26-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.12.2003


‘‘ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయమూర్తులుగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకము మధ్యలో భాగ్యము యొక్క మూడు సితారలను మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు. ఎంతటి శ్రేష్ఠ భాగ్యము మరియు ఎంత సహజముగా ప్రాప్తించింది. ఒకటి - అలౌకిక శ్రేష్ఠ జన్మ యొక్క భాగ్యము, రెండు - శ్రేష్ఠ సంబంధము యొక్క భాగ్యము, మూడు - సర్వ ప్రాప్తుల భాగ్యము. మెరుస్తున్న మూడు భాగ్య సితారలను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి - స్వయం భాగ్యవిధాత తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్యవిధాత అయినప్పుడు ఇక ఆ జన్మ ఎంత అలౌకికమైనది మరియు శ్రేష్ఠమైనది. మీ అందరికీ కూడా మీ ఈ భాగ్యపు జన్మ యొక్క నషా మరియు సంతోషము ఉంది కదా! దానితో పాటు సంబంధము యొక్క విశేషతను చూడండి - మొత్తము కల్పములో ఇటువంటి సంబంధము ఇతర ఏ ఆత్మకూ లేదు. విశేష ఆత్మలైన మీకే ఒక్కరి ద్వారా మూడు సంబంధాలు ప్రాప్తించాయి. ఒక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా. ఇలా ఒక్కరి ద్వారా మూడు సంబంధాలనేవి బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ లేవు. అనుభవము ఉంది కదా? తండ్రి సంబంధముతో వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు, పాలన కూడా చేస్తున్నారు. ఆ వారసత్వము కూడా చూడండి, ఎంత ఉన్నతమైనది మరియు అవినాశీ అయినది. మమ్మల్ని పాలన చేసేవారు భగవంతుడు అని ప్రపంచములోనివారు అంటారు, కానీ పిల్లలైన మీరు నిశ్చయము మరియు నషాతో - మమ్మల్ని పాలన చేసేవారు స్వయం భగవంతుడు అని అంటారు. ఇటువంటి పాలన, పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వము మరెవరికైనా ప్రాప్తించాయా! కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలన చేసేవారు కూడా మరియు టీచర్ కూడా.

ప్రతి ఆత్మ జీవితములో విశేషముగా మూడు సంబంధీకులు తప్పనిసరి, కానీ మూడు సంబంధాలూ వేరు-వేరుగా ఉంటాయి. మీకు ఒక్కరిలోనే మూడు సంబంధాలూ ఉన్నాయి. చదువు కూడా చూడండి - ఇది మూడు కాలాల చదువు. త్రికాలదర్శిగా అయ్యే చదువు. చదువును సంపాదనకు ఆధారము అని అంటారు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. మొత్తము విశ్వములో చూడండి - అన్నిటికంటే ఉన్నతోన్నతమైన పదవి రాజ్య పదవి అని గాయనము ఉంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి. ఇప్పుడు స్వ రాజ్యము ఉంది, మీరు రాజయోగీ స్వరాజ్య అధికారులు మరియు భవిష్య రాజ్య భాగ్యమైతే అవినాశీగా ఉండనే ఉంటుంది. దీనికంటే పెద్ద పదవి ఇంకేదీ ఉండదు. టీచర్ ద్వారా శిక్షణ కూడా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి. ఇలా శిక్షకుని సంబంధము బ్రాహ్మణ జీవితములో తప్ప మరెవ్వరికీ ఇంతవరకు లేదు, ఉండదు కూడా. అలాగే సద్గురువు సంబంధము, సద్గురువు ద్వారా శ్రీమతము లభిస్తుంది, ఈ శ్రీమతము యొక్క గాయనము ఈ రోజుకు కూడా భక్తిలో జరుగుతూ ఉంది. మన ప్రతి అడుగు ఏ ఆధారముతో పడుతుంది? శ్రీమతము ఆధారముతో ప్రతి అడుగు పడుతుంది అని మీరు నిశ్చయముతో అంటారు. కావున చెక్ చేసుకోండి - ప్రతి అడుగు శ్రీమతము అనుసారముగా నడుస్తుందా? భాగ్యమైతే ప్రాప్తించింది కానీ ఆ భాగ్యము ప్రాప్తించింది అన్నది జీవితములో అనుభవమవుతుందా? ప్రతి అడుగు శ్రీమతము అనుసారముగా ఉందా లేక అప్పుడప్పుడు మన్మతము లేక పరమతము అనేవి కలిసిపోవటం లేదు కదా? దీని పరిశీలన ఎలా అంటే - ఒకవేళ అడుగు శ్రీమతము అనుసారముగా ఉన్నట్లయితే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయిన అనుభవము ఉంటుంది. అడుగు శ్రీమతము అనుసారముగా ఉన్నట్లయితే సఫలత సహజముగా లభిస్తుంది. అలాగే సద్గురువు ద్వారా వరదానాల గని ప్రాప్తించింది. వరదానము ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే - ఎక్కడైతే వరదానము ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురువు సంబంధములో శ్రేష్ఠ మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. మరియు విశేషత ఏమిటంటే ఇది సహజ మార్గము. ఒక్కరిలోనే మూడు సంబంధాలు ఉన్నప్పుడు ఒక్కరిని గుర్తు చెయ్యటము సహజము. ముగ్గురినీ వేరువేరుగా గుర్తు చెయ్యాల్సిన అవసరము లేదు, అందుకే మీరందరూ, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఇది సహజము ఎందుకంటే ఒక్కరిలోనే విశేష సంబంధాలు వచ్చేస్తాయి. కనుక భాగ్య సితారలు మెరుస్తున్నాయి ఎందుకంటే బాబా ద్వారానైతే సర్వులకు ప్రాప్తులు లభించనే లభించాయి.

మూడవ భాగ్య సితార - సర్వ ప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు అన్న గాయము ఉంది. మీ ఖజానాలను గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఖజానాలు లేక సర్వ ప్రాప్తులు ఇతరులెవరి ద్వారానైనా లభించగలవా! మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారంటే, ఖజానాలు హాజరైపోతాయి, అందుకే ఇంతటి శ్రేష్ఠ భాగ్యము సదా స్మృతిలో ఉండాలి, ఇందులో నంబరువారుగా ఉన్నారు. ఇప్పుడు బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - ప్రతి బిడ్డ కోట్లలో కొద్దిమందే అయినప్పుడు మరి పిల్లలందరూ నంబరువారు కాదు, నంబర్ వన్ అవ్వాలి. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి - నంబరువారులో ఉన్నారా లేక నంబర్ వన్ గా ఉన్నారా? ఎలా ఉన్నారు? టీచర్లు, నంబర్ వన్ గా ఉన్నారా లేక నంబరువారుగా ఉన్నారా? పాండవులూ, నంబర్ వన్ గా ఉన్నారా లేక నంబరువారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే - మేము నంబర్ వన్ గా ఉన్నాము మరియు సదా అలానే ఉంటాము అని భావిస్తున్నారో, ఈ రోజు నంబర్ వన్ గా ఉండి, రేపు నంబరువారులోకి రావటము కాదు, అలా ఉండకూడదు, బ్రహ్మాబాబా ఎలా అయితే నంబర్ వన్ గా ఉన్నారో అలా మేము బ్రహ్మాబాబాను అనుసరించే నంబర్ వన్ గా ఉన్నాము మరియు అలాగే ఉంటాము అని ఇంతటి నిశ్చయబుద్ధితో ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. ఉన్నారా? ఊరికే అలా చేతులు ఎత్తవద్దు, ఆలోచించి, అర్థం చేసుకుని ఎత్తండి. బాగా పైకి ఎత్తండి, సగం ఎత్తితే సగమే ఉన్నట్లు. చేతులైతే చాలామంది ఎత్తారు. చూసారా, దాదీ చూసారా, ఇప్పుడు వీరి నుండి (నంబరు వన్ వారి నుండి) లెక్క తీసుకోండి. జనక్ (జానకి దాది) లెక్క తీసుకోండి. డబుల్ విదేశీయులు చేతులెత్తారు. చేతులెత్తండి, నంబర్ వన్ యేనా? చేతులెత్తి బాప్ దాదానైతే సంతోషపరిచారు. అభినందనలు. అచ్ఛా - చేతులెత్తారంటే మీకు మీ విషయములో ధైర్యము ఉన్నట్లు అర్థము మరియు ధైర్యము ఉన్నట్లయితే బాప్ దాదా కూడా సహాయకులుగా ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు బాప్ దాదా ఏం కోరుకుంటారు? నంబర్ వన్ గా ఉన్నారు, ఇది సంతోషించదగిన విషయము. కానీ... కానీ అంటే ఏమిటో చెప్పమంటారా లేక ‘కానీ’ అనేది లేనే లేదా? బాప్ దాదా వద్ద ‘కానీ’ అనేది ఉంది.

బాప్ దాదా చూసారు - మనసులో ఇముడ్చుకుని ఉన్నారు కానీ అది మనసు వరకే ఉంది, ముఖము మరియు నడవడికలో ఇమర్జ్ అయి లేదు. ఇప్పుడు బాప్ దాదా నంబర్ వన్ స్థితిని నడవడిక మరియు ముఖములో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సమయము అనుసారముగా నంబర్ వన్ అని చెప్పుకునేవారు తమ ప్రతి నడవడికలో దర్శనీయమూర్తిగా కనిపించాలి. వీరు దర్శనీయమూర్తులు అని మీ ముఖము చెప్పాలి. మీ జడ చిత్రాలు అంతిమ జన్మ వరకు కూడా, అంతిమ సమయము వరకు కూడా దర్శనీయమూర్తులుగా అనుభవమవుతాయి. కనుక చైతన్యములో కూడా, బ్రహ్మాబాబాను చూసారు కదా, సాకార స్వరూపములో, ఫరిశ్తాగా అయితే తర్వాత అయ్యారు, కానీ సాకార స్వరూపములో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ ఏం కనిపించేది? సాధారణముగా కనిపించేవారా? అంతిమ 84 వ జన్మ, పాత జన్మ, 60 సంవత్సరాలు దాటిన వయసు, అయినా కూడా ఆది నుండి అంతిమము వరకు వారిని దర్శనీయమూర్తిగా అనుభవము చేసారు. చేసారు కదా? సాకార రూపములో చేసారు కదా? అలాగే ఎవరైతే నంబర్ వన్ లో చెతులెత్తారో, టి.వి.లో తీసారు కదా? బాప్ దాదా వారి ఫైల్ ను చూస్తారు, బాప్ దాదా వద్ద ఫైల్ అయితే ఉంది కదా, మరి ఇప్పటినుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవమవ్వాలి. కర్మ సాధారణమైనదైనా కానీ, ఏ పని చేస్తున్నా కానీ, బిజినెస్ చేస్తున్నా, డాక్టర్ వృత్తి చేస్తున్నా, లాయర్ వృత్తి చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ ఏ స్థానములోనైతే మీరు సంబంధ-సంపర్కములోకి వస్తారో, వారు మీ నడవడిక ద్వారా, వీరు అతీతముగా మరియు అలౌకికముగా ఉన్నారు అని అనుభూతి చేస్తున్నారా? లేక ఇలా అయితే లౌకికము వారు కూడా ఉంటారు అని సాధారణముగా భావిస్తున్నారా? చేస్తున్న పనిలో విశేషత కాదు, ప్రాక్టికల్ జీవితములో విశేషత. చాలా మంచి వ్యాపారము, చాలా మంచిగా వకీలు పని చేస్తారు, చాలా మంచి డైరెక్టర్... ఇలాంటివారు చాలామంది ఉన్నారు. విశేష వ్యక్తుల పేర్లు కల ఒక పుస్తకము వెలువడుతుంది, అందులో ఎంతమంది పేర్లు ఉంటాయి, చాలామంది ఉంటారు. వీరు ఈ విశేషత చేసారు, వారు ఈ విశేషత చేసారు అని పేరు వస్తుంది. మరి ఎవరైతే చేతులెత్తారో, వాస్తవానికి అందరూ ఎత్తాలి, కానీ ఎవరైతే ఎత్తారో మరియు ఎత్తవలసిందే, అయితే మీ ప్రాక్టికల్ నడవడికలో మార్పును చూడాలి. ఈ ధ్వని ఇప్పుడు ఇంకా వెలువడలేదు. ఇండస్ట్రీలో పని చేస్తున్నా లేక ఎక్కడ పని చేస్తున్నా కానీ - వీరు సాధారణ కర్మలు చేస్తూ కూడా దర్శనీయమూర్తులు అని ఒక్కొక్క ఆత్మ అనాలి. అలా వీలవుతుందా, వీలవుతుందా? ముందున్నవారు చెప్పండి, వీలవుతుందా? ప్రస్తుత రిజల్టులో ఇది తక్కువగా వినిపిస్తుంది. సాధారణత ఎక్కువగా కనిపిస్తుంది. ఆ, ఎప్పుడైనా ఏదైనా విశేష కార్యము చేస్తే, విశేష అటెన్షన్ పెడితే, అప్పుడు సరిగ్గానే కనిపిస్తారు, కానీ మీకు బాబాపై ప్రేమ ఉందా, బాబాపై ప్రేమ ఉందా? ఎంత శాతము? టీచర్లు చేతులెత్తండి. చాలామంది టీచర్లు వచ్చారే. వీలవుతుందా? లేక ఒక్కోసారి సాధారణముగా, ఒక్కోసారి విశేషముగా కనిపిస్తారా? నోటి నుండి వెలువడే పదాలు కూడా, ఏ కార్యము చేస్తున్నా భాష కూడా అలౌకికముగా ఉండాలి, సాధారణ భాషగా ఉండకూడదు.

ఇప్పుడు బాప్ దాదాకు పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ ఆశ ఉంది, అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖము స్వతహాగానే నిరూపిస్తాయి, భాషణతో నిరూపించబడవు. భాషణ అనేది ఒక బాణము వేయడము వంటిది. కానీ వీరిని తయారుచేసేవారు ఎవరు అన్నదానితో ప్రత్యక్షత జరుగుతుంది! మిమ్మల్ని తయారుచేసేవారు ఎవరు అని వారు స్వయం వెతుకుతారు, స్వయం అడుగుతారు. రచన రచయితను ప్రత్యక్షము చేస్తుంది.

మరి ఈ సంవత్సరము ఏం చేస్తారు? గ్రామ సేవ చెయ్యాలి అని దాదీ అన్నారు, దానిని తప్పకుండా చెయ్యండి. కానీ బాప్ దాదా ఇప్పుడు ఈ పరివర్తనను చూడాలనుకుంటున్నారు. ఒక సంవత్సరములో ఇది సంభవమా? ఒక్క సంవత్సరములో? మరుసటి సీజన్ ప్రారంభమైనప్పుడు ఆ తేడా కనిపించాలి. మహా పరివర్తన అని అన్ని సెంటర్ల నుండి శబ్దము రావాలి, అప్పుడు పరివర్తన, పరివర్తన... అన్న పాటను పాడుతారు. మీ భాగ్యము ముందు ఇప్పుడు సాధారణ మాటలు మంచిగా అనిపించవు. దానికి కారణము ‘నేను’. ఈ నేను, నేను అన్న భావన, నేను ఏదైతే ఆలోచించానో, నేను ఏదైతే అన్నానో, నేను ఏదైతే చేస్తానో... అదే కరెక్ట్. ఈ నేను అనే భావన కారణముగా అభిమానము కూడా వస్తుంది, క్రోధము కూడా వస్తుంది. రెండూ వాటి పని అవి చేస్తాయి. అది బాబా ప్రసాదము, నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది! ప్రసాదాన్ని ఎవరైనా నాది అన్న భావనలోకి తీసుకురాగలరా? ఒకవేళ బుద్ధి ఉన్నా, ఏదైనా నైపుణ్యము ఉన్నా, ఏదైనా విశేషత ఉన్నా, బాప్ దాదా ఆ విశేషతను, బుద్ధిని అభినందిస్తారు, కానీ ‘నేను’ అనేదానిని తీసుకురాకండి. ఈ నేను అనే భావనను సమాప్తము చెయ్యండి. ఇది సూక్ష్మమైన నేను అన్న భావన. అలౌకిక జీవితములో ఈ నేను అనే భావన దర్శనీయమూర్తిగా అవ్వనివ్వదు. మరి దాదీలు ఏమనుకుంటున్నారు? పరివర్తన వీలవుతుందా? ముగ్గురు పాండవులు (నిర్వైర్ భాయి, రమేష్ భాయి, బృజ్ మోహన్ భాయి) చెప్పండి. ముగ్గురూ విశేషమైనవారు కదా. ముగ్గురూ చెప్పండి వీలవుతుందా? వీలవుతుందా? వీలవుతుందా? అచ్ఛా - ఇప్పుడు ఇందులో కమాండర్ గా అవ్వండి, ఇతర విషయాలలో కమాండర్ గా అవ్వకండి. పరివర్తనలో కమాండర్ గా అవ్వండి. మధుబన్ వారు అవుతారా? అవుతారా? మధుబన్ వారు చేతులెత్తండి. అచ్ఛా - అవుతారా? బొంబాయి వారు చేతులెత్తండి, యోగిని కూడా కూర్చున్నారు (పార్లేకు చెందిన యోగిని అక్కయ్య) బొంబాయి వారు అవుతారా? ఒకవేళ అవుతాము అంటే చేతులెత్తండి. అచ్ఛా, ఢిల్లీవారు చేతులెత్తండి. మరి ఢిల్లీవారు చేస్తారా? టీచర్లు చెప్పండి. చూడండి. ప్రతి నెల బాప్ దాదా రిపోర్టు తీసుకుంటారు. ధైర్యము ఉంది కదా? అభినందనలు.

అచ్ఛా, ఇండోర్ వారు చేతులెత్తండి. ఇండోర్ టీచర్లు చేతులెత్తండి. మరి టీచర్లు చేస్తారా? ఇండోర్ చేస్తుందా? చేతులు ఊపండి. అన్ని చేతులూ ఊపలేదు. చేస్తారా, చేయిస్తారా? దాదీలు చూడండి. టి.వి.లో చూస్తున్నారు. గుజరాత్ చేతులెత్తండి. గుజరాత్ చేస్తుందా? చేతులు ఊపటమైతే సహజమే. ఇప్పుడు మనసును ఊపాలి. ఎందుకు? ఇంత దుఃఖాన్ని చూస్తుంటే మీకు దయ కలగటం లేదా? ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా? కనుక ఇప్పుడు ప్రత్యక్షత యొక్క ప్లాన్ - ప్రాక్టికల్ జీవితము. ఇకపోతే, ప్రోగ్రాములు చేస్తుంటారు, ఇవి బిజీగా ఉండేందుకు చాలా మంచిది కానీ ప్రత్యక్షత అనేది మీ నడవడిక మరియు ముఖము ద్వారా జరుగుతుంది. ఇంకేదైనా జోన్ మిగిలిపోయిందా? యు.పి. వారు చేతులెత్తండి. యు.పి. వారు కొద్దిమందే ఉన్నారు. అచ్ఛా, యు.పి. చేస్తారా? మహారాష్ట్రవారు చేతులెత్తండి. బాగా పైకి ఎత్తండి. అచ్ఛా. మహారాష్ట్ర చేస్తారా? అభినందనలు. రాజస్థాన్ ఎత్తండి. టీచర్లు చేతులు ఊపండి. కర్నాటక ఎత్తండి. అచ్ఛా - కర్నాటక చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ చేతులెత్తండి. సరే, చిట్-చాట్ చేసాము. డబుల్ విదేశీయులు చేతులెత్తండి. జయంతి ఎక్కడున్నారు? డబుల్ విదేశీయులు చేస్తారా? ఇప్పుడు చూడండి, సభ మధ్యలో చెప్పారు. అందరూ చాలా మంచిగా ధైర్యాన్ని చూపించారు, ఇందుకొరకు పదమాల రెట్లు అభినందనలు. బయట కూడా వింటున్నారు, తమ తమ దేశాలలో కూడా వింటున్నారు, వారు కూడా చేతులు ఎత్తుతున్నారు.

మామూలుగా కూడా చూడండి, ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఉంటారో, వారి ప్రతి వచనాన్ని (మాటను) సత్య వచనము అని అంటారు. సత్య వచన్ మహారాజ్ అని అంటారు కదా. మరి మీరైతే మహా మహారాజులు. మీ ప్రతి వచనాన్ని ఎవరు విన్నా, వారు ఇది సత్య వచనము అని మనసులో అనుభవం చేయాలి. మీ మనసులో చాలా విషయాలు నిండి ఉన్నాయి, బాప్ దాదా వద్ద మనసును చూసే టి.వి. కూడా ఉంది. ఇక్కడ ఈ టి.వి. అయితే బాహ్య ముఖాన్ని చూపిస్తుంది కదా. కానీ బాప్ దాదా వద్ద ప్రతి ఒక్కరి యొక్క ప్రతి సమయములోని మనసు గతిని తెలుసుకునే యంత్రము ఉంది. మనసులో చాలా కనిపిస్తుంటుంది. మనసు యొక్క టి.వి.ని చూసినప్పుడు చాలా సంతోషిస్తారు, చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి. కానీ కర్మలలో యథాశక్తి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు కర్మల వరకు తీసుకురండి, వాణి వరకు తీసుకురండి, ముఖము వరకు తీసుకురండి, నడవడికలోకి తీసుకురండి. అప్పుడు అందరూ - శక్తులు వచ్చేసారు... అన్న మీ పాట ఉంది కదా, అలా అందరూ అంటారు. అందరూ శివుని శక్తులు. పాండవులు కూడా శక్తులే. కనుక శక్తులు శివబాబాను ప్రత్యక్షము చేస్తారు. ఇప్పుడిక చిన్న-చిన్న ఆటలు ఆపు చేయండి. ఇప్పుడు వానప్రస్థ స్థితిని ఇమర్జ్ చేయండి. కనుక బాప్ దాదా పిల్లలందరినీ, ఈ సమయములో బాప్ దాదా యొక్క ఆశలను పూర్తి చేసే ఆశా సితారలుగా చూస్తున్నారు. ఏ విషయము వచ్చినా ఈ స్లోగన్ ను గుర్తుంచుకోండి - ‘‘పరివర్తన, పరివర్తన, పరివర్తన’’.

ఈ రోజు బాప్ దాదా చెప్పిన మాటలలో ఒక్క మాటను మర్చిపోకండి, అది ఏ మాట? పరివర్తన. నేను మారాలి. ఇతరులను మార్చి నేను మారటము అని కాదు, నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోకూడదు. నేను నిమిత్తమవ్వాలి. నేను హే, అర్జున్ గా అవ్వాలి. అప్పుడు బ్రహ్మాబాబా సమానముగా నంబర్ వన్ తీసుకుంటారు (వెనుక ఉన్నవారు చేతులెత్తండి) వెనుక ఉన్నవారికి బాప్ దాదా మొదటి నంబరు ప్రియస్మృతులను ఇస్తున్నారు. అచ్ఛా.

నలువైపులా ఉన్న చాలా, చాలా భాగ్యశాలీ ఆత్మలకు, మొత్తము విశ్వములో కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన విశేషాత్మలకు, సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాప్ దాదాను ప్రత్యక్షము చేసే విశేషమైన పిల్లలకు, సదా సహయోగము మరియు స్నేహము అనే బంధనములో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా సమానముగా ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వింగ్స్ సేవల కొరకు బాప్ దాదా ప్రేరణలు:- వింగ్స్ సేవలలో మంచి రిజల్టు కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి వింగ్ వారు కష్టపడుతుంటారు, సంపర్కాలను పెంచుకుంటూ ఉంటారు. కానీ బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఏ విధంగా మెడికల్ వింగ్ వారు మెడిటేషన్ ద్వారా గుండె విషయములో ప్రాక్టికల్ గా చేసి చూపించారో, మెడిటేషన్ ద్వారా గుండె ఇబ్బంది నయమవ్వగలదు అని నిరూపించారో మరియు దాని ఋజువును చూపించారో, ఋజువును చూపించారు కదా! మీరందరూ విన్నారు కదా! అలా ప్రపంచమువారు ప్రత్యక్ష ఋజువును కోరుకుంటారు. ఇదే విధంగా ఏయే వింగ్స్ వారైతే వచ్చారో, ప్రోగ్రాములైతే చెయ్యాల్సిందే, చేస్తారు కూడా, కానీ ఎలాంటి ప్లాన్ ను తయారుచేయండంటే, దాని ద్వారా ప్రాక్టికల్ రిజల్టు అందరి ఎదురుగా రావాలి. అన్ని వింగ్స్ వారికి బాప్ దాదా చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటుంది కదా! అంతేకాక మెడిటేషన్ ద్వారా కూడా ఇలా జరగగలదు అని అన్నివైపులకు శబ్దము వ్యాపించింది. ఇప్పుడు దీనిని ఇంకా పెంచాలి.

ఇప్పుడు ప్రాక్టికల్ గా ఋజువును ఇవ్వండి, మెడిటేషన్ ద్వారా అన్నీ వీలవుతాయి అన్న ఈ విషయము వ్యాపించాలి. అందరి అటెన్షన్ మెడిటేషన్ వైపు ఉండాలి, ఆధ్యాత్మికత వైపు ఉండాలి. అర్థమైందా. అచ్ఛా!

వరదానము:-
సైలెన్స్ శక్తి ద్వారా విశ్వములో ప్రత్యక్షతా ఢంకాను మ్రోగించే శాంత స్వరూప భవ

‘‘సైన్స్ పై సైలెన్స్ యొక్క విజయము’’ అని అంటారే కానీ వాణి యొక్క విజయము అని అనరు. ఎంతగా సమయము మరియు సంపూర్ణత సమీపముగా వస్తూ ఉంటాయో అంతగా ఆటోమేటిక్ గా శబ్దములోకి ఎక్కువగా రావడము పట్ల వైరాగ్యము వస్తూ ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు కోరుకుంటున్నా కూడా అలవాటు అనేది శబ్దములోకి తీసుకువస్తుందో అలా కోరుకున్నా కూడా శబ్దము నుండి దూరమైపోతారు. ప్రోగ్రామ్ తయారుచేసుకుని శబ్దములోకి వస్తారు. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు ఇక విజయ ఢంకా మ్రోగనున్నది అని అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయము లభిస్తే అంత సమయము శాంత స్వరూప స్థితిలో ఉండే అభ్యాసకులుగా అవ్వండి.

స్లోగన్:-
జీరో బాబాతో పాటు ఉండేవారే హీరో పాత్రధారులు.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

వర్తమాన సమయములో విశ్వ కళ్యాణము చేసేందుకు సహజ సాధనము - మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రము చెయ్యటము. మొత్తము విశ్వములో ఉన్న సర్వాత్మలు విశేషముగా ఇదే కోరిక పెట్టుకుంటారు, అదేమిటంటే - భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రమవ్వాలి మరియు మనసు చంచలత నుండి ఏకాగ్రమవ్వాలి. విశ్వము కోరుకుంటున్న ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే, మీరు ఏకాగ్రమై మనసా శక్తుల దానాన్ని ఇచ్చినప్పుడు.