటారు. వ్యాపారాలు మొదలైనవి చేయండి కానీ చదువుకోవడము అనేది తప్పనిసరి. తమోప్రధానము
నుండి సతోప్రధానముగా అవ్వండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయండి. హృదయాన్ని
ప్రశ్నించుకోవాలి - మేము తండ్రి సేవలో ఎంతవరకు ఉన్నాము? ఎంతమందిని తమ సమానంగా
తయారుచేస్తున్నాము? త్రిమూర్తి చిత్రమైతే ఎదురుగా పెట్టడం జరిగింది. వీరు శివబాబా,
వీరు బ్రహ్మా. ఈ చదువు ద్వారా ఈ విధంగా తయారవుతారు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఈ విధంగా
తయారవుతారు. శివబాబా బ్రహ్మా తనువులోకి ప్రవేశించి బ్రాహ్మణులను ఈ విధంగా
తయారుచేస్తున్నారు. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు మీ హృదయాన్ని
ప్రశ్నించుకోండి - నేను పవిత్రముగా అయ్యానా? దైవీ గుణాలను ధారణ చేస్తున్నానా? పాత
శరీరాన్ని మర్చిపోయానా? ఇదైతే పాత చెప్పు కదా. ఆత్మ పవిత్రముగా అయితే చెప్పు కూడా
ఫస్ట్ క్లాస్ అయినదే లభిస్తుంది. ఈ పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని
ధరిస్తాము, ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు పాత చెప్పులో ఉన్నాము, రేపు ఈ విధంగా
దేవతలుగా తయారవ్వాలనుకుంటారు. తండ్రి ద్వారా భవిష్య అర్ధకల్పము కొరకు విశ్వానికి
కిరీటధారులైన యువరాజులుగా అవుతారు. మన ఆ రాజ్యాన్ని ఎవరూ కూడా లాక్కోలేరు. మరి
తండ్రి శ్రీమతముపై నడవాలి కదా. స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎంత స్మృతి
చేస్తున్నాను? ఎంత వరకు స్వదర్శన చక్రధారిగా తయారయ్యాను మరియు ఇతరులను
తయారుచేస్తున్నాను? ఎవరు చేస్తే వారు పొందుతారు. తండ్రి ప్రతిరోజూ చదివిస్తారు.
అందరి వద్దకు మురళీ వెళ్తుంది. అచ్ఛా, మురళి లభించకపోయినా కానీ 7 రోజుల కోర్సు అయితే
లభించింది కదా, బుద్ధిలోకి జ్ఞానము వచ్చింది. ప్రారంభంలో భట్టీ తయారైనప్పుడు కొందరు
పక్కాగా ఉన్నవారు, కొందరు కచ్చాగా ఉన్నవారు వెలువడ్డారు ఎందుకంటే మాయా తుఫాన్లు కూడా
వస్తాయి కదా. 6-8 నెలలు పవిత్రముగా ఉండి మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి తమను తాము
హతమార్చుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. అర్ధకల్పము మాయతో ఓడిపోయారు. ఇప్పుడు కూడా
ఓడిపోయినట్లయితే తమ పదవిని పోగొట్టుకుంటారు. నంబరువారు పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా.
కొందరు రాజులు-రాణులుగా, కొందరు మంత్రులుగా, కొందరు ప్రజలుగా అవుతారు, కొందరికి
వజ్ర-వైఢూర్యాలతో కూడిన మహళ్ళు ఉంటాయి. ప్రజలలో కూడా కొందరు చాలా షావుకారులుగా
ఉంటారు. వారికి వజ్ర-వైఢూర్యాలతో కూడిన మహళ్ళు ఉంటాయి, ఇక్కడ కూడా చూడండి, ప్రజల
నుండి అప్పు తీసుకుంటారు కదా. మరి ప్రజలు షావుకారులుగా అయినట్లా లేదా రాజులుగా
అయినట్లా? అంధకార నగరము... ఇవి ఇప్పటి విషయాలే. మేము విశ్వానికి కిరీటధారులైన
యువరాజులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు ఈ నిశ్చయము ఉండాలి.
మేము బ్యారిస్టరుగా లేక ఇంజనీరుగా అవుతాము అన్న ఈ విషయము ఎప్పుడైనా స్కూలులో
మర్చిపోతారా! కొందరైతే నడుస్తూ-నడుస్తూ మాయా తుఫానులు రావడంతో చదువును కూడా
వదిలేస్తారు.
తండ్రి వారి పిల్లలకు ఒక రిక్వెస్ట్ చేస్తారు, అదేమిటంటే - మధురమైన పిల్లలూ, మంచి
రీతిలో చదువుకున్నట్లయితే మంచి పదవిని పొందుతారు. తండ్రి పరువును నిలబెట్టండి. మీరు
ఇటువంటి అశుద్ధమైన పనులు చేసినట్లయితే తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు.
సత్యమైన తండ్రికి, సత్యమైన టీచరుకు, సద్గురువుకు నిందను తీసుకొచ్చేవారు ఉన్నత పదవిని
పొందలేరు. ఈ సమయములో మీరు వజ్ర సమానముగా తయారవుతున్నారు కావున గవ్వల వెనుక పడకూడదు.
బాబాకు సాక్షాత్కారము జరిగింది, ఇక వెంటనే గవ్వలను వదిలేసారు. అరే, 21 జన్మల కొరకు
రాజ్యాధికారము లభిస్తుంది, మరి వీటిని ఏం చేసుకోవాలి! ఇలా భావించి అంతా ఇచ్చేసారు.
మనమైతే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. వినాశనము జరగవలసిందే అని కూడా మీకు
తెలుసు. ఇప్పుడు చదువుకోకపోతే టూ లేట్ అయిపోతుంది, పశ్చాత్తాపపడవలసి వస్తుంది.
పిల్లలకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. తండ్రి అంటారు - ఓ పతిత-పావనా రండి అని
మీరు పిలుస్తారు కూడా. ఇప్పుడు నేను పతిత ప్రపంచములోకి మీ కోసం వచ్చాను మరియు
పావనముగా అవ్వండి అని మీతో చెప్తాను. మీరు మళ్ళీ పదే-పదే మురికిలో పడిపోతారు. నేనైతే
కాలుడికే కాలుడిని. అందరినీ తీసుకువెళ్తాను. స్వర్గములోకి వెళ్ళేందుకు తండ్రి వచ్చి
మార్గాన్ని తెలియజేస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని ఇస్తారు.
ఇది అనంతమైన జ్ఞానము. ఎవరైతే కల్పక్రితం చదువుకున్నారో, వారే వచ్చి చదువుకుంటారు,
అది కూడా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. నిశ్చయము ఏర్పడాలి - అనంతమైన తండ్రి వచ్చారు, ఏ
భగవంతుడిని కలుసుకునేందుకు ఇంతగా భక్తి చేసామో వారు ఇక్కడికి వచ్చి చదివిస్తున్నారు.
ఇటువంటి భగవంతుడైన తండ్రిని మనము కలుసుకోవాలి కదా. ఒకవేళ పక్కా నిశ్చయము ఉన్నట్లయితే
ఎంత ఉత్సాహముతో, సంతోషముగా పరుగెత్తుకుంటూ వచ్చి కలుసుకుంటారు. ఇందులో మోసమేమీ లేదు.
పవిత్రముగా అవ్వరు, చదువుకోరు, కేవలం బాబా దగ్గరకు వెళ్తాము అని అనేవారు కూడా చాలా
మంది ఉంటారు. అలా విహరించడానికి కూడా వస్తూ ఉంటారు. తండ్రి పిల్లలకు అర్థం
చేయిస్తారు - పిల్లలైన మీరు గుప్తముగా మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. పవిత్రముగా
అయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఈ రాజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు.
ఇక మిగిలినవారంతా హఠయోగులు. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన
నన్ను స్మృతి చేయండి. మేము అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీటధారులైన
యువరాజులుగా అయ్యేందుకు వచ్చాము అన్న నషాలో ఉండండి, కావున శ్రీమతముపై నడవాలి. మాయ
ఎటువంటిదంటే అది బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. తండ్రి సమర్థమైనవారు, అలాగే మాయ కూడా
సమర్థవంతమైనది. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ఇది కూడా ఎవరికీ
తెలియదు.
అచ్ఛా! మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.