28-10-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సద్గురువు ఇచ్చే మొట్టమొదటి శ్రీమతము
ఏమిటంటే - దేహీ అభిమానులుగా అవ్వండి, దేహాభిమానాన్ని వదిలివేయండి’’
ప్రశ్న:-
ఈ
సమయములో పిల్లలైన మీరు ఎటువంటి కోరికనూ లేక ఆశనూ ఉంచుకోకూడదు - ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే
మీరందరూ వానప్రస్థులు. ఈ కనుల ద్వారా దేనినైతే చూస్తున్నారో అదంతా
వినాశనమవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఏమీ అవసరం లేదు. పూర్తి బికారులుగా
అవ్వాలి. ఒకవేళ ఏదైనా ఖరీదైన వస్తువును ధరిస్తే అది ఆకర్షిస్తుంది, అప్పుడిక
దేహాభిమానములో చిక్కుకుపోతూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉంది. ఎప్పుడైతే శ్రమించి పూర్తి
దేహీ-అభిమానులుగా అవుతారో, అప్పుడు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది.
ఓంశాంతి
ఈ 15 నిమిషాలు లేక అరగంట పిల్లలు కూర్చున్నారు, బాబా కూడా - స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని 15 నిమిషాలు కూర్చోబెడతారు. ఈ శిక్షణ ఒకేసారి
లభిస్తుంది, ఇది మళ్ళీ ఇంకెప్పుడూ లభించదు. సత్యయుగములో ఆత్మాభిమానిగా అయి కూర్చోండి
అని చెప్పరు. ఇలా ఒక్క సద్గురువే చెప్తారు, వారి గురించే ఇలా అంటారు - ఒక్క
సద్గురువే తీరానికి చేరుస్తారు, మిగిలినవారంతా ముంచేస్తారు అని. ఇక్కడ తండ్రి
మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. వారు స్వయమూ దేహీ కదా. అర్థం
చేయించేందుకని వారు ఇలా చెప్తారు - నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని అని.
మిగిలినవారైతే దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేసేది ఉండదు. ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మానికి చెందిన సభ్యులు ఎవరైతే ఉంటారో, స్మృతి కూడా వారే చేస్తారు.
ప్రజలైతే నంబరువారు పురుషార్థానుసారంగా ఎంతోమంది ఉంటారు కదా. ఈ విషయము బాగా అర్థం
చేసుకోవలసినది మరియు అర్థం చేయించవలసినది. పరమపిత పరమాత్మ మీ అందరికీ తండ్రి కూడా
మరియు వారు నాలెడ్జ్ ఫుల్ కూడా. ఆత్మలోనే జ్ఞానము ఉంటుంది కదా. మీ ఆత్మ సంస్కారాలను
తీసుకువెళ్తుంది. తండ్రిలో అయితే మొదటి నుండే సంస్కారాలు ఉన్నాయి. వారు తండ్రి, ఇది
అందరూ అంగీకరిస్తారు కూడా. వారిలో ఉన్న ఇంకొక విశేషత ఏమిటంటే, వారిలో యథార్థమైన
జ్ఞానము ఉంది, వారు బీజరూపుడు. ఏ విధంగా తండ్రి కూర్చుని మీకు అర్థం చేయిస్తారో, అలా
మీరు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు, అలాగే వారు
సత్యమైనవారు, చైతన్యమైనవారు, నాలెడ్జ్ ఫుల్, వారికి ఈ మొత్తం వృక్షమంతటి జ్ఞానమూ
ఉంది. ఇంకెవరికీ ఈ వృక్షము యొక్క జ్ఞానము లేదు. దీని బీజము తండ్రి, వారిని పరమపిత
పరమాత్మ అని అంటారు. ఉదాహరణకు మామిడి వృక్షము ఉంటుంది, దాని బీజమును రచయిత అనే
అంటారు కదా. ఆ బీజము తండ్రి వంటిది, కానీ అది జడమైనది. అది ఒకవేళ చైతన్యముగా
ఉన్నట్లయితే దాని నుండి మొత్తం వృక్షమంతా ఎలా వెలువడుతుంది? అన్నది ఆ బీజానికి
తెలిసే ఉంటుంది కదా. కానీ అది జడమైనది. దాని బీజము కింద భూమిలో నాటబడుతుంది.
ఇక్కడైతే వీరు చైతన్య బీజరూపుడు. వీరు పైన ఉంటారు, మీరు కూడా మాస్టర్ బీజరూపులుగా
అవుతారు. తండ్రి నుండి మీకు జ్ఞానము లభిస్తుంది. వారు ఉన్నతోన్నతమైనవారు. పదవిని
కూడా మీరు ఉన్నతోన్నతమైనది పొందుతారు. స్వర్గములో కూడా ఉన్నత పదవి కావాలి కదా. ఈ
విషయాన్ని మనుష్యులు అర్థం చేసుకోరు. స్వర్గములో దేవీ-దేవతల రాజధాని ఉంటుంది.
రాజధానిలో రాజు, రాణి, ప్రజలు, పేదవారు, షావుకారులు మొదలైనవారందరూ ఎలా తయారై ఉంటారు.
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు,
దానిని ఎవరు చేస్తారు? భగవంతుడు. తండ్రి అంటారు - పిల్లలూ, ఏదైతే జరుగుతోందో అదంతా
డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతోంది, అందరూ డ్రామాకు వశమై ఉన్నారు. తండ్రి కూడా
అంటారు - నేనూ డ్రామాకు వశమై ఉన్నాను. నాకు కూడా పాత్ర లభించి ఉంది, అదే పాత్రను
అభినయిస్తాను. వారు సుప్రీమ్ ఆత్మ. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు,
మిగిలినవారందరినీ సోదరులు అని అంటారు. ఇంకెవరినీ ఇలా తండ్రి, టీచర్, గురువు అని అనడం
జరుగదు. వారు సర్వులకూ సుప్రీమ్ తండ్రి కూడా, టీచర్, సద్గురువు కూడా. ఈ విషయాలను
మర్చిపోకూడదు. కానీ పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే నంబరువారు పురుషార్థానుసారంగా
రాజధాని స్థాపన అవుతోంది. ప్రతి ఒక్కరూ ఎలా పురుషార్థం చేస్తున్నారు అనేది వెంటనే
స్థూలముగా కూడా తెలిసిపోతుంది. వీరు తండ్రిని స్మృతి చేస్తున్నారా, లేదా?
దేహీ-అభిమానులుగా అయ్యారా, లేదా? అన్నది కూడా తెలిసిపోతుంది. వీరు జ్ఞానములో
చురుకుగా ఉన్నారు అన్నది వారి నడవడిక ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. తండ్రి
ఎవరికీ డైరెక్టుగా చెప్పరు, వారు నిరాశపడకూడదు అని అలా చెప్పరు. బాబా ఇలా
అన్నారేమిటి, మిగిలినవారంతా ఏమి అంటారో అని బాధపడకూడదు అని డైరెక్టుగా చెప్పరు.
ఫలానా, ఫలానావారు సేవను ఎలా చేస్తున్నారు అన్నది తండ్రి చెప్పగలరు. మొత్తమంతా
సేవపైనే ఆధారపడి ఉంది. తండ్రి కూడా వచ్చి సేవ చేస్తారు కదా. పిల్లలే తండ్రిని స్మృతి
చేయవలసి ఉంటుంది. స్మృతి సబ్జెక్టే కష్టమైనది. తండ్రి యోగాన్ని మరియు జ్ఞానాన్ని
నేర్పిస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇకపోతే స్మృతిలోనే ఫెయిల్ అవుతారు.
దేహాభిమానము వచ్చేస్తుంది. ఇక అప్పుడు ఇది కావాలి, ఈ మంచి వస్తువు కావాలి అంటూ
ఇటువంటి ఆలోచనలు వస్తాయి.
తండ్రి అంటారు, ఇక్కడైతే మీరు వనవాసములో ఉన్నారు కదా. మీరైతే ఇప్పుడు
వానప్రస్థములోకి వెళ్ళాలి. ఇక అటువంటి వస్తువులేమీ ధరించలేరు. ఒకవేళ ఇటువంటి
ప్రాపంచికమైన వస్తువులేమైనా ఉంటే అవి ఆకర్షిస్తాయి. శరీరము కూడా ఆకర్షిస్తుంది. అది
ఘడియ-ఘడియ దేహాభిమానములోకి తీసుకువస్తుంది. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమించకుండా విశ్వ
రాజ్యాధికారము లభించదు. శ్రమ కూడా నంబరువారు పురుషార్థానుసారంగా కల్ప-కల్పమూ చేస్తూ
వచ్చారు, చేస్తూనే ఉంటారు. రిజల్టు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. స్కూల్లో కూడా
నంబరువారుగా ట్రాన్స్ఫర్ అవుతారు. ఫలానావారు బాగా కష్టపడ్డారు, వీరికి చదివించే
అభిరుచి ఉంది అని టీచర్ అర్థం చేసుకుంటారు. ఆ అనుభూతి కలుగుతుంది. అందులో అయితే ఒక
క్లాస్ నుండి ట్రాన్స్ఫర్ అయి రెండవ క్లాస్ లోకి, ఆ తర్వాత మూడవ క్లాస్ లోకి వస్తారు.
ఇక్కడైతే ఒకేసారి చదవాలి. మున్ముందు ఎంతగా మీరు సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా అన్నీ
తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా కష్టపడాలి. తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. కొందరు
రాజా, రాణులుగా అవుతారు, కొందరు ఇంకోలా అవుతారు, మరికొందరు మరోలా అవుతారు అని మీకు
తెలుసు. ప్రజలుగా కూడా ఎంతోమంది తయారవుతారు. వీరు దేహాభిమానములో ఎంతగా ఉంటారు,
వీరికి తండ్రిపై ఎంతటి ప్రేమ ఉంది - మొత్తమంతా వారి నడవడిక ద్వారా తెలిసిపోతుంది.
తండ్రితోనే ప్రేమ ఉండాలి కదా, సోదరుల ప్రేమ కాదు, సోదరుల ప్రేమతో ఏమీ లభించదు.
వారసత్వమైతే అందరికీ ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి అంటారు - పిల్లలూ,
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి.
ముఖ్యమైన విషయమే ఇది. స్మృతితో శక్తి లభిస్తుంది. రోజురోజుకు బ్యాటరీ నిండుతూ
ఉంటుంది ఎందుకంటే జ్ఞాన ధారణ జరుగుతూ ఉంటుంది కదా. బాణం తగులుతూ ఉంటుంది. రోజురోజుకు
మీ ఉన్నతి అనేది నంబరువారు పురుషార్థానుసారంగా జరుగుతూ ఉంటుంది. వీరొక్కరే తండ్రి,
టీచర్, సద్గురువు. వీరు దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శిక్షణను ఇస్తారు, ఇది
ఇంకెవ్వరూ ఇవ్వలేరు, మిగిలినవారందరూ దేహాభిమానులుగా ఉన్నారు, ఆత్మాభిమానులుగా అయ్యే
జ్ఞానము ఎవ్వరికీ లభించనే లభించదు. మానవమాత్రులెవ్వరూ తండ్రి, టీచర్, గురువుగా
అవ్వలేరు. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు. మీరు సాక్షీగా అయి
చూస్తున్నారు. మొత్తం నాటకమంతటినీ మీరు సాక్షీగా అయి చూడాలి. పాత్రను కూడా
అభినయించాలి. తండ్రి క్రియేటర్, డైరెక్టర్ మరియు యాక్టర్. శివబాబా వచ్చి పాత్రను
అభినయిస్తారు. వారు అందరికీ తండ్రి కదా. వారు వచ్చి కుమారులు మరియు కుమార్తెలు,
అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి ఒక్కరే, మిగిలినవారంతా ఆత్మలు, పరస్పరం
సోదరులు. వారసత్వము ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. ఈ ప్రపంచము యొక్క వస్తువేదీ
బుద్ధిలో గుర్తుకురాదు. తండ్రి అంటారు, మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశీయే.
ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళాలి. వారైతే బ్రహ్మ తత్వాన్ని తలచుకుంటారు అనగా ఇంటిని
తలచుకుంటారు. బ్రహ్మ తత్వములో లీనమైపోతాము అని భావిస్తారు. దానిని అజ్ఞానం అని
అంటారు. మనుష్యులు ముక్తి-జీవన్ముక్తుల గురించి ఏదైతే చెప్తారో అది తప్పు. వారు ఏ
యుక్తులనైతే రచిస్తారో అవన్నీ తప్పే. సరైన మార్గాన్ని అయితే ఒక్క తండ్రే
తెలియజేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని డ్రామా ప్లాన్ అనుసారంగా రాజులకే
రాజులుగా తయారుచేస్తాను. కొందరు అంటారు, మా బుద్ధిలో కూర్చోవడం లేదు, బాబా, మా
నోరును తెరవండి, కృప చూపించండి అని. తండ్రి అంటారు, ఇందులో బాబా చేసేది ఏమీ లేదు.
ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు డైరెక్షన్లపై నడవాలి. ఒక్క తండ్రి నుండే సరైన డైరెక్షన్
లభిస్తుంది, మిగిలిన మనుష్యులందరివీ తప్పుడు డైరెక్షన్లు ఎందుకంటే అందరిలోనూ పంచ
వికారాలు ఉన్నాయి కదా. కిందకు దిగజారుతూ, దిగజారుతూ తప్పుగా అయిపోతూ ఉంటారు.
రిద్ధి-సిద్ధి మొదలైనవి ఏమేమో చేస్తూ ఉంటారు. వాటిలో సుఖము ఏమీ లేదు. ఇవన్నీ
అల్పకాలికమైన సుఖాలని మీకు తెలుసు. దానిని కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు.
మెట్ల వరుస చిత్రముపై చాలా బాగా అర్థం చేయించాలి మరియు వృక్షము గురించి కూడా అర్థం
చేయించాలి. మీ ధర్మాన్ని స్థాపించేవారు ఫలానా, ఫలానా సమయములో వస్తారని, క్రైస్టు
ఫలానా సమయములో వస్తారని మీరు ఏ ధర్మము వారికైనా చూపించవచ్చు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి
కన్వర్ట్ అయిపోయారో, వారికి ఈ ధర్మమే నచ్చుతుంది, వారు వెంటనే బయటకు వస్తారు. కానీ
ఒకవేళ ఎవరికైనా ఇది నచ్చకపోతే, ఇక వారు పురుషార్థం ఎలా చేస్తారు? మనుష్యులు
మనుష్యులను ఉరికంబముపైకి ఎక్కిస్తారు. మీరైతే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఇది
చాలా మధురమైన ఉరి. ఆత్మ యొక్క బుద్ధియోగము తండ్రివైపు ఉంటుంది. తండ్రిని స్మృతి
చేయమని ఆత్మకు చెప్పడం జరుగుతుంది. ఇది స్మృతి రూపీ ఉరి. తండ్రి అయితే పైనే ఉంటారు
కదా. మనం ఒక ఆత్మ అని, మనం తండ్రినే స్మృతి చేయాలి అని మీకు తెలుసు. ఈ శరీరాన్ని
అయితే ఇక్కడే వదిలివేయాలి. మీకు ఈ జ్ఞానమంతా ఉంది. మీరు ఇక్కడ కూర్చుని ఏమి చేస్తారు?
వాణి నుండి అతీతముగా వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. అందరూ నా వద్దకు రావాలి అని
తండ్రి అంటారు, కావున వారు కాలుడికే కాలుడు అయినట్లు కదా. ఆ కాలుడు అయితే ఒక్కరినే
తీసుకువెళ్తాడు, అలాగని ఇలా తీసుకువెళ్ళేందుకు అక్కడ కాలుడు అంటూ ఎవ్వరూ లేరు. ఇదంతా
డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆత్మ తనంతట తానే సమయమనుసారంగా వెళ్ళిపోతుంది. ఈ తండ్రి
అయితే ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. ఇప్పుడు మీ అందరి బుద్ధియోగము మీ ఇంటికి వెళ్ళే
వైపు ఉంది. శరీరము వదలేయడాన్ని మరణించడం అని అంటారు. శరీరము అంతమయ్యాక ఆత్మ
వెళ్ళిపోతుంది. బాబా, మీరు వచ్చి మమ్మల్ని ఈ సృష్టి నుండి తీసుకువెళ్ళండి అనే
తండ్రిని పిలుస్తారు. ఇక్కడ ఇక మనం ఉండేది లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు
తిరిగి వెళ్ళాలి. బాబా, ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది, ఇప్పుడిక ఇక్కడ ఉండేది లేదు అని
అంటారు. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. మరణించడం కూడా తప్పకుండా ఉంటుంది. ఇది అందరి
వానప్రస్థావస్థ. ఇప్పుడిక వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. మిమ్మల్ని కాలుడు కబళించడు.
మీరు సంతోషముగా వెళ్ళిపోతారు. శాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి
మార్గానికి చెందినవి, అవి మళ్ళీ కూడా ఉంటాయి. ఇది డ్రామాలోని చాలా అద్భుతమైన విషయము.
ఈ టేప్, ఈ గడియారం మొదలైనవాటిని ఏవైతే ఈ సమయములో చూస్తున్నారో అవన్నీ మళ్ళీ ఉంటాయి.
ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి అనగా
అర్థము అవి మళ్ళీ ఖచ్చితముగా అదే విధముగా రిపీట్ అవుతాయి. మనం మళ్ళీ దేవీ-దేవతలుగా
అవుతున్నామని, మళ్ళీ అలాగే అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో కొద్దిగా కూడా తేడా
రాదు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు.
వారు అనంతమైన తండ్రి కూడా, టీచర్, సద్గురువు కూడా అని మీకు తెలుసు. మానవమాత్రులు
ఎవ్వరూ ఇలా ఉండరు. వీరిని మీరు బాబా అని అంటారు, ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. వీరు
కూడా అంటారు, నా నుండి మీకు వారసత్వమేదీ లభించదు. బాపూ గాంధీజీ కూడా ప్రజాపిత కాదు
కదా. తండ్రి అంటారు, ఈ విషయాలలో మీరు తికమకపడకండి. మేము బ్రహ్మాను భగవంతుడు లేక
దేవత అని అననే అనము అని చెప్పండి. తండ్రి అన్నారు, అనేక జన్మల అంతిమములో,
వానప్రస్థావస్థలో, మొత్తం విశ్వమంతటినీ పావనంగా చేయడానికి నేను వీరిలోకి
ప్రవేశిస్తాను. వృక్షములో కూడా చూపించండి, పూర్తిగా చివరిలో నిలబడి ఉన్నారు చూడండి.
ఇప్పుడు అందరూ తమోప్రధానముగా శిథిలావస్థలో ఉన్నారు కదా. ఇతను కూడా తమోప్రధానములో
నిలబడి ఉన్నారు, అవే ముఖకవళికలు ఉన్నాయి. ఇతనిలోకి తండ్రి ప్రవేశించి బ్రహ్మా అన్న
పేరును పెడతారు. లేకపోతే ఈ బ్రహ్మా అన్న పేరు ఎక్కడి నుండి వచ్చిందో మీరు చెప్పండి?
ఇతను పతితుడు, అతను పావనుడు. ఆ పావన దేవతలే మళ్ళీ 84 జన్మలు తీసుకుని పతిత
మనుష్యులుగా అవుతారు. ఇతను మానవుడి నుండి దేవతగా అవ్వనున్నారు. మనుష్యులను దేవతలుగా
తయారుచేయడము - ఇది ఒక్క తండ్రి పనే. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన అద్భుతమైన
విషయాలు. ఇతను ఆ విధంగా ఒక్క క్షణములో అవుతారు, మళ్ళీ అతను 84 జన్మలు తీసుకుని ఈ
విధంగా అవుతారు. ఇతనిలోకి తండ్రి ప్రవేశించి కూర్చుని చదివిస్తారు, మీరు కూడా
చదువుతారు. వీరి వంశావళి కూడా ఉంది కదా. లక్ష్మీ-నారాయణులు, రాధా-కృష్ణుల మందిరాలు
కూడా ఉన్నాయి. కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియవు. రాధా-కృష్ణులు మొదట యువరాజు,
యువరాణులుగా ఉంటారు, మళ్ళీ వారే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇతనే బికారి నుండి
యువరాజుగా అవుతారు, మళ్ళీ యువరాజు నుండి బికారిగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయము.
84 జన్మల కథ ఈ రెండు చిత్రాలలోనూ ఉంది. వీరు ఆ విధంగా అవుతారు. వారు యుగళులు కావున
4 భుజాలను చూపిస్తారు. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఒక్క సద్గురువే మిమ్మల్ని ఆవలి
తీరానికి తీసుకువెళ్తారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు, మళ్ళీ దైవీ గుణాలు కూడా
కావాలి. పత్ని గురించి పతిని అడిగినా లేక పతి గురించి పత్నిని అడిగినా, వారిలో ఈ-ఈ
లోపాలు ఉన్నాయి అని వెంటనే చెప్తారు. ఈ విషయములో వీరు విసిగిస్తారు అని చెప్తారు
లేక మేము ఇరువురమూ బాగానే కలిసి నడుచుకుంటున్నాము అని చెప్తారు. కొందరు ఎవరిని ఎవరూ
విసిగించుకోరు, ఇద్దరూ ఒకరికొకరు సహాయకులుగా అయి కలిసి నడుస్తారు. కొందరైతే
ఒకరినొకరు పడేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇందులో స్వభావాన్ని
బాగా మార్చుకోవలసి ఉంటుంది. అవన్నీ ఆసురీ స్వభావాలు. దేవతలది దైవీ స్వభావమే. ఇదంతా
మీకు తెలుసు. అసురులు మరియు దేవతల యుద్ధము జరుగలేదు. పాత ప్రపంచము మరియు కొత్త
ప్రపంచము ఎలా కలుసుకోగలవు. తండ్రి అంటారు, గతంలో ఏ విషయాలైతే గతించాయో, వాటిని
కూర్చుని వ్రాశారు, వాటినే కథలు అని అంటారు. పండుగలు మొదలైనవన్నీ ఇక్కడివే.
ద్వాపరయుగం నుండి వాటిని జరుపుకుంటూ వస్తారు. సత్యయుగములో అవి జరుపుకోబడవు. ఇవన్నీ
కేవలం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. దేహాభిమానము కారణముగా పిల్లలు ఎన్నో
పాయింట్లను మర్చిపోతారు. జ్ఞానమైతే సహజమే. 7 రోజుల్లో మొత్తం జ్ఞానమంతా ధారణ
అవ్వగలదు. మొట్టమొదట స్మృతియాత్రపై అటెన్షన్ ఉండాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ అనంతమైన నాటకములో పాత్రను అభినయిస్తూ మొత్తం నాటకాన్నంతా సాక్షీగా అయి
చూడాలి. ఇందులో తికమకపడకూడదు. ఈ ప్రపంచములోని ఏ విషయాలను చూస్తున్నా, అవి బుద్ధిలో
గుర్తుకురాకూడదు.
2. మీ ఆసురీ స్వభావాన్ని మార్చుకుని దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఒకరికొకరు
సహాయకులుగా అయి నడుచుకోవాలి, ఎవరినీ విసిగించకూడదు.
వరదానము:-
స్వయంలో సర్వ శక్తులను ఇమర్జ్ రూపములో అనుభవం చేసే సర్వ
సిద్ధి స్వరూప భవ
లౌకికములో ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క విషయము యొక్క శక్తి
ఉంటుంది. ఉదాహరణకు ధనము యొక్క శక్తి, బుద్ధి యొక్క, సంబంధ సంపర్కాల యొక్క శక్తి...
అప్పుడు వారికి, ఇదేమంత పెద్ద విషయము అన్న నిశ్చయము ఉంటుంది. వారు ఆ శక్తి ఆధారముతో
సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. మీ వద్దనైతే అన్ని శక్తులు ఉన్నాయి, అవినాశీ ధనము
యొక్క శక్తి సదా తోడుగా ఉంది, బుద్ధి యొక్క శక్తి కూడా ఉంది, అలాగే పొజిషన్ యొక్క
శక్తి కూడా ఉంది, సర్వశక్తులు మీలో ఉన్నాయి, వాటిని కేవలం ఇమర్జ్ రూపములో అనుభవం
చేయండి, అప్పుడు సమయానికి విధి ద్వారా సిద్ధి ప్రాప్తి చేసుకుని సిద్ధి స్వరూపులుగా
అవుతారు.
స్లోగన్:-
మనస్సును ప్రభు అప్పగించిన
సంపదగా భావిస్తూ దానిని సదా శ్రేష్ఠ కార్యములో వినియోగించండి.
| | |