25-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతము మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేస్తుంది, అందుకే దేహధారుల మతమును వదిలి ఒక్క తండ్రి శ్రీమతముపై నడవండి’’

ప్రశ్న:-
ఏ పిల్లల యొక్క బుద్ధి భ్రమించడము ఇప్పటివరకు సమాప్తం అవ్వలేదు?

జవాబు:-
ఎవరికైతే ఉన్నతోన్నతుడైన తండ్రి మతముపై అనగా ఈశ్వరుని మతముపై నమ్మకము లేదో, వారి భ్రమించడము ఇప్పటికీ ఆగలేదు. తండ్రిపై పూర్తి నిశ్చయము లేని కారణముగా రెండు వైపులా కాళ్ళు పెడతారు. భక్తి, గంగా స్నానాలు మొదలైనవి కూడా చేస్తారు మరియు తండ్రి మతముపై కూడా నడుస్తారు. ఇటువంటి పిల్లల గతి ఏమవుతుంది! వారు శ్రీమతముపై పూర్తిగా నడవరు అందుకే ఎదురుదెబ్బలు తింటారు.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
పిల్లలు భక్తుల యొక్క ఈ పాటను విన్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా అనరు. మీకు తెలుసు, మాకు ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు, వారొక్కరే ఉన్నతోన్నతమైనవారు. ఇకపోతే ఈ సమయానికి చెందిన మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారంతా కనిష్ఠమైనవారు. ఉన్నతోన్నతమైన మనుష్యులుగా కూడా భారత్ లో ఒకప్పుడు ఈ దేవీ-దేవతలే ఉండేవారు. వారి మహిమ - సర్వగుణ సంపన్నులు... ఈ దేవతలను ఇంత ఉన్నతముగా ఎవరు తయారుచేసారు అనేది ఇప్పుడు మనుష్యులకు తెలియదు. ఇప్పుడైతే పూర్తిగా పతితులుగా అయిపోయారు. తండ్రి ఉన్నతోన్నతమైనవారు. సాధు-సన్యాసులు మొదలైనవారందరూ వారి కొరకు సాధన చేస్తారు. ఇటువంటి సాధువుల వెనుక మనుష్యులు అర్ధకల్పము భ్రమించారు. ఇప్పుడు మీకు తెలుసు, తండ్రి వచ్చి ఉన్నారు, మేము తండ్రి వద్దకు వెళ్తాము. వారు మాకు శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్ఠాతి-శ్రేష్ఠముగా, సదా సుఖవంతులుగా తయారుచేస్తారు. రావణుడి మతముపై మీరు ఎంత తుచ్ఛ బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మతముపై నడవకండి. పతిత-పావన తండ్రినైన నన్ను పిలిచారు, అయినా కూడా ముంచేసేవారి వెనుక ఎందుకు పడతారు! ఒక్కరి మతమును వదిలి అనేకుల వద్దకు వెళ్ళి ఎదురు దెబ్బలు ఎందుకు తింటూ ఉంటారు? చాలా మంది పిల్లలు జ్ఞానాన్ని కూడా వింటూ ఉంటారు మళ్ళీ వెళ్ళి గంగా స్నానాలు కూడా చేస్తారు, గురువుల వద్దకు కూడా వెళ్తారు... తండ్రి అంటారు, ఆ గంగ పతిత-పావని ఏమీ కాదు. అయినా కూడా మీరు మనుష్యుల మతముపై వెళ్ళి స్నానాలు మొదలైనవి చేస్తే, తండ్రి అంటారు - ఉన్నతోన్నత తండ్రినైన నా మతముపై కూడా నమ్మకము లేదు. ఒకవైపు ఈశ్వరీయ మతము, ఇంకొకవైపు అసురీ మతము. వారి పరిస్థితి ఏమవుతుంది? రెండు వైపులా కాళ్ళు పెట్టినట్లయితే చీలిపోతారు. తండ్రిపై కూడా పూర్తి నిశ్చయము పెట్టుకోరు. బాబా మేము మీకు చెందినవారము, మీ శ్రీమతముపై మేము శ్రేష్ఠముగా తయారవుతాము అని అంటారు కూడా. మనము ఉన్నతోన్నతుడైన తండ్రి మతముపై మన అడుగులు వేయాలి. శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగానైతే తండ్రియే తయారుచేస్తారు. తండ్రి అంటారు - ఎవరి శరీరములోనైతే నేను ప్రవేశించానో వారైతే 12 మంది గురువులను ఆశ్రయించారు, అయినా కానీ తమోప్రధానముగానే అయ్యారు, లాభమేమీ కలగలేదు. ఇప్పుడు తండ్రి లభించారు కావున అందరినీ వదిలేసారు. ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు, తండ్రి అన్నారు - చెడు వినకండి, చెడు చూడకండి... కానీ మనుష్యులు పూర్తిగా పతిత తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు, వారు శ్రీమతముపై నడవలేరు. వారిలో శక్తి లేదు. మాయ ఎదురుదెబ్బలు తినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రావణుడు శత్రువు, రాముడు మిత్రుడు. కొందరు రాముడు అంటారు, కొందరు శివుడు అని అంటారు. వారి అసలు పేరు శివబాబా. వారంటారు - నేను పునర్జన్మలలోకి రాను. నాకు డ్రామానుసారంగా శివ అన్న పేరును పెట్టడం జరిగింది. ఒక్క వస్తువుకు పది పేర్లు పెట్టడంతో మనుష్యులు తికమకపడ్డారు, ఎవరికి ఏది తోస్తే ఆ పేరును పెట్టేసారు. నా అసలు పేరు ‘శివ’. నేను ఈ శరీరములోకి ప్రవేశిస్తాను. నేనేమి కృష్ణుడు మొదలైనవారిలోకి రాను. విష్ణువైతే సూక్ష్మవతనములో ఉంటారు అని వారు భావిస్తారు. వాస్తవానికి వారిది యుగళ్ రూపము, ప్రవృత్తి మార్గానికి చెందినది. అంతేకానీ వారికి 4 భుజాలేమీ ఉండవు. నాలుగు భుజాలు అనగా ప్రవృత్తి మార్గము, రెండు భుజాలు అనగా నివృత్తి మార్గము. తండ్రి ప్రవృత్తి మార్గము యొక్క ధర్మాన్ని స్థాపన చేసారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. ప్రవృత్తి మార్గము వారే మళ్ళీ పావనము నుండి పతితముగా అవుతారు అందుకే సృష్టిని నిలబెట్టేందుకు సన్యాసులకు పవిత్రముగా అయ్యే పాత్ర ఉంది. వారు కూడా లక్షల-కోట్ల మంది ఉన్నారు. మేళాలు జరిగినప్పుడు ఎంతో మంది వస్తారు, వారు వంట వండుకోరు, గృహస్థుల పాలనపై నడుస్తారు. కర్మ సన్యాసము చేసాక ఇక భోజనము ఎక్కడి నుండి తింటారు. కావున గృహస్థుల వద్ద తింటారు. గృహస్థులు - దీనిని కూడా దానముగా భావిస్తారు. వీరు (బ్రహ్మా తండ్రి) కూడా ఒకప్పుడు పూజారిగా, పతితముగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ శ్రీమతముపై నడుస్తూ పావనముగా అవుతున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేస్తున్నారు, అందుకే ఫాలో ఫాదర్ చేయండి అని అంటారు. మాయ ప్రతి విషయములోనూ వెంటాడుతుంది. దేహాభిమానము కారణంగానే మనుష్యులు పొరపాట్లు చేస్తారు. వారు పేదవారైనా లేక షావుకారులైనా, దేహాభిమానము తెగిపోవాలి కదా. దేహాభిమానము తెగిపోవడమే చాలా శ్రమతో కూడుకున్నది. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఈ దేహము ద్వారా పాత్రను అభినయించండి. మీరు దేహాభిమానములోకి ఎందుకు వస్తారు! డ్రామానుసారముగా దేహాభిమానములోకి కూడా రావాల్సిందే. ఈ సమయములోనైతే పక్కా దేహాభిమానులుగా అయిపోయారు. తండ్రి అంటారు, నీవైతే ఆత్మవు, ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మ శరీరము నుండి వేరయ్యాక శరీరాన్ని కట్ చేస్తే, శబ్దమేమైనా వెలువడుతుందా? లేదు, ఆత్మయే అంటుంది - నా శరీరానికి దుఃఖాన్ని ఇవ్వకండి అని. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలేయండి.

పిల్లలైన మీరు ఎంతగా దేహీ-అభిమానులుగా అవుతారో, అంతగా ఆరోగ్యవంతులుగా మరియు నిరోగులుగా అవుతూ ఉంటారు. ఈ యోగబలము ద్వారానే మీరు 21 జన్మలు నిరోగులుగా అవుతారు. ఎంతగా తయారవుతారో అంతగా పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. శిక్షల నుండి రక్షింపబడతారు. లేకపోతే శిక్షలు ఎన్నో అనుభవించవలసి వస్తుంది. కావున ఎంత దేహీ-అభిమానులుగా అవ్వాలి. చాలా మంది భాగ్యములో ఈ జ్ఞానము లేదు. ఎప్పటివరకైతే వారు మీ కులములోకి రారో అనగా బ్రహ్మా ముఖవంశావళులుగా అవ్వరో, బ్రాహ్మణులుగా అవ్వరో, దేవతలుగా ఎలా అవుతారు. రావడమైతే ఎంతోమంది వస్తారు, బాబా-బాబా అని వ్రాస్తారు, అంటారు కూడా, కానీ కేవలము నామమాత్రముగా అంటారు. ఒకటి-రెండు ఉత్తరాలు వ్రాస్తారు, ఆ తర్వాత మాయమైపోతారు. వారు కూడా సత్యయుగములోకి వస్తారు కానీ ప్రజల్లోకి వస్తారు. ప్రజలుగానైతే ఎంతోమంది అవుతారు కదా. మున్ముందు చాలా దుఃఖము కలిగినప్పుడు ఎంతోమంది పరుగులు పెడతారు. భగవంతుడు వచ్చారు అన్న శబ్దము వెలువడుతుంది. మీ సెంటర్లు కూడా ఎన్నో తెరచుకుంటాయి. పిల్లలైన మీ లోపమేమిటంటే, మీరు దేహీ-అభిమానులుగా అవ్వడం లేదు. ఇంకా ఎంతో దేహాభిమానము ఉంది. అంతిమములో ఏ మాత్రం దేహాభిమానము ఉన్నా, పదవి కూడా తగ్గిపోతుంది. అప్పుడు వచ్చి దాస-దాసీలుగా అవుతారు. దాస-దాసీలు కూడా నంబరువారుగా ఎంతోమంది ఉంటారు. రాజులకు దాసీలు కట్నముగా లభిస్తారు, షావుకారులకు లభించరు. రాధ ఎంతమంది దాసీలను కట్నముగా తీసుకువెళ్తారో పిల్లలు చూసారు. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. సాధారణమైన దాసీలుగా అవ్వడం కన్నా షావుకారు ప్రజలుగా అవ్వడం మంచిది. దాసి అన్న పదము మంచిది కాదు. దానికన్నా ప్రజలలో షావుకారులుగా అవ్వడము ఇంకా మంచిది. తండ్రికి చెందినవారిగా అయినట్లయితే మాయ చాలా మంచి పాలన చేస్తుంది. శక్తివంతులతో, శక్తివంతముగా అయి పోరాడుతుంది. దేహాభిమానము వచ్చేస్తుంది. శివబాబా నుండే ముఖాన్ని తిప్పేసుకుంటారు. బాబాను స్మృతి చేయడమే వదిలేస్తారు. అరే, తినడానికి తీరక ఉంది కానీ, ఇటువంటి తండ్రి ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో వారిని స్మృతి చేయడానికి తీరిక లేదా. మంచి-మంచి పిల్లలు శివబాబాను మర్చిపోయి దేహాభిమానములోకి వచ్చేస్తారు. లేకపోతే ఇటువంటి తండ్రి ఎవరైతే ప్రాణదానాన్ని ఇస్తారో, వారిని గుర్తుచేసి ఉత్తరమైనా వ్రాయాలి కదా. కానీ ఇక్కడ అసలు అడగకండి. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని ఎగరగొట్టేస్తుంది. అడుగడుగులోనూ శ్రీమతముపై నడిచినట్లయితే అడుగడుగులో పదమాలు లభిస్తాయి. మీరు లెక్కలేనంత ధనవంతులుగా అవుతారు. అక్కడ లెక్కపెట్టడమనేది ఉండదు. ధన-సంపదలు, వ్యవసాయము అన్నీ లభిస్తాయి. అక్కడ రాగి, ఇత్తడి, ఇనుము మొదలైవవి ఉండవు. బంగారు నాణాలు మాత్రమే ఉంటాయి. భవనాలే బంగారముతో తయారుచేస్తున్నపుడు ఇంకేమి ఉండవు. ఇక్కడ ఉండేదే భ్రష్టాచారీ రాజ్యము, యథా రాజా-రాణి తథా ప్రజా. సత్యయుగములో యథా రాజా-రాణి తథా ప్రజా అందరూ శ్రేష్ఠాచారులుగా ఉంటారు. కానీ ఈ విషయాలు మనుష్యుల బుద్ధిలో ఏమైనా కూర్చుంటాయా. వారు తమోప్రధానముగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవారు. వీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు నేను వచ్చి దేవతలుగా తయారుచేస్తాను, అయినా తయారవ్వరు. పరస్పరంలో కోట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. నేను చాలా మంచివాడిని, నేను ఇలాంటివాడిని... అని అంటారు. ఎవరూ కూడా - మనము నరకములో పడి ఉన్నాము, మనము రౌరవ నరకములో పడి ఉన్నాము అని భావించరు. ఇది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా పిల్లలైన మీకే తెలుసు. మనుష్యులు పూర్తిగా నరకములో పడి ఉన్నారు - రాత్రి-పగలు చింతలలోనే పడి ఉంటారు. జ్ఞాన మార్గములో ఎవరైతే తమ సమానముగా తయారుచేసే సేవను చేయలేరో, నీది-నాది అనే చింతలలోనే ఉంటారో, వారు రోగులవంటివారు. తండ్రిని తప్ప ఇంకెవరినైనా స్మృతి చేసారంటే వ్యభిచారులు అయినట్లు కదా. తండ్రి అంటారు, ఇంకెవరి చెప్పింది వినకండి, నా నుండే వినండి. నన్ను స్మృతి చేయండి. దేవతలను స్మృతి చేసినా మంచిదే, మనుష్యులను స్మృతి చేయడం వలన ఏ లాభము లేదు. ఇక్కడైతే తండ్రి అంటారు - మీరు తల కూడా ఎందుకు వంచుతారు! మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా శివబాబాను గుర్తుచేసుకుని రండి. శివబాబాను స్మృతి చేయడం లేదంటే పాపము చేస్తున్నట్లు. బాబా అంటారు - మొదటైతే పవిత్రముగా అయ్యే ప్రతిజ్ఞను చేయండి. శివబాబాను స్మృతి చేయండి. ఇందులో చాలా పథ్యము ఉంది. అతి కష్టము మీద ఎవరో అర్థం చేసుకుంటారు. తండ్రితో ఎలా నడుచుకోవాలి అన్న బుద్ధి కూడా లేదు, ఇందులో చాలా శ్రమించాల్సి ఉంటుంది. మాలలోని మణి పూసగా అవ్వడము అంత సులభమేమీ కాదు. ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడము. మీరు తండ్రిని స్మృతి చేయలేరా. తండ్రి సేవను, తండ్రి స్మృతిని మీరు ఎంతగా చేయాలి. చార్టు పెట్టుకోండి అని బాబా ప్రతి రోజూ అంటారు. ఏ పిల్లలకైతే తమ కళ్యాణము చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుందో - వారు అన్ని రకాలుగా పూర్తి పథ్యాన్ని పాటిస్తూ ఉంటారు. వారి ఆహార-పానీయాలు చాలా సాత్వికముగా ఉంటాయి.

బాబా పిల్లల కళ్యాణము కొరకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా పథ్యాన్ని పాటించాలి. చెక్ చేసుకోవాలి - నా ఆహార-పానీయాలు ఈ విధంగా అయితే లేవు కదా? లోభీగా అయితే లేను కదా? ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ ఏర్పడదో అప్పటివరకు మాయ తప్పుడు కర్మలు చేయిస్తూ ఉంటుంది. దానికి ఇంకా సమయముంది. ఇప్పుడైతే వినాశనము ఎదురుగా ఉంది అని తర్వాత తెలుస్తుంది. అగ్ని వ్యాపిస్తుంది. బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు. భారత్ లోనైతే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. అక్కడ బాంబులతో ఒకరినొకరు అంతం చేసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందరికన్నా ఎక్కువ కష్టము భారత్ కే కలుగుతుంది. మీపై మీరు చాలా దృష్టి వహించాలి - నేను ఏ సేవ చేస్తున్నాను? ఎంతమందిని నా సమానముగా నరుడి నుండి నారాయణుడిగా తయారుచేస్తున్నాను? కొందరు భక్తిలో బాగా చిక్కుకుని ఉంటే - ఈ కుమార్తెలు ఏం చదివించగలరు అని వారు అనుకుంటారు. వీరిని చదివించేవారు తండ్రి (భగవంతుడు) అన్నది అర్థం చేసుకోరు. కాస్త చదువుకుని ఉన్నా లేదా ధనము ఉన్నా గొడవపడడం మొదలుపెడతారు. గౌరవ-మర్యాదలనే పోగొట్టేస్తారు. సద్గురువుకు నిందను తీసుకొచ్చేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. అక్కడికి వెళ్ళి పైసకు విలువ చేసే పదవిని పొందుతారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నీది-నాది అనే చింతలను వదిలి తమ సమానముగా తయారుచేసే సేవ చేయాలి. ఒక్క తండ్రి నుండే వినాలి, తండ్రినే స్మృతి చేయాలి, వ్యభిచారులుగా అవ్వకూడదు.

2. తమ కళ్యాణము కొరకు ఆహార-పానీయాల పథ్యాన్ని ఎంతగానో పెట్టుకోవాలి - ఏ పదార్థము పట్ల లోభము ఉంచుకోకూడదు. మాయ ఎటువంటి తప్పుడు కర్మలు చేయించకుండా అటెన్షన్ ఉండాలి.

వరదానము:-
నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలతామూర్త భవ

ఏ లౌకిక లేదా అలౌకిక కార్యములోనైనా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు విశేషముగా కంట్రోలింగ్ పవర్ మరియు జడ్జిమెంట్ పవర్ (నిర్ణయ శక్తి) యొక్క అవసరము ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఆత్మ అయినా మీ సంపర్కములోకి వస్తే - వీరికి ఏ వస్తువు యొక్క అవసరము ఉంది అని మొదట నిర్ణయించవలసి ఉంటుంది. నాడి ద్వారా పరిశీలించి వారి కోరిక అనుసారంగా వారిని తృప్తపరచాలి మరియు స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై తమ అచల స్థితి యొక్క ప్రభావాన్ని వేయాలి - ఈ రెండు శక్తులు సేవా క్షేత్రంలో సఫలతామూర్తులుగా చేస్తాయి.

స్లోగన్:-
సర్వశక్తివంతుడిని సహచరునిగా చేసుకున్నట్లయితే మాయ (పేపర్ టైగర్) కాగితపు పులి వలె అవుతుంది.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీగా అవ్వండి’’

సేవా క్షేత్రములో స్వయానికి సంబంధించి మరియు సేవకు సంబంధించి రకరకాల విఘ్నాలు ఏవైతే వస్తాయో, దానికి కూడా కారణము ఏమిటంటే - స్వయాన్ని కేవలము సేవాధారిగా భావిస్తారు, కానీ నేను ఈశ్వరీయ సేవాధారిని. నేను సేవలో కాదు ఈశ్వరీయ సేవలో ఉన్నాను అన్న ఈ స్మృతి ద్వారా స్మృతి మరియు సేవ స్వతహాగానే కంబైండు అవుతాయి.