25-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - చురుకైన విద్యార్థులుగా అయి మంచి
మార్కులతో పాస్ అయ్యేందుకు పురుషార్థము చేయండి, సోమరి విద్యార్థులుగా అవ్వకండి,
ఎవరికైతే రోజంతా మిత్ర-సంబంధీకులు గుర్తుకొస్తూ ఉంటారో వారు సోమరులు’’
ప్రశ్న:-
సంగమయుగములో
అందరికంటే భాగ్యశాలి అని ఎవరిని అంటారు?
జవాబు:-
ఎవరైతే తమ
తనువు, మనసు, ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేస్తూ ఉన్నారో - వారు
భాగ్యశాలి. కొందరైతే చాలా పిసినారులుగా ఉంటారు, ఇక వారి భాగ్యములో లేదని అర్థం
చేసుకోవడం జరుగుతుంది. వారు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, ఎంతోకొంత చేసుకోవాలి అని
అర్థం చేసుకోరు. భాగ్యశాలి పిల్లలు అర్థం చేసుకుంటారు - తండ్రి ఇప్పుడు సమ్ముఖముగా
వచ్చారు, మేము మా సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి, ధైర్యమును ఉంచి అనేకుల భాగ్యాన్ని
తయారుచేసేందుకు నిమిత్తమవ్వాలి అని.
పాట:-
భాగ్యాన్ని
మేలుకొలుపుకుని వచ్చాను...
ఓంశాంతి
పిల్లలైన మీరు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు
మరియు నేను నీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అన్న భగవానువాచ ఉందని అంటారు. ఇప్పుడు
కృష్ణ భగవానువాచ అయితే కాదు. ఈ శ్రీకృష్ణ అనేది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. నేను
మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను అన్నది శివ భగవానువాచ. కావున మొదట
తప్పకుండా రాజకుమారుడైన శ్రీకృష్ణుడు తయారవుతారు. అంతేకానీ కృష్ణ భగవానువాచ అనేది
లేదు. కృష్ణ అనేది పిల్లలైన మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఇది పాఠశాల. భగవంతుడు
చదివిస్తున్నారు, మీరందరూ రాజకుమార, రాజకుమారీలుగా తయారవుతారు.
తండ్రి అంటారు, అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో నేను మీకు ఈ జ్ఞానాన్ని
వినిపిస్తాను - మళ్ళీ శ్రీకృష్ణుడిగా తయారయ్యేందుకు. ఈ పాఠశాలకు టీచర్ శివబాబా,
అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. శివబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మేము
భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చాము అని పిల్లలైన మీరు అంటారు. నేను పరమపిత
పరమాత్మ ద్వారా ఇప్పుడు భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చాను అని ఆత్మకు తెలుసు.
ఇది రాజకుమార, రాజకుమారీలుగా తయారయ్యే భాగ్యము. ఇది రాజయోగము కదా. శివబాబా ద్వారా
మొట్టమొదట స్వర్గములోని రెండు ఆకులైన రాధ-కృష్ణులు వెలువడుతారు. ఈ చిత్రాలు ఏవైతే
తయారుచేసారో అవి సరైనవి, అర్థం చేయించడానికి బాగున్నాయి. గీతా జ్ఞానము ద్వారానే
భాగ్యము తయారవుతుంది. భాగ్యము మేల్కొని ఉండేది, మళ్ళీ తర్వాత సమాప్తమైపోయింది. అనేక
జన్మల అంతిమములో మీరు పూర్తిగా తమోప్రధానముగా, బికారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ
రాజకుమారులుగా అవ్వాలి. మొదటైతే తప్పకుండా రాధ-కృష్ణులే తయారవుతారు, ఆ తర్వాత వారి
రాజధాని కొనసాగుతుంది. కేవలం ఒక్కరే ఉండరు కదా. స్వయంవరం తర్వాత రాధ-కృష్ణులే
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. నరుడి నుండి నారాయణుడిగా లేక రాజకుమారునిగా అవ్వడమనేది
ఒకటే విషయము. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని పిల్లలైన మీకు
తెలుసు. తప్పకుండా సంగమములోనే స్థాపన జరిగి ఉంటుంది, అందుకే సంగమయుగాన్ని
పురుషోత్తమ యుగము అని అనడం జరుగుతుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది,
మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సత్యయుగములో తప్పకుండా ఒకే ధర్మము ఉండేది. ఆ
చరిత్ర, భూగోళము తప్పకుండా మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. మళ్ళీ స్వర్గ స్థాపన
జరుగుతుంది. అందులో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, పరిస్తాన్ ఉండేది, ఇప్పుడు
స్మశానముగా ఉంది. అందరూ కామ చితిపై కూర్చుని భస్మమైపోతారు. సత్యయుగములో మీరు మహళ్ళు
మొదలైనవి తయారుచేస్తారు. క్రింది నుండి బంగారు ద్వారక లేక లంక పైకి వస్తాయి అనేమీ
కాదు. ద్వారక ఉండొచ్చు కానీ, లంక మాత్రము అక్కడ ఉండదు. స్వర్ణిమ యుగము అని రామ
రాజ్యాన్ని అంటారు. సత్యమైన బంగారమేదైతే ఉండేదో దానినంతటినీ దోచుకుపోయారు. భారత్
ఎంత సంపన్నముగా ఉండేదో మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది.
నిరుపేద అనే పదము వ్రాయడం తప్పేమీ కాదు. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేదని మీరు అర్థం
చేయించవచ్చు. అక్కడ ఇతర ధర్మాలేవీ ఉండవు. అలా ఎలా అవుతుంది, కేవలం దేవతలే ఉంటారా?
అని కొందరు అంటారు. అనేక మతమతాంతరాలు ఉన్నాయి, ఒకదానితో ఒకటి కలవదు. ఎంత విచిత్రము.
ఎంతమంది పాత్రధారులున్నారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోందని, మనము స్వర్గవాసులుగా
అవుతామని గుర్తుంటే సదా హర్షితముఖులుగా ఉంటారు. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి.
మీ లక్ష్యము-ఉద్దేశ్యమైతే ఉన్నతమైనది కదా. మనము మనుష్యుల నుండి దేవతలుగా,
స్వర్గవాసులుగా అవుతాము. స్వర్గ స్థాపన జరుగుతూ ఉందని కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు.
ఇది కూడా సదా గుర్తుండాలి. కానీ మాయ ఘడియ, ఘడియ మరపింపజేస్తుంది. భాగ్యములో లేకపోతే
బాగుపడరు. అబద్ధాలు చెప్పే అలవాటు అర్ధకల్పము నుండి ఏర్పడింది, అది ఇప్పుడు పోవడం
లేదు. అసత్యాన్ని కూడా సంపదగా భావించి ఉంచుకుంటారు, దానిని వదలకపోతే ఇక వీరి భాగ్యమే
ఇలా ఉంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు తండ్రిని స్మృతి చేయరు. స్మృతి కూడా
ఎప్పుడైతే పూర్తిగా మమకారము తొలగిపోతుందో అప్పుడే ఉంటుంది. మొత్తం ప్రపంచమంతటి నుండి
వైరాగ్యము. మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. వీరందరూ
నరకవాసులు, స్మశానవాసులు, వీరందరూ అంతమైపోనున్నారు అని తెలుసు. ఇప్పుడు మనము తిరిగి
ఇంటికి వెళ్ళాలి, అందుకే సుఖధామాన్ని, శాంతిధామాన్ని మాత్రమే స్మృతి చేస్తారు. మనము
నిన్న స్వర్గవాసులుగా ఉండేవారము, రాజ్యము చేసేవారము, దానిని పోగొట్టుకున్నాము, మళ్ళీ
మనము రాజ్యము తీసుకుంటాము. భక్తి మార్గములో ఎంతగా తల వంచి నమస్కరించడము, ధనాన్ని
వృధా చేయడము చేస్తారో ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆర్తనాదాలు చేస్తూనే
ఉంటారు, కానీ ఏమీ లభించదు. బాబా, రండి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని ఆత్మ
పిలుస్తుంది, అది కూడా అంతిమములో ఎప్పుడైతే చాలా దుఃఖము ఉంటుందో అప్పుడు పిలుస్తారు.
ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతము కానున్నది అని మీరు చూస్తారు. ఇప్పుడు ఇది మన
అంతిమ జన్మ, ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది. జ్ఞానాన్ని పూర్తిగా ధారణ
చేయాలి. భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా వస్తాయి కదా. హిందుస్థాన్, పాకిస్తాన్
విడిపోయినప్పుడు ఎంతమంది మరణించి ఉంటారు. పిల్లలైన మీకు ప్రారంభము నుండి మొదలుకుని
చివరి వరకూ అంతా తెలిసింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ ఉంటుంది.
కేవలం ఒక్క సోమనాథ మందిరము మాత్రమే బంగారముదిగా ఉండదు, ఇంకా ఎంతోమంది మహళ్ళు,
మందిరాలు మొదలైనవి బంగారముతో చేసినవి ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఎక్కడ
మాయమైపోతాయి? ఇక బయటకు రానే రానంతగా భూకంపాలలో లోపలకు వెళ్ళిపోతాయా? లోపలే
పాడైపోతాయా... ఏమవుతుంది? మున్ముందు మీకు తెలుస్తుంది. బంగారు ద్వారక లోపలకు
వెళ్ళిపోయింది అని అంటారు. ఇప్పుడు మీరు అంటారు - డ్రామాలో అది క్రిందికి
వెళ్ళిపోయింది, మళ్ళీ చక్రము తిరిగితే పైకి వస్తుంది. అది కూడా మళ్ళీ తయారుచేయవలసి
ఉంటుంది. ఈ చక్రాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ చాలా సంతోషము ఉండాలి. ఈ చిత్రాలనైతే
జేబులో పెట్టుకోవాలి. ఈ బ్యాడ్జ్ సేవకు చాలా యోగ్యమైనది. కానీ ఇంత సేవను ఎవ్వరూ
చేయడం లేదు. పిల్లలైన మీరు ట్రైన్ లో కూడా చాలా సేవ చేయవచ్చు కానీ ట్రైన్ లో ఏమి
సేవ చేసారు అని ఎప్పుడూ ఎవ్వరూ సమాచారమే వ్రాయరు. థర్డ్ క్లాస్ లో కూడా సేవ చేయవచ్చు.
ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకున్నారో, ఎవరైతే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారో,
వారే అర్థం చేసుకుంటారు. మనుష్యుల నుండి దేవతలు అని గాయనం చేయబడింది. అంతేకానీ
మనుష్యుల నుండి క్రిస్టియన్లు లేక మనుష్యుల నుండి సిక్కులు అని అనరు. అలా అనరు.
మనుష్యుల నుండి దేవతలు అయ్యారు అనగా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరిగింది.
మిగిలిన వారందరూ తమ, తమ ధర్మములలోకి వెళ్ళిపోయారు. ఫలానా, ఫలానా ధర్మాలు మళ్ళీ
ఎప్పుడు స్థాపన అవుతాయి అనేది వృక్షములో చూపించారు. దేవతలు హిందువులుగా అయిపోయారు.
హిందువుల నుండి మళ్ళీ వేరే-వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. ఎవరెవరైతే తమ
శ్రేష్ఠ ధర్మాన్ని, కర్మను వదిలి వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయారో, అటువంటివారు కూడా
చాలామంది వెలువడుతారు, వారు బయటకు వస్తారు. చివరిలో కొద్దిగా అర్థం చేసుకుంటారు,
ప్రజలలోకి వచ్చేస్తారు. దేవీ-దేవతా ధర్మములోకైతే అందరూ రారు. అందరూ తమ, తమ
సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ప్రపంచములో ఏమేమి
చేస్తూ ఉంటారు. ధాన్యము కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. పెద్ద-పెద్ద మెషీన్లు
పెడుతూ ఉంటారు. కానీ జరిగేదేమీ లేదు. సృష్టి తమోప్రధానముగా అవ్వవలసిందే. మెట్లు
కిందకు దిగవలసిందే. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ
కొత్త ప్రపంచ స్థాపన జరగవలసిందే. ఇప్పుడు సైన్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో, కొన్ని
సంవత్సరాలలో అందులో చాలా తెలివైనవారిగా అయిపోతారు, దానితో అక్కడ చాలా మంచి-మంచి
వస్తువులు తయారవుతాయి. ఈ సైన్స్ అక్కడ సుఖము ఇచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ సుఖము
కొద్దిగానే ఉంది, దుఃఖము ఎక్కువగా ఉంది. ఈ సైన్స్ వెలువడి ఎన్ని సంవత్సరాలయ్యింది?
ఇంతకుముందైతే ఈ విద్యుత్తు, గ్యాస్ మొదలైనవేమీ ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైపోయిందో
చూడండి. ఇక్కడ నేర్చుకున్నది అక్కడకు తీసుకువెళ్తారు. త్వరత్వరగా పని అయిపోతూ
ఉంటుంది. ఇక్కడ కూడా ఇళ్ళు ఎలా తయారవుతాయో చూడండి. అంతా రెడీగా ఉంటుంది. ఎన్ని
అంతస్థులు తయారుచేస్తారు. అక్కడ ఇలా ఉండదు. అక్కడైతే అందరికీ తమ, తమ పొలాలు ఉంటాయి.
ట్యాక్స్ మొదలైనవేమీ ఉండవు. అక్కడైతే అపారమైన ధనము ఉంటుంది. భూమి కూడా చాలా ఉంటుంది.
నదులైతే అన్నీ ఉంటాయి, కానీ కాలువలు ఉండవు, వాటిని తర్వాత తవ్వుతారు.
మాకు డబుల్ ఇంజన్ లభించింది అని పిల్లలకు లోలోపల ఎంత సంతోషము ఉండాలి. పర్వతాలపై
ట్రైన్ కు రెండు ఇంజన్లు ఉంటాయి. పిల్లలైన మీరు కూడా ఒక వేలు అందిస్తారు కదా. మీరు
ఎంత తక్కువమంది ఉన్నారు. మీ మహిమ కూడా గానం చేయబడ్డది. మనము ఈశ్వరీయ సేవాధారులమని
మీకు తెలుసు. శ్రీమతముపై సేవ చేస్తున్నాము. బాబా కూడా సేవ చేయడానికి వచ్చారు. ఏక
ధర్మ స్థాపనను, అనేక ధర్మాల వినాశనాన్ని చేయిస్తారు, కాస్త ముందుకు వెళ్ళి చూస్తే
చాలా హంగామాలు జరుగుతాయి. ఎక్కడైనా గొడవపడి బాంబులు వేస్తారేమో అని ఇప్పుడు కూడా
భయపడుతున్నారు. వివేకము ఇంకా ఆలస్యము ఉందని చెప్తుంది. నిప్పురవ్వలు అయితే ఎన్నో
అంటుకుంటూ ఉంటాయి. ఘడియ-ఘడియ పరస్పరం యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. పాత ప్రపంచము
అంతమయ్యేదే ఉంది అని పిల్లలకు తెలుసు. తర్వాత మనము మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు
84 జన్మల చక్రము పూర్తయ్యింది. అందరూ కలిసి వెళ్ళిపోతారు. మీలో కూడా కొద్ది మందికే
ఇది క్షణక్షణము గుర్తు ఉంటుంది. డ్రామానుసారముగా చురుకైనవారు మరియు సోమరులు, రెండు
రకాల విద్యార్థులు ఉన్నారు. చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయిపోతారు.
ఎవరైతే సోమరులుగా ఉంటారో, వారికైతే రోజంతా కొట్లాడడము, గొడవపడడముతోటే సరిపోతుంది.
తండ్రిని స్మృతి చేయరు. రోజంతా మిత్ర-సంబంధీకులే చాలా గుర్తుకువస్తూ ఉంటారు.
ఇక్కడైతే అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. మనము ఆత్మ, ఈ శరీరము రూపీ తోక వేలాడుతుంది.
మనము కర్మాతీత అవస్థకు చేరుకున్న తర్వాత ఈ తోక వదిలిపోతుంది. ఇదే చింత ఉంది,
కర్మాతీత అవస్థకు చేరుకున్నామంటే, ఈ శరీరము సమాప్తమైపోతుంది. మనము శ్యామము నుండి
సుందరముగా అయిపోతాము. కష్టపడాలి కదా. ప్రదర్శనీలో కూడా చూడండి, ఎంత కష్టపడతారు.
భోపాల్ కు చెందిన మహేంద్రను చూడండి, వారు ఎంత ధైర్యము చూపించారు. ఒంటరిగా ఎంత
కష్టపడి ప్రదర్శనీ మొదలైనవి చేస్తుంటారు. ఆ కష్టానికి ఫలితము కూడా లభిస్తుంది కదా.
ఒక్కరే ఎంత అద్భుతము చేసారు, ఎంతమందికి కళ్యాణము చేసారు. మిత్ర-సంబంధీకులు
మొదలైనవారి సహాయముతోనే ఎంత పని చేసారు. అద్భుతము కదా! మిత్ర-సంబంధీకులకు అర్థం
చేయించేవారు - ఈ ధనము మొదలైనవన్నీ ఈ కార్యములో ఉపయోగించండి, ఉంచుకుని ఏం చేస్తారు.
ధైర్యముతో సెంటరు కూడా తెరిచారు. ఎంతమంది భాగ్యాన్ని తయారుచేసారు. ఇలాంటివారు 5-7
మంది తయారైతే ఎంత సేవ అవుతుంది. కొందరైతే చాలా పిసినారులుగా ఉంటారు. ఇక భాగ్యములో
లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వినాశనము ఎదురుగా ఉంది, ఎంతోకొంత చేసుకోవాలి అని
అర్థం చేసుకోరు. ఇప్పుడు మనుష్యులు ఏదైతే ఈశ్వరార్థము దానము చేస్తారో, దానికి ఏమీ
లభించదు. ఇప్పుడు ఈశ్వరుడైతే స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. దాన పుణ్యాలు
చేసేవారికి ఏమీ లభించదు. సంగమములో ఎవరైతే తమ తనువు, మనసు, ధనము అన్నింటినీ సఫలం
చేసుకున్నారో లేక చేసుకుంటూ ఉన్నారో వారు భాగ్యశాలురు. కానీ భాగ్యములో లేకపోతే
అర్థమే చేసుకోరు. వారు కూడా బ్రాహ్మణులే, మనము కూడా బ్రాహ్మణులే అని మీకు తెలుసు.
మనము ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలము. ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు. వారు కుఖ
వంశావళి, మీరు ముఖ వంశావళి. శివజయంతి సంగమములో జరుగుతుంది. ఇప్పుడు స్వర్గము
తయారుచేయడానికి తండ్రి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే
మీరు పవిత్రముగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇలా యుక్తిగా
కరపత్రాలను ముద్రించాలి. ప్రపంచములో ఎంతోమంది చనిపోతారు కదా. ఎక్కడైనా ఎవరైనా
చనిపోతే అక్కడ కరపత్రాలను పంచాలి. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే పాత ప్రపంచ
వినాశనము జరుగుతుంది మరియు ఆ తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి, ఒకవేళ ఎవరైనా
సుఖధామానికి వెళ్ళాలనుకుంటే దానికి మంత్రము మన్మనాభవ. ఇలాంటి రసవత్తరముగా
ముద్రించబడ్డ కరపత్రాలు అందరి వద్దా ఉండాలి. స్మశానములో కూడా పంచవచ్చు. పిల్లలకు
సేవా అభిరుచి ఉండాలి. సేవా యుక్తులనైతే ఎన్నో తెలియజేస్తారు. ఇది చాలా బాగా వ్రాయాలి.
లక్ష్యము-ఉద్దేశ్యము అయితే వ్రాసి ఉంది. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరము రూపీ తోకను మర్చిపోవాలి.
ఒక్క తండ్రి తప్ప మిత్ర-సంబంధీకులు మొదలైనవారెవ్వరూ గుర్తుకు రాకూడదు, ఈ కృషి చేయాలి.
2. శ్రీమతముపై ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. తనువు, మనసు, ధనము అన్నింటినీ సఫలం
చేసుకుని తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకోవాలి.
వరదానము:-
కర్మభోగము రూపీ పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తము చేసే
సంపూర్ణ నష్టోమోహా భవ
ఇప్పటివరకు ప్రకృతి ద్వారా తయారైన పరిస్థితులు అవస్థను
తమవైపుకు ఎంతోకొంత ఆకర్షిస్తూ ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా తమ దేహము యొక్క
లెక్కాచారము, మిగిలిపోయి ఉన్న కర్మభోగము రూపములో వచ్చే పరిస్థితి తనవైపుకు
ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టోమోహా
అని అంటారు. ఏ విధమైన దేహము యొక్క లేక దైహిక ప్రపంచము యొక్క పరిస్థితి స్థితిని
చలింపజేయకూడదు - ఇదే సంపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి వరకు చేరుకుంటారో,
అప్పుడు క్షణములో తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపములో సహజముగా స్థితులవ్వగలరు.
స్లోగన్:-
పవిత్రతా వ్రతము అన్నింటికన్నా శ్రేష్ఠమైన సత్యనారాయణ వ్రతము - ఇందులోనే అతీంద్రియ
సుఖము ఇమిడి ఉంది.
మీ శక్తిశాలి మనసా
ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి
మనసా సేవ అనంతమైన సేవ.
ఎంతగా మీరు మనసు ద్వారా, వాణి ద్వారా స్వయం శ్యాంపుల్ గా అవుతారో, శ్యాంపుల్ ను చూసి
స్వతహాగానే ఆకర్షితులవుతారు. ఏ స్థూల కార్యాన్ని చేస్తున్నా కూడా మనసా ద్వారా
వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవను చెయ్యండి. ఏ విధంగా ఎవరైనా వ్యాపారస్థులు ఉంటే,
వారు స్వప్నములో కూడా తమ వ్యాపారాన్ని చూస్తూ ఉంటారు, అలా మీ పని, విశ్వ కళ్యాణము
చెయ్యటము. ఇదే మీ ఆక్యుపేషన్ (వృత్తి), ఈ ఆక్యుపేషన్ ను స్మృతిలో ఉంచుకుని సదా సేవలో
బిజీగా ఉండండి.
| | |