27-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ కర్మాతీత స్థితి ఎప్పుడైతే
ఏర్పడుతుందో, అప్పుడు విష్ణుపురిలోకి వెళ్తారు, పాస్ విత్ ఆనర్ అయ్యే పిల్లలే
కర్మాతీతులు అవుతారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీ
విషయములో ఇద్దరు తండ్రులూ ఏ కృషి చేస్తున్నారు?
జవాబు:-
పిల్లలు
స్వర్గానికి యోగ్యులుగా అవ్వాలని, వారిని సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా
తయారుచేయడానికి బాప్ దాదా, ఇద్దరూ కృషి చేస్తారు. మీకు డబుల్ ఇంజన్
దొరికినట్లయ్యింది. ఎటువంటి అద్భుతమైన చదువును చదివిస్తారంటే, దానితో మీరు 21 జన్మల
రాజ్య భాగ్యాన్ని పొందుతారు.
పాట:-
బాల్యపు
రోజులను మర్చిపోకండి...
ఓంశాంతి
మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. డ్రామా ప్లాన్
అనుసారముగా ఇటువంటి పాటలను ఎంచుకోవడం జరిగింది. మనుష్యులు ఆశ్చర్యచకితులవుతారు -
ఇక్కడ నాటకాలలోని పాటలపై వాణిని వినిపిస్తున్నారేమిటి, ఇదే రకమైన జ్ఞానము,
శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులను వదిలేసి, ఇప్పుడు పాటలపై వాణిని వినిపిస్తున్నారే!
అని ఆశ్చర్యపోతారు. మనము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని, వారి ద్వారా
అతీంద్రియ సుఖము లభిస్తుందని ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, ఇటువంటి తండ్రిని
మర్చిపోకూడదు. తండ్రి స్మృతి ద్వారానే జన్మ-జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. స్మృతిని
వదిలేసి పాపాలు ఉండిపోవడమనేది జరగకూడదు. అలా జరిగితే పదవి కూడా తగ్గిపోతుంది.
ఇటువంటి తండ్రినైతే బాగా స్మృతి చేసే పురుషార్థము చేయాలి. ఉదాహరణకు నిశ్చితార్థము
అయ్యాక ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. అలాగే, మీకు కూడా నిశ్చితార్థము జరిగింది,
మళ్ళీ ఎప్పుడైతే మీరు కర్మాతీత అవస్థను పొందుతారో అప్పుడు విష్ణుపురిలోకి వెళ్తారు.
ఇప్పుడు శివబాబా కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాబాబా కూడా ఉన్నారు. రెండు ఇంజనులు
లభించాయి - ఒకటి నిరాకారి, రెండు సాకారి. పిల్లలు స్వర్గానికి యోగ్యులుగా అవ్వాలని,
సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అవ్వాలని ఇరువురూ కృషి చేస్తున్నారు.
ఇక్కడ పరీక్షను పాస్ అవ్వాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ చదువు చాలా
అద్భుతమైనది, ఇది భవిష్య 21 జన్మల కొరకు. మిగిలిన చదువులన్నీ మృత్యులోకము కోసముంటాయి,
ఈ చదువు అమరలోకము కోసము. దాని కోసం ఇక్కడే చదవాలి కదా. ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రముగా
అవ్వదో అప్పటివరకు సత్యయుగములోకి వెళ్ళలేదు, అందుకే తండ్రి సంగమములోనే వస్తారు,
దీనినే పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇప్పుడే మీరు గవ్వ నుండి వజ్రముగా
అవుతారు, అందుకే శ్రీమతముపై నడుస్తూ ఉండండి. శ్రీ శ్రీ అని శివబాబానే అంటారు. మాల
యొక్క అర్థాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. పైన ఉన్న పుష్పము శివబాబా, ఆ
తర్వాత జంట పూసలు. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఆ తర్వాత ఉన్న పూసలు విజయము పొందేవారు.
వారి రుద్రమాలయే తర్వాత విష్ణుమాలగా అవుతుంది. ఈ మాల అర్థము ఎవ్వరికీ తెలియదు.
పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్రముగా అవ్వాలని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
63 జన్మలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఆ ఒక్క ప్రియునికి మీరు ఇప్పుడు
ప్రేయసులు. అందరూ ఆ ఒక్క భగవంతునికి భక్తులు. పతులకే పతి, తండ్రులకే తండ్రి ఆ తండ్రి
ఒక్కరే. పిల్లలైన మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తారు. వారు స్వయం అవ్వరు.
తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు - తండ్రి స్మృతి ద్వారానే మీ జన్మ-జన్మాంతరాల
పాపాలు భస్మమవుతాయి. సాధు-సన్యాసులైతే ఆత్మ నిర్లేపి అని అంటారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మంచి సంస్కారాలనైనా లేక చెడు సంస్కారాలనైనా ఆత్మయే తీసుకువెళ్తుంది.
వారు, ఎక్కడ చూసినా అంతటా భగవంతుడే భగవంతుడు, ఇదంతా భగవంతుని లీలయే అని అంటారు. వామ
మార్గములో పూర్తిగా అశుద్ధముగా అయిపోతారు. ఇటువంటి వారి మతముపై కూడా లక్షలాదిమంది
నడుస్తున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎల్లప్పుడూ బుద్ధిలో 3 ధామాలను
గుర్తుంచుకోండి - ఆత్మలు ఉండే ధామము శాంతిధామము, ఎక్కడి కోసమైతే మీరు పురుషార్థము
చేస్తున్నారో ఆ సుఖధామము, అర్ధకల్పము తర్వాత దుఃఖధామము ప్రారంభమవుతుంది. భగవంతుడినే
హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వారేమీ నరకాన్ని స్థాపించరు. తండ్రి అంటారు, నేను
అయితే సుఖధామాన్నే స్థాపన చేస్తాను. ఇకపోతే ఇది గెలుపు-ఓటముల ఆట. పిల్లలైన మీరు
శ్రీమతముపై నడిచి మాయా రూపీ రావణుడిపై విజయం పొందుతారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత
రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు యుద్ధ మైదానములో ఉన్నారు. ఇది
బుద్ధిలో ధారణ చేయాలి, మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. అంధులకు చేతికర్రగా అయి
ఇంటికి దారిని తెలియజేయాలి ఎందుకంటే అందరూ ఆ ఇంటిని మర్చిపోయారు. ఇది ఒక నాటకము అని
అంటారు కూడా. కానీ దీని ఆయువు లక్షల, వేల సంవత్సరాలు అని అంటారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, రావణుడు మిమ్మల్ని ఎంత అంధులుగా (జ్ఞాన నయనహీనులుగా) చేసేసాడు.
ఇప్పుడు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. తండ్రినే నాలెడ్జ్ ఫుల్ అని
అంటారు. అలాగని దాని అర్థం, వారు అందరి లోపల ఏముందో తెలిసినవారు అని కాదు. అది
రిద్ధి-సిద్ధి చేసేవారు నేర్చుకుంటారు, దానితో మీ లోపల ఉన్న విషయాలను
వినిపిస్తుంటారు. నాలెడ్జ్ ఫుల్ అంటే ఇది కాదు అర్థము. ఇది తండ్రి మహిమ. వారు జ్ఞాన
సాగరుడు, ఆనంద సాగరుడు. వారు అంతర్యామి అని మనుష్యులు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు
అర్థం చేసుకుంటారు - వారు టీచర్, మనల్ని చదివిస్తున్నారు, వారు ఆత్మిక తండ్రి కూడా,
ఆత్మిక సద్గురువు కూడా. అక్కడ దైహికమైన టీచర్లు, గురువులు ఉంటారు, అది కూడా
వేరువేరుగా ఉంటారు, ముగ్గురూ ఒక్కరే ఉండరు. ఎక్కడో ఒకరు తండ్రే టీచరు కూడా అవుతారు.
కానీ గురువు కాలేరు. ఎంతైనా వారు మనుష్యులే కదా. ఇక్కడైతే ఆ సుప్రీమ్ ఆత్మ, పరమపిత
పరమాత్మ చదివిస్తున్నారు. ఆత్మను పరమాత్మ అని అనరు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.
పరమాత్మ అర్జునుడికి సాక్షాత్కారము చేయిస్తే, ఇంతటి ప్రకాశాన్ని నేను
సహించలేకపోతున్నాను, ఇక ఈ సాక్షాత్కారాన్ని ఆపండి అని అన్నట్లుగా వారు చెప్తారు. ఇది
విన్న వారందరూ పరమాత్మ ఎంతో తేజోమయుడని భావిస్తారు. పూర్వము బాబా వద్దకు
వచ్చినప్పుడు సాక్షాత్కారములోకి వెళ్ళిపోయేవారు. ఇక ఆపండి, చాలా ప్రకాశము ఉంది, మేము
సహించలేకపోతున్నాము అని అనేవారు. ఏదైతే విని ఉన్నారో, బుద్ధిలో ఆ భావనే ఉంటుంది.
తండ్రి అంటారు, ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో, నేను వారి ఆ భావనను పూర్తి చేయగలను.
ఎవరైనా గణేశుడి పూజారి ఉంటే అతడికి గణేశుడి సాక్షాత్కారము చేయిస్తాను. సాక్షాత్కారము
కలిగితే ఇక నేను ముక్తిధామానికి చేరుకున్నాను అని భావిస్తారు. కానీ అలా జరగదు.
ముక్తిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. నారదుని ఉదాహరణ కూడా ఉంది. అతను భక్తులలో
శిరోమణిగా మహిమ చేయబడ్డారు. అతను, నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగితే, నీ
ముఖాన్ని చూసుకో అని అన్నారు. భక్తుల మాల కూడా ఉంటుంది. స్త్రీలలో మీరా మరియు
పురుషులలో నారదుడు భక్తులలో ముఖ్యులుగా మహిమ చేయబడ్డారు. ఇక్కడ జ్ఞానములో ముఖ్య
శిరోమణి సరస్వతి. నంబరువారుగా అయితే ఉంటారు కదా.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ అలా తప్పుడు
కర్మలు చేయిస్తుంది. ఇక అంతిమములో చాలా ఏడవవలసి, పశ్చాత్తాపపడవలసి ఉంటుంది -
భగవంతుడు వచ్చారు కానీ మేము వారసత్వాన్ని తీసుకోలేకపోయాము అని. ఇక వెళ్ళి ప్రజలలో
కూడా దాస-దాసీలుగా అవుతారు. చివరిలో చదువైతే పూర్తయిపోతుంది, అప్పుడు చాలా
పశ్చాత్తాపపడవలసి వస్తుంది, అందుకే తండ్రి పశ్చాత్తాపపడవలసిన అవసరం రాకూడదని
ముందుగానే అర్థం చేయిస్తున్నారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా
యోగాగ్నితో పాపాలు భస్మమవుతాయి. ఆత్మ సతోప్రధానముగా ఉండేది, మళ్ళీ అందులో మలినాలు
కలుస్తూ, కలుస్తూ తమోప్రధానముగా అయ్యింది. బంగారము, వెండి, రాగి, ఇనుము... అన్న
పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇనుపయుగము నుండి మీరు స్వర్ణిమయుగములోకి వెళ్ళాలి.
పవిత్రముగా అవ్వకుండా ఆత్మలు వెళ్ళలేవు. సత్యయుగములో పవిత్రత ఉండేది కావున సుఖము,
సంపన్నత కూడా ఉండేవి. ఇక్కడ పవిత్రత లేదు కావున సుఖము, సంపన్నత కూడా లేవు. రాత్రికి,
పగలుకు ఉన్నంత తేడా ఉంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ బాల్యపు రోజులను
మర్చిపోకండి. తండ్రి దత్తత తీసుకున్నారు కదా. బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు, ఇది
దత్తత. స్త్రీని దత్తత తీసుకోవడం జరుగుతుంది, ఆపై పిల్లలను రచించడం జరుగుతుంది.
స్త్రీని రచన అని అనరు, ఈ తండ్రి కూడా దత్తత తీసుకుంటారు. కల్ప పూర్వము నేను దత్తత
తీసుకున్న పిల్లలు మీరే. దత్తత తీసుకోబడ్డ పిల్లలకే తండ్రి నుండి వారసత్వము
లభిస్తుంది. ఉన్నతోన్నతమైన తండ్రి నుండి ఉన్నతోన్నతమైన వారసత్వము లభిస్తుంది. వారు
భగవంతుడు, ఆ తర్వాత రెండవ నంబరులో సత్యయుగ యజమానులైన ఈ లక్ష్మీ-నారాయణులు ఉన్నారు.
ఇప్పుడు మీరు సత్యయుగానికి యజమానులుగా అవుతున్నారు. ఇప్పుడు సంపూర్ణముగా అవ్వలేదు,
అవుతూ ఉన్నారు.
పావనముగా తయారై పావనముగా తయారుచేయడము, ఇదే సత్యమైన ఆత్మిక సేవ. మీరు ఇప్పుడు
ఆత్మిక సేవను చేస్తున్నారు, అందుకే మీరు చాలా ఉన్నతమైనవారు. శివబాబా పతితులను
పావనముగా తయారుచేస్తారు. మీరు కూడా పావనముగా తయారుచేస్తారు. రావణుడు ఎంత తుచ్ఛబుద్ధి
కలవారిగా తయారుచేసాడు. ఇప్పుడు తండ్రి మళ్ళీ యోగ్యులుగా తయారుచేసి విశ్వానికి
యజమానులుగా తయారుచేస్తారు. ఇటువంటి తండ్రిని రాయి-రప్పలలో ఉన్నారని ఎలా అంటారు.
తండ్రి అంటారు, ఈ నాటకము తయారై ఉంది. కల్పము తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు
డ్రామా ప్లాన్ అనుసారముగా నేను మీకు అర్థం చేయించేందుకు వచ్చాను. ఇందులో కొద్దిగా
కూడా తేడా రాదు. తండ్రి ఒక్క క్షణము కూడా ఆలస్యము చేయలేరు. ఏ విధంగా బాబా యొక్క పునః
అవతరణ జరుగుతుందో, అలాగే పిల్లలైన మీది కూడా పునః అవతరణ జరుగుతుంది. మీరు అవతరించారు.
ఆత్మ ఇక్కడకు వచ్చి మళ్ళీ సాకారములో పాత్రను అభినయిస్తుంది, దీనిని అవతరణ అని అంటారు.
పాత్రను అభినయించేందుకు పై నుండి కిందకు వచ్చారు. తండ్రిది కూడా దివ్యమైన అలౌకిక
జన్మ. తండ్రి స్వయం అంటారు, నేను ప్రకృతిని ఆధారముగా తీసుకోవలసి వస్తుంది. నేను ఈ
తనువులోకి ప్రవేశిస్తాను. ఇది నా కోసం నిశ్చితమైన తనువు. ఇది చాలా పెద్ద అద్భుతమైన
నాటకము. ఈ నాటకములో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది, దానిని అభినయిస్తూనే ఉంటారు.
21 జన్మల పాత్రను మళ్ళీ అలాగే అభినయిస్తారు. మీకు స్పష్టమైన జ్ఞానము లభించింది, అది
కూడా నంబరువారు పురుషార్థానుసారముగా లభించింది. మహారథులను బాబా మహిమ అయితే చేస్తారు
కదా. పాండవులు మరియు కౌరవులకు యుద్ధము జరిగినట్లుగా ఏదైతే చూపిస్తారో, అవన్నీ
కల్పితమైన విషయాలు. వారంతా దైహికమైన డబల్ హింసకులని, మీరు ఆత్మికమైన డబుల్
అహింసకులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రాజ్యాన్ని పొందేందుకు మీరు ఎలా
కూర్చున్నారో చూడండి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు.
ఇదే చింత పట్టుకుని ఉంది. శ్రమ అంతా స్మృతి చేయడములోనే ఉంది, అందుకే భారత్ యొక్క
ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. విదేశీయులు కూడా భారత్ యొక్క ఈ ప్రాచీన యోగాన్ని
నేర్చుకోవాలని అనుకుంటారు. సన్యాసులు మాకు ఈ యోగాన్ని నేర్పిస్తారు అని భావిస్తారు.
వాస్తవానికి వారు నేర్పించేది ఏమీ లేదు. వారి సన్యాసము హఠయోగముతో కూడినది. మీరు
ప్రవృత్తి మార్గము వారు. ప్రారంభములోనే మీ రాజధాని ఉండేది. ఇప్పుడు ఇది అంతిమము.
ఇప్పుడు పంచాయతీ రాజ్యము ఉంది. ప్రపంచములో అంధకారమైతే చాలా ఉంది. ఇప్పుడిక ఏ కారణమూ
లేకుండా రక్తసిక్తమైన ఆట జరగనున్నదని మీకు తెలుసు. దీనికి సంబంధించి కూడా ఒక నాటకము
చూపిస్తారు, ఇక్కడ ఇది అనంతమైన విషయము. ఎన్ని హత్యలు జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు
సంభవిస్తాయి. అందరి మృత్యువు జరుగుతుంది. దీనిని ఏ కారణమూ లేని రక్తసిక్తమైన ఆట అని
అంటారు. దీనిని చూసేందుకు చాలా ధైర్యము కావాలి. పిరికివారైతే వెంటనే
మూర్ఛితులైపోతారు, ఇందులో నిర్భయత చాలా కావాలి. మీరు శివశక్తులు కదా. శివబాబా
సర్వశక్తివంతుడు, మనము వారి నుండి శక్తిని తీసుకుంటాము. పతితము నుండి పావనముగా
తయారయ్యే యుక్తిని తండ్రియే తెలియజేస్తారు. తండ్రి చాలా సింపుల్ సలహాను ఇస్తారు -
పిల్లలూ, మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, ఇప్పుడు
తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా,
సతోప్రధానముగా అవుతారు. ఆత్మ తండ్రితో యోగము జోడించినట్లయితే పాపాలు భస్మమవుతాయి.
అథారిటీ కూడా తండ్రే. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చిత్రాలలో
చూపిస్తారు. అతని ద్వారా కూర్చుని సర్వ వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయించారు.
ఇప్పుడు మీకు తెలుసు, బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మా
ద్వారా స్థాపన చేస్తారు, ఆ తర్వాత ఏదైతే స్థాపన అయ్యిందో, దానిని పాలన కూడా
తప్పకుండా చేస్తారు కదా. ఇవన్నీ బాగా అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే అర్థం
చేసుకుంటారో వారికి - ఈ ఆత్మిక జ్ఞానము అందరికీ లభించేందుకు ఏం చేయాలి అన్న ఆలోచన
ఉంటుంది. మన వద్ద ధనముంటే సెంటర్లు ఎందుకు తెరవకూడదు. తండ్రి అంటారు, సరే, అద్దెకే
ఇల్లు తీసుకోండి, అందులో హాస్పిటల్ మరియు యూనివర్శిటీ తెరవండి. యోగము ద్వారానే
ముక్తి, జ్ఞానము ద్వారానే జీవన్ముక్తి. రెండు వారసత్వాలు లభిస్తాయి. ఇందులో కేవలం 3
అడుగుల భూమి చాలు, ఇంకేమీ అవసరము లేదు. గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీని తెరవండి.
విశ్వవిద్యాలయము అన్నా లేక యూనివర్శిటీ అన్నా విషయము ఒక్కటే. ఇది మనుష్యుల నుండి
దేవతలుగా తయారయ్యేందుకు ఎంత పెద్ద యూనివర్శిటీ. మీ ఖర్చు ఎలా నడుస్తుంది అని
అడుగుతారు. అరే, బి.కె.ల తండ్రికి ఇంతమంది పిల్లలు ఉంటే, మీరు ఖర్చు ఎలా నడుస్తుంది
అని అడగడానికి వచ్చారా! బోర్డుపై ఏమి వ్రాసి ఉందో చూడండి. ఇది చాలా అద్భుతమైన
జ్ఞానము. తండ్రి కూడా అద్భుతమైనవారు కదా. విశ్వానికి యజమానులుగా మీరు ఎలా అవుతారు?
శివబాబాను శ్రీ శ్రీ అని అంటారు ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైనవారు కదా.
లక్ష్మీ-నారాయణులను శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణుడు అని అంటారు. ఇవన్నీ బాగా ధారణ
చేయవలసిన విషయాలు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది సత్యాతి,
సత్యమైన అమరకథ. కేవలం ఒక్క పార్వతికి మాత్రమే అమరకథను వినిపించి ఉంటారా. అమరనాథ్ కు
ఎంతమంది మనుష్యులు వెళ్తారు. పిల్లలైన మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు
వచ్చారు. మళ్ళీ వెళ్ళి అందరికీ అర్థం చేయించాలి, రిఫ్రెష్ చేయాలి, సెంటర్ తెరవాలి.
తండ్రి అంటారు, కేవలం 3 అడుగుల భూమిని తీసుకుని హాస్పిటల్ మరియు యూనివర్శిటీని
తెరుస్తూ వెళ్ళినట్లయితే ఎంతోమంది కళ్యాణము జరుగుతుంది. ఇందులో ఖర్చు ఏమీ లేదు.
ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు సంతోషము ఒక్క క్షణములో లభిస్తాయి. కొడుకు పుట్టగానే
వారసుడు అవుతాడు. మీకు కూడా నిశ్చయము ఏర్పడగానే విశ్వానికి యజమానిగా అవుతారు. ఇక
మిగిలినదంతా పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అంతిమములో ఏ కారణమూ లేని రక్తసిక్తమైన దృశ్యాలను చూసేందుకు చాలా, చాలా
నిర్భయులుగా, శివశక్తులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తిని
తీసుకోవాలి.
2. పావనముగా తయారై, పావనముగా తయారుచేసే సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. డబుల్
అహింసకులుగా అవ్వాలి. అంధులకు చేతికర్రగా అయి అందరికీ ఇంటికి దారిని తెలియజేయాలి.
వరదానము:-
నేను మరియు నాది అన్నదానిని సమాప్తము చేసి సమానతను మరియు
సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగీ భవ
ప్రతి క్షణము ప్రతి సంకల్పములో బాబా, బాబా అన్నది గుర్తు
ఉండాలి, నేను అన్నది సమాప్తమైపోవాలి, ఎప్పుడైతే నేను అన్నది ఉండదో అప్పుడిక నాది
అన్నది కూడా ఉండదు. నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, నా పని లేక డ్యూటీ, నా
పేరు, నా ప్రతిష్ఠ... ఎప్పుడైతే ఈ నేను, నాది అన్నది సమాప్తమైపోతుందో అదే సమానత
మరియు సంపూర్ణత. ఈ నేను మరియు నాది అన్నదాని త్యాగమే అన్నింటికంటే పెద్ద సూక్ష్మ
త్యాగము. ఈ నాది అనే అశ్వాన్ని (గుర్రాన్ని) అశ్వమేధ యజ్ఞములో స్వాహా చేయండి,
అప్పుడు అంతిమ ఆహుతి పడుతుంది మరియు విజయ ఢంకా మ్రోగుతుంది.
స్లోగన్:-
హాజీ
అంటూ సహయోగమనే చేతిని అందించడము అనగా ఆశీర్వాదాల మాలలను ధరించడము.
మీ శక్తిశాలి మనసా
ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి
ఎప్పుడైతే నిరంతరము
ఏకరస స్థితిలో స్థితులయ్యే అభ్యాసము ఉంటుందో, అప్పుడే మనసా ద్వారా సకాష్ ను ఇవ్వగలరు.
దీని కోసం ముందుగా వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చెయ్యండి. అప్పుడు
మాయ ద్వారా వచ్చే అనేక రకాల విఘ్నాలను ఈశ్వరీయ లగనము యొక్క ఆధారముతో సమాప్తము
చెయ్యండి. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ పాఠము ద్వారా ఏకాగ్రతా శక్తిని
పెంచుకోండి.
| | |