ఓంశాంతి
కొత్త ప్రపంచములోకి వెళ్ళే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి గుడ్ మార్నింగ్
చెప్తున్నారు. తప్పకుండా మేము ఈ ప్రపంచము నుండి దూరముగా వెళ్తున్నామని ఆత్మిక
పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎక్కడికి? తమ స్వీట్ సైలెన్స్ హోమ్
కు (మధురమైన నిశ్శబ్దమైన ఇంటికి). శాంతిధామమే దూరముగా ఉంది, అక్కడి నుండే ఆత్మలమైన
మనము వస్తాము. అది మూలవతనము, ఇది స్థూలవతనము. అది ఆత్మలైన మన ఇల్లు. ఆ ఇంటికి తండ్రి
తప్ప ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మీరందరూ ఆత్మిక సేవ
చేస్తున్నారు. ఎవరు నేర్పించారు? దూరంగా తీసుకువెళ్ళే తండ్రి. ఎంతమందిని దూరంగా
తీసుకువెళ్తారు? లెక్కలేనంతమంది ఉన్నారు. ఆ ఒక్క పండాకు పిల్లలైన మీరందరూ కూడా
పండాలే (మార్గదర్శకులే). మీ పేరే పాండవ సేన. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరికీ దూరంగా
తీసుకువెళ్ళే యుక్తిని తెలియజేస్తారు, అదేమిటంటే - మన్మనాభవ, తండ్రిని స్మృతి
చెయ్యండి. బాబా, ఈ ప్రపంచము నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళండి అని అంటారు.
కొత్త ప్రపంచములో ఇలా అనరు. ఇక్కడ ఉన్నది రావణ రాజ్యము, అందుకే ఇక్కడి నుండి దూరంగా
తీసుకువెళ్ళండి, ఇక్కడ విశ్రాంతి లేదు అని అంటారు. దీని పేరే దుఃఖధామము. ఇప్పుడు
తండ్రి మిమ్మల్ని ఎదురుదెబ్బలు తిననివ్వరు. భక్తి మార్గములో తండ్రిని వెదికేందుకు
మీరు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. తండ్రి స్వయంగా అంటారు, నేను గుప్తమైనవాడిని, ఈ
కళ్ళ ద్వారా ఎవ్వరూ నన్ను చూడలేరు. కృష్ణుని మందిరములో తల వంచి నమస్కరించేందుకు
పాదరక్షలను పెడతారు, కానీ అలా నమస్కరించేందుకు నాకు పాదాలే లేవు. మీకైతే కేవలం ఒకే
మాట చెప్తున్నాను - ప్రియమైన పిల్లలూ, మీరు కూడా ఇతరులకు చెప్తారు - మధురమైన సోదరులూ,
పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. అంతే, ఇంకే కష్టమూ లేదు.
ఏ విధంగా తండ్రి వజ్రము వలె తయారుచేస్తారో, అలాగే పిల్లలు కూడా ఇతరులను వజ్రము వలె
తయారుచేస్తారు. మనుష్యులను వజ్రము వలె ఎలా తయారుచేయాలి అన్నదే నేర్చుకోవాలి. డ్రామా
అనుసారముగా కల్పపూర్వము వలె కల్ప-కల్పము యొక్క సంగమములో తండ్రి వచ్చి మనకు
నేర్పిస్తారు. మళ్ళీ మనము ఇతరులకు నేర్పిస్తాము. తండ్రి వజ్రము వలె
తయారుచేస్తున్నారు. మీకు తెలుసు, ఖోజ మతస్థుల గురువైన ఆగా ఖాన్ ను బంగారము, వెండి,
వజ్రాలతో తూకం వేసారు. నెహ్రూను బంగారముతో తూకం వేసారు. ఇప్పుడు వారెవ్వరూ వజ్రము
వలె తయారుచేసేవారు అయితే కాదు. తండ్రి అయితే మిమ్మల్ని వజ్రము వలె తయారుచేస్తారు.
వారిని మీరు దేనితో తూకం వేస్తారు? మీరు వజ్రాలు మొదలైనవి ఏం చేసుకుంటారు. మీకైతే
అవసరమే లేదు. వాళ్ళు పందాలలో ఎంతో ధనాన్ని వృధా చేస్తారు. ఇళ్ళు, ఆస్తిపాస్తులు
మొదలైనవి తయారుచేసుకుంటూ ఉంటారు. పిల్లలైన మీరైతే సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు.
మీరు ఎవరి నుండైనా అప్పు తీసుకుంటే మళ్ళీ 21 జన్మల కొరకు నింపి ఇవ్వవలసి ఉంటుంది.
మీకు ఎవ్వరి నుండి అప్పు తీసుకునేందుకు అనుమతి లేదు. మీకు తెలుసు, ఈ సమయములో ఉన్నది
అసత్యమైన సంపాదన, ఇది అంతమైపోయేది ఉంది. బాబా చూసారు, ఇవి గవ్వలు, మాకు వజ్రాలు
లభిస్తుంటే ఈ గవ్వలను ఏం చేసుకుంటాము? తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని ఎందుకు
తీసుకోకూడదు. భోజనమైతే ఎటు తిరిగి దొరుకుతుంది. ఒక నానుడి కూడా ఉంది - ఎవరి చేతులైతే
ఇలా ఉంటాయో వారు మొదటి నంబర్ తీసుకుంటారు అని. బాబాను షర్రాఫ్ (ఎక్స్ చేంజ్
వ్యాపారము చేసేవారు) అని కూడా అంటారు కదా. కావున తండ్రి అంటారు, మీ పాత వస్తువులను
ఎక్స్ చేంజ్ చేస్తాను. ఎవరైనా చనిపోతే అతని పాత వస్తువులను కాటికాపరికి ఇస్తారు కదా.
తండ్రి అంటారు, నేను మీ నుండి ఏం తీసుకుంటాను. ఈ ఉదాహరణను చూడండి. ద్రౌపది కూడా
ఒక్కరే కాదు కదా, మీరందరూ ద్రౌపదులే. బాబా, మమ్మల్ని వివస్త్రగా అవ్వడము నుండి
రక్షించండి అని చాలా పిలుస్తారు. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఈ
అంతిమ జన్మ పవిత్రముగా అవ్వండి. తండ్రి పిల్లలతో, నా గడ్డం పరువు నిలబెట్టండి,
కులానికి కళంకము తీసుకురావద్దు అని అంటారు కదా. మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎంత
నషా ఉండాలి. తండ్రి మిమ్మల్ని వజ్రము వలె తయారుచేస్తారు, వీరిని కూడా ఆ తండ్రే
వజ్రము వలె తయారుచేస్తారు. స్మృతి వారినే చేయాలి. ఈ బ్రహ్మా బాబా అంటున్నారు, నన్ను
స్మృతి చేయడము ద్వారా మీ వికర్మలు వినాశనమవ్వవు. నేను మీ గురువును కాను. వారు నాకు
నేర్పిస్తారు, నేను మళ్ళీ మీకు నేర్పిస్తాను. వజ్రము వలె తయారవ్వాలంటే తండ్రిని
స్మృతి చెయ్యండి.
బాబా అర్థం చేయించారు, భక్తి మార్గములో ఎవరైనా దేవతలను భక్తి చేస్తూ ఉన్నా వారి
బుద్ధి దుకాణము, వ్యాపారము మొదలైనవాటి వైపుకు పరిగెడుతూ ఉంటుంది, ఎందుకంటే వాటి
ద్వారా సంపాదన జరుగుతుంది. బాబా తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు - ఎప్పుడైతే బుద్ధి
ఇటూ-అటూ పరుగెడుతూ ఉండేదో, అప్పుడు నాకు నేను చెంపదెబ్బ వేసుకునేవాడిని - ఇవన్నీ
ఎందుకు గుర్తుకువస్తున్నాయి అని? కావున ఇప్పుడు ఆత్మలైన మనము ఒక్క తండ్రినే స్మృతి
చేయాలి కానీ మాయ ఘడియ, ఘడియ మరపింపజేస్తుంది, గట్టి దెబ్బ తగులుతుంది. మాయ
బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. ఇలా, ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి. తండ్రి అంటారు -
ఇప్పుడు మీ కళ్యాణమూ చేసుకోండి, అలాగే ఇతరుల కళ్యాణమూ చేయండి, సెంటర్లు తెరవండి.
బాబా, ఫలానా చోట సెంటర్ తెరవనా అని చాలామంది పిల్లలు ఇలా అంటారు. తండ్రి అంటారు,
నేనైతే దాతను, నాకు ఏమీ అవసరం లేదు, ఈ ఇళ్ళు మొదలైనవి కూడా పిల్లలైన మీ కోసమే
తయారుచేస్తారు కదా. శివబాబా అయితే మిమ్మల్ని వజ్రము వలె తయారుచేయడానికి వచ్చారు.
మీరు ఏదైతే చేస్తారో, అది మీకే ఉపయోగపడుతుంది. శిష్యులు మొదలైనవారిని
తయారుచేసుకునేందుకు వీరేమీ గురువు కాదు. ఇళ్ళను తాము ఉండేందుకని పిల్లలే
తయారుచేసుకుంటారు. అయితే, ఇళ్ళు కట్టించినవారు వచ్చినప్పుడు వారికి మర్యాదలు చేయడం
జరుగుతుంది, మీరు పైన ఉన్న కొత్త ఇంటిలోకి వెళ్ళి ఉండండి అని వారితో అంటారు.
కొందరేమంటారంటే - ‘మేము కొత్త ఇంట్లో ఎందుకు ఉండాలి, మాకైతే పాతదే బాగా అనిపిస్తుంది,
మీరు ఎలా ఉంటున్నారో మేమూ అలాగే ఉంటాము, మేము దాత అన్న అహంకారమేమీ మాకు లేదు,
కొత్తదానిలో బాప్ దాదాయే ఉండనప్పుడు మేమెందుకు ఉండాలి? మమ్మల్ని కూడా మీతోటే
ఉండనివ్వండి, మీకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది’ అని అంటారు.
తండ్రి అర్థం చేయిస్తారు, ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా సుఖధామములో ఉన్నత
పదవి పొందుతారు. స్వర్గములోకైతే అందరూ వెళ్తారు కదా. భారత్ పుణ్యాత్ముల ప్రపంచముగా
ఉండేదని, అప్పుడు పాపము యొక్క పేరే లేదని భారతవాసులకు తెలుసు. ఇప్పుడైతే
పాపాత్ములుగా అయిపోయారు. ఇది రావణ రాజ్యము. సత్యయుగములో రావణుడు ఉండడు. రావణ రాజ్యము
అర్ధకల్పము తర్వాతనే ఉంటుంది. తండ్రి ఇంతగా అర్థం చేయించినా అర్థం చేసుకోరు.
కల్ప-కల్పమూ ఇలా జరుగుతూ వచ్చింది. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు ప్రదర్శినీలు
పెడతారు, ఎంతోమంది వస్తారు. ప్రజలైతే చాలామంది తయారవుతారు. వజ్రము వలె
తయారయ్యేందుకైతే సమయము పడుతుంది. ప్రజలు తయారైనా అది కూడా మంచిదే. ఈ సమయమే వినాశన
సమయము. అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి. 8 రత్నాల మాల ఏదైతే తయారై ఉందో, అది పాస్
విత్ ఆనర్ల మాల. 8 రత్నాలే నంబర్ వన్ లోకి వెళ్తారు, వారికి కొద్దిగా కూడా శిక్షలు
పడవు. వారు కర్మాతీత అవస్థను పొందుతారు. ఆ తర్వాత 108, నంబరువారు అనైతే అంటారు కదా.
ఇది తయారై, తయారుచేయబడిన అనాది డ్రామా. ఎవరు మంచిగా పురుషార్థము చేస్తున్నారు అని
దీనిని సాక్షిగా అయి చూస్తారు. కొందరు పిల్లలు చివరిలో వచ్చారు, శ్రీమతముపై నడుస్తూ
ఉంటారు. ఇలాగే శ్రీమతముపై నడుస్తూ ఉంటే పాస్ విత్ ఆనర్లు అయి అష్ట రత్నాల మాలలోకి
రావచ్చు. అయితే నడుస్తూ, నడుస్తూ అప్పుడప్పుడు గ్రహచారము కూడా పడుతుంది. ఇలా
ఎత్తు-పల్లాలు అందరికీ వస్తాయి. ఇది సంపాదన. ఒక్కోసారి చాలా సంతోషముగా ఉంటారు,
ఒక్కోసారి తక్కువగా ఉంటారు. మాయ తుఫానులు మరియు చెడు సాంగత్యము వెనక్కు తోసేస్తాయి.
సంతోషము మాయమైపోతుంది. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము
ముంచేస్తుంది అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు రావణ సాంగత్యము ముంచేస్తుంది, రాముని
సాంగత్యము తీరానికి చేరుస్తుంది. రావణుని మతము ద్వారా ఇలా తయారయ్యారు. దేవతలు కూడా
వామ మార్గములోకి వెళ్తారు. వారి చిత్రాలను ఎంత అశుద్ధముగా చూపిస్తారు. ఇది వామ
మార్గములోకి వెళ్ళిన దానికి గుర్తు. భారత్ లోనే రామ రాజ్యము ఉండేది, భారత్ లోనే
ఇప్పుడు రావణ రాజ్యము ఉంది. రావణ రాజ్యములో 100 శాతం దుఃఖితులుగా అవుతారు. ఇది
నాటకము. ఈ జ్ఞానము ఎవరికైనా అర్థం చేయించడం ఎంత సహజము.
(ఒక నర్స్ బాబా ఎదురుగా కూర్చున్నారు) బాబా ఈ బిడ్డతో అంటున్నారు - నీవు నర్సువు,
ఆ సేవ కూడా చేస్తూ ఉండు, దానితోపాటు నీవు ఈ సేవ కూడా చేయవచ్చు. రోగులకు కూడా ఇలా
జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండు - తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి,
మళ్ళీ 21 జన్మల వరకూ మీరు రోగులుగా అవ్వరు, యోగము ద్వారానే ఆరోగ్యము మరియు ఈ 84
జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా ఐశ్వర్యము లభిస్తాయి. నీవు చాలా చేయగలవు,
ఎంతోమంది కళ్యాణము చేస్తావు. లభించిన ధనాన్ని కూడా ఈ ఆత్మిక సేవలో ఉపయోగిస్తావు.
వాస్తవానికి మీరందరూ కూడా నర్సులే కదా. ఛీ-ఛీగా అశుద్ధముగా ఉన్న మనుష్యులను దేవతలుగా
తయారుచేయడము - ఇది నర్స్ సమానమైన సేవయే కదా. తండ్రి కూడా అంటారు, నన్ను పతిత
మనుష్యులు, మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు. నీవు కూడా రోగులకు ఈ
సేవ చేయు, నీపై బలిహారమవుతారు. నీ ద్వారా సాక్షాత్కారము కూడా జరగవచ్చు. ఒకవేళ
యోగయుక్తముగా ఉన్నట్లయితే పెద్ద-పెద్ద సర్జన్లు మొదలైనవారందరూ వచ్చి నీ పాదాలపై
పడతారు. నువ్వు చేసి చూడు. ఇక్కడికి మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాయి, మళ్ళీ
వెళ్ళి వర్షించి ఇతరులను రిఫ్రెష్ చేస్తాయి. కొంతమంది పిల్లలకు అసలు వర్షము ఎక్కడి
నుండి వస్తుంది అన్నది కూడా తెలియదు. ఇంద్రుడు వర్షిస్తాడు అని భావిస్తారు.
ఇంద్రధనుస్సు అని అంటారు కదా. శాస్త్రాలలోనైతే ఎన్ని విషయాలు వ్రాసేసారు. తండ్రి
అంటారు, ఇది మళ్ళీ జరుగుతుంది, డ్రామాలో నిశ్చితమై ఉంది కదా. మనము ఎవరి గ్లాని చేయము,
ఇది తయారై, తయారుచేయబడిన అనాది డ్రామా. అది భక్తి మార్గమని అర్థం చేసుకోవడం
జరుగుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటారు కూడా. పిల్లలైన మీకు ఈ పాత
ప్రపంచముపై వైరాగ్యము ఉంది. మీరు మరణిస్తే ప్రపంచము మరణిస్తుంది. ఆత్మ శరీరము నుండి
వేరైపోతే ఇక దానికి ప్రపంచమే సమాప్తము.
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, చదువులో నిర్లక్ష్యము
చేయకండి. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. బ్యారిస్టర్లలో ఒకరు లక్ష రూపాయలు సంపాదిస్తే
ఇంకొకరికి వేసుకోడానికి కోటు కూడా ఉండదు. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. ఈ చదువు
అయితే చాలా సహజమైనది. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి అనగా మీ 84 జన్మల ఆదిమధ్యాంతాలను
తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది, దీని పునాది లేదు. మిగిలిన
వృక్షమంతా నిలబడి ఉంది. అలాగే ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమేదైతే ఉండేదో, అది
కాండముగా ఉండేది, అది ఇప్పుడు లేదు. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు.
మనుష్యులు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. తండ్రి కూర్చుని ఈ విషయాలన్నింటినీ అర్థం
చేయిస్తారు, మీరు సదా కొరకు సుఖవంతులుగా అవుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు.
ఫలానావారు చనిపోయారు అన్న మాటే అక్కడ ఉండదు. కావున తండ్రి సలహా ఇస్తారు, అనేకులకు
దారిని తెలియజేస్తే వారు మీపై బలిహారమైపోతారు. కొందరికి సాక్షాత్కారము కూడా జరగవచ్చు.
సాక్షాత్కారమనేది కేవలం లక్ష్యాన్ని చూపిస్తుంది. దాని కోసము చదవాల్సి ఉంటుంది కదా.
చదవకుండా బ్యారిస్టరుగా అవుతారా. సాక్షాత్కారము అయ్యిందంటే ముక్తులైపోయారు అని కాదు.
మీరాకు సాక్షాత్కారము అయ్యింది, అలాగని కృష్ణపురికి వెళ్ళిపోయారని కాదు. నవవిధ భక్తి
చేయడం ద్వారా సాక్షాత్కారమవుతుంది. అలా ఇక్కడ నవవిధ స్మృతి. సన్యాసులు బ్రహ్మ
జ్ఞానులుగా, తత్వ జ్ఞానులుగా తయారవుతారు. బ్రహ్మములో లీనమైపోవాలి అంతే అని
అనుకుంటారు. కానీ బ్రహ్మము అయితే పరమాత్మ కాదు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, శరీర నిర్వహణార్థము మీ వ్యాపారము మొదలైనవి
చేయండి కానీ స్వయాన్ని ట్రస్టీగా భావిస్తూ చేయండి, అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది.
అప్పుడు మమకారము తొలగిపోతుంది. ఈ బాబా తీసుకుని ఏం చేస్తారు? వీరైతే తన సర్వస్వాన్నీ
వదిలేశారు కదా. ఇళ్ళు-వాకిళ్ళను లేక మహళ్ళు మొదలైనవాటినైతే తయారుచేసుకునేది లేదు.
ఎంతోమంది పిల్లలు వస్తారు కావున ఈ ఇళ్ళు నిర్మిస్తారు. ఆబూ రోడ్ నుండి ఇక్కడి వరకు
క్యూ ఏర్పడుతుంది. ఇప్పుడే మీ ప్రభావము పడితే ఇక మీ తల పాడు చేసేస్తారు. పెద్ద
మనుష్యులు వస్తే గుంపులు కడతారు. మీ ప్రభావము చివరిలో వెలువడేది ఉంది, ఇప్పుడే కాదు.
పాపాలు అంతమయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. ఇటువంటి స్మృతిలో
శరీరము వదలాలి. సత్యయుగములో శరీరము వదిలినప్పుడు, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక
కొత్తదానిని తీసుకుంటారని అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే దేహాభిమానము ఎంతగా ఉంటుంది.
తేడా ఉంది కదా. ఈ విషయాలన్నింటినీ నోట్ చేసుకోవాలి మరియు చేయించాలి. ఇతరులను కూడా
మీ సమానముగా వజ్రము వలె తయారుచేయాలి. ఎంత పురుషార్థము చేస్తే అంత ఉన్నత పదవిని
పొందుతారు. ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరు ఏ సాధువో, మహాత్మో కాదు.
ఈ జ్ఞానము చాలా ఆనందదాయకమైనది, దీనిని బాగా ధారణ చేయాలి. తండ్రి నుండి విని మళ్ళీ
ఇక్కడిది ఇక్కడే వదిలేయడం కాదు. పాటలో కూడా విన్నారు కదా, మీతో తీసుకువెళ్ళండి అని
అంటారు. మీరు ఈ విషయాలను ఇంతకుముందు అర్థం చేసుకునేవారు కాదు, ఇప్పుడు తండ్రి అర్థం
చేయించారు కావున అర్థం చేసుకుంటున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.